నృపస్య చిత్తం
నృపస్య చిత్తం కృపణస్య విత్తం
మనోరథా దుర్జనమానవానా
స్త్రియా చరిత్రం పురుషస్య భాగ్యం
దేవో న జానాతి కుతో మనుష్య
రాజు మనసు, లోభివాని సంపద,దుర్జనుని జేవితేఛ్చ,స్త్రీల చరిత్ర, పురుషుల సంపాదన, దేవునికే తెలియదు, మనుషులకా?
( దేవునికి కూడా తెలియనివ్వనంత గుట్టుగా ఉంచుతారు, ఇక మనుషులకెలా తెలుస్తుంది?)
రాజుమనసెపుడూ గుట్టే! అలాగే ఉండాలట. ఎవరినీ నమ్మడు, పెళ్ళాన్ని కూడా!! నమ్మేడో ఐపోయాడే!!!
లోభివాని సంపదెంత?అతనికే తెలీదు. తెలియనివ్వడు. అంతే!!!ఎక్కడ దాచాడో తెలియదెవరికి, తెలియనివ్వడు కూడా. నేడు రెండు వేల రూపాయల నోట్ల కట్టలు బయట పడుతున్నట్టు. ఏదీ? ఎక్కడా చప్పుడు లేదే!
దుర్జనుని జీవితాశయం ఏమై ఉండచ్చు...దేశం ఏమైపోయినా బాధలేదు, అంతే, జీవితాశయం గుట్టే
స్త్రీల చరిత్ర అంటే పుట్టు పూర్వోత్తరాలు, అంటే వయసు గుట్టు, అదీ సంగతి.
పురుషుని సంపాదన, జీతమో, గీతమో, ఏ సంపాదనా గుట్టే
వీటిని పైవారు దేవునికి కూడా తెలియనివ్వరు, మనుషులకెలా తెలియనిస్తారు???
அப்பிடியா
ReplyDeleteఅది తెలుగులో ఏడవచ్చుగా. కమల్‌హాసన్‌లాగ అప్పిడియా, చప్పిడియా అని "అరవ"కపోతే.
Deleteకాంత్28 May 2023 at 06:15
Deleteకాంత్ జీ!
కొంతమందికిదలవాటు! ఏం చేయగలం సార్!!
Anonymous27 May 2023 at 16:49
Deleteఇది అరవంట కదా!! నాకు ’అరవం’ రాదండి,అదేమో తెలియలేదు, అర్ధమూ తెలియలేదు సుమా
తెలుగే రాదు ఇలా తమిళంలో రాస్తే ఎలాగా అంటున్నారాండీ :)
Deleteజిలేబి
Zilebi29 May 2023 at 16:26
Deleteయతో భ్రష్ఠ తతో భ్రష్ఠః, తెనుగూ రాదు, అరవమూ పూర్తిగా రానివారు అరవంలో అరవడమెందుకూ? అప్పిడియా చప్పిడియా అంటే ఎంటో చెప్పచ్చుగా తమరు :)
ఏదో సంస్కృతంలో వున్నదాని బరికేసి మాకు తెనుగొచ్చు అంటూ గొప్పలు చెప్పుకోవడమే ? తెలుగులో చెప్పండి. :)
DeleteZilebi30 May 2023 at 20:35
Deleteతెనుగూరాదు, అరవమూ రాదుగాని అప్పిడియా చప్పిడియా అంటే ఏంటో చెబుదురూ.
అప్పిడి అనగా ఆ పిడి
Deleteచప్పిడి అనగా ఛా! పిడి
ఇట్లు
మేతావులకు మేతావి
జిలేబి
Zilebi31 May 2023 at 11:20
Deleteపిల్లి అంటే బిడాలం అన్నట్టుంది. మేతావులకు మేతావి కాదు బుజ్జమ్మా! నీలాగా :)
-
Deleteపిల్లి యనగా బిడాల
మ్మల్లె గలదె నీ జవాబు మాకు తెలుపవే
తల్లీ అప్పిడియాకున్
మళ్లీ చప్పిడికి అర్థ మసలుందామ్మీ ?
జిలేబుల్స్ :)
స్టాకు మార్కెట్టుని కుదిపేసేరేమిటి ఇవ్వాళ తాతగారూ ?
Zilebi31 May 2023 at 17:18
Deleteఅప్పిడియా చప్పిడియా అంటె అర్ధమేటో చెప్పమంటే తికమకపెట్టి చంపుతున్నావు. దేవుణ్ణి కూడా తికమకపెట్టేయగలవు.దేవునికే పంచాంగం చెప్పగలవులా ఉందే!
ఇంతకి నీకు అర్ధం తెలుసా? తెలీదా?
పడుతూ లేస్తూ పరుగులు పెట్టేదే స్టాకు మార్కెట్టంటే, అది నీకూ తెలుసుగా!అందులోనూ ఫ్యూచర్లు,ఆప్షన్లు అంటావుగా!
నేనేమో స్టాకు మార్కెట్ దూకాన్ మూసేసి, బ్లాగు దూకాన్ ఓపెన్ చేసి లవ్వు స్టాకు అమ్మకానికి పెట్టేను, కొనేవారే కనపట్టం లేదు.
2024 లో రాజ్యం మీదేట, ప్రమీలా రాజ్యమని బాబా చెప్పేడు. ప్రమీలా రాజ్యంలో నువ్వు మంత్రివే నన్ను మర్చిపోకూ....
గుడ్డు నైటూ
బుజ్జమ్మా!
Delete''అల్లుడు అనేటప్పటికి రేవులో వంకర తాడి చెట్టు నిటారుగా లేచినిలబడిందని'' ఒక నానుడిలే! మంత్రి అనేటప్పటికే ఊసూ పలుకు లేకుండా గాయబ్ ఐపోయావుసుమీ!!
-
Deleteఅల్లుడనగనే సామెత
చెళ్ళున రేవందు తాడి చెట్టు నిటారై
భళ్ళున లేచినిలబడున్
పుల్లగిలి పరుగిడి నావ బోల్ మంత్రి యనన్
జిలేబుల్స్ :)
-
ReplyDeleteతెలుగోళ్ళకి తెనుగే రా
దిల మాచన శర్మ గారు దీన్ని తెలిపిరీ
పలకా బలకము నిమ్మా
జిలేబులను వేయు తీరు శీఘ్రము నేర్వన్ :)
జిలేబి
Zilebi31 May 2023 at 11:25
Deleteనేననలేదు :) బుజ్జమ్మ అన్నమాటేస్మీ :)