12, మార్చి 2026, గురువారం

Tax on GB

 Tax on GB


ఒకప్పుడు నెలకి నాలుగు వందలు నెట్ బిల్లు కట్టుకుంటే కష్టంగా ఉండేది. మరి ఎన్ని జి.బి ఇచ్చేవారో గుర్తులేదు,15 ఏళ్ళకితం మాట. జి.బి 400 రోజులు కూడా ఉండేవిట. ఇప్పుడో ఒక జి.బి నాలుగు రూపాయలంటే రోజుకి వంద జి.బి వాడేవాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు నాకే రోజుకి 10 జి.బి దాకా అవుతోంది😂😜 ఇంటి మొత్తమ్మీద 8 మంది జనాభాకి నెలకి 1500 జి.బి అవుతోంది,వాడకం. పన్ను వేద్దామని ఆలోచించక్కరలేదు,వేయడమే మంచిది. 

ఎందుకంటే డాటా  ఖరీదు తగ్గడంతోనే అవసరవాడకం కంటే అనవసర వాడకం,అనగా సోషల్ మీడియాలో, గోచీ పెట్టుకోడం కూడా చేతకానివాడు కూడా నాలాగ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నాడు.😂 అవి బ్లాగులు కావచ్చు,ఇన్స్టా కావచ్చు,టెలిగ్రాం కావచ్చు,ఫేస్ బుక్కు కావచ్చు, వాట్సాప్ కావచ్చు. చిత్రంగా ఆరట్టై వాడేవారు కనపట్టంలేదు,దేశీ కదా ,అంతా విదేశీ మోజే. 

చెత్త బ్లాగులు చెత్త పోష్టులు చెత్త వ్యాఖ్యలు గుంపులే
ఎత్తి పోతలు వింత భాషల చెత్త కైతలు పోగులే
మొత్తుకోళ్ళులు నెత్తిపొడ్పులు సుత్తిమాటలు రాశులే

వత్తురా యిక పాఠకుల్ మన బ్లాగులోకపు జోలికిన్ 

శ్యామలీయం బలే తిట్టేరు. ఐ లైక్ ఇట్. 


ఇక యు చ్యూబ్ గురించి చెప్పేదే లేదు. ఏదో ఒకటి షూట్ చేసి పెట్టెయ్యడమే. ఆ ఆకు తిను, సుగర్ మాయం,మూడు రోజుల్లో అనేవాడు, కాళ్ళు తిమ్మిర్లా,ఇది రాయి దెబ్బకి తగ్గుతాయనేవాడు,ఇలా అందరూ వైద్యులే. ఇందులో ఏ ఒక్కటి పనిచేసినా మందుల కంపెనీలు మూసుకోవాలి,డాక్టర్లు గోచీలు పెట్టుకుని పందుల్ని కాచుకోవాలి లేదా పల్లీలు అమ్ముకోవాలి. కుక్క ఎదురొచ్చి ఏ పక్కనుంచి వెళితే మంచిది,దీనిమీద ఒకడికి పండితుడి వేషంవేసి కార్యక్రమం, ఇలా ఎన్నని చెప్పేదీ? కొన్ని ఉదాహరణలే .


   ఇక సోషల్ మీడియాలో  హేటువాదులకి దేశద్రోహులమాట చెప్పేదే లేదు. కట్పేస్టు,కాపీ పేస్టు  ప్రొఫెసర్లు గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి విదేశాల సొమ్ము చేరడం వీటికోసం అదనం. ప్రభుత్వం మీద విషం చిమ్మేవారికి లోటే లేదు. వీరి వీరభక్తులకు లెక్కా,జమా లేనేలేదు. వీరందరి డాటా ఉపయోగం మీద పన్ను వేయాల్సిందే.  తల్లిపాలుతాగి రొమ్ముగుద్దిన చందంగా విదేశాలనుంచి దేశద్రోహ ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది. ఇక కమే (ఎ.ఐ) వచ్చాకా ఫేక్ వీడియోలు,ఆడియోలు రకరకాలు కనపడుతున్నాయి,వీటి మీద అదుపు కనపడటం లేదు.             

 నెట్ కి అతుక్కుపోయే పిన్నా పెద్దా అంతా ఒకలాగే ఉన్నారు. ఎవరూ చెప్పేవారు లేరు,వినేవారసలే లేరు.  


సులభా పురుషా రాజన్  

సతతః ప్రియవాదినః 

అప్రియస్య చ పధ్యస్య

వక్తా శ్రోతాచ దుర్లభః 

                     మారీచుడు

ప్రియమైనమాటలు చెప్పేవాళ్ళే దొరుకుతారు,ఎప్పుడూ. అప్రియమైనా సత్యం చెప్పేవాడు దొరకడు దొరికి చెప్పినా వినేవాడు లేడని, మారీచుడు రావణునికి చెప్పినమాట.   🙏 

  ఇలా టేక్స్ వేస్తేనైనా వాడే సమయం తగ్గుతుందని ఆశట.ఇది జరిగేనా? ఏమో చూదాం . 


20 కామెంట్‌లు:

  1. https://bonagiri.wordpress.com/2026/01/27/most-necessary-tariffs-to-prevent-digital-disaster/

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ టపా అప్పుడే చూసా. కామెంటు పెడదామంటే ఒప్పుకోలేదు,బ్లాగు.మానేసా,మరచిపోయా. ఏమైనా మీరు దీర్ఘదర్శులు
      ***

      తొలగించండి
    2. I posted the above message on X to Nirmala ji and Vaishnav ji on 27th January. Not sure whether they read it.

      తొలగించండి
  2. నిజమేనండి. విచ్చలవిడి వాడకం మీద పన్ను వేయవచ్చును. తప్పులేదు. నావిషయం ఐతే సరాసరిగా రోజుకు మహా ఐతే ఒక జోబీ డేటా వాడుతాను. రామసంకీర్తనం తప్ప నేను చేస్తున్నది ఆట్టే లేదు. బ్లాగువిహారం మరీఅంత ఎక్కువ కాదు. నెట్ వాడటం లేదేమని జియో వాడు అంతా బాగుందా వాడరేం అంటూ కుశలప్రశ్నలు వేస్తూ ఉంటాడు అపుడపుడూ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక్క జియో వాడే అనేమిలెండి,అంతా ఆ బళ్ళో చదువుకున్నవారే అన్న నానుడి చందం

      తొలగించండి
  3. అది బ్రాడ్ బేండ్ ఐనా , మొబైల్ ఐనా 12శాతం
    Tax కడుతున్నాం కదండీ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సారూ! అది ప్లాన్ అమ్మకం మీద టాక్స్. ఇది వాడిన జి.బి మీద టాక్సు

      తొలగించండి
    2. ప్లాన్ అమ్మినవాడు కట్టడు కదా ,
      కొన్నవాడే కట్టేది . ఏ రాయయితే నేం ,
      పన్ను రాలేది వినియోగదారుడిదే కదా !

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. తాగేవాడే కట్టుకుంటాడు తాళ్ళపన్ను అనేది పాతకాలపు నానుడే కదుసార్! 🤣🙏

      తొలగించండి
    5. తాతగారండీ
      ఈ టాళ్ పన్ను కతా కమా మీషు ఏమిటి‌?

      తొలగించండి
    6. Zilebi13 మార్చి, 2026 6:04 PMకి
      ప్రతి నానుడికి కత ఉండదు జిలేబి,ఐనా చెబుతా విను.

      ఒక రాజుగారు ఆదాయం పెంచడానికి ఏం చేద్దామని ఆలోచన చేస్తే మంత్రి కల్లుతాగేవారు హెచ్చుగా ఉన్నారు, గనక కల్లుమీద పన్ను వేద్దామన్నాడు. ఎంతొస్తుందంటే కోశాధికారి కాకిలెక్కలూ చెప్పేడు.సరే కల్లు మీద పన్నేద్దామని నిర్ణయించేరు.తాడి చెట్టుకూ పన్నేయాలని నిర్ణయించేరు. అంతతోకాలేదు. ఇదెక్కడ వసూలు చేయాలనే సమస్య వచ్చింది. తాడిచెట్టు యజమానా? కల్లు గీసేవాడా చర్చ వచ్చింది. దానికి ఒకరు తాగేవాడే పెట్టుకుంటాడు తాళ్ళపన్ను అని సమస్యను తేల్చేసేడు. అప్పటినుంచి కల్లు ఖరీదు రాజావారు నిర్ణయిస్తారు,అందులో తాళ్ళ పన్ను కూడా కలిసి ఉంటుంది. అదే తాగేవాడే పెట్టుకుంటాడు తాళ్ళపన్ను కత.

      తొలగించండి
  4. ఒకప్పట్లో కర్మ రేడియోకి టాక్సు గుంజే వాళ్లు :)

    మళ్లీ అల్లాంటి కాలం‌ వస్తోందన్న మాట డేటాకి‌ ట్యాక్సు :)

    అన్నీ పిదప బుద్ధులయిపోయేను :)


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సిగ్గులేదూ! సొతంత్రం వచ్చిన 43 ఏళ్ళకి రేడియో పన్ను రద్దు చేసేరు,ఎందుకు చేసేరు,నీకు తెలుసు. అడిగితే మక్కెలిరగదన్ని బొక్కలో తోస్తారని భయపడి దేశం నుంచి పారిపోయావు. ఇప్పుడు తొక్కలో కబుర్లు చెబుతున్నావు. దేశంలో లేని నీకు మా గోలెందుకు?

      తొలగించండి
    2. సరే లెండి డేటాకి టాక్సు కట్టడానికి‌ తలవంచేరు మల్లే వుంది

      బియెస్ యెన్నెల్ కాలంలో రౌండు రౌండు‌గా తిరిగే నో నెట్టుకి ఇన్ టర్ నెట్ నెల చందా కట్టినట్టు :)


      తొలగించండి
    3. నిర్మలమ్మ జమానాలో డబ్బు బేంక్ లో పెడితే పన్ను , తీస్తే పన్ను . ఎన్నిసార్లయినా .....

      తొలగించండి
    4. Zilebi13 మార్చి, 2026 9:57 AMకి
      చిన్ననోమునోచి పెద్ద ఫలితం రావాలంటే ఎట్లొస్తదీ! యావత్తైలం తద్వ్యాఖ్యానం🤣

      తొలగించండి

    5. వెంకట రాజారావు . లక్కాకుల13 మార్చి, 2026 10:21 AMకి
      డబ్బుంది కనక పన్ను కడతన్నారు సార్,మీరు. నెత్తిమీద ఎంట్రుకల్లేనోళ్ళం ఏంకడతాం సార్. మీరు పన్ను కట్టాలె మేం బువ్వ తినాలే.

      తొలగించండి
  5. మధ్యతరగతి వాళ్ళ కష్టమే కద సార్ ,
    పెద్ద వాళ్ళ బంగారు పళ్యాలలో చేరేది .
    పూర్వం కష్టజీవుల శ్రమ దోపిడీ అనేవాళ్ళు .
    ఇప్పు డలా అనాల్సిన పనిలేదు .
    తినీ , తినక మధ్యతరగతి వేతనజీవులు
    భవిష్యత్తవసరాలకు నాల్గు డబ్బులు దాచి పెట్టుకుంటే , చావబాదుడు .

    రిప్లయితొలగించండి
  6. వెంకట రాజారావు . లక్కాకుల13 మార్చి, 2026 11:58 AMకి

    సమసమాజ నిర్మాణమె నీ ధ్యేయం
    సకలజనుల సౌభాగ్యమె నీ లక్ష్యం

    ఉన్నవాడిదగ్గర తీసుకుని లేనివాడైకి పెట్టడం సోషలిస్టు సమాజ నిర్మాణంట కదు సార్!

    రిప్లయితొలగించండి