Thursday, 3 March 2016

విరగబూత


13 comments:


  1. పూతను జూచెను మాచన
    తాతర ! బిరబిర టపాన దాపున బెట్టెన్
    యేతా వాతా కెమెరా
    జోదుగ, జూడగ తళుక్కు జొచ్చెగ మీరన్

    ReplyDelete
    Replies

    1. జిలేబిగారు,
      ధన్యవాదాలు

      Delete
  2. "కొత్త చిగురు" (ఫిబ్రవరి 27) నుంచి "విరగబూత" (మార్చ్ 3) వరకూ వచ్చేసారే శర్మ గారు!
    ఫొటో ఆహ్లాదంగా ఉంది.

    ReplyDelete
    Replies

    1. నరసింహారావు గారు,

      ఇవి పదేను రోజుల కితం తీసిన ఫోటోలు, ఇల్లాలి అనారోగ్యంతో బ్లాగు ముఖం చూడలేదు. పెరటిలో మొక్క చిగురొచ్చింది. మా ప్రాంతం లో మామిడి పూతే లేదు. ఈ ఒక్క చెట్టు మాత్రం విరగబూసిందిలా, చిత్రమనిపించింది.
      ధన్యవాదాలు

      Delete
  3. Replies
    1. మావి సొగసు పూచి, మనువాడ రమ్మంది,
      రా, వసంత! భువికి రా, యొకింత ,
      పుడమి పెండ్లి వేది , విడిది యీ ప్రకృతీ
      మాత, పెండ్లి కర్త మన్మథుండు .

      Delete
    2. బాగుంది సర్ ...

      Delete
    3. రాజారావు గారు,
      మీ రెండు పద్యాలూ బాగున్నాయండి, ఎందుకు తొలగించారో తెలియలేదు.
      మీ పద్యాలలో ఏదో చెప్పలేని ఆకర్షణ, పద్యం నడక అలా వుంటుంది
      ధన్యవాదాలు

      ఎన్.ఎమ్.రావుగారు,
      పద్యం బాగుంది కదూ
      ధన్యవాదాలు

      Delete
    4. అవును గురువు గారూ,
      రాజా రావు గారు చాలా అద్భుతంగా వ్రాశారు.
      (నా ధోరణి (అర కొర జ్ఞానం) లో నేను కూడా ఏదన్నా
      గిలుకుదామనుకుని నాలుగైదు రకాలుగా రా(వ్రా)సి
      సంతృప్తి లేక దణ్ణం పెట్టి ఊరుకున్నాను.
      ఈ విషయం లో నాకు జిలేబీ మాత గారి స్పందనా
      వేగం, ప్రతిభ పై ఒకింత ఆశ్చర్యం, మరింత ఆనందం
      కలుగుతుంటూంది. దటీజ్ జిలేబి. చీర్స్...)
      ధన్యవాదాలు సర్ ...

      Delete
    5. వేగము జిలేబి స్పందన !
      రాగపు పదనిసల రాణి రావు ఉవాచః !
      ఈ కళ ప్రతిభయు అచ్చెరు
      వేకద ! మాటల రగడల వేగము జూడన్ :)

      చీర్స్
      జిలేబి

      Delete
    6. జడల ముడులను గట్టు రాలుగాయి
      డబిది దిబిడిల గొట్టు తానెనోయీ
      జగడ రగడలు తనకు సరసమోయీ
      పదుల సంఖ్యల బ్లాగు కవితలోయీ!

      ఒప్పుల కుప్ప తానేనంటనోయీ
      'చెప్పాలె' చెప్పాలంటూ తలలంటునోయీ
      కుప్పలు తెప్పలుగ కా'మింటు'లోయీ
      తప్పుక తిరగ ఎవ్వరి వల్లనౌనంటనోయీ!


      అల్లరి కాదిది జిలేబీ మాయీ
      చల్లని సరదా మాత్రమేనండోయీ...

      (శర్మ గారూ ...
      అమ్మ గారి పార్టీ కండువా కప్పుకున్నాననుకున్నారు గాదూ!
      అయ్యో! అదేం లేదండీ, నన్ను నమ్మండి గురూ గారూ !)

      లోల ...
      :-)

      Delete
  4. మల్లెల వాసన మత్తేక్కిస్తే ..మామిడి పూల వాసన అంతకన్నా ఎక్కువ .వొకసారి పూచిన మామిడి క్రింద వో రెండు నిముషాలు నిలబడి చూడ౦డి..తేడా మీకే తెలుస్తుంది..చెట్లకి చిగురు కోత్హ బట్టలాంటివి అయితే ,పూత ఆభరణ అలంకారాలాంటివి..అనిపిస్తుంది నాకైతైనూ ..

    ReplyDelete
    Replies
    1. astrojoyd గారు,

      మల్లెపూల వాసన మత్తు కలిగిస్తుంది, మిగిలిన పువ్వులవాసన అంతకంటే బాగుంటుంది.

      మా ఇంటికి తూర్పున మల్లెలు ఈ కాలం పూస్తాయి.
      దక్షిణం వైపు ఉభయ సంధ్యలలో వెలగమల్లి విరబూసి మత్తు కలిగించే వాసనేస్తుంది.
      పడమర టేకి,యూకలిప్టస్ పూచే కాలం. ఆ వాసన బలే బాగుంటుంది.
      ఉత్తరం ఇష్టమైన మామిడి పూత నుంచి బలే సువాసన. ఈ వసంతం మాకానందమే
      ధన్యవాదాలు.

      Delete