Thursday, 17 August 2023

ఎంతో కొంత, అంతా హిరణ్యకశిపులే!

 

ఎంతో కొంత,  అంతా హిరణ్యకశిపులే!


నడకల్లో రకాలున్నాయట. నత్తనడక, పిల్లినడక,పెళ్ళివారి నడక...ఇలా...ఆధునికులైతే మార్నింగ్ వాక్,ఈవినింగ్ వాక్, స్టేరింగ్ వాక్, ...ఇలా.

మొన్న నడకలో ఎముక చిట్లినదగ్గర్నుంచి మంచానికే అతుక్కుపోయా! నిన్న కాలికి కట్టిప్పేరు దాంతో   ఇక్కడికొచ్చా! ఈమధ్యలో మందస్మితవదనారవింద సుందరి, 

( అబ్బా ఇంత పేరా!   ఎత్తుపళ్ళ సుందరి అంటే బాగోదుగా)  దరహాసోజ్జ్వలన్ముఖి తో
జరిగిన సంభాషణ.   


''అయ్యయో! ఎలా జరిగింది? ఏమయింది?'' అడిగింది.

''నడుస్తోంటే జరిగింది,  (విరిగింది)నెప్పిగా ఉంది'' 

''చిన్నపిల్లాణ్ణనుకుంటున్నారా, గెంతుకుంటూ నడవడానికి, నెమ్మదిగా నడవాలిగా? ''  అభిమానం, ప్రేమ,  ఆతృత, ఆవేదన,  కొంచం  విచారం, కోపం,విసుగు,  కలగలిపి.

బుస్సున కోపమొచ్చింది.తమాయించుకున్నా! ఊరుకున్నా! 

ఒకరోజు తరవాత. ''తిట్టేవా?'' అడిగా

''మరి! నైస్!! బలే పడ్డారు!!! అని అప్రీసియేట్ చేశా అనుకున్నారా?'' అడిగిందీ సారి నిజంగానే కోపంగా.

''కాలు కావాలని విరుచుకుంటారా?నీకు దయ లేదు'' అనేశా!

''నాకు దయ ఉంది. మీకు భయం లేదు. జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్న.. పర్వా లేదు కదా.. ''అన్నది

నేనేదో సమాధానం చెప్పేనుగాని, ఆలోచనలో పడ్డా.

విరిగిందంటే, ఇలా అన్నదేం! అని. నా కాలు  విరిగిందన్న బాధ,   బాధ పడుతున్నానన్న బాధ అదనం, అభిమానం, ప్రేమ,  ఆతృత, ఆవేదన,   కలగలిపి,అభిమానం పెల్లుబికి అన్నమాటగా చెప్పుకుని.....

   

"ఏంటి భయం,జాగ్రత్త, పర్వా లేదు కదా"  అని ఆలోచనలో పడ్డా! 

భయం ఎలాపుడుతుంది? స్వయంగా ఒక సంఘటన చూడడం లేదా వినడం ద్వారా భయం పుడుతుంది. భయంనుంచి జాగ్రత్త పుడుతుంది. 


ఒక ఉదాహరణ చూదాం. భాగవతం దగ్గరకెళితే...

హిరణ్యాక్షుడు హరి చేతిలో మరణించిన తరవాత హిరణ్యకశిపుడికి భయం పుట్టుకొచ్చింది. మనమూ 

 ఇంతేనేమో అని. అందుకు తపస్సుచేసేడు.బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ''వత్సా! ఏమి నీకోరికంటే?'' ''చావులేని వరంకావాల''న్నాడు. ''అది ఇవ్వడం కుదరదుగాని మరేమన్నా కోరుకోమంటే!'' ''గాలిన్ కుంభిని..అని ఈ చోట్ల, వీళ్ళచేత చావు రాకూడ''దన్నాడు. ''సరే! ఇచ్చానురా!! చాలామందికి వరాలిచ్చా గాని ఇలాటి వరం అడిగినవాడు లేడు, బుద్ధికలిగి బతుకు'', అన్జెప్పి తిరోహితులయ్యారు, బ్రహ్మగారు..ఆ తరవాత కత తెలిసిందే! వీడేవైతే కాదనుకున్నాడో, వాటిని తప్పించి నరసింహ రూపంలో గడపమీద గోళ్ళతో పొట్ట చీల్చి చంపేడు. వీడు తీసుకున్న జాగ్రత్తలు ఉపయోగించాయా?


ఇలాటిదే మరొకటి భారతం నుంచి

శాపానికి మరణిస్తావంటే భయపడ్డాడు,ఒంటి స్థంభం మేడలో దాగాడు, ఎన్నిజాగ్రత్తలో తీసుకున్నాడు,చివరికి చావు తప్పిందా?  చివరికి పండులో పురుగుగా వచ్చి కాటేసిపోయాడు,  తక్షకుడు.


అభివృద్ధి చెందేమనుకుంటున్న వారు, ఆ దేశాల మనుషులు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఆరోగ్య రక్షణలుంటాయి, చెకప్ లుంటాయి,హాస్పిటళ్ళుంటాయి, మేధావులైన డాక్టర్లుంటారు,డబ్బుకైతే లోటే లేదు. కానీ, చిత్రంగా ఆ దేశాల్లోనూ పౌరులు చచ్చిపోతున్నారు, వ్యాధుల మూలంగా! మరీ జాగ్రత్తలు ఎందుకు పనిచెయ్యటం లేదు? అర్ధం కాలేదు.

  కాలం ఎవరిని వదలదు. అందుకే కాలగ్రాసీభూతులయ్యారంటుంటారు,అంటే కాలం మింగేసిందన మాట. కాలOమూడితే (కాలం పూర్తైతే) జాగ్రత్తలేం పని చెయ్యవు.అదే  విధి 

ఏమనమాట? కాలాన్ని జయించినవారు లేరు. జాగ్రత్తలేం పని చెయ్యవు. 

నిన్న పుట్టిన శరీరం పెరిగింది. పెరిగినది శాశ్వతంగా ఉండదు. నశిస్తుందనే స్పృహ లేకపోతోంది. నిన్న మధువులొలికించిన సోగకళ్ళు నేడు లొత్తపోయాయి. నిన్నటి వయసు అందాలు నేడు జారిపోయాయి. నిన్న హరి నామస్మరణ చేసినవారిని నిందించిన నోరు పెగలటం లేదు. నిన్న అందరిని తన్నిన కాలు నేడు లేవటం లేదు. నిన్న విచక్షణలేక దండించిన చేయి నేడు ఎండిపోయింది. ఐనా మానవులకి జ్ఞాననాడి ఆడటం మొదలు కావటం లేదు. మనసును జయించే ఆలోచనే మొదలుకావటం లేదు. కనీసం పగ,అసూయ,ఈర్ష్య,ద్వేషాలను వదలించు కోవాలనే కోరిక ఆలోచనకే రావటం లేదు.

శరీర సుఖాలతో కాలం గడిపెయ్యచ్చనే ఆలోచన కలిగిన 

మానవులంతా ఎంతోకొంత, అంతా హిరణ్యకశిపులే!


విధి తప్పదు! అందుకే వేదం చెప్పేమాట

త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుక మివబంధనాత్మృత్యో ముక్షీయమామృతాత్!

ఎంత చక్కటి కోరిక!! అపమృత్యువు నుంచి రక్షించు!  దోసకాయ ముగ్గిన తరవాత తొడిమనుంచి విడిపోయినట్టు, కాలం చెల్లిన తరవాత తీసుకుపో!!!

21 comments:

  1. అంతే కదండీ, కాలాన్ని జయించలేం.

    తక్షకుడు కాటేసింది పరీక్షిత్తును కదూ, జనమేజయుడని వ్రాసారు చూడండి.

    - విన్నకోట నరసింహారావు

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      వ్యక్తులు,ప్రదేశాల పేర్లు గుర్తుండకపోవడం ఒక వ్యాధి లక్షణమంటుంది హోమియోపతి, ఈ లక్షణం నాకు వయసులో ఉండగానే సంక్రమించింది. చరిత్ర ఎంతేని చెప్పగలనుగాని, వ్యక్తులపేర్లు,ప్రదేశాలు, తారీకులు గుర్తుండవు. ఇదీ నేను చరిత్ర పరిక్షలో తప్పడానికి కారణం. :) ఈ మధ్య ఇది మరికొంచం పెరిగిందండి, వయసుతో.
      జనమేజయుడిని కాటేసినది కర్కోటకుడు అని రాశా మొదటగా! ప్రచురించేటపుడు చూసి తక్షకుడు కదా అని గుర్తొచ్చి సరిజేసానండి. జనమేజయుడు తప్పని గుర్తించలేదు. మీరు చెప్పిన తరవాత గుర్తొచ్చింది అది పరీక్షిత్తని, టపాలో కూడా సరి జేస్తాను. సరిజేసినందుకు ధన్యవాదాలు.

      Delete
  2. కాలూరుకోదేమిటండీ? ఫ్రాక్చర్ అయింది ఈ మధ్యనేగా, అప్పుడే బయటకు బయలుదేరారా? అది అతుక్కునేటందుకు కావలసిన వ్యవధి ఇవ్వండి సారూ.

    మీ మందస్మితవదనారవిందానికి మీ బాగోగుల గురించిన చింత ఎక్కువలాగానే ఉంది 🙂.

    - విన్నకోట నరసింహారావు

    ReplyDelete
    Replies
    1. Anonymous17 August 2023 at 10:39
      విన్నకోట సారూ!
      ఇరవైరోజులుగా మంచంమీద కాలు పైకి పెట్టుకుని పడుకుని, పడుకుని విసుగొచ్చిందండి. కాలకృత్యాలకి తప్ప కదలికలేకపోడంతో సుగర్ పెరిగిపోయింది. డాక్టర్ కట్టు తీసేసి నెమ్మదిగా నడవమన్నారు, గదుల్లోనే! అందుకే ఈ ప్రయత్నం. నా మంచం నుంచి పదడుగులు భోజనానికి,ఆరడుగులు డెస్క్ టాప్ దగ్గరకేనండి. మరెక్కడికి కదలటం లేదు. మళ్ళీ చెప్పేదాకా ఇంటి బయట (మూడు గదుల్లో తప్పించి) కాలు ఎగరేయద్దన్నారు సార్ డాక్టరు:)

      మందస్మిత వదనారవింద సుందరికి ఎందుకో మరి, నేనంటే అభిమానం, ప్రేమ. ఎందుకిలా అంటే కితం జన్మలో చెప్పవలసినదేదో మరిచిపోయాను, అందుకే ఇపుడు పరిచయం చేసాడు దేవుడు, అంటుంది. నిజంగానే అమ్మలాగా కోప్పడింది,అభిమానించింది,ఆతృతపడింది,బాధపడుతోంది. నిజంగానే ఇటువంటివారు దొరకడం అదృష్టం కాదంటారా?
      ధన్యవాదాలు.

      Delete
    2. గతంలో మీరు కలహాగ్నీచెకుముకి అన్నట్లుగా గురుతు.

      Delete
    3. Anonymous17 August 2023 at 19:54
      గతంలో ఎప్పుడూ కలహాగ్ని చెకుముకి అనలేదండి.

      Delete
  3. శివుడు గారు విష్ణువు గారు అని అనరు. కానీ బ్రహ్మ గారు అని అంటారు. 🤔 కొంతమంది ప్రవచన కర్తలు ఈ పద్ధతి విరివిగా వాడుకలోకి తెచ్చారు.

    ReplyDelete
    Replies

    1. Anonymous17 August 2023 at 10:40
      ఈ అనుమానానికి ఇదివరలో ఒకసారి జవాబిచ్చిన గుర్తు.మళ్ళీ మొదలుకొచ్చాం, రెడ్డేచ్చే మొదలాడమన్నట్టు.

      విష్ణువుగారు,శివుడుగారు అనరు, బ్రహ్మగారు అనే అంటారు.ఎందుకూ? బ్రహ్మగారు సృష్టికర్త. భూమిమీద స్తీ,పురుషులంతా సృష్టికర్తలే. అందుకే సాటిసృష్టికర్తని గౌరవించుకోడానికే బ్రహ్మగారు అని అంటారు.
      సమజ్గాలా! ఇది మనలని మనం గౌరవించుకోడమే నబయ్యా!!

      Delete
    2. వివరణ సరికాదు. తెలియక పోతే తెలీదు అని చెప్పడం మంచిది. ఇంకో విచిత్ర సమాధానం వద్దు.

      Delete

    3. Anonymous17 August 2023 at 22:17
      వివరణ సరికాదన్నప్పుడు, సరియైన వివరణ, నేను చెప్పినదెందుకు సరికాదో చెప్పవలసిన బాధ్యత మీదే!
      ఇక నాకు అనిపించినది చెప్పేను, మీరు చెప్పేది ఇంతకంటే తార్కికంగా చెబితే, అద్దానిని ఒప్పుకోడానికి సిద్ధం, మీదే ఆలస్యం.
      మీకు నచ్చనివన్నీ విచిత్ర సమాధానాలనుకుంటే ఎలాగండీ!

      Delete
  4. స్వాగతం శర్మ గారూ... మందస్మితవదనారవింద సుందరి గారు ఎవరండీ ..

    ReplyDelete
  5. Anonymous17 August 2023 at 14:37

    మీ ఆదర స్వాగతానికి ధన్యవాదాలు.
    ఎవరంటే చెప్పడమెలా? మందస్మితవదనారవిందసుందరి అంతే లేదా దరహాసోజ్జ్వలన్ముఖి
    మీరనుకున్న ....బ్రహ్మగారి చెల్లెలు మాత్రం కాదండీ!

    ReplyDelete
    Replies
    1. గతంలో మీరు కలహాగ్నీచెకుముకి అన్నట్లుగా గురుతు.

      Delete

    2. Anonymous17 August 2023 at 19:54
      "దరహాసోజ్జ్వలన్ముఖి" ఇది లలితా సహస్రంలో ఆరువందల ఒకటో నామం. మీకు తెలియదనికాదుగాని అర్ధం వివరిస్తా!
      దరహాసం=చిరునవ్వు
      ఉజ్జ్వల=ప్రకాశవంతమైన
      ముఖి=ముఖము కలిగినది.
      విగ్రహ వాక్యం: చిరునవ్వుతో ప్రకాశవంతమైన ముఖము కలిగినది.
      ఇక
      మందస్మితవదనారవింద సుందరి, ఇది తెనుగనుకున్నా! కాదు అంతా సంస్కృతమేనన్నారు తెలిసిన పెద్దలు.అర్ధం
      మంద=మెల్లనైన
      స్మిత=చిరునవ్వు
      వదన=ముఖము
      అరవింద=తామరపువ్వు
      సుందరి=యవ్వనవతియైన స్త్రీ.
      విగ్రహవాక్యం:మెల్లనిచిరునవ్వుతో తామరపువ్వులాటి (అందమైన) ముఖం(ముఖ పద్మం)కలిగిన యవ్వనవతియైన స్త్రీ.
      లలితమ్మ నామం దరహాసోజ్జ్వలన్ముఖి అన్నా మందస్మితవదనారవింద సుందరి అన్నా ఒకటేనటండి.

      కలహాగ్నీచెకుముకి అన్నది మొదటిసారి వింటున్నమాటండి. ఒకరికి కలహాలరాణి బిరుదుందిటండి. కొఱవిదయ్యానికి ఏ పేరైతే ఏమిటి లెండి.

      Delete
  6. ఒకరికి కలహాలరాణి బిరుదుందిటండి -

    ఎవరండీ వారు ?
    వారిని తలవక మీ కస్సలు పొద్దోయేటట్టు లేదు?

    ReplyDelete
    Replies

    1. Anonymous19 August 2023 at 01:55

      బిరుదున్న మాట నిజం కదండీ! ఆ బిరుదూ ఎవరో అనామకులు బహూకరించిందే కదా! అంతేకాదు, వారా బిరుదును వేళాడదీసుకుని చరిస్తున్నారుగా!! అనుమానమేలనయ్యా సామీ!!!!!!!!!!!!!!

      ముంజేతి కంకణానికి అద్దమెందుకని సామెత. అంతే కాదు మరో మోటు సామెత కూడా
      మిట్టపళ్ళాయనా! అంటే మా ఇంట్లో ముండ చెప్పిందా? అని అడిగినట్టు ఇంకచెప్పనులెండి, చాలు.

      నేనెప్పుడూ తలుచుకోనండి! బలవంతంగా తలపుకుతెస్తే తలుచుకోక ఎలాగండి?

      Delete
    2. // “ ఎవరండీ వారు ?
      వారిని తలవక మీ కస్సలు పొద్దోయేటట్టు లేదు?” //

      శర్మ గారు,
      ఈ కామెంట్ పెట్టిన Anonymous ఎవరో మొహం మీదే తెలిసిపోతోంది కదా? 😉

      - విన్నకోట నరసింహారావు

      Delete
  7. మానవులంతా ఎంతోకొంత హిరణ్యకశిపులే అయ్యుండొచ్చు గాక. కాని మీ బ్లాగులో కామెంటు చేసేవాళ్ళంతా కాలగ్రాసీభూతుల్లాగ "ఎనానిమస్సు"లైపొయారేంటండీ? కాల మహిమా? ప్రకృతి మహిమా? BTW, Welcome back శర్మగారూ.

    ReplyDelete
    Replies

    1. కాంత్19 August 2023 at 04:35

      కాంత్ జీ!
      మీ ఆదర స్వాగతానికి, వందనాలు, ధన్యవాదాలు.

      మీరన్నమాట నిజం.
      ఎనానిమస్సులు కావడానికి కారణాలనేకం కదండి. :)ఎవరి కష్టమేంటో తెలీదండి. కాలమహిమ కదా!

      Delete
    2. పెద్ద సారూ మీరు గమనించారో లేదో తెలియదు కానీ మీ వాకిట్లో తిరిగే అనామసులందరికీ మీపై గౌరవమూ, అభిమానమే తప్ప మరోటి కనబడదు నాకు, కాకపోతే కొంచెం హాస్యం మిళా
      యించిన చమక్కుల తళుకులు అద్దుతూ ఉంటారు అంతే.

      Delete

    3. Anonymous19 August 2023 at 20:19
      అలా అంటారా? అస్తు! __/\__

      Delete