Thursday 1 June 2023

ఏమిజన్మంబు? ఏమి జీవనము?

 ఏమిజన్మంబు? ఏమి జీవనము?


 ఏమిజన్మంబు? ఏమి జీవనము?

ఈ మాయకాయంబు? ఏమిజన్మంబేమి జీవనము?


పుట్టుకేంటి? పెరగడమేంటి? చావేంటి? మనిషికి మనిషిపుట్టడమేంటి? పండునుంచి పండు పుట్టడమేంటి? ఆడ, మగ తేడా ఏంటి?స్త్రీకే బిడ్డకలగడమేంటి? ఎందుకీ తేడా? ఆకలేంటి? అన్నమేంటి? అన్నం తింటే ఆకలి తీరడమేంటి?ఆలోచిస్తే ఇదంతా గందరగోళం. ప్రేమ అభిమానాలేంటి? ఎందుకు? అన్నీ కొచ్చన్లే.  సమాధానాలు లేవు.... 


ఓరోజు సాయంత్రం ఆలోచన ఈ దారి పట్టింది.బయటికెళ్ళలేక లోపలుండలేని స్థితి. ఇంతలో మందస్మితవదనారవిందసుందరి,త్రిదశి, వచ్చి కూచుంది, ”తాతగారూ రేపు ఊరునుంచి వెళ్ళిపోతున్నానూ” అంటూ, బిక్కముఖంతో. అంతలోనే అసలీ కలవడమేమి?విడిపోవడమేమి? కారణం లేని కార్యం ఉండదంటారు కదా! అడిగింది.

ఈ  ప్రశ్నకి సమాధానం భారతంలో భీష్ముడు చెప్పారు, పద్యం గుర్తులేదు, భావం చెబుతా! గాలిచేత ఎగరగొట్టబడ్డ మేఘాలు గుంపుగా చేరతాయి, అదేగాలిచేత చెదరగొట్టబడతాయికూడా! అలాగే మానవులు విధి(చాలా అర్ధాలున్నాయి, ఈ మాటకి)చేత కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఓ చిన్న కొచ్చను సమాధానం చెప్పూ అన్నా! తన బిక్కమొహం చూడలేక!!!


ఒక నాలుగొందల మీటర్ల వాకింగ్ ట్రాక్ మీద ఒకే చోటునుంచి ఇద్దరు గంటకు నాలుగు కి.మి ల వేగంతో ఒకే సమయంలో బయలుదేరి ఎదురెదురుగా నడుస్తున్నారు. వీరుకలుస్తారా? ఎప్పుడు ఎక్కడ?


అదేట్రాక్ మీద మరో ఇద్దరు కలిసి గంటకు నాలుగు కి.మి ల వేగంతో ఒకేవైపుకు నడుస్తున్నారు. వీరు కలిసినడుస్తారా? విడిపోతారా?


అదే ట్రాక్ మీద ఒకడు గంటకు నాలుగు కి.మి ల వేగంతో నడుస్తున్నాడు. మొదటివాడు నడక మొదలెట్టిన రెండు నిమిషాల తరవాత రెండవాడు అదే చోటునుంచి,  అదే  వేగంతో అదే వైపుకి నడకమొదలెట్టేడు. వీరిద్దరూ కలుస్తారా? ఎప్పుడు?ఎక్కడా?

ఈ కొచ్చన్లు విని మందస్మితవదనారవిందసుందరి మరింత బిక్కమొహంతో నేను లెక్కల్లో వీకూ అంది బెక్కుతూ!!! 

ఆలస్యమైతే తిక్కమొగుడు వచ్చి ఎత్తుకుపోతాడు, అంది నవ్వుతూ. ఎక్కడున్నాడు? అడిగా బయట కార్ లో కూచుని ఉన్నాడు, అందుకే కంగారు. బై అంది చెయ్యి ఊపుతూ. నువ్వు ప్రేమించబడ్డ చోట సుఖంగా ఉంటావు. నువ్వు ప్రేమించినచోట సుఖంగా ఉండలేవన్నా!బై చెప్పుతాతా అంది,పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ. బై చెప్పను బై అనకు,వెళ్ళొస్తా అనాలి, అన్నా.మరికొంచంసేపు నిలిపి ఉంచడానికి. ఏం? అడిగింది.వెళ్ళొస్తా అన్నదానిలో మళ్ళీ కలుస్తామనే ఆశ ఉంది, బైలో లేదు, అన్నా! ”ఎల్పోయొస్తా” అంది నవ్వుతూ. నిజం ఇలా అనేవాళ్ళని చూసి నవ్వుతాం, నిజానికి ఇందులో ఎంత,మళ్ళీ కలుస్తామనే ఆశ ఉంది, అన్నా! ఇంకీ సారి వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళింది, ”వస్తానూ” అంటూ, చిత్రం కదూ!!! 


8 comments:

  1. పుట్టుటయు నిజము పోవుటయు నిజము
    మాయయనునదేది లేదోయి మానవా
    ఈ జీవితమే సత్యము
    మిగిలిన వన్నియు నీ ఊహలే తాతా



    జిలేబుల్స్

    ReplyDelete
    Replies
    1. Zilebi1 June 2023 at 19:53
      కందమ్మా!
      పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమిది నాటకమూ అన్నారు, అన్నమయ్య. తమరి మాటేమో తెల్వలే!!!

      Delete
    2. ఎప్పుడూ పాత చింత కాయ పచ్చడేనా ?
      మారండి మార్పును ఆహ్వానించండీ మార్పొక్కటే శాశ్వతమైనది


      ఆమెన్

      జిలేబి

      Delete
    3. Zilebi2 June 2023 at 20:48
      బుజ్జమ్మా!
      నిజమేస్మీ! నువ్వు చెప్పినమాటే వేదం. నీకు తెలియంది లేదుట, దేవునికే పంచాంగం చెప్పగలవని ఎవరో అన్నారమ్మా! వింటాం! వింటాం తల్లీ....

      Delete
  2. మిగిలినవన్నిట్లో జిలేబుల్స్, జిలేబీలు కూడా ఉన్నాయి

    ReplyDelete
    Replies
    1. Anonymous2 June 2023 at 00:59
      ఏంటో అర్ధమే కాలేదండీ

      Delete
    2. "మిగిలిన వన్నియు నీ ఊహలే తాతా" అని జిలేబి ఉవాచ కదా. ఆ మిగిలినవన్నిట్లో జిలేబీలు, జిలేబుల్స్ కూడా ఉంటాయి కదా. అంటే అవి కూడ ఊహలే కదా.

      Delete
    3. Anonymous2 June 2023 at 23:21
      జిలేబి ఉవాచ సమర్ధించేరనమాట! అస్తు! అస్తు!!
      జిలేబి ఏంటీ? జిలేబుల్స్ ఏంటో తెరియమిల్లె, చొల్లుంగో సార్!!

      Delete