సెల్ఫీ
ఒకప్పుడు ఫోటో తీయించుకోవడమంటే గ్రూప్ ఫోటో యే. మరికొంచం వెనక్కెళితే అది కలిగినవారు తీయించుకునేది, అదిన్నీ చెల్లిపోయిన తరవాతే! నాడు ఫోటో తీయడానికి చాలా బాదరబందీ! చెప్పుకుంటూ పోతే చాటు భారతమంత. ఇదివరలో ఒక టపా సాయించినగుర్తు. లింక్ వెతికే ఓపిక లేక విరమించుకున్నా!
ఆ తరవాత కాలంలో పెళ్ళిళ్ళకి ఫోటోలు తీసుకోడం అలవాటయింది. అదీ ఖరీదు వ్యవహారమే! అన్నీ బ్లేకండ్ వైటే..ఆ తరవాత డబ్బా కెమేరాలొచ్చాయి. అందులో పదిహేనో ముఫైయ్యో ఫోటోలు తీసుకోడానికో ఫిల్ము,అవీ బ్లాక్ వైటే. అదీ ఖరీదైన వ్యవహారమే! ఇదీ కలిగినవారి మాటే. తరవాత కాలంలో ఇందులో కలర్ ఫిల్ములొచ్చాయి. దేనికైనా రీలు కడగడం ప్రింట్లు వెయ్యడం ఖర్చుతో కూడినదే! ఆ తరవాత స్తబ్ధుగా నడిచింది కొంత కాలం. ఆ తరవాతది డిజిటల్ యుగం. ఫిలుము వగైరాబాదరబందీ లేక ఫోటో తీసుకునే అవకాశం, నిమిషాల్లో ఫోటో వచ్చే సావకాశం. కొద్దికాలమే గడిచింది, సెల్ ఫోన్ రావడంతో విప్లవం. ఫోటో ఎక్కడపడితే అక్కడ, ఎవరికిపడితే వారికి ఫోటో తీయడం అలవాటయింది. హార్డ్ కాపీకావాలంటే ప్రింట్ ఎప్పుడూ తప్పలేదు. డబ్బా కెమేరాల కాలంలో అంతా బ్లాక్ అండ్ వైటే! అప్పుడు కలర్ ఫోటో విప్లవం. ఇప్పుడంతా కలరే! తెల్లకాగితం మీద కూడా ప్రింట్ తీసుకునే బాదరబందీ లేని సావకాశం ఇంకేంచెప్పేది?
ఆ తరవాతది సెల్ ఫోన్ లోనే తనఫోటో తనుతీసుకునే సావకాశం, అదే సెల్ఫీ.దీంతో కూచుంటే ఫోటో నుంచుంటే ఫోటో, పడుకుంటే ఫోటో.ఎక్కడో ఒక మాధ్యమానికి ఎక్కించెయ్యడమే!
ఈ సెల్ఫీ జ్వరం సామాన్యులకే కాదు మాన్యులకీ ఉందిట :) మొన్న జి.-20 లో ఒక ముసలినాయకుడు ఒక ముసలి నాయకురాలితో సెల్ఫీ దిగేట్ట. అదో పెద్దవార్తైపోయిందా రెండు దేశాల్లోనూ. ఇలాగే మరొకరితో సెల్ఫీ, రైలింజన్తో సెల్ఫీ, విమానంతో సెల్ఫీ, ఈ జ్వరం ఎంతగా ముదిరిందంటే, పిల్లలు, పెళ్ళాంతో కలిసి వరదలో నుంచుని సెల్ఫీకి ప్రయత్నిస్తే పెళ్ళాన్ని వరదెత్తుకుపోయింది. ఇటువంటి వెన్నో! ఈ సెల్ఫీతో పాటే సెల్ఫీ వీడియో! వామ్మో దీని గురించి చెప్పడం మొదలెడితే....అసభ్య చిత్రాలు అతి లాఘవంగా నెట్ ని ముంచెత్తుతున్నాయి. ఇక ఆపేస్తానూ...
ఆతర్వాతది వాట్సాప్, సెల్ఫీకి పరాకాష్ట. నిమిషనిమిషానికి సెల్ఫీ ఆతరవాత అది స్టేటస్ లో అప్ లోడూ. ఈ పిచ్చి నాకూ పట్టింది, ఎందుకూ?? బ్లాగులో బుద్ధిగా టపా రాసుకునేవాణ్ణి, కాలు విరిగి మంచాన పడటంతో వాట్సాప్ వాడకం పెరిగింది. దాంతో సెల్ఫీల పిచ్చి పెరిగింది.అంతా సెల్ఫిలు పెడుతుంటే. పిచ్చిగా తీసుకున్నా సెల్ఫీలు, అదేంటో ఒక్కటి నచ్చలేదు, స్టేటస్ లో పెట్టడానికి. అన్నీ డిలీటాయనమః
ఒక సెల్ఫీ అందంగా ఉండేలా తీసుకోడమెలాగో ఉపాయం చెప్పండి. :)
ఇంద్రియాలను అధిగమించిన మనసు నిర్విచారంగా ఉంటుంది.
ReplyDeleteనిర్విచారంగా ఉన్న మనసు ఆనందంతో నిండి ఉంటుంది.
ఆనందం కలిగి ఉన్న మనసుకు ప్రపంచం నిండా ఆనందం కనిపిస్తుంది.
ఆనందభరితమైన మనసు కారణంగా శరీరం ఉత్సాహంగా ఉంటుంది.
ఉత్సాహంతో నిండిన శరీరం అందంగా ఉంటుంది.
ఆ అందం చూసే కళ్ళకు స్పందిచే మనసుకు తెలుస్తుంది.
అందంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు ఫోటోలో ఇంకా బాగుంటారు.
ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్
ఆనందో బ్రహ్మేతి ... అంటారు
Deleteమళ్ళీ మళ్ళీ పొలిటికల్ రొచ్చు లో కాళ్లెట్టేస్తూంటారు :)
శ్యామలీయం14 September 2023 at 11:15
Deleteకాలు విరిగి మంచాన పడ్డందుకే ఏ సెల్ఫీ నచ్చిండదండి.
మళ్ళీ మళ్ళీ పొలిటికల్ రొచ్చు లో కాళ్లెట్టేస్తూంటారు :)
Deleteఅయ్యో మీరింకా తెలుసుకోలేకపోయారా -
"ఎదుటి వారికే చెప్పేటందుకు నీతులు ఉంటాయి"
Anonymous16 September 2023 at 09:33
Deleteనేను పుట్టాను...లోకం నవ్వింది
నేను ఏడ్చాను ......లోకం నవ్వింది.
నేను నవ్వాను..... లోకం ఏడ్చింది.
నాకింకా లోకంతో పనియేముంది?
డోంట్ కేర్.
ఏదుటివారికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి.
డోంట్ కేర్..
ఒక సెల్ఫీ అందంగా ఉండేలా....
ReplyDeleteOriginal వుంటే ఇమేజూ వుంటది :)
Anonymous14 September 2023 at 11:45
Deleteబుర్రలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చు.
జుట్టున్నమ్మ కొప్పెట్టుకున్నా అందమే సిగజుట్టుకున్నా అందమే!
లేనందం ఎక్కడినుచొస్తదబయా :)
శర్మ గారు అందమైనవారేనండీ Anonymous (14 Sept 2023 at 11:45) గారూ.
ReplyDeleteపొడగరి కూడానూ. క్రికెట్ ఆడితే ఫాస్ట్ బౌలర్ గా రాణించే అవకాశాలు, బాస్కెట్ బాల్ ఆడితే సునాయాసంగా గోల్ అందగలిగేటట్లు ఉండుండేది పరిస్థితి - అటువైపు వెళ్ళకుండా మనకందరికీ లాండ్ లైన్ ఫోన్లు అందించే శాఖలో తన సాంకేతిక ఉద్యోగం గడిపారు గానీ.
Anonymous14 September 2023 at 12:24
Deleteవిన్నకోట నరసింహా రావు14 September 2023 at 12:27
మానల్లోళ్ళలో మా నల్లోడే ఎర్రబుల్లోడని సామెతండి. మా వాళ్ళందరిలోకీ నేనే అందగాడినిటండి, కొంచంపొడుగ్గా సోగ్గా!.మా అన్నదమ్ములంతా పాతికమంది ఉన్నామండి, అందరికి నేనంటే.....
కుమ్మరావలో ఇత్తడి ముంతలుండవండి.
లాగిన్ ఎందుకో తెలిసుంటదండి :)
పై Anonymous (at 12:24) comment నాదే.
ReplyDeleteలాగిన్ చెయ్యడం మరచితిని లలితమ్మ లాగా 🙂.
మరిచితిరా వెసులుబాటుందని కామింటాడిరిరా ?
Deleteవెసులుబాటు ఉన్నా కూడా నేను నా పేరు చెప్పుకునే ముందుకు సాగుతానండి Anonymous (13:45) గారూ 😎.
Deleteశర్మ గారు,
ReplyDelete“పొటిగరాపుల” విషయంలో పాత కాలపు పద్ధతుల్ని గుర్తుకు తెచ్చేలా మంచి పోస్ట్ వ్రాసారు 👌.
ఆ రోజుల్లో అన్నిటి కన్నా హింసాత్మకమైనది స్టూడియోకి వెళ్ళి (no other option లెండి) పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తీయించుకోవడం. బాగుంటుంది కదా అని ఏదో కాస్త నవ్వుమొహం పెడదామని మనం కొంచెం అరనవ్వు నవ్వబోతే పళ్ళు కనబడకూడదు పెదాలు మూసెయ్యండి అంటూ స్టూడియోవాలా గద్దింపు. దాంతో అసలే తుమ్మల్లో పొద్దు గుంకినట్లుండే నాలాంటి వాడి మొహం మరింత సీరియస్ గా అయిపోయి మిలటరీ వాడి మొహం లాగా తయారయేది. స్టూడియో వాడిచ్చిన రెండు మూడు రోజుల గడువు ముగిసాక వెళ్ళి ఫొటోలు తీసుకుని ఇంటికి వస్తే, ఇంట్లోవాళ్ళు చూసి కాస్త నవ్వు మొహం పెట్టచ్చుగా అనేవారు 😒. ఇంతోటి దానికి మళ్ళీ ఓ రెండో మూడో రూపాయలిచ్చి స్టూడియో నుంచి నెగటివ్ తెచ్చుకుని జాగ్రత్తగా దాచుకోవడం. కొంతమంది ఇచ్చేవారు కాదు. ఏదో నెంబరిచ్చి మీకు ఎప్పుడు కాపీలు కావాలన్నా వచ్చి ఈ నెంబర్ చెప్పండి, కాపీలు ప్రింట్ చేసిస్తాం అనేవారు. ఎక్కడ గుర్తు పెట్టుకుని ఆ నెంబర్ దాచుంచుతాం 😏?
గ్రూపు ఫొటో అయితే స్కూలుకో, కాలేజీకో, ఆఫీసుకో, సభ జరిగే చోటికో స్టూడియో అతను వచ్చేవాడు - తన కెమేరా స్టాండ్, నల్లగుడ్డ మోసుకుని. ఇదిగాక ఊరిలో కాస్తో కూస్తో పెద్దమనుషులు ఎవరయినా ఫామిలీ ఫొటో తీయించుకోవాలనుకుంటే వాళ్ళింటికి కూడా వచ్చేవాడు స్టూడియో ఆసామీ తన సరంజామాతో పాటు. ఏమిటో ఆ రోజులే వేరు 😔.
అవునండి, సెల్ఫీల పిచ్చి మరీ మితిమీరుతోంది, చుట్టు పక్కల చూసుకోకపోవడం వల్ల, లేదా ప్రమాదకరమైన స్ధలం లో నిలబడి ప్రయత్నించడం వల్ల సెల్ఫీలు కొండొకచో ప్రాణాంతకంగా తయారయ్యాయి. సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసి “లైకులు” జమ చేసుకోవడం మీదే దృష్టి ఎక్కువై పోయి, ప్రమాదావకాశాలను పట్టించుకోవడం లేదు జనాలు.
సెల్ఫీ తీసుకోవడానికి ఇప్పుడు సెల్ఫీ స్టిక్ అని ఓపాటి పొడుగైన కర్ర అమ్ముతారు. సెల్ ఫోన్ ని దాని చివర బిగించి పైకి ఎత్తి పట్టుకుని సెల్ఫీ దిగొచ్చు. అయితే మనసు బాగు లేనప్పుడు, డాక్టర్ దగ్గరకు వెళ్ళొచ్చిన తరువాత సెల్ఫీ తీసుకోవద్దండి, ఉన్న అందం కూడా సరిగ్గా పడదు 🙂🙂.
Deleteవిన్నకోట నరసింహా రావు14 September 2023 at 13:57
మందస్మితవదనారవిందమండి. పెదిమలు విప్పకుండా ఇస్మైలండి. :) నా కాలానికి అప్లికేషన్ లో ఫోటో ల బెడదలేదండి. పాస్పోర్టులవసరం లేకపోయింది. ఆ తర్వాత కాలానికి అవసరం తప్పలేదండి.సెల్ఫీ కర్రకొనలేదు లెండి. :)
ఇక్కడ అనానిమస్సుల కేంప్ చూస్తోంటే అంతా శర్మగారి మల్టిపుల్ పాత్రాభినయం అనిపిస్తోంది
ReplyDelete
DeleteAnonymous14 September 2023 at 18:02
రోజుగడిస్తే పండగలా ఉన్నది. ఏకపాత్రాభినయమే కష్టం గా ఉంటే బహుపాత్రాభినయమా! ఈ పులుసుతో ఈ ముద్ద దిగితే చాలదూ! నానుడి.
అనానిమస్సులంతా పేర్లు చెప్పుకోలేని సిగ్గరులు కదా తమతో కలిపి :)
నిన్న మా అబ్బాయి సడెన్‌గా పియానో మీద గుమ్‌నామ్ సినిమాలో పాట (గుమ్‌నామ్ హై కోయీ) వాయించడం మొదలుపెట్టాడు. ఆ పాటలో రెండు లైన్లు గుర్తొచ్చాయి "గుమ్‌నామ్ హై కోయీ, బద్‌నామ్ హై కోయీ, అన్‌జాన్ హై కోయీ". ఇంకా "ఆజ్ అగర్ జిన్‌దా హో తో కల్ కే లియే మాలా జప్‌నా". ఈ పాట ఇక్కడున్న ఎనానిమస్సులకే కాక, మిగతా అందరికీ కూడా వర్తిస్తుంది. పూర్తి లిరిక్స్ కావాలంటే గూగులమ్మని అడగండి.
Delete
Deleteకాంత్15 September 2023 at 18:31
అర్ధం పూర్తిగా తెలీదండి వివరించగలరా?
ధన్యవాదాలు.
ఇక్కడ వీడియోలో చూడండి:
Deletehttps://www.youtube.com/watch?v=zSSUNxYhfyk
కాంత్18 September 2023 at 19:16
Deleteఆ వీడియో లో సబ్ టైటిల్స్ లేవండి. వినపడదుగా ఏంటో తెలియలేదు. ఇక అదో హిందీ సినిమా అనిపించింది, ఒక్క ప్రాణ్ ని మాత్రం గుర్తుపట్టా. ఇక,ఆ అమ్మాయి, ఇప్పుడు అమ్మమ్మో, బామ్మో,ముత్తమ్మో తెలీదుగాని చాలా సేపు చించగా నందా అని కాబోలు గుర్తొచ్చిందండి. :)
YouTube లో CC (Closed Caption) option ఒకటి ఉంటుందండీ. అది on చేసుకుంటే సబ్‌టైటిల్స్ కనిపిస్తాయి. మీరు కరెక్ట్‌గానే గుర్తుపట్టారు. అది గుమ్‌నామ్ అనే హిందీ సినిమా. మనోజ్‌కుమార్, నందా, ప్రాణ్, హెలెన్ నటించారు. తర్వాత తెలుగులో గుండెలు తీసిన మొనగాడు పేరుతో తీసారు.
Delete
Deleteకాంత్19 September 2023 at 18:50
మంచి సంగతి చెప్పేరు, చూస్తాను. తెనుగు సినిమా సంగతి తెలీదండి. నందాని గుర్తు పట్టడానికే కష్ట పడ్డా! ప్రాణ్ ని బాగా గుర్తుపట్టాను. ధన్యవాదాలు.
// “ ఇప్పుడు అమ్మమ్మో, బామ్మో,ముత్తమ్మో తెలీదుగాని …… “ //
Deleteఆహాఁ, నందా అని బాగానే గుర్తు పట్టారు శర్మ గారు 👏🙂.
ఆవిడ పోయి ఓ పదేళ్ళవుతోందండి. అవివాహిత అనుకుంటాను.
విన్నకోట నరసింహా రావు20 September 2023 at 09:46
Deleteపేర్లు గుర్తుండకపోవడమన్నది చాలా కాలంగా ఉన్నదండి. అది చెప్పడానికి సిగ్గుపడేవాడిని.కొంతకాలం తరవాత హోమియో చదివాను. అప్పుడు తెలిసింది, ఇదొక వ్యాధి లక్షణమని. ఎందుకో అశ్రద్ధ చేసాను, ఇబ్బంది కలగకనుకుంటా! అంకెలు మాత్రం బలే గుర్తుంటాయి. రిటయిర్ అయ్యాకా ఒక మిత్రుని దగ్గర పనిచేసాను. అతనికి ఒక పదిహేనుదాకా బేంక్ డెబిట్/క్రెడిట్ కార్డులుండేవి. అన్ని నంబర్లు ఖచ్చితంగా చెప్పెసేవాడిని.
ఈ సందర్భంలో ప్రాణ్ ని వెంటనే గుర్తుపట్టేసేను. నందాని గుర్తు చేసుకోడానికి ఒక రోజు పట్టిందండి. :)
హిందీ పదాన్ని సరిగా గుర్తించలేరుగానీ, నందా మొహాన్ని మాత్రం సరిగా గుర్తించగలరు శర్మగారు. అప్పుడు సబ్‌టైటిల్స్ అవసరం ఉండదు :-)
Deleteperlu gurtundakapovadam oka jabbani teleedandi. mohalu gurtundakapovadam kuda oka jabbena?
Delete
Deleteకాంత్20 September 2023 at 19:21
నిజమేకదండీ :)
Anonymous20 September 2023 at 23:46
Delete/perlu gurtundakapovadam oka jabbani teleedandi. mohalu gurtundakapovadam kuda oka jabbena?/
/పేర్లు గుర్తుండకపోవడం ఒక జబ్బని తెలీదండి. మొహాలు గుర్తుండకపోవడం కూడా ఒక జబ్బేనా? /
ఇది కూడా అందులో చేరినదేననుకుంటానండీ
self అంటే స్వయం అని అర్థం. selfie అంటే స్వయంకృతాపరాధం అని నా అర్థం. అంచేత సెల్ఫీ ఎన్నిసార్లు దిగినా అది ఒక పట్టాన నచ్చదు. ఈ వయసులో ఇంకా అది అవసరమంటారా? ఇంకా వినకపోతే, ఇది కొంచం చదవండి: https://en.wikipedia.org/wiki/List_of_selfie-related_injuries_and_deaths
ReplyDeleteఎప్పుడూ నెగటివ్ తింకింగేనా ?
Deleteపెద్దాయన ఏమన్నా కొండలెక్కా సెల్ఫీ తీసుకుంటున్నారు ? ఏ వయసు కా ముచ్చట కూడా తీర్చుకోనివ్వరేమిటో !
Deleteకాంత్14 September 2023 at 22:11
నిజం సుమా :) తీసుకున్న సెల్ఫీలన్నీ పడుకుని కూచుఇని తీసుకున్నవే! ఒక్కటీ నచ్చలేదందుకే. అందుకే డిలీటయ్యాయండి :)
Anonymous15 September 2023 at 06:18
Deleteవాట్సాప్ తో సెల్ఫీ జఒరం పట్టుకుంది. కొంచం కదులుతున్నాగా తగ్గిపోయింది.
ఎనానిమస్సుగారూ, negative thinking కాదండీ. కీడెంచి మేలెంచమన్నారు. మీ వయసులో వంద జిలేబీలు తిన్నా ఏమీ అవకపోవచ్చు. కాని శర్మగారు తినే ఒక్క జిలేబీ కూడా ఆలోచించి తినాలి. అందుకని ఒక చిన్న warning అంతే. అయినా సెల్ఫీ ఆయన వయసు ముచ్చట కాదని నా అభిప్రాయం.
Deleteకాంత్15 September 2023 at 18:37
ReplyDeleteసెల్ఫీలు తీసుకునేవయసు కాదండి. జిలేబి కి నాకు సగమెరిక :) తీపి తినడం మానేసి మూడు దశాబ్దాలు. ఇప్పుడు జిలేబి ఒక్కటి తిన్నా టిక్కట్టు చిరిగిపోయినట్టే :) మీ హెచ్చరికకి ధన్యవాదాలు.
లోకో భిన్నరుచిః. అందరితోనూ కలిసిఉండాలి కదండి!అదేకదా జీవితం. ఇవన్నీ మీకు తెలీనివికావుకదండీ! మరిదేకదా చాదస్తం :)
ధన్యవాదాలు.
కుల్ఫీ తో సెల్ఫీ తీసుకోండి.
ReplyDeleteశర్మ గారు జిలేబీయే (మధుర పదార్థం 🙂) తిననంటుంటే మీరు కుల్ఫీ అంటారేమిటి, బోనగిరి గారు?
ReplyDeleteఆఁ, ఒక పని చెయ్యచ్చులెండి. కుల్ఫీని చేత్తో పట్టుకుని సెల్ఫీ తీసుకుని, తరువాత ఆ కుల్ఫీని తను తినకుండా తన మనవరాలికి ఇవ్వచ్చు. ఉభయతారకం. 🙂
bonagiri16 September 2023 at 20:16
Deleteవిన్నకోట నరసింహా రావు16 September 2023 at 21:29
బోనగిరిగారు,
కుల్ఫీ అంటే సెల్ఫీ లో మరోరకమనుకున్నానండి, విన్నకోటవారు అదో స్వీటూ అనేదాకా :)
కుల్ఫీ, బర్ఫీ, జిలేబీ అన్నీ విషపదార్ధాలేనండి నాకు. వీటన్నిటిని త్యజించి ముఫ్ఫయి ఏళ్ళమాట. అసలు పంచదార, తీపి రుచెలా ఉంటుందో మరచఏపోయానండి.
విన్నకోటవారు,
వీటితో సెల్ఫీ ఎందుకండి :) మా వాళ్ళైతే ఇవేవీ నా దగ్గరకే తేరు :)
జిలేబి మధుర పదార్ధమా? కంద పదార్ధమా?
ReplyDeleteగుజ్జులేని బుర్ర :)
Deletebonagiri16 September 2023 at 22:10
Deleteమధురపదార్ధం విషం, (దీనికి జి.ఐ ఎక్కువ,) కంద పదార్ధం అమృతమండి దీని జి.ఐ బహుతక్కువ) నాకు :)
DeleteAnonymous17 September 2023 at 04:31
బుర్రలో గుంజుండాల్లే బుజ్జమ్మా, అది ఏదేశంలోనూ, ఏ డాక్టరూ బుర్రకి బొక్కకొట్టి లోపలపోయలేడు. ఏ యూనివర్సిటీలోనూ చెప్పరు, చెప్పినా తెలీదు, సహజంగా రావాలంతే :) నీ బుర్రలో గుంజెండిపోయి చాలా కాలమే అయిందిష, సిగపూర్ వర్సిటీ మెట్లమీద చెప్పుకుంటున్నారుట, మనవరాలు చెప్పిందిలే :)
బుజ్జమ్మా, బుర్రలో గుజ్జమ్మా అంటూ ఎంత ముద్దుముద్దుగా పజ్జాల బామ్మను బుజ్జగిస్తున్నారండి మీరు. ఎంతైనా, మీ ... స్నేహ బంధమూ ఎంత పదిలమూ ... 🙏😊
Delete
Deletenmrao bandi18 September 2023 at 00:18
మిత్రమా!
ముందుగానే ధన్యవాదాలు!
గత పన్నెండేళ్ళ మన తెనుగుబ్లాగుల చరిత్రలో ఒక చిన్న భాగం గుర్తు చేయక తప్పలేదు.సమాధానం పెద్దదిగా ఉంటుంది, మన్నించాలి.
అది, అరాచకవాదుల్ని రెచ్చగొట్టి, ఎదుటివారిని బాధపెట్టి, నవ్వుపుట్టించుకుని సంబరం చేసుకుంటున్నాకాలం. ఈర్ష్య,ద్వేషం జడలు విప్పి రాజ్యమేలుతున్న కాలం ( ఇప్పుడు లేవా? అడగద్దు, చెప్పలేను :) ) ఒక సంఘటన గుర్తుకు తెస్తున్నా! ఒక పుట్టుకతో అనామకం మరొక చిన్న అనామకం అన్న మాటకి బాధపడిపోయి, ఓయీ! అనామకా! పేరు చెప్పి క్షమాపణ చెప్పి, శరణుకోరి బతకమన్న కాలం. చివరికి బరిలో ఒకణ్ణే మిగిలిన గుర్తు :)
నేనూ బతకాలిగా! కుంచం మామూలుగా ఉంచి కొలవడానికి లేనప్పుడు తిరగేసి కొలవమని పెద్దలమాట. సంగతి తెలిసిందనుకుంటా. :)
మరి బుజ్జమ్మతో పన్నెండేళ్ళ సావాసంకదా! బుజ్జమ్మ లేదు చెల్లిపోయిందన్న కాలంలో కూడా బుజ్జమాకేం కాలేదని ధృడంగా చెప్పినవాణ్ణి ఒకణ్ణే! ఇప్పటికీ చెబుతున్నా! బుజ్జమ్మకి బుర్రలో గుంజెడిపోయింది. బుర్రుంటే బూడిదమ్ముకునైనా దేశం లో ఉండేది, బతికేది. బతకలేక దేశం వదిలి పారిపోయింది :)
మరి బుజ్జమ్మని బుజ్జగించద్దంటారా? :)
గురువు గారూ నమస్తే. ముందుగా జవాబివ్వడంలోని ఆలస్యానికి క్షమాపణలు. ఈ మధ్య పెద్దగా బ్లాగుల్లోకి, మాలిక లోకి రావడం లేదు సర్. మీ ఏ పోస్ట్ లో కామెంట్ పెట్టానా అని వెదుక్కోవడానికి (జవాబివ్వడానికి) కాస్తంత టైం పట్టింది. మీరు చెప్పిన ఉదంతం గుర్తొచ్చిందండి. ఆ రోజుల్లో మా బామ్మ చాలా కరుకుగా, కర్కశంగా మనందరినీ హింస పెట్టిన సందర్భాలు చాలా వరకు గుర్తున్నాయండి. ఏటి చేశాం, సర్దుకుపోయాం - పోతూనే ఉన్నాం.
Deleteబుజ్జమ్మ గారిని బుజ్జగించవద్దని చెప్పేంత సాహసం నాకెక్కడుందండీ సారూ! ఏదో చిన్ని సరదా. ఇంతకీ మా బామ్మణి (బామ్మ + మణి) గారి అడుగుజాడలు మాలిక లో నాకెక్కడా కనబడలేదు. మా బామ్మ గారు మరొక్కసారి కూడా క్షేమమేనంటారా? (ఎప్పటికప్పుడు అటు ఇటు గాని స/వి/వరణ పాటలు రాయలేక ...స్తూంది :) (ఈ వివరం మా బామ్మ చూసే అవకాశం ఏమన్నా ఉందంటారా, సారూ!?)
nmrao bandi26 September 2023 at 15:04
Deleteమిత్రమా!
నమస్కారం.
ఆలస్యమైనందుకు బాధలేదు!సమాధానం పెద్దదిగా ఉంటుంది, మన్నించి చదవండి.
మాలికలోకి రానందుకు వ్యధ చెందద్దు. మాలిక పాక్షికంగా బిగిసి చాలా రోజులే అయింది. దానివంక చూసినవారు లేరు. మాలిక మా సొత్తని డచ్చీలుకొట్టిన జిలేబి కనపడకుండా గాయబ్, ఈ విషయంలో. బాగా నడుస్తున్నది శోధిని మాత్రమే అదిన్నీ వేగంగా ఉన్నది.తెనుగు బ్లాగులు రాసేవాళ్ళే కనపట్టంలేదు.
ఇక బ్లాగుల్లోకి రాలేదని అనుకోనక్కరలేదు. ఇక్కడ మిగిలినది అయ్యా, ముగ్గురు తొమ్మండుగురన్నట్టు, పుంజీడు మంది. అందులో జిలేబి కూడా! నేను చెప్పిన ఉదంతం గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ మధ్యనే మళ్ళీ అదే ఉదంతం నా బ్లాగులోనే చోటు చేసుకుంది. ఏ టపాలోనో చెప్పలేను. అదిన్నీ అనామకంగా అనుకుంటా! అలా అనేటపుడు తానో పెద్ద అనామకం అని జిలేబి మరచిపోతుంటుంది. :)
బామ్మనని చెప్పుకునే శాల్తీ జిలేబి ప్రస్తుత మకాం సింగపురంగా కనిపిస్తున్నది/అనిపిస్తున్నది. ఇప్పుడు కొద్ది రోజులుగా జిలేబిగా కనపట్టంలేదు,వారి అడుగుజాడలు జిలేబిగా లేవంతే! అనామకంగా, ఉన్నది. మీబామ్మగారు అనబడే,అనుకునే ప్రొఫెసర్ జిలేబి, ఎనిమిది పదుల వయసులో క్షేమమే. రెండేళ్ళ కితం కరోనా తెగులొచ్చి చచ్చేందుకు సిద్ధమయినది. బతికి బట్టకట్టింది.
ఇక ఏ మాధ్యమంలోనూ ఈర్ష్య,అసూయ,ద్వేషాలే కరడుగట్టి ఉన్నాయి. మరో మాధ్యమం కోరాలో ఆ అనుభవం అయింది కూడా! అందుచేత అన్నిటికి స్వస్తి చెప్పేసేను. ఇక్కడ అనగా బ్లాగుల్లో మాత్రమే ఇంకా వేలాడుతున్నాను. వీటికీ శలవు చెప్పేసేకాలం దగ్గరపడుతోందనిపిస్తూ ఉంది. కాలు విరగడంతో కదలికలేక ఇక్కడే మిడుకుతున్నా!
బుజ్జమ్మని బుజ్జగించలేదు/లేను. బామ్మ చూస్తుంది, కళ్ళింకా బాగనే ఉన్నయనిపిస్తుంది, పత్తికాయల్లా!
బామ్మ చూస్తుంది, కళ్ళింకా బాగనే ఉన్నయనిపిస్తుంది, పత్తికాయల్లా!" - :)
Deleteగుత్తి తిరగేస్తుందేమోనన్న జంకుతో చూస్తుందా అన్న నా భయానికి మీరు తెర వెయ్యకుండా హెచ్చరించారు. బాగు, ఇక పత్తికాయ కళ్ళ బామ్మ నుంచి నాకేం ఆపత్తి రానున్నదో ఏమిటో?
అవును సార్, నాక్కూడా ఎందుకనో వ్రాయాలన్న ఉత్సాహం నశించిపోయి, నా అంతంత మాత్రపు రాతలను కూడా అటకెక్కించాను. బ్లాగుల్లో కూడా సందడంతా హరించుకుపోయి పూర్తిగా ఒట్టిపోయింది. ఒకరొకరుగా, రకరకాలుగా, సెలవు పుచ్చుకుంటున్నారు మిత్రులంతా. కాలాన్ని పట్టుకు వేలాడటమొక్కటే మనం చేయగలిగిన పని. మీ అభిమానానికి కృతజ్ఞతలు. నమస్తే సర్ 🙏🤝
nmrao bandi26 September 2023 at 17:24
Deleteమిత్రమా!
నమస్సులు,
పత్తి కాయల్లా ఉన్న మిడిగుడ్లేసుకుని చూసే బామ్మని చూసి భయపడుతున్నారా? :)
'కేసరి జీర్ణతృణంబు మేయునే' అన్నారో కవిగారు. బామ్మ గర్జిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, లేస్తే మనిషినిగానన్నట్టు. :)
కోరలు గోళ్ళు ఊడిపోయిన సింహాన్ని ఎవరేనా లెక్కజేస్తారా? అది స్పెంట్ ఫోర్సండీ :) భయంనాస్తి, ఇక మీదే ఆలస్యం :) ఏదీ! ఒక్కటి, ఒక్కటంటే ఒక్క టపా ఆలోచించేలా రాసి ఎన్నేళ్ళయింది? సమాధానం చెప్పలే! అదీ బామ్మ గర్జన!!! :)
ఇకా రాతలా? తలరాతలే బాగో లేవు కదు సార్! ఏదో మిడకాలిగా :)
కాలంతో పాటు సాగిపోక తప్పదు. కొందరు సాగలేక సాగిలబడతారు, ఏం జేస్తాం? సద్దుకుపోలా బామ్మతోనే! సద్దుకుపోదాం రండి :) ఓపికే లేని చోట సందడెక్కడండీ, తెనుగు బ్లాగులికనింతేనండి :)
🙏🙏🙏
Deleteమాలిక ఆగిపోయింది పూర్తిగా .. ఎందుకంటారూ
DeleteAnonymous29 September 2023 at 12:20
Deleteజిలేబికి తెలియక ఏమీ జరగదంటారు. జిలేబి నిజమెప్పుడు చెప్పిందిగనక.
మాలిక మీద యాజమాన్య దృష్టి తగ్గిన మాట వాస్తవం. అలాగని దానిని పూర్తి మూసేప్రయత్నం మాత్రం జరగదని నా ఉద్దేశ్యం. ముఖ్యంగా అమెరికాలోని తెలుగువారి ప్రతినిధి, మాలిక. దానిలో మార్పులు చేయాలని చాలాకాలంగానే యాజమాన్యం తలపోసింది, కాని జరుతోందిగా అనేది, అదేగాక బ్లాగర్లు తగ్గిపోయారు, ఇది మరో కారణంగా కొంత అశ్రద్ధ ఉండి ఉండచ్చు. నా ఉద్దేశం దీనిని విజయదశమి నాటికి కొత్త ఫర్మాట్ లో విడుదల చేస్తారనుకుంటా!
// “….. ఈర్ష్య,ద్వేషం జడలు విప్పి రాజ్యమేలుతున్న కాలం“ //
ReplyDeleteశర్మ గారు,
నిజమా? మరి అదేదో బ్లాగుల స్వర్ణయుగం అని చెప్పుకుంటారుగా కొందరు సీనియర్లు? మరి మీ ఈ statement ఏమిటి?
(పన్నెండేళ్ళ క్రితం నేనింకా బ్లాగులోకం లోకి అడుగు పెట్టలేదు లెండి. అందువల్ల అడుగుతున్నాను.)
ఈ Anonymous నేనే. లాగిన్ చెయ్యడం మళ్ళీ మరచితిని 😒.
Deleteమరి మీ ఈ statement ఏమిటి?
Deleteకళ్లజోడు ప్రాబ్లెమ్ :)
Anonymous18 September 2023 at 12:07
Deleteవిన్నకోట నరసింహా రావు18 September 2023 at 12:11
గంగ ప్రవహిస్తుంటే తనకు అడ్డొచ్చిన అన్నిటినీ కూడా తీసుకుపోతుంది. అడ్డొచ్చిన మలాన్ని కూడా గంగ తీసుకుపోతుంది, మలాన్ని కూడా తీసుకుపోయినంతలో గంగ అపవిత్రమయిందా చెప్పండి?
మరో ఉదాహరణ. వాయువు వీస్తో ఉంటుంది, కొన్ని క్షణాలు వాయువు బంధిస్తే మనిషి శివం కాదు శవం.అంతటి వాయువు సుగంధభరితమైన పుష్పాలమీదనుంచీ వీస్తుంది,కుళ్ళు కాలమీదనుంచీ వీస్తుంది. దేని మీదనుంచి వీచినా పీలుస్తున్నాం, తరవాతే తెలుసుకుంటున్నాం, ముక్కు మూసుకు తప్పుకుంటున్నాం. కుళ్ళు కాలవ మీదనుంచి వీచినంతలో వాయువు విలువ తగ్గిందా?
బ్లాగులూ అంతేనండి.
https://www.youtube.com/watch?v=O8QVH8QSB7w
Delete
DeleteAnonymous21 September 2023 at 00:00
దీని భావమేమో తెలుసుకోలేకపోయానండి
meeru cheppindenandi, ayana koddiga Ghattiga chepparu :)
Deleteఅంతటి వాయువు సుగంధభరితమైన పుష్పాలమీదనుంచీ వీస్తుంది,కుళ్ళు కాలమీదనుంచీ వీస్తుంది. దేని మీదనుంచి వీచినా పీలుస్తున్నాం, తరవాతే తెలుసుకుంటున్నాం, ముక్కు మూసుకు తప్పుకుంటున్నాం. కుళ్ళు కాలవ మీదనుంచి వీచినంతలో వాయువు విలువ తగ్గిందా?
Anonymous21 September 2023 at 23:03
Delete/meeru cheppindenandi, ayana koddiga Ghattiga chepparu :)/
/అంతటి వాయువు సుగంధభరితమైన పుష్పాలమీదనుంచీ వీస్తుంది,కుళ్ళు కాలమీదనుంచీ వీస్తుంది. దేని మీదనుంచి వీచినా పీలుస్తున్నాం, తరవాతే తెలుసుకుంటున్నాం, ముక్కు మూసుకు తప్పుకుంటున్నాం. కుళ్ళు కాలవ మీదనుంచి వీచినంతలో వాయువు విలువ తగ్గిందా?/
/మీరు చెప్పిందేనండి, అయన కొద్దిగ ఘట్టిగ చెప్పారు :)/
ధన్యవాదాలు.
నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. ఇది సత్యం, జగత్తు మొత్తం మీద, స్థలకాలాలతో నిమిత్తంలేక. అంటే సత్యమే నిత్యమైనది. మార్పు చెందనిది :)