అరటాకెళ్ళి ముల్లుమీద పడ్డా.....
అరటాకెళ్ళి ముల్లుమీద పడ్డా, ముల్లెళ్ళి అరటాకుమీద పడ్డా అరటాకుకే నష్టం !!! ఇదో పాతకాలపు నానుడి. ఆ కాలంలో ఆడపిల్లతో మగవాడు మాటాడితే ఆడపిల్ల బతుకు బండలైపోతుందనీ, పాడైపోతుందనీ, అలాగే ఆడపిల్ల చొరవ తీసుకుని మగాడితో మాటాడినా ఫలితం అలాగే ఉంటుందనీ చెప్పేవారు. ఆ తరవాత ఆడపిల్ల వీపు సాపు చేసేవారు. ఇదే లోకపు తీరు, నాడు.
కాని రోజులు మారాయి.
రోజులు మారాయా! లేదు!! అవే సంవత్సరాలు,అవే ఆయనాలు, అవే ఋతువులు, అవే మాసాలు, అవే పక్షాలు, అవే వారాలు, అవే గంటలు, నిమిషాలూన్ను. మరి మారిందేంటీ? మనిషి బుద్దులు మారాయి.
ఇప్పుడు మగాడు ఆడపిల్లతో మాటాడినా, ఆడపిల్ల మగాడి వెంటపడినా,వేధించినా,మాటాడినా, పగిలేది మగాడి వీపే. వాడే వయసువాడైనా, ఏమి మాటాడినా, లోకం వినదు. మగాడి వీపు పగలడం ఖాయం.
ఆడవారితో దూరంగా ఉండడం ఆరోగ్యానికి మంచిది. తస్మాత్ జాగ్రత,జాగ్రత.
పూర్తిగా ఆరోగ్యకరం (దూరంగా ఉండడం).
ReplyDelete“Me Too” హడావుడి బాగా నడుస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు తనకు లేడీ సెక్రటరీ వద్దని అన్నారని వార్తల్లో వచ్చింది. తెలివైన పని చేసాడు అనుకున్నాను.
విన్నకోట నరసింహా రావు7 May 2023 at 10:16
Delete"Me Too"నడుస్తూనే ఉందండి సెక్షన్ 498A లాగా
-
ReplyDeleteజరగండీ జరగండీ
పరపతి పోతుంది మీకు పడతుల వెంటా
డ! రవణపు రమణుల వెనుక
గరళపు బుద్ధులును ముసుగు కపటేశ్వరులున్
:)
జిలేబుల్స్
Zilebi7 May 2023 at 11:04
Delete/ముసుగు కపటేశ్వరులున్/
తమ ముసుగు తొలగించండి, నిజం తెలుస్తుంది.
-
Deleteతొలగించండి తమ ముసుగు
జిలేబి నిజమేమియొ తెలిసి జనుల్ సంతో
షలహరిని తూగెదరుగా
సలహాల్రాయుని కలహపు సఖి బండబడా :(
జిలేబి
హలో బ్రదర్ సినిమాలో బ్రహ్మానందం రాజనాల గారితో అనే ఒక డైలాగ్ గుర్తుకు వస్తుంది.
ReplyDeleteఏమండీ రాజనాల గారూ మీరు సీనియర్ మోస్ట్ ఇలన్ కదా. హీరో వెళ్లి ఇలన్ మీద పడ్డా లేక ఇలన్ వెళ్లి హీరో మీద పడినా చివరాఖరికి ఇలన్ కే బొక్క అని మీకు తెలీదా.
Anonymous8 May 2023 at 15:06
Deleteనేను సినిమాలు చూడనండి. అంచేత తెలీదు.
ఇక సినిమాలో హీరో కొట్టినట్టు నటించినందుకూ, ఇలన్ కొట్టించుకున్నట్టు నటించినందుకూ డబ్బులుచ్చుకుంటారు. నిజ జీవితంలో అలా జరగదండి. వడ్డన ఫ్రీ కదండి, అదే ఆడపిల్లో మాటందా వీపు విమానం మోతే సుమా!!!!