కోటాకు
కోటాకు
పొత్తు
పువ్వు
పళ్ళగెలవేసే అరటిచెట్టు కొంచం పొట్టిగా,లావుగా పెరుగుతుంది.ఎరుపు డౌలుంటుంది.ఆకులు వెడల్పుగా పెద్దవిగా ఉంటాయి. పువ్వు పొడుగ్గా వుంటుంది, కొద్ది ఎరుపు డౌలు. గెలకి అత్తాలు పదిపైన ఉంటాయి.అత్తానికి ఇరవై నుంచి ఇరవైనాలుగు పళ్ళుంటాయి.
కాయలగెలచెట్టు కొద్ది పొడుగు ఆకుపచ్చగా ఉంటుంది,పువ్వు పొట్టిగా, చిన్నదిగా, బాగా ఎర్రగా ఉంటుంది,ఆరునుంచి ఎనిమిదత్తాలుంటాయి. అత్తానికి పది నుంచి పన్నెండు కాయలుంటాయి. ఆకులు పొడుగ్గా ఉండి కొద్ది వెడల్పు తక్కువుంటుంది.
(పనికిరాని పరిజ్ఞానం)
గెల
ఇది చక్కెరకేళీ పళ్ళ గెల. అత్తాలు నాలుగుగాని ఐదుగాని ఉంటాయి. అత్తానికి పదమూడు కాయలుంటాయి. అత్తంలో పైన ఏడు కింద ఆరు కాయలుంటాయి.
Lovely 👌.
ReplyDeleteగోదావరి జిల్లా లో మా రోజులు గుర్తొస్తున్నాయి. నగర జీవితంలో ఇటువంటి దృశ్యాలే కనబడవు 😟.
విన్నకోట నరసింహా రావు12 May 2023 at 10:31
Deleteపల్లెవాళ్ళంకదండీ ఇవి నిత్యం :)
వెనకాల పెద్ద అపార్ట్మెంటు కాంప్లెక్సు కనిపిస్తా వుండాది పల్లీయులమంటూ నాజూకు పోతారేమిటండీ తాతగారు !
DeleteZilebi13 May 2023 at 09:42
Deleteపల్లెవాళ్ళైతే పూరిపాకల్లోనే ఉండాలనేం లేదు :) మా చుట్టుపక్కలే దగ్గరగా ముఫై పైగా గేటెడ్ కాంప్లెక్స్ లున్నాయి. మాది పల్లెటూరే. :)
వామ్మో ! వామ్మో ! ముప్పై పైబడి గేటెడు ! పల్లె టూర్ అంటూ వయ్యారాలున్నూ !
Deleteఇదేమన్నా అంటే అంతే అంటూ బెదిరింపులున్నూ ! ఎంతకైనా తగుదురు పల్లీయులు.
Zilebi13 May 2023 at 11:14
Deleteఊరు మొత్తంమీద వంద పైగా గేటెడ్ కాంప్లెక్స్ లు ఉంటాయి, జనాభా ముఫిఐదు వేలు దాటదు. నాజూకులేం లేవు, నిజాలే!
- ఓ యబ్బో ఓ యబ్బో !
Deleteపైబడె గేటెడపార్ట్మెం
ట్లో బుజ్జమ్మా విలేజి లోవందకు పై
జేబుల నిండుగ డబ్బులు
గ్లోబల్మాడెలు జిలేబి కుగ్రామంబౌ :)
జిలేబి
Zilebi13 May 2023 at 12:59
Deleteపాత తూగోజిలో వేళంగి బాగా కలిగిన గ్రామం.
మా వూరు గత పదేళ్ళుగా పెరుగుతోంది.కారణాలు.
విద్య:నాలుగు కాలేజిలున్నాయి. పాతిక కిలో మీటర్లలో వర్సిటి ఉంది.కె.జి నుంచి పి.జి చదువు.చుట్టుపక్కల పల్లెలకి మా వూరు సెంటరు.సంపాదనలున్నాయి, ఖర్చులూ ఉన్నాయి.
రైల్: కలకత్తా-మద్రాస్ ఇనుప దారుంది.చాలా ఎక్స్ప్రెస్ రైళ్ళాగుతాయి.
కమ్యూనికేషన్; తూగోజిలో రాజమండ్రి కాకినాడ తరవాత ఎస్.టి.డి కలిగినది.
వైద్యం; వంద పడకల ఆసుపత్రి ఉంది.
పరిశ్రమలు; గ్రాసిం దగ్గరలో ఉంది,Rice mills,ఎడిబుల్ బ్రాన్ ఆయిల్ మిల్లు లున్నాయి.వ్యాపారం ఉంది.
పట్నవాసం పోకడలన్నీ ఉన్నాయి.పోలీస్ స్టేషనుంది. సి.ఐ ఆఫీసుంది.కోర్టుంది.మందు కొట్లున్నాయి. లేనిదేంటొ చెప్పు?సిమెంట్ రోడ్లున్నాయి. గేటెడ్ కమ్యూనిటీ లున్నాయి. ఇంకేం కావాలి బుజ్జమ్మా!
బీదాబిక్కీ పట్నవాసులం. మాకెక్కడిదీ వెసులుబాట్లండీ ప్చ్
Delete
DeleteZilebi13 May 2023 at 18:54
దగ్గరగా వందేళ్ళగా మా వూరు లేబర్ హబ్ ILTD Grading section మూలంగా. అప్పటినుంచి జనులు ఇక్కడ సెటిలయిపోయారు.ఇప్పటికి బీదా బిక్కీయే ఎక్కువ.పక్క వూరి మీలాటి మా రాజులు మా వూరు చేరి గేటెడ్ లు కట్టడం మొదలెడితే మేమూ అదేపని చేసేం.ఇప్పుడు లేబర్ కి ఖాళీ లేదు. రోజుకూలి రెండు వేలు.మా వూరొచ్చెయ్యి బాగా బతుకుదువు,పట్నంలో బతకలేవు.
చాలా స్పష్టంగా వివరించారు.
Deleteకానీండి, ఇప్పటికి మారిన స్థితులలో సిద్ధునికో శివునికో జిలేబీలు వేయాలట. కాబట్టి ఇప్పటికి రావటం కుదిరే టట్టు లే. వీలు చూసుకుని వస్తా. ఓ నాలుగు గ్రౌండ్లు రిజర్వ్ చేసి వుంచండి . పది వేలు సరిపోతుందా ?
జిలేబి
Zilebi14 May 2023 at 10:23
Deleteమీ చిత్తం. అలాగే బతికేద్దురూ :)
ఇక్కడ land rates living locality (posh area) 400 square yards 25 to 30 lacs. prime area 50 lacs. Business area more than one crore. Be prepared. :) you cannot leave town and come down to village. :)
400 sq yards జస్ట్ 25 ? చాలా సలీసు గా వుందే ఓ నాలుగు రిజర్వ్ చేసి పిలవండి. వెంఠనే ఆఘమేఘాలపై వచ్చి వాలి రిజిస్ట్రేషను గట్రా చేసేసుకుందారి
Deleteజిలేబి
Zilebi14 May 2023 at 13:09
Deleteనా తడిక రాయబారమెందుకూ.డబ్బులు తెచ్చుకునొచ్చి నచ్చింది చూసి కొనుక్కోవచ్చు. :)
ఏం బెంగలూరు, చెన్నై, నెల్లూరు నచ్చలేదా? మొహం మొత్తేయా? :)
తడిక రాయబారం 😁😁😁😁.
Deleteఅవునూ, చిత్తూరు అని గుర్తు, ఇప్పుడు సడెన్ గా నెల్లూరు చేరిందేమిటి జాబితాలో, శర్మ గారు?
మరి సింగపూర్ లోను, రాణిపేట లోనూ ఆస్తులేం లేవంటారా?
తడిక రాయబారమంటే ఏమిటండీ ? ఓ టపా రాయండి
Deleteవిన్నకోట నరసరాయలవారూ
Deleteఇంకొన్ని రోజులు పోతే మొత్తం ఐరోపా , అమెరికా ఆఫ్రికా ఓస్ అంతా జిలేబిదేనని తాతగారన్నా హాశ్చర్య పోవాల్సిన పనిలేదండోయ్ :)
Zilebi14 May 2023 at 19:34
DeleteED తేల్చాల్సిన లెక్కకదా :)
Zilebi14 May 2023 at 19:27
Deleteసరదా టపాయే రాయచ్చు, కాని వేడి పాపం పెరిగినట్టు40,41,42,43,44, పెరుగుతూ నేటికి 44కి చేరింది, ముందు52 కి చేరుతుందిట. అంచేత వాయదా తప్పదు, గుర్తు చేయాల్సిందేస్మీ
విన్నకోట నరసింహా రావు14 May 2023 at 18:19
Deleteనెల్లూరు మొదలు. మద్రాసు,రాణీపేట (అయ్యరు గారు), చిత్తూరు, తిరుపతి,ఉత్తరాంధ్ర, కళింగ. ఎన్నవతారాలండి.
ఆ తరవాతే బెంగలూరు,సింగపూరు,మళ్ళీ బెంగలూరు,రాణీపేట, చివరికి మళ్ళీ నెల్లూరు. ఎక్కడేక్కడేమున్నాయన్నది ED తేల్చాల్సిన యవ్వారమండి.
కర్ణాటక నుండి కళింగ వరకూనా? ఆహా రాయలవారి జైత్రయాత్ర లాగా ఉందే !
Deleteసరదా టపాయే రాయచ్చు
Deleteరాయరూ ప్లీజ్ ప్లీజ్
-
Deleteరాయల వారివలె జిలే
బీ యవనాశ్వపు సవారి వీరాంగణయో!
ఈ యమ దొరికిన చోట
ల్లా యమ్మో ల్యాండు డీలులన్ కబ్జాయో!
జిలేబి
సరదా టపాయె రాయొ
Deleteచ్చు! రాయరూ తాతగారు చువ్వన ప్లీజ్ ప్లీజ్
నరసింహారావయ్యా
మరి వత్తాసుపలుకండి మంచి టపా రాన్
విన్నకోట నరసింహా రావు15 May 2023 at 18:43
Deleteఎనభైయేళ్ళ జైత్రయాత్ర కదండీ. చచ్చి బతికినా బుద్ధి మాత్రం మారలేదు. :)
Zilebi15 May 2023 at 19:59
Deleteనిన్నవేడి47, రాత్రి తొమ్మిదికి కూడా40 ఉన్నది. ఈ వేళ ఉదయమే ఆరుకే 30.ఇప్పుడు 36 ఉంది . డెస్క్ టాప్లో తప్పించి తెలుగులేదు. డెస్క్ టాప్ ఉన్నగదికి ఎ.సి లేదు. ఎ.సి గదికి డెస్క్ టాప్ కదపడం కుదరదు, ఇన్నునాయి. ముడిపడాలంటే, వాయిదాయే మంచిపని. :)
Zilebi16 May 2023 at 03:09
Deleteబుజ్జమ్మా!
సముఖంలో రాయబారం, ఇది కూడా తడిక రాయబారాలో ఒకటే సుమా! :)
Zilebi16 May 2023 at 03:09
Deleteబుజ్జమ్మా!
మరచానూ! ఇంత సందడిలోనూ కరంటు ఉంటోంది,బాగుంటోంది. :) అదే పదివేలు. :)
ఎంత మంచి పాజిటివ్ థింకింగ్ గల పెద్దలండి మీరు. మీలాంటి వారివల్లే దేశంలో ఇంకా ధర్మం నిలబడి వున్నది.
Delete
DeleteAnonymous16 May 2023 at 16:46
బాగోనప్పుడు చెప్పి బాగున్నప్పుడు చెప్పకపోవడం తప్పు కదూ!!! గుచ్చాల్సినప్పుడు గుచ్చాలి మెచ్చాల్సినపుడు మెచ్చి తీరాలిగా!!!అదే పాసిటివ్ తింకింగ్
ఓ యబ్బో !/ ఓ యబ్బో !
Delete
DeleteZilebi17 May 2023 at 22:40
అంత సీన్ తమకి లేదుగా! :)
వేడి మంటెక్కిస్తూంటె నిన్న రాత్రిదాకా ఏమైనట్టో :)
ఒకరోజు నలభైకే అస్సో, ఉస్సో అంటే నలభైపైన పదిరోజులు పైగా ఎలాబతుకుతున్నాం :)
వెనకాల “కనిపిస్తా” ఉన్నది అపార్ట్-మెంట్ “కాంప్లెక్సు” లాగా అనిపించడం లేదు. శర్మ గారి డాబా ఇల్లే అయుండచ్చు.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు13 May 2023 at 10:53
Deleteఏం కనపడకపోయినా బుజ్జమ్మ ఎప్పుడో చెప్పినమాట గుర్తుంచుకుని చెప్పినదండీ! మావిడి చెట్టు వెనక ఒక గేటెడ్ ఉన్నసంగతి. :)
శర్మ గారు,
ReplyDelete// “ మా వూరు గత పదేళ్ళుగా పెరుగుతోంది.“ //
అలాగే అనిపిస్తోంది పైన మీరు వివరించిన కారణాలు చూస్తే. ప్చ్, రిటైరయ్యాక మీ ఊరిలో సెటిల్ అయినా బాగుండేది, ప్రశాంతంగా ఉండేదేమో?
అవునూ, “పరిశ్రమలు” లో మీ ఊరి పేరుని వెంటనే గుర్తుకు తెచ్చే ITC (పాత ILTD) మర్చిపోయారేం?
విన్నకోట నరసింహా రావు14 May 2023 at 10:06
Deleteపెద్ద ఇబ్బందులుండవండి. ఎవరి అవసరాలు వారికి వేరు కదండీ. అవసరాలని దృష్టిలో ఉంచుకునే ఇక్కడ సెటిలయ్యా, పట్నంలో కాక. ప్రశాంతతకి లోటు లేదండి.
ఇప్పుడు ప్రజలకి ITC తో సంబంధం లేదండి. ఈ ప్రాంతం లో పొగాకు పంటలేదు, grading section తీసేసారు. అందుకు లేబర్ తో పనిలేదు. అందుకు చెప్పలేదండి.
Zilebi14 May 2023 at 10:23
Deleteజిలేబులేసి సిద్ధుడికో శివుడికో నైవేద్యం పెట్టలేదే??? ఎవరికి పెట్టాలో తేల్చుకోలేకపోతివా???? :) :) :)
ఇప్పటిదాకా జిలేబులు పోతానే వుండాయండీ ఏమీ పాకాన పడలె ఇంకా :)
Deleteరేపటికి లేకుంటే శుక్రవారనికి భాగ్యదా లక్ష్మీ బారమ్మా తెమలొచ్చండి :)
Zilebi17 May 2023 at 22:39
Deleteపాకానబడకపోతే పులిసిపోవచ్చు.
సిద్ధుడో,శివుడో, తేలకపోతే కోతి,పిల్లుల తగువైపోవచ్చు.నేను ముందు నేను ముందు :)
పెహలే ఆప్ పెహలీ ఆప్ గాడీ నికల్గయీ, పాతకాలం మాట. నేడు, పెహలే మై, పెహలేమై గాడీ నికల్జాయేగీ,దోనోంకో ఛోడ్కే :)
“జిలేబి” గారు (15 May at 20:19),
ReplyDelete// “….. వీరాంగణయో!” //
వీరాంగ “ణ” అంటారా? వీరాంగన అంటారా?
వీరాంగణ అనగా వీరత్వము తో "అంగణముల" అనగా ల్యాండు డీలు ల లేక కబ్జాల అని అర్థమండి :)
ReplyDeleteఅబ్బబ్బా తెలుగు వాళ్లంటారు గాని అస్సలు తెలుగే రా నట్టున్నట్టుంది :)
మా గురువులు నేర్పించిన తెలుగు వచ్చు.
Deleteమీ లాంటి గుగ్గురువులు వాడే తెలుగు రాదు.
ఎవరండోయ్ మీ గురువులు వారి కమామీషు?
Deleteస్కూల్లో తెలుగు టీచర్లు, కాలేజ్ లో తెలుగు లెక్చరర్లు. ఉద్దండులు, మహానుభావులు 🙏
Deleteవిన్నకోట నరసింహా రావు17 May 2023 at 07:21
Deleteవీరు ప్రొఫెసర్ కదా! కొత్తకొత్తవి పుట్టిస్తూ ఉంటారు, అర్ధాలు చెబుతూ ఉంటారు. :)
-
Deleteవీరు ప్రొఫెసరుగ! చెబుతుం
టారండీ కొత్తకొత్త యర్థమ్ములతో
ప్రేరేరపణలు గురువుల
వారి దయయటంచు మీదు వాదించడమున్
జిలేబి
Zilebi17 May 2023 at 22:50
Deleteప్రొఫెసర్ కాదో? అబద్ధాలాడితే మళ్ళీ జన్మలో ఆడపిల్లలే పుడతారుష :)
శర్మ గారు,
ReplyDeleteభోజనం చెయ్యడాని కోసం వాడే అరిటాకు చెట్టు ఏమైనా ప్రత్యేకమా లేక ఏ అరటి చెట్టు ఆకులైనా పనికొస్తాయంటారా?
ఈ వ్యాఖ్య / ప్రశ్న నాదే.
Deleteఏ రాయైతేనేమి పళ్లూడగొట్టుకోవడానికి ?
Deleteతాతగారు సైలెంటుగా వున్నారు.
Deleteకుశలమేనా ?
పై వ్యాఖ్య ఎవరిది ? మీదేనా ?
జిలేబి
Anonymous22 May 2023 at 11:06
Deleteవిన్నకోట నరసింహా రావు22 May 2023 at 11:08
విన్నకోటవారు,
పనికిరాని పరిజ్ఞానం చెబుతున్నా!పండితమ్మన్యుణ్ణికదా!సమాధానం పెద్దదిగా ఉండచ్చు, తప్పులు మన్నించాలి.
భోజనానికి ఆకు ఉత్తమం. ఏ చెట్టుదైనా అరటాకు ఉత్తమోత్తమం.
ఆ తరవాతవి మోదుగాకు,తామరాకు,చివరగా టేకు ఆకు కూడా ఉత్తమమే
ఆతరవాతది జమ్మి విస్తరి అనగా బంగారు కంచం, కలిగిన మారాజుల సొత్తే
ఆ తరవాత రజతం, వెండి కంచం బంగారు పువ్వుతో ఉన్నది.
ఆతరవాతది కంచుకంచం, తోమి ఎండలో బోర్లిస్తే బంగారు కంచంలా మెరిసిపోతుంది.
ఆ తరవాత నేడు వాడుకునే స్టీలు (ఇనపకంచం)
చిట్ట చివరగా అల్యూమినియం కంచం.
దోసిట పట్టుకుని తినడం అన్నిటికంటే ఉత్తమోత్తమం.
రైతు మొక్కతోటనుంచికాని అకుకొయ్యడు.
ఐదు అరటాకులను ఒక సమూహంగా ఉంచుతారు, దాన్ని ’కవిలె’ అంటారు. ఇప్పుడు అరటాకును ఎక్కువగా వాడుతున్నారు, ఆహారం పేకింగుకు. . కవిలె ఖరీదు ఇరవై రూపాయలదాకా ఉంది. ఒక ఆకు ఐదు రూపాయలు.
మీరు “పండితమ్మన్యు”లేవిటండీ, శర్మ గారు. మీ విద్వత్తుకు అవమానం.
Deleteనన్నడిగితే అరిటాకు తర్వాత తతిమ్మా ఆకుల కన్నా తామరాకు ఉత్తమం అంటాను. ముఖ్యంగా చిరుతిండికి తామరాకు. వేడి ఇడ్లీలు తామరాకులో వడ్డిస్తే మహత్తరం. భోజనానికయితే అరిటాకే, తర్వాత కుట్టిన విస్తరి.
కవిలె అనడం అరిటాకుల కట్టలకే కాదండి. అల్లుడు ప్రభుత్వాఫీసులో చిరు గుమాస్తాగా పని చేస్తుంటే నచ్చని అత్తగారు ఫైళ్ళు చంకన పెట్టుకుని ఆఫీసుకు బయలుదేరుతున్న అల్లుడి గురించి ఆ కవిలె కట్టలు పట్టుకుని ఆఫీసుకు వెడుతున్నాడు అనేవారు పాతకాలపు అత్తగార్లు 🙂🙂.
విన్నకోట నరసింహా రావు23 May 2023 at 09:56
Deleteతామరాకు చాలా చోట్ల దొరకదండి.ఇడ్లీకి బాగుంటుంది. కొంతమందికి ఆ ఆకు వాసన నచ్చదు. లేతాకులు పప్పులో వేయించాడు మా పెద్దన్నయ్య మా పెద్దక్క పెళ్ళిలో,చివరిరోజు, పెళ్ళివారికి. :) మాకు రుచి చూడ్డానికి కూడా దొరక్కుండా తినేసిపోయారు,బాగుంది బాగుందంటూ.
అరటాకు ఉత్తమోత్తమం, మోదుగాకు కుట్టిన విస్తరి ఆ తరవాతెక్కువగా వాడతారు,అడ్డాకు ఆ తరవాతదే.
అరటాకులో వడ్డించిన ఆహారంలో ఉండే చిరువిషాల్ని హరిస్తుందిట. ఎక్కువపాటి విషాన్నైతే వెలిబుచ్చుతుందంటారు.
ప్లీడరు గుమాస్తాలు కేసులకవిలె కట్టలు మోసుకుపోవడం అలవాటేనండి :)
This comment has been removed by the author.
Deleteమీరు బంగరు మణి అండీ
Deleteచైం చిక్ జాల్ రా :)
Deleteబంగరు మణి మీరండీ
ఠంగున తెలతెల్లవారి టపటప కామెం
ట్లంగట తేదియు టైమును
ట్రింగున ప్రచురించి యిత్తురే యుత్తరమున్
జిలేబి
DeleteZilebi23 May 2023 at 17:54
Zilebi24 May 2023 at 05:52
బంగరు మణి :) ఉండదనుకుంటా :)
ఆ పేరెట్టి బేరమెట్టేద్దామనే :)
అబ్బే!!! కొనేవారుండరు కుందనం.
ముసలెద్దెవరికి కావాలి?? తిండి దండగ :)
పైడినెలత ప్రయోగం బాగుంది,దుష్ట సమాసంకాదుగదా!
పైడితల్లి,పైడిబొమ్మ,పైడికొండ, బంగారం,వెలిగారం ఏంటీ? బంగారం మీదపోయింది మనసూ!!! :)
అన్నట్టు రెండువేల నోట్ల కట్టలట్టుకుని బంగారం కొట్లంట తిరుగుతున్నట్టా, మా వాట్సాప్ యూనివరిసిటీ లో ఒక వీడియో వైరల్, ఒకడు ఏభై కట్టలు కార్ టైర్లో పెట్టేడు, ఇప్పుడు బయటికి తీసేడు, భయం..
అన్నట్టు బంగారం రేట్ పెరిగిందిష, ఏభై కట్టలికి ఎంతొస్తుంది?? అసలిదెక్కడ దాచాలబ్బా!!!సాయపడుమీ :) :)
వందలు వేల కోట్లు దాచినవాళ్ళేం చెయ్యాలబ్బా:)
Easy liquidity is required..
Will be paid suitably for good suggesion. :) :) :)
పోతేపోనీ అని మన తాతగారు కదా అని పొహిడితే యింత బెట్టు చేసుకుంటే ఎలా ? ఆయ్:)
Deleteబంగారం మీద మనసు పోవడం అంటే మోదీ దెబ్బ కదా, శర్మ గారు.
Deleteఇక వెలిగారం అంటే బంగారం కాదు, బంగారానికి మెరుగుపెట్టే టంకం (borax) అనుకుంటాను.
విన్నకోట నరసింహా రావు24 May 2023 at 11:56
Deleteబంగారం, వెలిగారం అని కలిపి అంటుంటారండి, అది టంకమా :)
మోడీ దెబ్బ పోలీస్ దెబ్బలా తగిలినట్టుందండీ, కలిగినవారికి?
బేంకులదగ్గర జనాలున్నట్టు లేదు, బంగారపు కొట్ల దగ్గరున్నారట, జనం.
Zilebi24 May 2023 at 11:06
Deleteబెట్టేంలేదు బుజ్జమ్మా! తిప్పలుపడుతున్నావేమో కట్టలతో సాయం చేద్దామనుకున్నా! నీకెందుకులే!!! కట్టలు మార్చి ఉంటావు, ఈ పాటికే :)
ReplyDeleteAnonymous22 May 2023 at 11:20
చెప్పిన నానుడి సమయానికి సందర్భానికి అతికినట్టుండాలి. ఇది అలా లేనట్టుగా ఉండే!! :)
Zilebi23 May 2023 at 08:18
ReplyDeleteకుశలానికి లోటేమి? :) ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది, వయసు ముచ్చట్లు కదా! వేడి చితక్కొడుతోంది, అర్ధరాత్రికి కూడా చల్లబడటం లేదు, ఎసి నుంచి బయటికొస్తే నిప్పులగుండంలో కొచ్చినట్టుంటోంది.
పునః పునః ధన్యవాదాలు,
తాతగారికి,
ReplyDeleteయుగళపు జీవన మధురిమ
ల గమనపు తొలకరి జల్లు లా తల్లి జతన్
జగమున మొదలైన దినము
న గ చింతనమదె మదిని మునకలిడ ప్రణతుల్
బిలేజి.
Zilebi25 May 2023 at 05:06
Deleteజిలేబికి వందనం
see post
https://kasthephali.blogspot.com/2023/05/blog-post_25.html