తులసి ప్రదక్షిణం పాట
గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా!
గోవిందు సన్నిధి నాకీయవమ్మా
ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా
వైకుంఠసన్నిధి నాకీయవమ్మా
రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
నిండైన సంపదలు నాకియ్యవమ్మా
మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
ముత్తైదువతనం నాకీయవమ్మా
నాలుగో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
నవధాన్య రాసుల్లు నాకీయవమ్మా
ఐదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
ఆయువైదోతనం నా కియ్యవమ్మా
ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
అత్తగల పుత్రుణ్ణి నా కియ్యవమ్మా
ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
వెన్నుని ఏకాంత సేవీయవమ్మా
ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
యమునిచే బాధలు తప్పించవమ్మా
తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా
పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
పద్మాక్షి నీ సేవ నాకియ్యవమ్మా
ఎవ్వరు పాడినా ఏకాశి మరణం
పుణ్యస్త్రీలు పాడితే పుత్ర సంతానం
రామతులసి లక్ష్మి తులసి
నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మా
Courtesy:What's app
బాగుందండి. మంచి పాట.
ReplyDeleteకానీ ఈ కాలంలో ఇటువంటివి ఎందరు పట్టించుకుంటున్నారు? అసలు తెలుగు చదవగలిగినవారే తగ్గిపోతున్నారు.
ఆరో ప్రదక్షిణలోని కోరిక మాత్రం - ఎవర్ గ్రీన్ 😄. అందుకేగా ఈకాలపు ఆడపిల్ల వైపు వారు మగపెళ్ళివారిని మీ ఇంట్లో “పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా” అని అడుగుతున్నారు (పాతసామాన్లంటే పరోక్షంగా పిల్లవాడి తల్లితండ్రులట).
// “అత్త లేని కోడలుత్తమురాలు ఓయమ్మా” // 🙂
విన్నకోట నరసింహా రావు28 August 2023 at 12:42
Deleteవిన్నకోటవారు,
తులసి మొక్క వెయ్యడానికి చోటెక్కడండి :)
ఆరో ప్రదక్షిణంలో అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా అంటూ ఉంది. అత్తకావాలని అనుకుంటోందనుకుంటున్నా! నేటి రోజుల గురించా! :)
అత్తలేనికోడలుత్తమురాలూ ఓయమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలూ ఆహుం ఆహుం.
ఇక తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
తోడుగా కన్యలకు తోడీయవమ్మా
అది జోడుగా కన్యలకు తోడీయవమ్మా అనిగాని, తోడుగా కన్యలకు జోడీయవమ్మా అని గాని ఉండాలేమో అనుకుంటున్నానండి. ఏమంటారు?
రామతులసి, లక్ష్మి తులసి అన్నారేగాని కృష్ణ తులసి అనలేదేమబ్బా! అనుమానం సుమా!
ప్రదక్షిణం పదక్షిణానికి ఇలా క్యాష్ డీలింగ్ హాట్ హాట్ సెటిల్మెంటు తులసమ్మతో చేసేసుకుంటూ పోతూంటే ఆహా యెంత హాయి యెంత హ్యాపీ :)
ReplyDeleteగివ్ అండ్ టేక్ ఇట్ ఈజీ పాలసీ :)
కిలాడి :)
జిలేబి
Zilebi28 August 2023 at 16:43
Deleteలోకమంతే కదా!
అంతా ఇన్వెస్టుమెంటే రిటర్ను సెటిలిమెంటూ అవుపడటం లేదు.
గివ్ అండ్ టేక్ గుడ్ పాలసీ :)
ఒంటి ప్రదక్షిణం తో వైకుంఠ సన్నిధి ఒంటబట్టితే, ఇంక మిగతా ప్రదక్షిణాలన్నీ ఎందుకో? ఎక్కడో లాజిక్ మిస్ అయినట్లుందే
ReplyDelete
Deleteకాంత్28 August 2023 at 22:42
వైకుంఠం అంత తేలిగ్గాదండి :) అది తెలుసుగనకే ఆతరవాత కోరికలు ఒకో ప్రదక్షిణానికి తగ్గించుకుంటూ వచ్చింది. :)