Tuesday, 12 September 2023

వినాశ కాలే విపరీతబుద్ధిః

వినాశ  కాలే విపరీతబుద్ధిః 


రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః

పాపే  పాపాః   సమే సమాః

రాజానమనువర్తంతే

యథా రాజా తథా ప్రజాః

(ఆచార్య చణకుడు)

రాజు ధార్మికుడైతే ప్రజలు ధార్మికులై ఉంటారు. రాజు పాపకార్యాలు చేసేవాడైతే ప్రజలూ పాపకార్యరతులే! రాజు ఎలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు.


న నిర్మితా కేన న దృష్టపూర్వా

న  శ్రూయతే హేమమయీ కురంగీ

తథాపి తృష్ణా రఘునందనాస్య

వినాశ   కాలే విపరీతబుద్ధిః 

(ఆచార్య చణకుడు)


ఇంతకు ముందు బగారు లేడిని ఎవరూ నిర్మించలేదు, చూడలేదు, దాని గురించి వినలేదు. కాని బంగారు మాయలేడి కనపడితే రఘురాముడే ఆకర్షింపబడ్డాడు. వినాశ కాలానికి విపరీత బుద్ధులే పుడతాయి.


బంగారు లేడిని చూసినది సీత. ముచ్చటపడింది. బంగారు లేడి ఉండదని ఎప్పుడూ,ఎవరూ చూడలేదని తెలియనిదా సీత?. కాని ఆ క్షణానికి మాయ కమ్మింది. ఆలోచన నశించి రాముణ్ణి బంగారు లేడిని పట్టి తెమ్మని కోరింది. ఎప్పుడూ సీత కోరిక కోరినది కాదు, మరి ఈ సారి కోరిక కోరింది, అదిన్నీ తన వీరత్వానికి సంబంధించినదీ, కావచ్చు. రాముడికి మాత్రం బంగారు లేడి ఉండదని తాము రాక్షసుల మధ్య ఉన్నామని, వారి ఏ పన్నాగమైనా కావచ్చని తెలియనివాడా? సీతలాగే మాయలో పడిపోయాడు. విల్లంబులు పుచ్చుకు బయలుదేరాడు.   లక్ష్మణుడు  అన్నా! ఇది రాక్షసమాయ కావచ్చు, అని  చెప్పినా వినలేదు. బయలుదేరుతూ లక్ష్మణునికి సీత గురించి జాగ్రత్తలూ చెప్పాడు.

 అదే వినాశకాలె విపరీత బుద్ధి,కష్టపడే కాలానికి ఇటువంటి బుద్ధులే పుడతాయి.


23 comments:

  1. // “ లక్ష్మణుడు సరేనన్నాడు తప్పించి, అన్నా! ఇది రాక్షసమాయ కావచ్చు, అని ఒక్క ముక్క చెప్పలేదే!” //

    అదేమిటి, శర్మ గారు, రాక్షసమాయ కావచ్చు అని లక్ష్మణుడు రాముడితో అన్నాడని చదివినట్లు గుర్తే 🤔?

    కాసేపటికే మాయ అరుపులు విని, రాముడిని రక్షించటానికి వెళ్ళమని సీత అన్నప్పుడు లక్ష్మణుడు సీతతో కూడా ఆ మాటే అన్నాడని కూడా చదివినట్లు గుర్తు. దాని మీద సీత నిష్టూరమాడి లక్ష్మణుడిని పంపించింది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు10 September 2023 at 10:42
      లేడి కోసం బయలు దేరకముందే లక్ష్మణుడు రాముడికి చెప్పేడా? గుర్తుపోయిందండీ! పొరబడి ఉంటాను సుమా! ఆ తరవాత ఇది రాక్షసమాయని సీతకి చెప్పినది గుర్తు. ఒక సారి చూసి చెప్పరూ! టపాలో సరిజేస్తాను.

      Delete
  2. शंकमानः तु तम् दृष्ट्वा लक्ष्मणो रामम् अब्रवीत् |
    तम् एव एनम् अहम् मन्ये मारीचम् राक्षसम् मृगम् || ३-४३-५
    సీత పిలువగా వచ్చి పురుషసింహులైన రామలక్ష్మణులు ఆ బంగరుజింకను చూసారు. కాని లక్ష్మణుడు అనుమానించి "ఇది రాక్షసుడు మారీచుడు అనుకుంటూన్నాను" అని రాముడితో చెప్పాడు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం10 September 2023 at 12:28

      నేను పొరబడ్డాను. లక్ష్మణుడు ముందే ఇది రాక్షసమాయ అని చెప్పిన సంగతి మరచాను. టపాలో మారుస్తాను.గుర్తుచేసినందుకు
      ధన్యవాదాలు.

      Delete
  3. కాలే, పాపే, సమే, వర్తంతే, శ్రూయతే అని మార్చండి.

    ReplyDelete
    Replies
    1. Anonymous11 September 2023 at 23:29
      సంస్కృత లిపిలో దీర్ఘం లేదు. మన తెనుగు వారి అలవాటు దీర్ఘం తీయడమనుకుంటున్నా!
      ధన్యవాదాలు.

      Delete
    2. శర్మగారు, తెలుగులో ఎ , ఏ లున్నాయి. సంస్కృతభాషలో ఏ ఒకటే ఉందండీ. హిందీలో కూడా అలాగేను.

      Delete
    3. శ్యామలీయం12 September 2023 at 11:54
      సంస్కృత లిపిలో కాలె అని ఉన్నది.కాలె,పాపె,సమె, వర్తంతె,శ్రూయతె, కాకువంటారా? మనం తెనుగు లిపిలో రాసుకునేటపుడు కాలే అని రాసుకోవాలా? సాధారణంగా అంతా వినాశకాలే విపరీత బుద్ధిః అని అంటుంటారు, రాస్తుంటారు కూడా! ఎది సాధువో చెప్పగోర్తాను.

      Delete
    4. సంస్కృతంలో "ఏ , ఓ " కారాలు (ए, ओ) దీర్ఘాక్షరాలు మాత్రమే - హ్రస్వాలు కావు. సరిచేయండి దయచేసి.

      లలిత

      Delete
  4. శర్మగారూ, నిజంగానే ' ए ऐ & ओ औ '..(ఏ -ఐ , ఓ ఔ )మాత్రమే హిందీ & సంస్కృత భాషలలో ఉన్నాయి. పొట్టి ఎ ఒ లు సంస్కృత హిందీ భాషలలో లేవు.

    ReplyDelete
  5. పొర - पोर
    పోరా पोरा


    ReplyDelete
  6. Anonymous11 September 2023 at 23:29
    శ్యామలీయం12 September 2023 at 11:54
    Anonymous12 September 2023 at 17:46
    Anonymous12 September 2023 at 19:24
    సంస్కృత లిపిలో ఏ,ఓ లు దీర్ఘాక్షరాలని గుర్తించలేకపోవడం పొరబాటయింది. మొదటసారి చెప్పినపుడు పూర్తిగా అర్ధంకాలేదు, శ్యామలీయం చెప్పినా అవగాహన కాలేదు. శ్యామలీయం మొదటి సారి చెప్పింది అవగాహన కాలేదు. లలితమ్మాయి వివరంగా చెప్పేకా అవగాహన కొచ్చింది. సరిజేసాను.

    ఇక ఈ తప్పు నాదిగాదు :) వయసుది.ఇది వయసుతో వచ్చే అవకరమనుకున్నా, వయసు చిన్నెలనుకున్నా బాధలేదు. ఇవి అందరికిన్నీ తప్పనివే!! ఎక్కడో నూటికి కోటికి ఒకరుంటారు, అదృష్టవంతులు. అందులో చేరలేకపోయాను. వినికిడిపోయింది. ఓ మాదిరి అక్షరాలు కనపట్టంలా! ఒక సారి చెప్పింది కూడా అవగాహన కావటంలేదు. వివరంగా చెప్పినవారందరికి
    ధన్యవాదాలు.

    ReplyDelete
  7. అసాధారణ పరిస్థితులలోగాని సాయంత్రం ఆరు దాటేకా బ్లాగుల్లోకి రాను, మత్తుగా ఉంటుంది, వేసుకునే మందుల ప్రభవం, ఉదయానికి కొంత తగ్గుతుంది. అదుగో అప్పుడు మొలుచుకొచ్చిందీ సందేహం. తెలిసినవారు తీర్చవలసినదిగా విన్నపం.

    సంస్కృతంలో ఎ,ఒ లు దీర్ఘాలేగాని హ్రస్వాలు కాదు. ఒప్పుదలే. కాని చిన్న ధర్మ సందేహం, మరి లిపిలో కనపడుతున్నాయేం? తెనుగు భాషప్రభావమా?
    ए, ऎ, ओ ऒ

    ReplyDelete
  8. ए, ऐ - ఏ , ఐ
    ओ, औ - ఓ , ఔ

    అవే గుణింతాల్లో వ్రాస్తే

    के, कै - కే , కై
    को , कौ - కో , కౌ

    के నెత్తి మీద ఆ ఒక్క కొమ్మూ లేకపోతే “కే " అనలేం కదా! అందుకే గుణింతంలో ఒక కొమ్ము అదనంగా ఉంటుంది "ఏ , ఐ" -కారాలకి.

    లలితమ్మాయ్

    ReplyDelete
    Replies
    1. లలితమ్మాయ్!
      నా అనుమానం సరిగా చెప్పలేకపోయానమ్మా!
      ఎ,ఏ,ఐ,ఒ,ఓ,ఔ
      ఇవి తెనుగు అక్షరాలు.
      గుణింతంలో కె,కే, కై,కొ,కో,కౌ
      మరి సంస్కృత లిపిలో
      ए,ऎ,ऐ,ओ,ऒ,औ, ఇవి సంస్కృత అక్షరాలు. గుణింతంలో के,कॆ, कै,को,कॊ,कौ

      ఏ,ఓ లు దీర్ఘాక్షరాలే ఐనప్పుడు, హ్రస్వాలు లిపిలో ఎందుకున్నాయన్నది అనుమానం సుమా!

      Delete
    2. బుర్ర లేని తాతగారాండి మీరు ?
      అడిగిందే అడుగుతున్నారు చెప్పిందే చెప్పుతున్నాము ?

      లలితమ్మాయ్

      Delete
    3. శర్మగారూ, మీ సందేహం కరెక్టైనదే. నేను చిన్నప్పుడు హిందీ నేర్చుకునేటప్పుడు హ్రస్వాలు నేర్చుకోలేదు. నేను నేర్చుకున్నది ఏ, ఐ, ఓ, ఔ (ए,ऐ,ओ,औ)లు మాత్రమే. కంప్యూటర్/ఇంటర్నెట్ వచ్చినతర్వాత హ్రస్వాలు [ऎ - ఎ, ऒ - ఒ] కూడా చేర్చబడ్డాయి. ఈ లింక్‌లో చూడండి వివరించారు:
      https://groups.google.com/g/technical-hindi/c/_60en6bqTik
      [ऍ and ऑ are normally not listed in traditional dictionaries, but are included as
      digital dictionaries do include these characters]

      Delete
    4. లలితమ్మాయ్‌గారు కొంచెం కళ్ళజోడు పెట్టుకుని చూస్తే మీకు ऎ,ऐ ల మధ్య ओ,ऒ ల మధ్య తేడా కనిపిస్తుంది. తాతగారి మీద మరీ అలా విసుక్కోకండి

      Delete
    5. పై కాంత్ వ్యాఖ్య అర్థమయిందా ?
      సంస్కృతం కన్నా పటిష్టమైనది తెలుగు.


      లలితమ్మాయ్

      Delete
    6. Anonymous14 September 2023 at 03:56
      Anonymous13 September 2023 at 17:37
      శభాష్! జిలేబి!!!
      నీ సమయజ్ఞతకి మెచ్చేను. ఇద్దరి మధ్య తగువెలా పెట్టచ్చో నేర్చుకోవచ్చు. అనామక కామెంట్ రాస్తూ కింద పేరు రాసుకునే వాళ్ళకో పాఠం కూడా కదా!!!! మెచ్చేనుగా నిద్రపో!బి.పి పెంచుకుకోకు. నీ కామెంట్ ను గుర్తించలేనూ!!!!!!

      Delete
    7. కాంత్14 September 2023 at 00:22
      కాంత్14 September 2023 at 00:24
      ఏ,ఓ లు మాత్రమే సంస్కృతంలో ఉన్నప్పుడు ఎ,ఒ లు వాడుకలో ఎందుకున్నాయి అన్నదే నా అనుమానమండి. ఇప్పటికిన్నీ సరిగా వ్యక్తం చేయలేకపోయానేమో కూడా! మీరు నా అనుమానం తీర్చారు. సంతసం. తెనుగు భాషా ప్రభావం సంస్కృత లిపిమీద పడిందన్నది తెలిసింది.

      లలితమ్మాయి విసుక్కోలేదండి. ఇది జిలేబి చతురు అంతే!

      Delete
    8. సంస్కృత భాషలో హ్రస్వాలు అవసరం లేకపోవచ్చు. కాని సంస్కృతానికి వాడే లిపి (దేవనాగరి) హిందీ, మరాఠీ, వగైరా భాషలకి కూడా వాడతారు. హ్రస్వాలున్న పరభాషాపదాలని ఆ భాషలో రాయాలంటే హ్రస్వాలు అవసరమని గుర్తించి వాటిని adopt చేసుకునివుండొచ్చు. తమిళంలోకూడా original గా చాలా అక్షరాలు లేవు (ఉదా. జ, ష, స, హ, క్ష, శ్రీ). తరువాత వాటి అవసరం గుర్తించి (ముఖ్యంగా సంస్కృత పదాల్ని తమిళంలో రాయాలంటే), వాటిని సంస్కృతంనుంచి దిగుమతి చేసుకున్నారు.

      Delete
    9. కాంత్14 September 2023 at 21:27
      అన్ని భాషలమీద దేవనాగరికి పట్టుంటే అన్ని భాషల ఛాయ దేవనాగిరి మీదున్నట్టుందండి.

      Delete