అనుమానం
పై చిత్రం నిజం కాదని కల్పితమనీ ఇప్పుడే తెలిసింది. at 3PM today the 24/8/23
నిన్న సాయంత్రం చంద్రయాన్-3 లేండర్ నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకింది. ఇలా చంద్రుని ఉపరితలాన్ని లేండర్ తాకే సమయంలో దుమ్ము లేస్తుందనీ అది కాస్తా తగ్గిన తరవాత లేండర్ నుంచి క్రాలర్ బయటికొస్తుందనీ దాని చక్రాలకి ఇలా చంద్రుని మీద చెరగని భారత ముద్రలుంటాయని అంటున్నారు. (చంద్రునిపై గాలి లేనందున, ముద్రలెప్పటికి అలాగే ఉంటాయని) చంద్రుని పై గాలి లేనప్పుడు శూన్యప్రదేశంలో దుమ్మెలా లేస్తుందన్నది అనుమానం.
తెలిసినవారు చెప్పకోర్తాను.
మీ అనుమానాన్ని మా కాలేజీ గ్రూపులో పెట్టాను. ఒక పెద్దమనిషి ఇచ్చిన జవాబు 👇 (వారితో నాకు పరిచయం లేదు, వారి విద్యార్హతలేమిటో, ప్రస్తుత వృత్తి యేమిటో నాకు తెలియదు).
ReplyDelete=========================
“🙂It is due to the landers thrust. Simple.”
=========================
విన్నకోట నరసింహా రావు24 August 2023 at 11:24
Deleteవిన్నకోటవారు,
వారు చెప్పినదాన్ని కాదనగల విజ్ఞానం లేదు కాని మిడి మిడి జ్ఞానం కనక అనుమానాలెక్కువ.
లేండర్ కి నాలుగు కాళ్ళున్నాయి,చంద్రుని ఉపరితలంమీద చేరడానికి. అదే మరోఆకారంలో ఉంటే వారు చెప్పినట్టు దుమ్ములేచే అవకాశం ఉన్నది. ఇక లేండర్ 1.68 కెమ్/హవర్ వెలాసిటీ తో చంద్రుని తాకినట్టు పేపరు వార్తలబట్టి తెలుసుకున్నది. నాలుగు సన్నపాటి కాళ్ళకి అంత దుమ్ములేస్తుందా? మరో సందేహం. ఇక లేండర్ దిగేటపుడు పేల్చిన రెట్రో రాకెట్ల జెట్ మూలంగా దుమ్ములేస్తుందా? మరో అనుమానం. ఇవన్నీ పిచ్చి ప్రశ్నలూ కావచ్చు, మిడిమిడి జ్ఞానంతో!
నా అనుమానాన్ని మీ కాలేజిలో పెట్టి అనుమాన నివృత్తి చేయడానికి యత్నించిన మీకు వందనాలు.
టపాలో చిత్రం నిజం కాదని కల్పితమనీ ఇప్పుడే తెలిసింది. ఇవి కల్పించేవారు ఏమి సాధిస్తున్నారో తెలియదు. ఇటువంటి అభూతకల్పనల మూలంగా దేశానికి చెడ్డపేరే వస్తోంది.దీన్నెందుకు గుర్తించటంలేదో తెలియదు.
ReplyDeleteచంద్రుని మీద నడుస్తున్న క్రాలర్ తన గుర్తుల్ని వదలుతుందని ఇస్రో చెప్పిందట. అది సాకుగా తీసుకుని ఈ చిత్రాన్ని ఫోటోషాప్ చేసి ప్రపంచం మీదకి వదిలేసేడొకాయన. ఇస్రో వారు ఈ విషయం మీద ఏమీ మాటాడలేదని తెలుస్తోంది.
చివరికి ఈ వార్త ఒట్టి పుకారు మాత్రమేనట.
ReplyDeleteఎవరో మహానుభావుడు fact check చేస్తే తేలిందట.
కనీసం ఏప్రిల్ ఒకటి కూడా కాదు, మరి సోషల్ మీడియాలో కొంత మందికి అదేమి ఆనందమో !
https://www.thequint.com/news/webqoof/isro-logo-indias-national-emblem-imprinted-on-the-moon-by-chandrayaan-3-fake-fact-check
విన్నకోట నరసింహా రావు24 August 2023 at 15:49
Deleteచంద్రయాన్-3 గురించి దేశ విదేశాల్లో కుతూహలం ఉంది. ప్రతి చిన్న వార్త విషయాన్ని కుతూహలంగా చూస్తారు. దేశ,విదేశీయులు ఈ వార్త నిజంకాదని తెలిసి ఎంత నవ్వుకుంటారో కదా! దీనిని వార్తలుగా ఎందుకు ప్రచురిస్తారో తెలియకుంది, దురదృష్టం..
అంత ఉచ్ఛం నీచం ఆలోచించే విచక్షణ కూడానా ఇటువంటి జనాలకు?
Deleteతాము పెట్టిన ఇమేజ్ లకు, విడియోలకు ఎన్ని “లైకులు” వచ్చాయి అన్నదే వారి ఏకైక లక్ష్యం లా తోస్తోంది.
విన్నకోట నరసింహా రావు24 August 2023 at 19:59
Deleteమన దేశమంటే పడి ఏడ్చేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. డేశం ఏదైనా ప్రగతి సాధించిందంటే ఏడ్చేవాళ్ళకి దేశంలోనూ తక్కువలేదు. ఇటువంటివి చూసి జనాలు అసలు విషయాన్ని తక్కువచేసి చూపాలనే ప్రయత్నాలకీ తక్కువ లేదు. అదీ బాధ కదండీ! లోకో భిన్నరుచిః కదా! ఇదింతే
-
ReplyDeleteచంద్రయాన్ ఖుషీ లో గోల్మాల్ గోవింద్సామి ఎవరో అలాంటి ఇమేజ్ పెడితే అబ్బో కామోసు అంటూ దాంతో తలే ఉంగలీ దబానే వాలే హై క్యా హిందుస్తాన్ జన్తా :) ఇమేజ్ ముచ్చటగా వుంది.
ఎన్ జాయ్ మాడి తాతగారు . అది వదిలి పెట్టి ఈ కొక్కొరకో ఈకలు పీకడమేలండీ :)
నారదా
జిలేబి
Zilebi24 August 2023 at 19:56
Deleteబహుకాల దర్శనం, దేశంలోనే ఉన్నారా? ఖుషీలో గోల్మాల్ గోవిందం సరదాగా ఉండచ్చుగాని, ఏడ్చేవాళ్ళున్నప్పుడు బావోదనేదే మాట. ఇమేజ్ ముచ్చటగా ఉన్నమాట నిజం, అందుకేగదా ఇక్కడ దాకా వచ్చింది. :) మంచి ఇమేజ్ తయారు చేసినందుకు జేజేలు. కొక్కొరో కో లకి ఈకలు లేవండి. :)