Monday, 28 March 2016

శర్మ కాలక్షేపంకబుర్లు-గవళ్ళ గంగమ్మ గారి హస్తోదకం…

6 comments:

  1. ఎప్పుడొ చిన్నప్పుడు పెద్దబాలశిక్ష లో చదివాను ఈ చమత్కార పద్యాలు. ఇక్కడ మీవల్ల మళ్ళీ చూస్తున్నాను. సంతోషంగా వుంది.

    మా నాన్నమ్మ చెప్పేవారు - ఏక వాక్య సుందరకాండ - గుర్తున్నంతవరకూ ఇక్కడ రాస్తున్నాను. దీనికి ముందూ వెనకా ఇంకేమయినా వున్నాయెమో తెలీదు. పెద్దవారు మీకేమయినా తెలిస్తే చెప్తారని.

    అంచిత చతుర్ధ జాతుడు పంచమ మార్గమున పోయి ద్వితీయంబు దాటి తృతీయంబప్పురినుంచి ప్రథమ తనూజను గాంచెన్

    పూజ్యుడయిన హనుమంతుడు (పంచభూతాలలో నాల్గవదయిన వాయుపుత్రుడు) ఆకాశ (పంచమ) మార్గమున వెళ్ళి సముద్రము (రెండవదయిన నీరు) దాటి, లంకా నగరానికి నిప్పు (మూడవది అయిన అగ్ని) సీతా దేవిని (మొదటి పంచభూతమయిన భూమి పుత్రిక) చూసెను.

    ReplyDelete


  2. అంచిత చతుర్ధ జాతుడు
    పంచమ మార్గమున పోయి ప్రథమ తనూజన్
    గాంచెన్ తృతీయ మప్పురి
    నుంచె ద్వితీయంబు దాటి నురుకుల వచ్చెన్

    ReplyDelete
    Replies
    1. నమస్తే! పూర్తి పద్యం పంచుకున్నందుకు ధన్యవాదాలు. చిన్నప్పుడు విన్నది పొడుపు కథలా గుర్తుపెట్టుకున్నాను కానీ - పద్యంగా మర్చిపోయాను . ఇన్నాళ్ళకి మళ్ళీ మీ పుణ్యమా అని గుర్తుంచుకునేలా దొరికింది.

      Delete
    2. లలితగారు,
      ఈ మధ్య జిలేబిగారు పద్యాలమీద నడుస్తున్నారు లెండి. అందుకు మీ పద్యం రిపేర్ చేసేరు. అదీ సంగతి
      ఏమైన మంచి పనే చేసేరు గనక జిలేబిగారికి, మంచి పద్యం గుర్తుచేసిన మీకు
      ధన్యవాదాలు.

      Delete
    3. నమస్తే! మీరు పెద్దవారు. దయచేసి నన్ను "గారు" అని మన్నించొద్దు. నేను మీ బ్లాగులు అన్నీ చదువుతూ వుంటాను - కానీ ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు. మీరు బ్లాగులు రాయడం మానేద్దామని అనుకుంటున్నారని మీ బ్లాగులో చదివినప్పుడు బాధపడ్డాను. మీరు మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ రాయడం సంతోషంగా అనిపించింది. మీరు చక్కటి ఆరొగ్యంతో ఇలాగే ఎన్నో మీ తరానికి మాత్రమే తెలిసిన, దక్కిన వారసత్వపు ఇంటలెక్చువల్ సంపదని అందరితో పంచుకోవాలని కోరుకుంటూ....

      ధన్యవాదాలతో,
      లలిత

      Delete
    4. చిరంజీవి లలిత,
      ఇప్పటి వరకు నేను మీకు తెలుసు బ్లాగ్ ద్వారా, కాని మీరు నాకు తెలియదు కదమ్మా! అందుకే అలా...
      మీ ఆత్మీయతకు అభిమానానికి
      ధన్యవాదాలు.

      Delete