ముక్కు,బొడ్డు జానకి అందుతాయా???
అమ్మా ఆకలేస్తోందే!
నిన్ననంతా జ్వరం పేలేసింది, లంఘనం చేసేవుగా. సీతారామయ్య తాతగారి దగ్గర కెళ్ళి ఆయన చేత చెయ్యి చూపించుకున్నావా?
వెళ్ళేను. చెయ్యి చూసేరు. ఆ తరవాత, ఒరే! ముందుకువంగి నీజానతో ముక్కుని,బొడ్డునీ అందుకో! ( జాన అంటే చిటికినవేలు చివరనుంచి బొటన వేలు చివరదాకా కొలత. ఇది తొమ్మిదంగుళాలే)
అన్నారు.
అందిందా?
లేదు.
మరేమన్నారు? ఈ వేళా,రేపూ లంఘనం చేసెయ్యీ అన్నారు.
ఇంకేం మరీ,తాతగారి మాటంటే సుప్రీం కోర్టు ఆర్డరే, అపీల్లేదు.అన్నం పెట్టను.
ఆకలేస్తోందే మరీ!
అక్కడ గ్లాసులో పాలెట్టేను తాగి పడుకో! ఎండనబడి గెంతకు, ఆగమ్మకాకిలా తిరక్కు, పుస్తకం తియ్యకు, పరుపుమీద పడుకోకు, నులకమంచం మీద బొంతేసుకు పడుకో!!! అమ్మమాటంటే మెజిస్ట్రేటు కోర్టు ఆర్డరైనా సుప్రీంకోర్టు కెళ్ళినా తిరుగులేదు. ఏమో సుప్రీం కోర్టులో మరోటి తగిలించచ్చు కూడా! అందుకే చచ్చినట్టు కుక్కినపేనులా అమ్మచెప్పినట్టి వినేసి పడుకోడమే మంచిదనిపించేది.
జానతో ముక్కును,బొడ్డునూ అందుకోవడం ఒక టెస్టు, జ్వరం తగ్గిందీ లేనిదీ చెప్పడానికి, ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అంతే! ఇప్పుడు బొడ్డూ, ముక్కూ జానకి అందవు,నూటికి తొంభై మందికి. ప్రయత్నంచద్దూ, వెన్ను నెప్పెడుతుంది. ఏం? మీ వెన్ను ముదిరిపోయింది, అది వంగదు. మనం నడ్డొంచి పనిచేసినదెప్పుడూ! కూచుని ఫోన్ గీకడం తప్పించి చేసే పనే లేదుకదా!!అందుకు అదంతే! అంతే!!
మొన్ననోరోజు ఉదయపు నడకలో ఒకతను నలతగా ఉన్నట్టనిపిస్తే ఏమని అడిగేరు. జ్వరమొచ్చింది, తగ్గిందో లేదోగాని నీరసంగా ఉందన్నాడు. అదేమయ్యా! అనారోగ్యంతో వ్యాయామం చేయకూడదు. ముందుకువంగి జానతో బొడ్డూ,ముక్కూ అందుకోమన్నా! ప్రయత్నం చేసేడు, అందలేదు. ఇక అక్కడున్నవాళ్ళంతా ప్రయత్నం చెయ్యడం మొదలెట్టేరు. ప్రయత్నించినవారెవరికి అందలేదు. కొంతమంది సిగ్గుపడి అందుకోలేదు. వాళ్ళలో ఇద్దరిని చూపించి మీకు అందుతుంది చూసుకోండి అన్నా! ఆ కుర్రాళ్ళిద్దరూ ప్రయత్నం చేసేరు, ముక్కు,బొడ్డూ జానకి అందేయి. ఇప్పుడు ఇదొక వ్యాయామమైపోయింది :)
Jaana anagaa emii ?
ReplyDeleteAnonymous4 May 2023 at 16:59
DeleteJaana anagaa emii ?
జాన అనగా ఏమి ?
మీ మాటని తర్జుమాచేసుకున్నా!
నిన్ననొనక అమ్మాయి ప్రత్యక్షంగానే అడిగిందీ ప్రశ్న. అందుకని తెలియదనుకునే జవాబిస్తున్నాను. తెలిసినవారడిగిఉంటే ఇది పరిక్ష అనుకుంటా!!!
చేతివేళ్ళు చాపండి, బొటను వేలు వెనక్కు వెళుతుంది. ఇప్పుడు చూపుడు వేలు పక్కవేలు చివరనుంచి బొటనవేలు చివరదాకా ఉండే కొలతే జాన. ఇది సాధారణ మనిషికి తొమ్మిదంగుళాలుంటుంది. కొలుచుకు చూసుకున్నారా? సరిపోయిందా?ఇక ఇటువంటివే బెత్తెడు,మూరెడు,బారెడు ఇలా మాటలున్నాయి. ఇవన్నీ కొలతలు.
చూపుడు వేలు పక్కవేలు కాదు. నాకు తెల్సినంతవరకు, అది చిటికెనవేలు చివరనుంచి బొటనవేలు చివరదాకా ఉండే కొలత.
Deleteమీరేమన్నా లార్డ్ లబక్దాసా ?
Deleteకాదండీ జిల్ జిల్ జిల్ జిలేబి రాణి గారూ!
DeleteZilebi9 May 2023 at 03:17
Deleteబుజ్జమ్మా!
కలహాల్రాణీ పేరెవరు పెట్టోరోగాని, గొప్ప పేరెట్టేరుగా!అద్సరేగాని, మాటాడిన ప్రతివారిని ఇలా చెప్పడం ఉహూహు, అస్సలు బాలేదు.వాళ్ళూరుకుంటారేంటీ? తమలపాకుతో నీవొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా అంటారు సుమీ. దీన్నే అని, అనిపించుకోడం అత్తగారూ నీకలవాటు అంటారు :) :) :)
Deleteకాంత్8 May 2023 at 22:27
కాంత్9 May 2023 at 07:21
కాంత్ జీ
ఎప్పుడో ఎనభై ఏళ్ళకితం మాట.జాన అంటే ఆంధ్రభారతి కూడా ఒక కొలత అని చెప్పేసి ఊరుకుంది. నేను పొరబడి ఉండచ్చు, మీరు చెప్పినదే నిజమని అనుకుంటున్నా. ఈ కొలతైతే ముక్కు, బొడ్డూ అసలందవు :)
జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి పేరు బాగుందండీ, కాని కలహాల్రాణి మరీ బాగుళ్ళా!
తాతగారూ
Deleteఏదో మీకు వత్తాసిద్దామని అన్నానండోయ్ :)
Zilebi9 May 2023 at 09:30
Deleteవత్తాసంటే ఇదా? !!!! వామ్మో కలహాల్రాణీ
కలహాల్రాణి పేరుతో బాటు తంపి అనే చిన్న బిరుదు కూడా బాగానే ఉంటుందేమో కదా శర్మ గారు?
Deleteకాంత్8 May 2023 at 22:27
Deleteకాంత్ జీ మీరు చెప్పినదే నిజం. నాకూ అనుమానముండి, ఆంధ్రభారతి చూస్తే ఒక కొలత అని చెప్పి ఊరుకుంది. విన్నకోటవారు విషయం వివరించేరు. టపాలో కూడా విషయం వివరిస్తాను. విషయాన్ని సరి చేసినందుకు మీ ఇద్దరికి
ధన్యవాదాలు.
Anonymous4 May 2023 at 16:59
Deleteఅది చిటికినవేలు చివరనుంచి బొటనవేలు చివరవరకు జాన. ఇది తొమ్మిదంగుళాలే సుమా!
విన్నకోట నరసింహా రావు9 May 2023 at 12:08
Deleteసారూ!
కలహాల్రాణి బిరుదు కొత్తదండి. ఓ అనామకచక్రవర్తి ఆ పేరెట్టి తప్పుకున్నారు. పేరు చెపితే వీరతాళ్ళేద్దుంకదండి. కాని భయం, ఏమో! రాకాసిలా మీదబడి పీక్కు తింటుందేమోనని. ఈ బిరుదు స్థిరం చేసేద్దామండి. పదేళ్ళ కితం కాలంలో మీరు చెప్పిన తంపి బిరుదు కూడా ఉన్నట్టు గుర్తు.సహస్ర నామాల్లా ఎన్నని గుర్తు లెండి. :)
అవున్లెండి శర్మ గారు, గ్రాడ్యుయేషన్ తరువాత పోస్ట్-గ్రాడ్యుయేషన్ లాగా తంపి నుంచి పైకి ఎగబాకి కలహాల్రాణి.
Deleteబాగుందండి. ఇదే ఖాయం.
విన్నకోట నరసింహా రావు9 May 2023 at 19:21
Deleteప్రస్థుతానికి ఇదే ఖాయమండి, రేపు ఇంతకంటే మంచి బిరుదివ్వచ్చు, మరొకరు, చెప్పలేం కదండీ :) అదేంటోగాని మారాజా! అన్ని బిరుదులూ అనామకులే ఇచ్చేస్తున్నారు. ఒక మంచి బిరుదు ఆలోచించారదండీ
( ఎప్పుడూ పేరు ముందు పెట్టుకునేలాగానూ, Dr.డాక్టర్, Lr.లాయర్, Er. Engineer....!!ఇలా)
సింపులూ.
DeleteKr. “జిలేబి” అని పెట్టుకోవడమే.
Kr. = కలహాల రాణి
(మొగవాడైతే కలహాల రాయుడు)
బిరుదెలా ఉంది శర్మ గారూ ? 😎
This comment has been removed by the author.
Deleteవిన్నకోట నరసింహా రావు10 May 2023 at 11:38
Deleteసూపరో సూపరు సార్
పాన Anonymous గారి సందేహం తీర్చండి, శర్మ గారు.
ReplyDeleteఅవునూ, వృద్ధులకు ముక్కు, బొడ్డు జానకు అందకపోయినా జ్వరలక్షణమేమీ కాదు అనుకోవచ్చా? లేదా డాక్టర్ దగ్గరకు పరుగెత్తాలంటారా?
విన్నకోట నరసింహా రావు4 May 2023 at 18:33
Deleteనేటి కాలంలో నూటికి తొంభై తొమ్మిది మందికి అందవు సార్! డాక్టర్ దగ్గరకి పరిగెట్టక్కరలేదు.
ఏమిటీ తాతగారు బొడ్డు జానకి అంటున్నారే హరిబాబు గార్ని పిలిచి నాలుగు వాతలు పెట్టిద్దాము తాతగారికి అనుకున్నా . జాన, కి యా :)
ReplyDeleteజాన, కియా యా ? :)
జిలేబి
మీలాంటి కోణంగులుంటారనే నేను జాన “కు” అన్నాను నా వ్యాఖ్యలో, జాన “కి” అనలేదు 😎.
ReplyDelete
Deleteకోణంగులగు జిలేబీల్
జానకి అంటే ఇలా విచారిస్తారం
చే నే జానకు అన్నా
మీనాక్షుల్ చూడలేని మినకర గలదే :)
జిలేబి
జాన = బొటనవేలు నుంచి చిటికెన వేలు వరకు.
ReplyDelete—————————————
“A span is the distance measured by a human hand, from the tip of the thumb to the tip of the little finger. In ancient times, a span was considered to be half a cubit.”
https://en.m.wikipedia.org › wiki
Span (unit) - Wikipedia
———————————————
https://en.m.wikipedia.org/wiki/Span_(unit)#:~:text=A%20span%20is%20the%20distance,to%20be%20half%20a%20cubit.
తాతగారు గోళీల్రాయులు కామోసు అందుకే చూపుడు వేలితో జానెడుతున్నారు :)
Deleteవిన్నకోట నరసింహా రావు9 May 2023 at 11:31
Deleteవిన్నకోటవారు
చిన్న అనుమానం అది చిటికినవేలా? మధ్యవేలా? అన్నది. టపాలో ఆ మాట చెప్పక దాటేశాను. అది చిటికినవేలని కాంత్ జీ చెప్పేరు, దాన్ని మీరు ధృవపరచేరు. సంతసం.
ధన్యవాదాలు
Zilebi9 May 2023 at 12:36
Deleteబుజ్జమ్మా!
కాయికి కంచాకి సైను. గోళీలాట కూడా చేత కాదు :) ప్రొఫెసర్ ఎలా అయ్యావో సుమా :) చూపుడు వేలు తో గోళీలాడిన గుర్తు లేదు. అది మధ్యవేలుతోనే అని నా గుర్తు.
This comment has been removed by the author.
ReplyDeleteశర్మ గారు,
ReplyDelete"జిలేబి” గారు ప్రొఫెసర్ కూడానా? వారి ఈ పార్శ్వం గురించి ఇప్పుడే వింటున్నాను మీ ద్వారా. విద్యాధికులని తెలుస్తూనే ఉంది కానీ ప్రొఫెసర్ లెవెల్ అనుకోలేదు. సంతోషం.
శర్మగారికి జిలేబి గారు బాగా తెలిసిన వ్యక్తియే. ఇరువురూ కలిసి మనలనాటపట్టిస్తున్నారేమో నరసింహారావు గారు.
DeleteAnonymous10 May 2023 at 04:10
Deleteఒకప్పుడు జిలేబి నేను వెరువేరు అన్నారు, ఆ తరవాత నేను జిలేబి ఒకటేనన్నారు( నిన్నటిదాకా మాట),జిలేబి చచ్చిపోయిందన్నారు, దయ్యమయిందన్నారు, ఇప్పుడే ఇద్దరూ తెలిసినవాళ్ళే మనల్ని ఆటపట్టిస్తున్నరంటున్నారు. రేపేమంటారో!! :)
జిలేబిని ఇందులో వెతుక్కోండి
నృపస్య చిత్తం కృపణస్య విత్తం
మనోరథా దుర్జనమానవానా
స్త్రియా చరిత్రం పురుషస్య భాగ్యం
దేవో న జానాతి కుతో మనుష్య :)
-
Deleteనేను జిలేబియు వేరని
నేనున్ను జిలేబియు నొకరే యని చెప్పిం
డ్రూ! నేడిరువురమొక్కం
డ్రేనేమోయనెడు శంక! రేపేమగునో!
జిలేబి
Zilebi10 May 2023 at 11:15
Deleteఇద్దరూ ఒక్కరు కాదు, వేరు వేరు.ఇద్దరూ బాగా తెలిసినవారు అని నేటి మాట. జిలేబిని వెతుక్కోమన్నా! నేనెవరో ఎవరికి తెలియకపోలేదు. :) రేపేమంటారో!! :)
విన్నకోట నరసింహా రావు9 May 2023 at 21:39
ReplyDelete/"జిలేబి” గారు ప్రొఫెసర్ కూడానా? /
బలే కొచ్చనండీ :) గోళీలాటలో, బచ్చాలాటలో. గూటీ బిళ్ళ, కుండబంతి, ఇలా ఈ ఆటలన్నిటిలోనూ ప్రొఫెసరండి బాబు, నెల్లూరు ఫేమస్ నాటిరోజుల్లో, తెలుసా!!! :).
-
Deleteనెల్లూరుకున్ జిలేబికి
కల్లయె సంబంధమనుట కష్టేఫలి వా
రిల్లాయనరాదండీ
చల్లని గోదారి తల్లి సాక్షి పలుకుడీ :)
Zilebi10 May 2023 at 11:28
Deleteఉన్నమాటంటే ఉలుకెక్కువ కదూ! :)
-
Deleteఉలుకెక్కువకదుటే ఓ
జిలేబి నే ఉన్నమాట చెబితే తైత
క్కల కందపు పద్యముతో
పిలకుచ్చుకుకొట్టినావు పిడిగుద్దులతో :(
Anonymous11 May 2023 at 01:07
Deleteబుజ్జమ్మా!
నా పిలకనీకందదులే! అది భూమికి ఆరడుగులెత్తులో ఉంటుంది. నువ్వెక్కడ భూమి జానెడు ఉండవు. నా పిలక నీకెక్కడoదుతుందిలే!!! నేను వంగినా అందదు. :)అంచేత పజ్జంలో పిలక బదులు పిడక అని మార్చుకో ఇటకరాళ్ళ పేర్పు సరిపోతుందిలే :)
అబ్బే కుదరదండీ డ కార ప్రాస వేయలేం. తప్పి తవరి వేస్తే గురువులుంగారు మొట్టికాయ వేసెదరు. కావున వేసిన పదమే సరియగు పిడకా :)
Deleteపోనీ …. పలకుచ్చుకు కొట్టినావు …. అనండి.
Deleteయతి అడ్డొస్తుందండి.
DeleteAnonymous12 May 2023 at 02:22
Deleteజిలేబికి యతులు,ప్రాసలు,గణాలు అడ్డుటండీ, కొత్త వ్యాకరణమే రాసేస్తుంది :)
విన్నకోట నరసింహా రావు11 May 2023 at 21:22
Deleteఅలా అంటారా ? పరకుచ్చుకునైనా కొట్టెయ్యగలదు :)
Zilebi11 May 2023 at 18:15
Deleteకందమ్మా!
ళ ల ర యోరభేదః అని కాబోలు సూత్రం మార్చెయ్యి! ల డ రయోరభేధః అన్జెప్పు.కొత్త వ్యాకరణమే రాసెయ్యి.
గురువా వారెవరు? నువ్వే జగద్గురువు కదా!! మరింకేం!! వ్యాకరణం కొత్తగా రాసెయ్యి బుజ్జమ్మా! నిన్ను కాదనువాడెవడు? కల్యాణ రామా! పాడెయ్యి, మంగళం. ఊ..మైహూ నా.. :)
అందుకే నిన్ను మొన్న కోవిడ్ లో దేవుడు కిందకిపంపేసేడు. తెనుగుకి కొత్త వ్యాకరణం రాయాలనీ నీ కందాలు తెనుగు ప్రజలు అనుభవించే యోగం ఇంకా ఉందని పంపేసేడు,కాందంటే కుదురుతుందా? :) కానిచ్చెయ్యి. నిన్ను కాదన్నవాడు అంగుష్ఠమాత్రుడే కదా, నీ లెక్కల్లో!!! :) కాదంటావా? తప్పదా? ఐతే పరక అని మార్చుకో! సరిపోతుందిగా :)
అబ్బో! చాలా థియరీ తెలుసే తాతగారికి !
Deleteఅయినా అలా వ్యాకరణాన్ని మార్చడం కుదరదండోయ్ ఎవరిష్టానికి వారు. గురువుల మార్గానికి కట్టుబడుండాలె.
పరక ప్రాస కుదరదంతే.
జిలేబి
పోనీ లేండి మీ ఆశ, నరసరాయలవారి విన్నపాన్ని మన్నించి పోతేపోనీ అని సవ రించా .
Deleteఉలుకెక్కువకదుటే ఓ
జిలేబి నే ఉన్నమాట చెబితే తైత
క్కల కందపు పద్యముతో
డలా సమూహనిని ద్రిప్పి రవ్వాడితివే
Zilebi12 May 2023 at 19:54
Deleteకందమ్మా!
ఈ పాలికొగ్గీసినా,పల్లకో!! :)
Zilebi12 May 2023 at 19:47
ReplyDeleteబుజ్జమ్మా!
ల డ యోరభేధః ఈ సూత్రమూ ఉందిష.
నీలా ప్రొఫెసర్ని కాదుగా :)
నిన్ను శిష్యురాలిగా భరించగలిగినా గురువువెవరో తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిస్మీ,ఎవరు శివుడా? విష్ణువా?పలుకులరాణీ ఏనా?