తెనుగువార్తలు-మీడియా
మా చిన్నప్పుడూ అనను. ఆ రోజుల్లో ఈ రోజు పేపరు రేపొచ్చేది. అదొస్తే గొప్పే!! నోటి మాటే వార్త. ఆ వార్త పేపర్లో కూడా వచ్చిందయ్యా! అంటే శిలాక్షరమని, నిజమని నమ్మేవారం, పల్లెలలో. రోజులు జరిగాయి, రేడియో వచ్చింది. వార్తలకి కొద్దికాలమే, పందులపెంపకానికి గంట సమయం. ఇదీ రేడియో సంగతి. కాలం జరిగింది దూరదర్శన్ వచ్చింది. ఇదీ ఏం తక్కువ తినలేదు. చివరికి తెనాలి రామలింగడి పిల్లి కతైపోయింది, మాపల్లీయులకు :) వార్త అంటే, అందునా ప్రభుత్వ వార్త అంటే నిజం కాదనే నిర్ణయానికొచ్చేసేం, అప్పుడే!
ఆ తరవాత ప్రైవేట్ టి.వి చానల్స్ వచ్చాయి, తల్లీబిడ్డా న్యాయంగా వార్తలుండేవి, ఇవీ తక్కువకాలమే, వార్తలు నిజానిజాల కలగలుపు.బియ్యంలో రాళ్ళేరు కున్నట్టుండేది. ఆ తరవాత వార్తా చానల్స్ వచ్చాయి. ఈ పాటికే పేపర్లు ఒకే వార్తని వారికి నచ్చిన రీతిలో రాసుకునే రోజులొచ్చాయి. నాలుగు పేపర్లు చదివితేగాని నిజమేంటో తెలిసేదిగాదు. ఆ తరవాత కాలంలో అదీ పోయింది.ఎవరివార్త వారిదే, నిజం ఎప్పుడో ఎగిరిపోయింది,ఇగిరిపోయింది.వార్త లేదు అంతా వారివారి అభిప్రాయాలే వార్తలైపోయాయి.
ఇక ఆ తరవాత టి.వి చానల్స్ వారు వారికి తగినరీతిలో వార్తలు వండి వార్చుకోడం మొదలైంది, ఇంకేం అస్థాన విద్వాంసులు తిమ్మిని బెమ్మిని చేసి చూపే అలవాటు వచ్చి చేరింది, పేనల్ డిస్కషన్ పేరుతో. దీనితో టి.వి అంటేనే వెగటుపుట్టేసింది.
కాలం కొద్దిగానే నడిచింది. సోషల్ మీడియా! ఎవరివార్త వారిదే!! ఆ తర్వాతొచ్చింది యు టూబ్, ప్రతివారూ ఒక పత్రికే,వార్త అందించేవారే, ఇక చెప్పేదేమి? ఏది నిజం, ఏది నిజంకాదు.తెలియదు. అంతలా వార్తలు బ్రష్టు పట్టిపోయాయి. మీడియా పేరు జెప్పుకుని భయపెట్టి, బ్లాక్ మైల్ చేసి డబ్బులు సంపాదించుకోడం పాతకాలపు విద్యే! పల్లెవాసులకిది కొత్త. యు ట్యూబ్ చానల్స్ వచ్చాకా మా దగ్గరా ఈ సంస్కృతి మొదలయింది.
ఇప్పుడన్ని వార్తా మాధ్యమాలకి దూరంగా ఉన్నాం. నిజమేంటి ఎవరూ చెప్పరు, కాదు చెప్పలేరు, కొందరటు, కొందరిటు, తప్పుపట్టేవారే!!పోనీ ఎవడెటు పోతే నాకేం!!! అమ్మయ్యా! ప్రాణం సుఖంగా ఉంది. ఎప్పుడూ పాలితుడినే, కాదు, ఎప్పుడూ పీడితుడినే!!!
ఏది నిజం? చిదంబర రహస్యం.
// “ ఏది సత్యం, ఏదసత్యం” // అన్నాడు శ్రీశ్రీ ఏనాడో. ఈ రోజుల్లో మీడియా వారి వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తుంది.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు21 September 2023 at 11:22
Deleteఅంతేనండి.
Just like each one believes in his/her own religion, God(s)/Goddess(es), now each have their own news papers/channels or whatever. Don't try to find the truth, just believe in whatever makes you happy :) what do you lose
ReplyDeleteAnonymous21 September 2023 at 12:19
DeleteTrue,sir. i don`t lose any thing. I don`t mind also. Dispensed with news papers long back, not viewing TV from last ten years. Really happy.
Thank you.
ఈ వార్తల గొడవలు మీకెందుకండీ ఈ వయసులో
ReplyDeleteహాయిగా కృష్ణా రామా అంటూ కూర్చోండి
అవే అన్నీ సర్దుకుంటాయి
శర్మగారి చేతిలో మాయాపేటిక (మొబైల్) ఉందండి. మాయాబజార్లో అభిమన్యుడికి మాయాపేటికలో ఒక్క శశిరేఖే కనిపించింది. కాని శర్మగారికి అందులో అన్ని రకాల అందాలు, నందా-లు, సువార్తలు, దుర్వార్తలు కూడా కనిపిస్తున్నాయి :-)
Deleteశర్మగారూ, మీ బ్లాగుకూడా ఒక రకమైన వార్తా మాధ్యమమే కదా. అయినా మీరు పాలితుడు కాదంటారా?
మాయాపేటిక ప్రాబ్లెమా చూడకూడని వాటిని కూడా చూడాలన్న కోరిక సమస్యా?
DeleteAnonymous21 September 2023 at 13:10
Deleteబుజ్జమ్మా!
సామరస్య పరాయణా!
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
కాంత్21 September 2023 at 18:41
Deleteఏ రేఖ కనపడినా చూచేటంత ఓపిక,కోరిక లేవండి.నందాలని అందాలని చూడాలనుకునే వయసు కాదు.
ఏంటో! ఈ నందాలని అందాలని బలవంతంగా గుర్తు చేసేరు. నేను మరచినా మీరు మరచేలా లేరుగా! వయసు ముచ్చటలెండి, కొనసాగిపొండి. అస్తు!
Anonymous22 September 2023 at 04:43
Deleteనీ ప్రోబ్లెమో,సమస్యో నీకే అర్ధంకానట్టుందే!! :)
కాంత్21 September 2023 at 18:41
Deleteపాలకుడు అంటే పరిపాలించేవాడు, పాలితుడు అంటే పరిపాలింపబడేవాడు. పీడకుడు అంటే పీడించేవాడు, పీడితుడు అంటే పీడింపబడేవాడు అనుకుంటున్నానండి.
నేను పాలితుడిని,పీడితుడినినండీ
ఏ వయసు నుండి కృష్ణా రామా అంటూ కూర్చోడం మొదలెట్టాలి, Anonymous (21 Sept 2023 at 13:10) గారూ? అహఁ, జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నాను లెండి.
ReplyDeleteఒకటో ఇయర్ నుంచండి.
Delete??? 🤔
Delete*aravai okaTo
Deleteవిన్నకోట నరసింహా రావు21 September 2023 at 13:46
Deleteబలే కొచ్చనండి :)
Anonymous21 September 2023 at 14:02
DeleteAnonymous22 September 2023 at 02:31
కందమ్మా!
అరవై ఒకటి లెక్కేంటో
ఇది కూడా “జిలేబి” గారేనా, శర్మ గారూ?
Deleteఅసలే ముసుగు, దాని మీద మరో ముసుగా?
కాస్త అతిగా లేదూ?
విన్నకోట నరసింహా రావు22 September 2023 at 15:35
Deleteమనకివేళ కొత్తకాదు కదండీ. కుందనానికి తప్పించి ఇంత గొప్ప ఆలోచనలు మరెవరి రాగలవు చెప్పండి. :)
కాస్త అతిగా లేదూ ?
Deleteఅదేదో సామెత గుర్తొస్తోందండి .. పచ్చ కామెర్ల .....
DeleteAnonymous23 September 2023 at 02:34
సామెతజెపితే సమయ సందర్భాలకి టంకంలా అతుక్కోవాలి.
నిజాలు చెప్పారు మీరు. ఈ పెడ ధోరణి విస్తరించడానికి పచ్చ మీడియా ఒక ప్రబల కారణం. ఇప్పుడు అనైతిక, కుల, పార్టీ అనుకూల, వ్యక్తిత్వ హనన వార్తలు ప్రచారం చేసే ఈ ధోరణి వికృత రూపం దాల్చింది. దాదాపు ప్రతి మీడియా హౌస్ ఒక అజెండా తోనే పని చేస్తున్నాయి.
ReplyDeleteపచ్చ మీడీయాఏంట్రా బేవకూఫ్,జఫ్ఫా గాడు దొబ్బేసిన డబ్బుతో అన్నీ నడుపుతున్నాదు
Delete
DeleteAnonymous21 September 2023 at 16:08
అభిమానం తప్పు లేదు. దురభిమానమే కూడదు. సత్యమేదో మీకు పూర్తిగా తెలుసా! తెలిస్తే చెప్పండీ.తిట్టినంతలో మీరు గొప్పవాళ్ళైపోరు.
Anonymous21 September 2023 at 15:17
Deleteఎవరో ఒకరు మొదలుపెడతారు కదండీ! మిగతావారు దాన్ని కొనసాగించడం తప్పనుకోరు.మీతో పూర్తిగా ఏకీభవించకపోవచ్చు, మీ అభిప్రాయమూ నిజం కాకపోవచ్చు. మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కును కాదనను.ఇతరులను నిందించనంతవరకు అభ్యంతరం ఉండదు.
శర్మ గారు,
ReplyDeleteపైనొక చోట మీరు “టంకం” అంటే గుర్తొచ్చింది.
ఈ మధ్య రామారావు (NTR) గారి స్మారక నాణెం విడుదలయింది కదా. అప్పుడు మొదటిరోజునే హైదరాబాదులోని ప్రభుత్వ టంకశాల కు వెళ్లాను ఓ నాణెం కొనుక్కుందామని.
అక్కడకు వాలిపోయారు కెమేరాలు, మైకు లతో. ఈ “పరిస్థితి” కనిపిస్తోంది, ఆ “పరిస్థితి” కనిపిస్తోంది అంటూ (టీవీ వారి ఊతపదం) మైకులోకి చెప్పేసుకుని, తరువాత అక్కడ లైన్ లో ఉన్న (పోలీసు వారు పెట్టిన లైను లెండి; లేకపోతే మనకు అంత పద్ధతి ఎక్కడ?) జనాల మొహం మీద మైకు పెట్టి మీకేం అనిపిస్తోంది లాంటి ప్రశ్నలేవో అడగడం మొదలెట్టారు. సరే, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈలోగా అక్కడే కాస్త దూరంగా ఓ ప్రక్కగా నిలబడ్డ కొంత మందిని ఒకతను కెమేరాతో ఫొటోలు తియ్యడం మొదలెట్టాడు. మమ్మల్ని ఎందుకు ఫొటో తీస్తున్నావు అని ఆ గుంపులోనున్న వయసులో ఓ పెద్దాయన అడిగాడు. అతగాడు అహంకారంగా (అతని మొహంలో, మాటలో తెలుస్తోంది) “మీడియా” అని అవతలకి వెళ్ళాడు. అంటే అన్నిటికీ అదే వివరణ అన్నట్లు, తమకు అన్ని రకాల స్వేచ్ఛ ఉంది అన్నట్లు మనం అనుకోవాలేమో?
నాకు పరిచయమున్న కొందరు ప్రింట్ మీడియా జర్నలిస్టులు (వాళ్ళల్లో కొంత మంది సీనియర్లు కూడా ఉన్నారు) ఇలా అహంకారంగా మాట్లాడడం నేను చూడలేదు. టీవీ మీడియా వారే …. తామేదో "సెలెబ్రిటీలు" అని ఫీలయి పోతుంటారు అనిపిస్తుంది (ఇది కూడా వాళ్ళే అధిక ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన పదం)? సమాజంలో ఆలోచనా ధోరణులు బాగా మారి పోయాయి / మారి పోతున్నాయి.
( సినిమా వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే …. నా ఈ వ్యాఖ్య “లెంగ్త్” length కొంచెం ఎక్కువయింది, ఏమనుకోకండి 🙂.)
విన్నకోట నరసింహా రావు23 September 2023 at 13:31
Deleteఅతి చెయ్యడం మీడియాకి అలవాటైపోయిందనుకుంటానండి. ఇంతకి నాణెం కొనుక్కున్నారా :)
This comment has been removed by the author.
Deleteఅంత దూరం వెళ్ళాక …….. ……… 😏.
Deleteఎంతయినా ఒకే జిల్లా వాళ్ళం కదా 😌.
👍😄🙏
Delete