నన్నెవరూ పట్టించుకోవటం లేదు.😊
నన్నెవరూ పట్టించుకోవటం లేదు.
ఇలా బాధపడకు.
ఎవరికీ నీ అవసరం లేదు,అందుకే పట్టించుకోడం లేదు.ఇది పచ్చి నిజం. బాధపడి ఉపయోగం లేదు. ఇలా అనుకోడం కష్టం అనుకుంటే
అందరూ నావాళ్ళే అందుకే పట్టించుకోటంలేదు అనుకో మనసు ప్రశాంతం. ఇలా అనుకోడం మరికొంత బాధకే కారణం అనుకుంటావా?
నాకెవరూ లేరు అనుకో, ఈ కనపడేవాళ్ళంతా మిధ్య, ఇదొక నాటకం అనుకో,ఇప్పుడు నీ మనసుకి బహు ప్రశాంతత చిక్కి తీరుతుంది.
లేదూ!
ఎవరినీ నువ్వు పట్టించుకోడం మానెయ్యి అప్పుడు చిత్రంగా అందరూ నిన్ను పట్టించుకుంటారు. అది చేయలేవు.
అదే విష్ణుమాయ.
అద్వైతానంద తాతాశ్రీ మహరాజ్ కీ
ReplyDeleteజై!
పంచదశలోక పరమబ్లాగానంద మహరాజ్ కీ
జై!
కవిశ్రీ అంబరమణి అప్పాజీ మహరాజ్ కీ
జై!
Zilebi25 December 2024 at 09:33
Deleteఏమిటీ అర్ధం లేని,అర్ధం కాని జేజేలు.ఎవరికి?ఎందుకు?
ఎవరూ పట్టించుకోవడంలేదు అంటే, దగ్గర ఏమీ లేదు అన్న మాట.
ReplyDeleteBonagiri25 December 2024 at 10:35
Delete👌అంతే కదండీ! పట్టించుకోవడం లేదంటే నీ దగ్గరేం లేదు,అందుకే నీ అవసరం లేదు.
యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్చతి గేహే ||5||
అదే శంకరులు చెప్పినదిన్నీ. ఏం జరుగుతుంది చెప్పేరు. శంకరులు సూపర్ మాస్టర్ సైకాలజిస్ట్ . దానినుంచి తప్పించుకోడం ( ఆ బాధనుంచి తప్పించుకోవడం) ఎలా అన్నది మనకే వదిలేశారు. దాన్ని అర్ధం చేసుకోడం లోనే ఉంది అసలు తిరకాసంతా!
-
ReplyDeleteఎవరూ పట్టించుకొనుట
లె! విదురు లేడ్వంగ బోనగిరి చట్టంచున్
ప్రవచించిరి మీ కెడ లే
రవంతయున్ మేటరంచు రాధనమిదియే ! :)
DeleteZilebi25 December 2024 at 13:26
నువ్వేడుస్తూ ఎదుటి వాళ్ళు ఏడుస్తున్నారనుకుంటావు. అదే నీ తిరకాసు. నీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నీ కుంచం నిండలేదు.
పరమాత్మే చే పట్టగ ,
ReplyDeleteపరులతొ పనియేమి విబుధ ? పరిపరి విధముల్
హరినామ జపము సేయుచు ,
తరియింతుము గాదె జరను , ధన్యత గలుగున్