Tax on GB
ఒకప్పుడు నెలకి నాలుగు వందలు నెట్ బిల్లు కట్టుకుంటే కష్టంగా ఉండేది. మరి ఎన్ని జి.బి ఇచ్చేవారో గుర్తులేదు,15 ఏళ్ళకితం మాట. జి.బి 400 రోజులు కూడా ఉండేవిట. ఇప్పుడో ఒక జి.బి నాలుగు రూపాయలంటే రోజుకి వంద జి.బి వాడేవాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు నాకే రోజుకి 10 జి.బి దాకా అవుతోంది😂😜 ఇంటి మొత్తమ్మీద 8 మంది జనాభాకి నెలకి 1500 జి.బి అవుతోంది,వాడకం. పన్ను వేద్దామని ఆలోచించక్కరలేదు,వేయడమే మంచిది.
ఎందుకంటే డాటా ఖరీదు తగ్గడంతోనే అవసరవాడకం కంటే అనవసర వాడకం,అనగా సోషల్ మీడియాలో, గోచీ పెట్టుకోడం కూడా చేతకానివాడు కూడా నాలాగ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నాడు.😂 అవి బ్లాగులు కావచ్చు,ఇన్‌స్టా కావచ్చు,టెలిగ్రాం కావచ్చు,ఫేస్ బుక్కు కావచ్చు, వాట్సాప్ కావచ్చు. చిత్రంగా ఆరట్టై వాడేవారు కనపట్టంలేదు,దేశీ కదా ,అంతా విదేశీ మోజే.
వత్తురా యిక పాఠకుల్ మన బ్లాగులోకపు జోలికిన్
శ్యామలీయం బలే తిట్టేరు. ఐ లైక్ ఇట్.
ఇక యు చ్యూబ్ గురించి చెప్పేదే లేదు. ఏదో ఒకటి షూట్ చేసి పెట్టెయ్యడమే. ఆ ఆకు తిను, సుగర్ మాయం,మూడు రోజుల్లో అనేవాడు, కాళ్ళు తిమ్మిర్లా,ఇది రాయి దెబ్బకి తగ్గుతాయనేవాడు,ఇలా అందరూ వైద్యులే. ఇందులో ఏ ఒక్కటి పనిచేసినా మందుల కంపెనీలు మూసుకోవాలి,డాక్టర్లు గోచీలు పెట్టుకుని పందుల్ని కాచుకోవాలి లేదా పల్లీలు అమ్ముకోవాలి. కుక్క ఎదురొచ్చి ఏ పక్కనుంచి వెళితే మంచిది,దీనిమీద ఒకడికి పండితుడి వేషంవేసి కార్యక్రమం, ఇలా ఎన్నని చెప్పేదీ? కొన్ని ఉదాహరణలే .
ఇక సోషల్ మీడియాలో హేటువాదులకి దేశద్రోహులమాట చెప్పేదే లేదు. కట్పేస్టు,కాపీ పేస్టు ప్రొఫెసర్లు గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి విదేశాల సొమ్ము చేరడం వీటికోసం అదనం. ప్రభుత్వం మీద విషం చిమ్మేవారికి లోటే లేదు. వీరి వీరభక్తులకు లెక్కా,జమా లేనేలేదు. వీరందరి డాటా ఉపయోగం మీద పన్ను వేయాల్సిందే. తల్లిపాలుతాగి రొమ్ముగుద్దిన చందంగా విదేశాలనుంచి దేశద్రోహ ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది. ఇక కమే (ఎ.ఐ) వచ్చాకా ఫేక్ వీడియోలు,ఆడియోలు రకరకాలు కనపడుతున్నాయి,వీటి మీద అదుపు కనపడటం లేదు.
నెట్ కి అతుక్కుపోయే పిన్నా పెద్దా అంతా ఒకలాగే ఉన్నారు. ఎవరూ చెప్పేవారు లేరు,వినేవారసలే లేరు.
సులభా పురుషా రాజన్
సతతః ప్రియవాదినః
అప్రియస్య చ పధ్యస్య
వక్తా శ్రోతాచ దుర్లభః
మారీచుడు
ప్రియమైనమాటలు చెప్పేవాళ్ళే దొరుకుతారు,ఎప్పుడూ. అప్రియమైనా సత్యం చెప్పేవాడు దొరకడు దొరికి చెప్పినా వినేవాడు లేడని, మారీచుడు రావణునికి చెప్పినమాట. 🙏
ఇలా టేక్స్ వేస్తేనైనా వాడే సమయం తగ్గుతుందని ఆశట.ఇది జరిగేనా? ఏమో చూదాం .
https://bonagiri.wordpress.com/2026/01/27/most-necessary-tariffs-to-prevent-digital-disaster/
రిప్లయితొలగించండిమీ టపా అప్పుడే చూసా. కామెంటు పెడదామంటే ఒప్పుకోలేదు,బ్లాగు.మానేసా,మరచిపోయా. ఏమైనా మీరు దీర్ఘదర్శులు
తొలగించండి***
I posted the above message on X to Nirmala ji and Vaishnav ji on 27th January. Not sure whether they read it.
తొలగించండిBonagiri sir,
తొలగించండిNormally ministers will find no time to read messages,as they will be many. But the p.s will read it and send an abridged note to the minister along with the link of the article.. The minister will read the note and if find useful or informative anyway, read the full article. Finally the message will be recorded in the ministry at appropriate section and place for further use. Normally an acknowledgement may be sent,if you have given the mail address along with the article. No paper work it seems.
Hope this message in reply keeps you in good spirits 🙏
నిజమేనండి. విచ్చలవిడి వాడకం మీద పన్ను వేయవచ్చును. తప్పులేదు. నావిషయం ఐతే సరాసరిగా రోజుకు మహా ఐతే ఒక జోబీ డేటా వాడుతాను. రామసంకీర్తనం తప్ప నేను చేస్తున్నది ఆట్టే లేదు. బ్లాగువిహారం మరీఅంత ఎక్కువ కాదు. నెట్ వాడటం లేదేమని జియో వాడు అంతా బాగుందా వాడరేం అంటూ కుశలప్రశ్నలు వేస్తూ ఉంటాడు అపుడపుడూ.
రిప్లయితొలగించండిఒక్క జియో వాడే అనేమిలెండి,అంతా ఆ బళ్ళో చదువుకున్నవారే అన్న నానుడి చందం
తొలగించండిఅది బ్రాడ్ బేండ్ ఐనా , మొబైల్ ఐనా 12శాతం
రిప్లయితొలగించండిTax కడుతున్నాం కదండీ .
సారూ! అది ప్లాన్ అమ్మకం మీద టాక్స్. ఇది వాడిన జి.బి మీద టాక్సు
తొలగించండిప్లాన్ అమ్మినవాడు కట్టడు కదా ,
తొలగించండికొన్నవాడే కట్టేది . ఏ రాయయితే నేం ,
పన్ను రాలేది వినియోగదారుడిదే కదా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితాగేవాడే కట్టుకుంటాడు తాళ్ళపన్ను అనేది పాతకాలపు నానుడే కదుసార్! 🤣🙏
తొలగించండితాతగారండీ
తొలగించండిఈ టాళ్ పన్ను కతా కమా మీషు ఏమిటి?
Zilebi13 మార్చి, 2026 6:04 PMకి
తొలగించండిప్రతి నానుడికి కత ఉండదు జిలేబి,ఐనా చెబుతా విను.
ఒక రాజుగారు ఆదాయం పెంచడానికి ఏం చేద్దామని ఆలోచన చేస్తే మంత్రి కల్లుతాగేవారు హెచ్చుగా ఉన్నారు, గనక కల్లుమీద పన్ను వేద్దామన్నాడు. ఎంతొస్తుందంటే కోశాధికారి కాకిలెక్కలూ చెప్పేడు.సరే కల్లు మీద పన్నేద్దామని నిర్ణయించేరు.తాడి చెట్టుకూ పన్నేయాలని నిర్ణయించేరు. అంతతోకాలేదు. ఇదెక్కడ వసూలు చేయాలనే సమస్య వచ్చింది. తాడిచెట్టు యజమానా? కల్లు గీసేవాడా చర్చ వచ్చింది. దానికి ఒకరు తాగేవాడే పెట్టుకుంటాడు తాళ్ళపన్ను అని సమస్యను తేల్చేసేడు. అప్పటినుంచి కల్లు ఖరీదు రాజావారు నిర్ణయిస్తారు,అందులో తాళ్ళ పన్ను కూడా కలిసి ఉంటుంది. అదే తాగేవాడే పెట్టుకుంటాడు తాళ్ళపన్ను కత.
ఒకప్పట్లో కర్మ రేడియోకి టాక్సు గుంజే వాళ్లు :)
రిప్లయితొలగించండిమళ్లీ అల్లాంటి కాలం వస్తోందన్న మాట డేటాకి ట్యాక్సు :)
అన్నీ పిదప బుద్ధులయిపోయేను :)
సిగ్గులేదూ! సొతంత్రం వచ్చిన 43 ఏళ్ళకి రేడియో పన్ను రద్దు చేసేరు,ఎందుకు చేసేరు,నీకు తెలుసు. అడిగితే మక్కెలిరగదన్ని బొక్కలో తోస్తారని భయపడి దేశం నుంచి పారిపోయావు. ఇప్పుడు తొక్కలో కబుర్లు చెబుతున్నావు. దేశంలో లేని నీకు మా గోలెందుకు?
తొలగించండిసరే లెండి డేటాకి టాక్సు కట్టడానికి తలవంచేరు మల్లే వుంది
తొలగించండిబియెస్ యెన్నెల్ కాలంలో రౌండు రౌండుగా తిరిగే నో నెట్టుకి ఇన్ టర్ నెట్ నెల చందా కట్టినట్టు :)
నిర్మలమ్మ జమానాలో డబ్బు బేంక్ లో పెడితే పన్ను , తీస్తే పన్ను . ఎన్నిసార్లయినా .....
తొలగించండిZilebi13 మార్చి, 2026 9:57 AMకి
తొలగించండిచిన్ననోమునోచి పెద్ద ఫలితం రావాలంటే ఎట్లొస్తదీ! యావత్తైలం తద్వ్యాఖ్యానం🤣
తొలగించండివెంకట రాజారావు . లక్కాకుల13 మార్చి, 2026 10:21 AMకి
డబ్బుంది కనక పన్ను కడతన్నారు సార్,మీరు. నెత్తిమీద ఎంట్రుకల్లేనోళ్ళం ఏంకడతాం సార్. మీరు పన్ను కట్టాలె మేం బువ్వ తినాలే.
మధ్యతరగతి వాళ్ళ కష్టమే కద సార్ ,
రిప్లయితొలగించండిపెద్ద వాళ్ళ బంగారు పళ్యాలలో చేరేది .
పూర్వం కష్టజీవుల శ్రమ దోపిడీ అనేవాళ్ళు .
ఇప్పు డలా అనాల్సిన పనిలేదు .
తినీ , తినక మధ్యతరగతి వేతనజీవులు
భవిష్యత్తవసరాలకు నాల్గు డబ్బులు దాచి పెట్టుకుంటే , చావబాదుడు .
వెంకట రాజారావు . లక్కాకుల13 మార్చి, 2026 11:58 AMకి
రిప్లయితొలగించండిసమసమాజ నిర్మాణమె నీ ధ్యేయం
సకలజనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
ఉన్నవాడిదగ్గర తీసుకుని లేనివాడైకి పెట్టడం సోషలిస్టు సమాజ నిర్మాణంట కదు సార్!
ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి---------------------------
పట్టినది పసిడి యగు , చే
పట్టిన ప్రతి కార్యమెల్ల ఫలవంతమగున్
గట్టిగ ' ఉగాది ' మొదలుగ
తుట్ట తుదవరకును మీకు తోషం బొదవున్ .
----- లక్కాకుల వెంకటరాజారావు .
వెంకట రాజారావు . లక్కాకుల19 మార్చి, 2026 9:23 AMకి
తొలగించండిమీకు ఉగాది శుభాకాంక్షలు,బహు ఆలస్యంగా, మన్నించాలి
ఇచ్చట గల శ్రీమాన్ పెద్దలందిరికి
రిప్లయితొలగించండిపరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు !
ఆపరా భవ! గావు మయ్యా జనులను
లోకమున ట్రంపు చేయుకల్లోల మేల?
దేశముల మధ్య రగడలు దేనికయ్య
విశ్వమంతయు జగదీశ వెరసి నీదె!
జిలేబి
తాతగారు
రిప్లయితొలగించండికుశలమేనా ?
Zilebi25 మార్చి, 2026 4:44 AMకి
తొలగించండిZilebi26 మార్చి, 2026 9:47 AMకి
ఏమి చెప్పుదును. మార్చ్ 1 మొదలు భాస్కరుని కడగంటి చూపుకే 39,40 ఉంటోంది.😂 మొదటివారం వారఫలాలో దూర ప్రయాణం అన్నాడు, తప్పదు,మరి. 500 కిలో మీటర్లు ఎంత ఏ.సి కారైనా హైవే మీద 120కి.మి వేగంతో ప్రయాణం,గుడెలదురుతూ.😒 రోజు తరవాత మళ్ళీ వెనక్కి,ఏమందును, వేడి ఆపై అనారోగ్యం, కోలుకుంటున్నమనుకుంటూ నడిపేసేను ఉగాదిదాకా. ఉగాది పచ్చడి తిన్నాను,తేడా చేసింది. మరింకేం వేడి తగ్గలేదు,అనారోగ్యం పిలవకపోయినా పలుకుతుందిగా. బ్లాగుజోలికే రాలేదు. 'కునికే నక్కమీద తాటిపండు పడ్డట్టు',హై-ఫై చచ్చింది,బతికింది,బతికి చచ్చింది, చచ్చే దోబుచులాటలో వారంపైగా గడచిపోయె. నిన్నటి పూర్తిగా చచ్చింది,కొత్త రూటర్ వేసేటప్పటికి ఈ కాలమయింది.
నన్ను తలుచుకున్నందుకు
ధన్యవాదాలు.
-
రిప్లయితొలగించండితాత గారి మౌనమ్మును తరచి చూడ
సంది యమ్ము కలుగుచుండె చాన చాన
కుశలమేన స్వామీ వారు కొంత తెలియ
జేయు మయ్యరొ తిరుమల వేంకటేశ!
ఇట ' మతిస్థిమితము ' దప్పి , హేయమైన
రిప్లయితొలగించండిమాటలను తూలు ' నీచుల ' మది దలంచి
మౌనమును దాల్చె ననిపించు మహితయశుడు
శర్మగారికి వందన శతము 🙏 లయ్య .
వెంకట రాజారావు . లక్కాకుల26 మార్చి, 2026 10:05 AMకి
తొలగించండిఉడుకు పెరిగింది,ఆరోగ్యం జాగర్తా!🙏
నేను ఈమధ్య చాలా నెలలపాటు తెలుగుబ్లాగులను వదలిపెట్టి నిజంగా చాలా చాలా హాయిగా ఉన్నాను. ఎక్కువమంది అడుగుతున్నారని నా బ్లాగును మళ్ళా పబ్లిక్ చేసి బ్లాగ్లోకం లోనికి వచ్చాను. అది చాలా పెద్దపొరపాటే అని గ్రహించాను. ఇక్కడ ఈ రాజారావు, జిలేబి అనే ఇద్దరు వ్యాఖ్యావీరులు నిత్యం అదేపనిగా నిరంతరాయంగా నామీద రాళ్ళువేస్తుంటే మిగిలిన అందరు తమతమ ఒళ్ళు కాపాడుకోవాలని దూరంగా కూర్చుని వినోదం చూస్తున్నారు మౌనంగా. ఆ ఇద్దరి మాటల కన్నా యీమౌనమే నన్ను ఎక్కువగా బాధిస్తున్నది. పిచ్చివాళ్ళ స్వర్గంలా మారి కశ్మలపూరితంగా తయారైన ఈ తెలుగుబ్లాగుల మధ్య నేను ఉండలేను. ఉండటం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు కూడా. కాబట్టి ఇక సెలవు.
రిప్లయితొలగించండిశ్యామలీయం26 మార్చి, 2026 11:26 AMకి
తొలగించండిలోకో భిన్న రుచిః. మీరు పట్టించుకుంటేనే ఏదైనా పడుతుంది,స్థిరంగా నిలబడు నిన్ను ఎవరూ కదల్చలేరంటుందు ఋగ్వేదం, తమకు తెలీయనిదా? ఇదేకదా ఉ.బో.స🙏
ఏమండీ తాతగారూ
రిప్లయితొలగించండిఈ రచన మీదేనా ?
https://eemaata.com/em/writer/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF+%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE/?view=theme
Zilebi2 ఏప్రిల్, 2026 5:46 AMకి
తొలగించండినాదేలా ఉందే! 😍
ఇదెక్కడ దొరికింది తమకు?