"ఆగఛ్ఛ మూర్ఖ"
భోజరాజుగారి పట్టపు దేవేరి తన ఇష్ట సఖితో, ఉద్యానవనంలో, ఉదయకాలంలో ముచ్చటలాడుతుండగా భోజరాజుగారు ప్రవేశించారు.
మహరాజావారొస్తున్నారొహో! అనే హెచ్చరికలు ముందు చేయడం, అంతేగాక మహరాణీవారితో మాటాడాలన్నా, ముచ్చటించాలన్నా కూడా ముందుగా రాణివారికి కబురంపి, వారి అనుమతితోనే రాజావారైనా రావడం అన్నది రాజవంశాలలో అలవాటు. ఇల్లాటి ఏ హెచ్చరికలు, కబురూ లేకనే రాజా వారు దయచేసేరు, ఆ సమయానికి మహరాణీవారు ఇష్ట సఖితో ముచ్చట్లాడుతున్నారు. అంతట మహరాణీవారు "ఆగఛ్ఛ మూర్ఖ" అని ఆహ్వానించారు. రాజావారు తెల్లబోయారుగాని కారణం ఉండచ్చు తనను మూర్ఖ అని సంబోధించడంలో అనుకుని సభకు వెళ్ళిపోయారు.
సభలో కవులు,పండితులు కొలువుతీరి వున్నారు. కొంత మంది కొత్తగా సభలోనూ ప్రవేశిస్తున్నారు. ఇలా వస్తున్నవారిని ఆగఛ్ఛ మూర్ఖ అని రాజావారు సంబోధిస్తున్నారు. అందరూ ఇదేమో అర్ధంకాక తెల్లబోయి చూస్తున్నారంతా. ఇంతలో కాళిదాసుగారు సభలో ప్రవేశించారు. ఆయన్నూ ఆగఛ్ఛ మూర్ఖ అని ఆహ్వానించారు. విన్న కాళిదాసుగారు, చతురుడు,బుద్ధిశాలి కనక ఏదో జరిగి ఉంటుందని ఊహించి, ఈ కింది శ్లోకం చెప్పేరు.
ఖాదన్న గఛ్ఛామి హసన్న జల్ఫే
గతం నా శోచామి కృతం న మన్యే
ద్వాభ్యాం తృతీయో న భవామి రాజన్
కిం కారణం భోజ భవామి మూర్ఖః
Courtesy:
https://kavulu.blogspot.com/2023/08/blog-post_531.html
"నడుస్తూ తినను, నవ్వుతూ మాటాడను,గతించిన దాని గురించి దుఃఖ పడను, ఇద్దరు ఏకాంతంలో ఉన్నపుడు ఆహ్వానింపబడక మూడవవానిగా చేరను, ఏ కారణం తో నన్ను మూర్ఖుడా అని సంబోధించారు భోజరాజా" అని అడిగాడు.
ఇప్పుడు రాజావారికి మహరాణీవారు తనను అగఛ్ఛ మూర్ఖ అని సంబోధించడం లో ఆంతర్యం.
( ట్రోల్ ఆర్మీ వారికి పండగే! కానివ్వచ్చు, మీదే ఆలస్యం . :) )
అకారాంత పుంలింగ శబ్దం సంబోధన లో విసర్గ ఉండదు.
ReplyDelete
ReplyDeleteAnonymous22 August 2023 at 09:04
సరిజేసేను.
ధన్యవాదాలు.
నాకు సంస్కృతం ఒక్క ముక్కా రాదు.
ReplyDeleteరాణీ గారు రాజావారిని డైరెక్ట్ గా సంబోధించ లేదేమో, మూర్ఖుడు వచ్చాడు అని తన ఇష్టసఖితో అన్నదేమో అనుకోవడానికి ఏమయినా ఛాన్సే ఉండచ్చంటారా?
Deleteవిన్నకోట నరసింహా రావు22 August 2023 at 13:12
సంస్కృతం మాట దేవుడెరుగు తెనుగక్షరాలే పూర్తిగా రావు నాకు :) వరసగా రాయలేను.
రాణీవారు ఇష్టసఖితో అన్నట్టనుకోడానికి సావకాశం లేదనుకుంటానండి.
మాటాడిన తరవాత నవ్వు లేదా నవ్విన తరవాత మాటాదు అని తిట్టేది అమ్మ, నాచిన్నపుడు. ఏది ఏమైనా చెప్పిన మాటలు మూడూ సుభాషితాలు కదా! నచ్చేయి బాగా! నేటి కాలంలో ఈ మూడూ చాలా ఎక్కువగా కనపడుతున్నట్టున్నాయండి.