శ్రీమాత్రేనమః
అరవైరెండు సంవత్సరాల కితం, ఇరవై సంవత్సరాల వయసులో, ఇదే రోజు యుగళజీవితానికి అనుమతించి, ఏభైఆరు సంవత్సరాలు అవిఛ్చినంగా కొనసాగింపజేసిన అమ్మకు వందనం.
ఐదు సంవత్సరాలుగా ఒంటరిజీవితాన్ని ప్రసాదించిన అమ్మకు వందనం.
వందనము రఘునందనా! భక్త చందనా!!సేతు బంధనా!!!రామా
వందనము రఘునందనా!!!!!
జీవితం వడ్డించిన విస్తరి కాదు!పూల పాన్పూకాదు!! జీవితం నల్లేరు మీద నడకా కాదు, పల్లేరులూ గుచ్చుకుంటాయి.
ఈ రోజు ఉదయం నడక ప్రారంభిస్తుండగా జిలేబి పద్యం రాలింది.
"తాతగారికి,
యుగళపు జీవన మధురిమ
ల గమనపు తొలకరి జల్లు లా తల్లి జతన్
జగమున మొదలైన దినము
న గ చింతనమదె మదిని మునకలిడ ప్రణతుల్"
పద్యంచూస్తూ అడుగులు ముందుకేస్తే రెండు కాళ్ళలోనూ పల్లేరుకాయలు గుచ్చుకున్నాయి. ఒక్కసారిగా కూలబడ్డా. అరికాళ్ళలో గుచ్చుకున్న పల్లేరులేరిపారేశా. లేచినిలబడ్డా!నడక సాగించా!ఆలోచనలో పడి అదేపనిగా నడుస్తుండగా ఒక మనవరాలెదురొచ్చి, తను నాముందుండి, తను వెనక్కి పరిగెడుతూ,ఏంటీ! ఎప్పుడూ లేనిదివేళ ఇంకా నడుస్తున్నారూ? అంటూ ఆపింది. ఆగాను ప్రకృతిలో పడ్డాను.అనుక్షణం నన్ను గమనించే అమ్మకు వందనం.
జీవితంలో కుప్పలా కూలబడిపోయిన సంఘటనలూ ఉన్నాయి,లేవలేమోననుకున్న ప్రతిసారి లేవగలవు, ముందడుగు వెయ్యి,చివరిదాకా నడవగలవు,నడవాలనే ధైర్యాన్ని, దృక్పధాన్నిచ్చిన ,అమ్మకు మరోసారి వందనం.
ఈ టపా రాసేందుకు అవకాశం కలగజేసిన జిలేబికి వందనం.ఈ మధ్య కాలంలో లేనిది, ఈ టపా రాసే అరగంటలోగా రెండుసార్లు కరంటు తీసేసి, మార్పులు,చేర్పులు,కూర్పులకు తోడిచ్చిన కరంటువారికి ప్రత్యేక వందనం.
మరొకసారి
వందనము రఘునందనా! సేతు బంధనా!! భక్తచందనా!! రామా!! వందనము రఘునందనా!!
శ్రీమాత్రేనమః
🙏🙏🙏
ReplyDelete“జిలేబి” గారికేమన్నా కర్ణపిశాచి ఉందా, మీ యుగళజీవితానికి నాంది ఇదే రోజున జరిగింది అని … దాని మీద పద్యం అల్లేశారు? యుగళ జీవితం 56 యేళ్ళా - అద్భుతం. ముగిసి అప్పుడే అయిదేళ్ళు గతించి పోయాయా, ప్చ్.
అవునూ, పల్లేరు కాయలు గుచ్చుకోవడం ఏమిటి సారూ? చెప్పులు వేసుకోరా?
కరెంటు పోవడం మొదలయిందా 🙂🙂? శభాష్.
అవునూ, పల్లేరు కాయలు గుచ్చుకోవడం ఏమిటి ? ...
Deleteఅవదూ మరి జిలేబి పజ్యాలను ఆడిపోసుకుంటూంటే అస్తమానూ :)
వందనము తాతగారికి
జిలేబి
నడుస్తుంటే మీ పజ్యం రాలిందన్నారుగా. పల్లేరుకాయల్లాంటి మీ పజ్య పాదాలు ఆయన పాదాలకి గుచ్చుకున్నట్టున్నాయి
Deleteవందనము తాతగారికి
Deleteనిజం చెప్పండి వారు మీకు తాత గారా లేక మీరే వారికి ?
విన్నకోట నరసింహా రావు25 May 2023 at 17:20
Deleteవిన్నకోటసారూ!
కర్ణపిశాచి లేదు కాకరకాయ కాదండి. ఒకప్పుడు ఏభైఏళ్ళ యుగళ జీవితానికి బ్లాగులో పండగ జరిగింది.అదీ అంతకుముందు యుగళ జీవిత తారీకు, ఆరోజు జరిగినది బ్లాగులో రాస్తే అది గుర్తుపెట్టుకుని చెప్పినమాటేనండి. జిలేబికి ఫోటోగ్రాఫిక్ మెమరీ కదా! అదండి సంగతి.
ఏబై ఆరేళ్ళకి అలాజరిగిపోయిందండి, అవును ఐదేళ్ళయింది. ఏమీ చేయలేనిదానిగురించి విచారించడం వ్యర్ధం కదా!!
చెప్పులేసుకుని ట్రేక్ దాకా వెళ్ళి అక్కడొదిలేసి, చెప్పులు లేకుండా నడవడం అలవాటు, ట్రేక్ మీద ఇసకలో. పజ్జెం చూస్తూ పచ్చికమీదకి వెళిపోయా అక్కడున్నట్టున్నాయి పల్లేరులు, వాటిపని అవి చేశాయండి, అంతే. జీవితం గుర్తొచ్చింది, దానితో.
కరంటు బాగానే ఉందండి, ఉంటోంది కూడా, అందుకే ఎ.సి నుంచి బయటకే రావటం లేదు, ఉదయం ఐదునుంచి ఏడు దాకా తప్పించి. నిన్ననే నాకోసమే పోయిందనుకుంటా. కరంటు పోయిన సమయంలో మార్పులు,చేర్పులు,కూర్పులు ఆలోచించా, అందుకే వందనం చెప్పేను.
Zilebi25 May 2023 at 19:23
Deleteబుజ్జమ్మా!
నా రెండు కాళ్ళలో పల్లేరులు గుచ్చుకున్నందుకు చంకలు కొట్టుకున్నావా! మంచిదే సుమా! రెండు చేతులెత్తి నమస్కారం చేయడం, సంతోషంతో చంకలు కొట్టుకోవడం మంచి వ్యాయామం, అలాగే కొనసాగించూ :)
నమస్సులు మీకు. ఆ మాత కరుణ అపారము.
ReplyDeleteగ చింతనం (?) అంటే ఏమిటి?
DeleteAnonymous25 May 2023 at 18:53
ధన్యవాదాలు.
అదేంటో జిలేబి చెప్పాలి గా :)
Anonymous26 May 2023 at 02:01
ReplyDeleteఅస్తమానం తిడితే ఆ తిట్టుకి విలువుండదండీ :) ఆపై మీ ఇష్టం :)
Anonymous26 May 2023 at 05:37
ReplyDeleteచెప్పాలనే ఉంది కాని సమయం కాదు సుమా!
దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచితజ్ఞతా
అభ్యాసేన న లభ్యతె చత్వారః సహజా గుణాః