Wednesday, 7 June 2023

సుఖస్యాఽనంతరం

 (ఆచార్య చాణక్య నీతి)


సుఖస్యాఽనంతరం దుఃఖం

దుఃఖస్యాఽనంతరం సుఖమ్

న నిత్యం లభతె దుఃఖం

న నిత్యం లభతె సుఖమ్


సుఖాల తరవాత దుఃఖాలు, దుఃఖాల తరవాత సుఖాలు కలుగుతూ ఉంటాయి.ఎప్పుడూ దుఃఖమే స్థిరంగా ఉండిపోదు. అలాగే సుఖమూన్నూ స్థిరంగా ఉండిపోదు.


పుస్తకస్తా తు యా విద్యా

 పరహస్త గతం ధనం

కార్యకాలె సముత్పన్నె

 న సా విద్యా న తద్ధనం

 

పుస్తకంలో ఉన్న విజ్ఞానము, ఇతరులచేతిలోని మనధనము అక్కరకు రావు  (సమయానికి, అవసరానికి ఆదుకోవు)


నృపస్య చిత్తం కృపణస్య విత్తం

మనోరథా దుర్జనమానవానా

స్త్రియా చరిత్రం పురుషస్య భాగ్యం

దేవో న జానాతి కుతో మనుష్య

 

రాజు మనసు,లోభివాని సంపద,దుర్జనుని కోరిక,స్త్రీ చరిత్ర,మగవాని సంపాదన, దేవునికైనా తెలియదు, మనుషులకా?

 రాజుమనసులో మాట గుట్టు, లోభివాని సంపాదనంతా గుట్టు,దుర్జనుని కోరిక గుట్టు, స్త్రీల చరిత్ర అనగా వయసు వివరాలు గుట్టు,పురుషుని సంపాదన గుట్టు. వీరంతా తమ గుట్టు దేవుడికి కూడా తెలియనివ్వక దాచి ఉంచుతారు, మనుషులకెలా తెలుస్తుంది? అని కవి భావం. 


అత్యాసన్నాః వినాశాయ
దూరస్థాః న ఫలప్రదాః
సేవ్యంతాం మధ్య భావేన
రాజా వహ్ని గురుస్త్రియః

 

రాజు,నిప్పు,గురుస్త్రీలు  వీరిపట్ల అతి సన్నిహితంగా ఉంటే వినాశనమే, అలాగని దూరంగా ఉండి ఉపయోగం లేదు. అందుచేత మధ్యస్థ దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుని మాట.  

గురు స్త్రియం అన్న చోట వేరువేరుగా కాక గురుస్త్రియం గా చెప్పుకోవాలని చెప్పేరు. అందుకు మార్పు," రాజు,అగ్ని, గురుస్త్రీలు వీరిపట్ల అతి చనువుతో ప్రవర్తించడం ప్రమాద హేతువు,వినాశకారి. 




40 comments:

  1. కృషితో నాస్తి దుర్భిక్షం,
    జపతోనాస్తి పాతకం,
    మౌనేన కలహోనాస్తి
    నాస్తి జాగరతో భయం


    ౨) ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ
    లఘ్వీ పురావృద్ధి ముపైతి పశ్చాత్
    దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా
    ఛాయేవ మైత్రీ ఖల సజ్జనాం

    ౩) పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః
    పరోపకారాయ చరన్తి గావః పరోపకారాయమిదం శరీరమ్

    ౪)నూనం హితే కవివరా విపరీతవాదో
    యే నిత్య మాహూరబలా ఇతి కామినీస్థాః
    యాభిర్వైలోలతరతారకదృషిపాతైః
    శక్రాదయ్ఽపి విజితాస్త్వబలాః కధం తాః?


    నేను కూడా చెప్తానండోయ్ :)



    జిలేబుల్స్

    ReplyDelete
    Replies
    1. Zilebi7 June 2023 at 20:44
      బుజ్జమ్మా!
      పొద్దుటే నడక్కి బయలుదేరుతుంటే అక్షింతల్లా నాలుగు చినుకులు రాలాయి. అబ్బ చల్లబడిపోయిందనుకున్నా! మబ్బుగా ఉందిలే! ఈ వేళ అక్షరాలా నలభైనాలుగు వేడిఉంటుందని జోస్యం.సరే ఇది రోజూ మాటే! నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడెవడని సామెతలే!


      నువ్వు మేధావివి కదా! చిన్న అనుమానం తీర్చు. చాణుక్యుడు రాజు,నిప్పు,గురువు స్త్రీలకి అత్యంత సన్నిహితంగా ఉండద్దు,ఉంటే నాశనమే అంటారు.
      అత్యాసన్నా వినాశాయ

      దూరస్థా న ఫలప్రదా

      సేవత్వం మధ్యభావేన

      రాజా వహ్ని గురు స్త్రియం
      ఏంటి దీని కత చెప్పు.తరవాత అనుమానలు మళ్ళీ అడుగుతాలే!

      Delete
    2. శర్మ గారు,
      ఏమిటి గురువుకు కూడా సన్నిహితంగా ఉండడం మంచిది కాదా? ఎందుకలాగ? తతిమ్మా మూడు సరే గానీ గురువుని కూడా వినాశకారి అని ఎలా అంటాడు చాణక్యుడు (ద్రోణుడి లాంటి గురువనా వారి భావం?) ?

      “జిలేబి” గారు మీ ప్రశ్నకు చెప్పే జవాబులో నా సందేహాన్ని కూడా కలుపుతారని తలుస్తాను.

      Delete

    3. విన్నకోట నరసింహా రావు8 June 2023 at 09:03
      నాకూ అదే అనుమానమండీ. బుజ్జమ్మ చెబుతుందని అడిగేనండి. ద్రోణుడు, చండామార్కులను తప్పు పట్టక్కరలేదండి.

      Delete
    4. Early morning thought flashed - why for Guru too -
      Familiarity breeds contempt.

      That could be the reason.

      Cheers
      జిలేబి

      Delete
    5. Zilebi9 June 2023 at 06:35
      బుజ్జమ్మా!
      నిన్న44 నేడు,రేపు,ఎల్లుండి, ఆవలెల్లుండి కూడా 44 పైమాటే అని జోస్యం. మా బతుకే కానుందో దేవునికే ఎరుక.

      ఏమనుకోకూ! నువ్వు కొంచం స్లో టు ఆపరేట్. మాదగ్గర స్లో టు ఆపరేట్ స్లో టు రిలీజ్ ఇలా రకరకాల రిలేలుండేవిలే! :)
      స్పందన ఆలస్యం :) నేనూ గురువు వేరు,స్త్రీలు వేరని అనుకున్నా! కాని అనుమానంతో చర్చకుపెట్టి నిన్నడిగాను.చర్చ ప్రారంభించినదీ నేనే.

      సంగతిలో కొస్తా
      గురువూ మనిషే ఆయనకు ఇష్టాఇష్టాలు, కొన్ని వ్యసనాలూ ఉండచ్చు, వాటిని చగ్గరచూసి అసహ్యించుకోవచ్చు. దాని మూలంగా చదువు కుంటుపడి నాశనహేతువవుతుందనుకున్నా!
      ఈపై నీ ఇష్టం :)

      Delete
    6. అబ్బ! మీరు రాస్తేనే చాలండీ అదే సరి. బై ది వే ఆ పై ఆంగ్లానికి మీరన్న దానికి ఏమి డిఫరెన్సు :)


      జిలేబి

      Delete
    7. Unable to understand 😂

      Delete
    8. ఇంతకీ తాతగారు ఆ పై నేను వ్రాసిన నాలుగో సంస్కృత శ్లోకానికి అర్థం చెబుదురూ :)

      జిలేబి

      Delete
    9. అతివలజూచి వీ రబల లంచు వచించు మహాకవీంద్రు లు
      ద్ధతవిపరీతవాదు, విది దబ్బర గాదు;విలాసినీ సమం
      చితతరలాక్షిపాతములచే గెలువంబడి రింద్రముఖ్యులున్
      ధృతి నటువంటి వా రబల లేగతి నైరి తలంచి చూడగన్?

      Delete
    10. ఎక్కణ్ణుంచి కొట్టుకొచ్చారు :)


      జి

      Delete
    11. Zilebi9 June 2023 at 20:10
      కొట్టుకురావడం, పట్టుకురావడం, నెట్టుకుపోవడం, చుట్టుకుపోవడం, కట్టుకుపోవడం చిన్నప్పటినుంచీ నీకలవాటని మరచాసుమీ :)

      Delete
  2. రాజవహ్నిగురుస్త్రీల విషయంలో అతిసాన్నిహిత్యం ప్రమాదం సుమా అనిభావమండీ. రాజు తనకు ఎంత చనువు ఇచ్చినా రాజంటే భయం వీడకూడదు. అగ్ని ఎంతచిన్నగా ఉన్నా అగ్ని సంబంధంకల వాటితో సులువుగా ప్రవర్తించగలిగినా చిన్పపొ‌రపాటుతో అంతా ప్రమాదమే అని మరువరాదు. గురువుతో సమపాండిత్యమూ సభల్లో సమగౌరవమూ కలిగినా గురువుతో చనువుతీసుకోక భక్తితోనే ఉండాలి. ఇక స్త్రీలు ఎంతచనువు ఇచ్చినా సముదాచారం పాటించి వందనంతో మెలగాలి లేదా తనకైనా వా‌రికైనా లోకాపవాదం రావచ్చును. ఈవిషయాలలో వివేకం కలిగి ఉండాలని బోధ ఇక్కడ.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం8 June 2023 at 11:26
      వివరణకి ధన్యవాదాలు. రాజు,అగ్ని,స్త్రీల విషయంలో మీమాటే. గురువుతో అతి చనువుతో ప్రమాదం,వినాశం ఏమీ అనేదే సందేహం కదండీ!

      Delete
  3. గురు స్త్రియః అంటే ఇక్కడ, గురువుకు చెందిన స్త్రీల విషయం చెప్తున్నారు. గురు పత్నులని భావన.గురుకులాలకు సంబంధించిన రోజుల్లోని అంశం. బృహస్పతి భార్య తార, చంద్రుల విషయం ప్రస్తావనార్హం.

    ReplyDelete
    Replies
    1. డా.విష్ణు నందన్8 June 2023 at 15:51
      వందనం.
      నిస్సందేహంగా సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.
      మరో అనుమానం.

      పుస్తకస్తా తు యా విద్యా
      పరహస్త గతం ధనం
      కార్యకాలె సముత్పన్నె
      న సా విద్యా న తద్ధనం
      ఇది ఆచార్య చాణుక్యుని మాటగా ఉన్నది. దీనితో పాటు మరొకటి కూడా చెప్పబడుతోంది, ఇలా

      పుస్తకం వనిత విత్తం
      పరహస్తగతం గతః
      అధవా పునరాయాతు
      భ్రష్టా జీర్ణేన స్వల్పశః
      ఇది తరవాతి కాలంలో కల్పించి చాణుక్యునిదిగా చెలామణీ చేస్తున్నారనిపిస్తుంది. ఏది నిజం తెలుపగోర్తాను.
      మరోసారి ధన్యవాదాలు.

      Delete
    2. కాంత్9 June 2023 at 05:47

      అది గురువుకు చెందిన స్త్రీ అని కాదండి. గురువు, స్త్రీలు రెండూ వేరు వేరు పదాలు. క్రింది లింకులు చూడండి:
      https://mcjoshi21.blogspot.com/2018/10/todays-subhashita_18.html
      https://books.google.com/books?id=_pM3DwAAQBAJ&pg=PA68&lpg=PA68

      Delete
    3. కాంత్9 June 2023 at 05:47
      జోషి గారినే నేనూ అనుసరించా! గురువు స్త్రీ వేరుగా కనపడేటప్పటికి అనుమానం కలిగి చర్చకు పెట్టేను. విష్ణునందన్ గారు సంస్కృతపండితులు.అంతేగాక చెప్పినది తార్కికంగా నప్పడంతో సరిపోయిందనుకున్నా! ఇంతకంటె సరియైన, తార్కికంగా చెబితే దాన్ని ఒప్పుకోడానికి సిద్ధమే. మరోమాట, ఆచార్య చాణుక్య చెప్పేటపుడు ఈ నలుగురు,ఈ ఎనిమిదిమంది, ఈ ఆరుగురు అని వక్కణిస్తారు, అది ఆయన అలవాటు.

      ఇది చూడండి.

      రాజా వేశ్యా యమశ్చాగ్ని
      తస్కరో బాలయాచకో
      పరదుఃఖం న జానంతి
      అష్టమో గ్రామకంటకః
      రాజు,వేశ్య,యముడు,అగ్ని,బాలలు,యాచకులు ఇతరుల కష్టం గుర్తించరు, అని (ఏడుగుర్ని చెప్పి)ఎనిమిదోవాడు గ్రామీణుడు అంటారు (పల్లెటూరి బైతు)
      చర్చలో పాల్గొన్నందుకు
      ధన్యవాదాలు.

      Delete
    4. ఆ పైనున్న లింకులను క్షుణ్ణంగా పరిశీలించాను, మొదటగా చెప్పవలసినదేమంటే, ఈ శ్లోకానికి సంబంధించి, ఇంటర్నెట్లో ఉన్న దాదాపు పదుల సంఖ్యలో ఉన్న యే లింకులోనూ సరైన పాఠం లేదు. కొంత సంస్కృత పరిజ్ఞానంతో, అంతకు పైన కర్త కర్మ క్రియలకు వాడిన విభక్తి ప్రత్యయాలను బట్టో, వాడిన పురుషలను బట్టో అందులో ఏక ద్వి వచనాలను బట్టో సరైనదా కాదా అని చెప్పవచ్చు.

      నేను ముందర ఈ శ్లోకానికి శర్మ గారు కూర్చిన పాఠం వ్యాకరణాన్ని అనుసరించి కావాలనే మొదట్లో సరిదిద్దలేదు, అడిగిన మేరకే భావార్థాన్ని అన్వయించడం జరిగింది.

      ఇప్పుడు అవసరం పడింది కనుక ఇందులో ఉన్న మొదటి తప్పు- శర్మ గారి పాఠం లోనూ, ఇతరేతర వందలాది ఇంటర్నెట్ పాఠాల్లోనూ కొట్టొచ్చినట్లు కనపడుతున్న తప్పు- సేవత్వం అనే శబ్దం. అసలక్కడ లక్షణార్థకమైన ఆ శబ్దం అన్వయించనే అన్వయించదు. రాజా వహ్ని గురు స్త్రీలకు సంబంధించి ఏం చేయమంటున్నాడు కవి? అనేది చూడాలి. సేవించాలంటున్నాడు, ఎలా? మధ్య భావేన/ మధ్య మార్గేన మధ్యస్థ భావం వహించి లేదా మధ్యస్థ మార్గం వహించి. మరి సేవత్వం లో క్రియ ఎక్కడుంది?

      కనుక అది ధాతు రూపం అని ఎరుగవలె. సేవ్యతాం, సేవ్యేతాం, సేవ్యంతాం అని ప్రథమ, ద్వి, బహు వచనాలకు సంబంధించిన ఆజ్ఞా పూర్వక ధాతువు- సేవింపబడవలెను, ఇద్దరు సేవింపబడవలెను, అనేకులు సేవింపబడవలెను. అని మూడు రూపాల్లో ఎదో ఒకటి ఉండాలి. ఒకరిద్దరు మాత్రం తమ తమ ఇంటర్నెట్ పాఠాల్లో సేవ్యతాం అని ఏక వచన ధాతువు ఇచ్చి ఉన్నారు కాని ఇక్కద రాజు, వహ్ని, గురు స్త్రియః అని ముగ్గురుండడం వల్ల, ఏక వచన ధాతువు కూడా తప్పే. సేవ్యంతాం అనే పాఠం సరైనది. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే- "సేవత్వం మధ్యభావేన" అనేది వ్యాకరణ దోషం. "సేవ్యంతాం మధ్య భావేన" బదులు మొదట్లో ఎవరో తప్పు దిద్దడం వల్ల, గతానుగతికో లోకః అయ్యుండవచ్చు, ఇంటర్నెట్ నిండా కాపీ పేస్టుల వల్ల.

      అత్యాసన్నాః వినాశాయ
      దూరస్థాః న ఫలప్రదాః
      సేవ్యంతాం మధ్య భావేన
      రాజా వహ్ని గురుస్త్రియః

      రాజా వహ్ని గురు స్త్రియః వినాశాయ అత్యాసన్నాః , తే రాజా వహ్ని గురు స్త్రియః దూరస్థాః ఫల ప్రదాః న, తే రాజా వహ్ని గురు స్త్రియః మధ్యభావేన సేవ్యతాం. ఇతి. అన్వయక్రమం.

      రాజు, అగ్ని, గురు స్త్రీలు వినాశనం కొరకే అత్యాసన్నులౌతారు, అంటే వినాశనం దాపురించినప్పుడు మనం వారికి అత్యాసన్న స్థితికి చేరుకుంటాము. అలాగే, రాజు, అగ్ని గురుస్త్రీలు దూరస్థాః దూరంగా ఉంచబడినప్పుడు, ఫలప్రదాః న- ఫలప్రదులు కారు, అంటే యే ఫలితాన్ని ఇవ్వరు అని. చివరగా, రాజు, అగ్ని, గురు స్త్రీలు మధ్యభావేన సేవ్యతాం అంటే మధ్యస్థ మార్గంలో సేవింపబడుదురు గాక అని తాత్పర్యం.


      ఇంత చెప్తే కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫికల్ట్ అని ఇంతకు ముందు పైపైన చెప్పి వదిలేశానన్న మాట.

      Delete
    5. ఆహా! ఎన్నాళ్లకెన్నాళ్లకు తెలుగు బ్లాగులోకంలో నాటి ప్రతిభాపాటవాలు బయటపడినాయి!

      Kudos to vishnuji and to Sharmaji for asking this !


      Cheers
      జిలేబి

      Delete
    6. 🙏

      పైన వ్రాసిన సమాధానంలో, శ్లోకంలో "సేవ్యంతాం" అని సరిగానే వ్రాసినాను కానీ క్రింద అన్వయక్రమంలోనూ, తాత్పర్యంలోనూ "సేవ్యతాం" అని పొరపాటు దొర్లింది. అన్నిచోట్లా "సేవ్యంతాం" అని చదువదగినది. పొరపాటునకు క్షంతవ్యుడను.

      Delete
    7. డా. విష్ణు నందన్9 June 2023 at 16:07
      డా.విష్ణు నందన్9 June 2023 at 16:58
      విష్ణు నందన్ గారు,
      వందనం.
      పృధివ్యా త్రీణి రత్నాని
      జలమన్నం సుభాషితం
      అని చెప్పిన చాణుక్యులంటే చిన్న మమకారం. వారు చెప్పిన సుభాషితంలో గురువు గురించి ఇలా చెబుతారా? అని అనుమానమొస్తే జరిగిన కతది. ఇప్పటికే సంస్కృతం మృతభాషగా జమకట్టేసేరు. తెనుగు కూడా ఆ జాబితాలో చేరిపోయేకాలం రాకుండా చెల్లిపోవాలని కోరిక. ఇప్పుడిప్పుడే చిన్నవాళ్ళలో సంస్కృతం నేర్చుకోవాలనే కోరిక కలుగుతున్నట్టుంది. మా తరానికి పొట్ట తిప్పలతో సరిపోయి నేర్చుకోలేకపోయాం ! అభిమానం మాత్రం చచ్చిపోలేదు. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చినందుకు క్షంతవ్యుడిని.
      కుప్పుసామయ్యరు మేడ్ డిఫికల్ట్ కాలంవారా? మరోసారి వందనం.
      ధన్యవాదాలు.

      Delete
    8. విష్ణు నందన్ గారు,
      మరచాను టపాలో కూడా సరిచేసాను.
      ధన్యవాదాలు.

      Delete
  4. శ్రీమాన్ శ్యామలీయం వారు,
    శ్రీయుతులు విష్ణునందన్ వారు

    తాత గారి ప్ర్రశ్న సందేహాన్ని తీర్చేరని భావిస్తాను. దీనికి పైనను ఏమైనా సందియములున్నవా? దయచేసి తెలుపుడీ.
    వాటికి కూడా జవాబులు పై యిరువురు యిచ్చెదరు.


    ఇట్లు
    జిలేబి జీరో నాలెడ్జు

    ReplyDelete
    Replies
    1. Zilebi8 June 2023 at 16:12
      అనుమానం అడిగితే పొద్దుటినుంచి పత్తా లేకుండా పారిపోయావు.ఇప్పుడు సందేహ నివృత్తి అయ్యాకా పెద్ద వీరకత్తెలా ( వీరకత్తి, అంటే మరో అర్థం ఉందిలే) తయారయ్యావు వారు చెబుతారు వీరు చెబుతారని. సముఖం లో నీ తడికి రాయబారమేంటీ :)

      /జిలేబి జీరో నాలెడ్జు/
      ఇదేదో ముందే చెప్పచ్చుగా

      Delete
    2. నిజాన్ని ఒప్పేసు కుంటే కూడా తప్పేలా వుంది.

      మరీ చోద్యమండీ తాతగారు. సరే జిలేబీ ఫుల్ నాలెడ్జు ఓకేనా :)

      ఎటులైనను మీ సమాధానాలు తీర్చగల ఆసాములు వారిరువురే.

      అందులోను శ్రీయుతులు విష్ణువారు మరీ దిట్ట.

      కావున మీ సరి కొత్త ప్రశ్నలకు వేచి వుండుడీ సందియములు అతి త్వరలోనే తీర్చబడును.


      నాది కూడా ఓ సందేహం వుంది.
      లోభీ పరమో దాతః ఈ పద్యానికి ఫుల్ తెలిస్తే చెప్పండి. It starts something like కృపణేన... ,( not sure forgot old age you see ...)





      ఇట్లు
      జిలేబి ఫుల్ నాలెడ్జు

      Delete
    3. Zilebi8 June 2023 at 17:39
      / తప్పేలా వుంది./పాల ”తప్పేలా” ఉంది :)
      /జిలేబి ఫుల్ నాలెడ్జు/
      /జిలేబి జీరో నాలెడ్జు/ రెండూ నిజం కావు. :)

      Delete
    4. హాఫ్ నాలెడ్జ్ అంటే సరిపోతుందేమో మధ్యస్ధంగా 😉?

      Delete
    5. విన్నకోట నరసింహా రావు9 June 2023 at 07:35
      అంతేనేమోనండీ :)
      బుజ్జమ్మా! నేననలా!!!

      Delete
    6. విన్న కోట వారు మధ్యలో baked వదిలిపెట్టేరు :)

      Delete
    7. baked అన్నది silent అన్నమాట.
      😁

      Delete
    8. కాంత్9 June 2023 at 19:25

      జిలేబి ఫుల్ నాలెడ్జు అంటే లార్డ్ లబక్ దాస్;
      జిలేబి జీరో నాలెడ్జు అంటే జిల్ జిల్ జిల్ జిలేబి రాణి.

      Delete
  5. “జిలేబి” గారు (9 June 2023 at 16:31),
    // “ Kudos to vishnuji and to Sharmaji for asking this ! “ //

    హేమిటో “జిలేబి” గారు, విశ్వనాథ వారు చెప్పినట్లు విష్ణుశర్మ / ‘సంస్కృతం’ / చదువు అనిపిస్తోంది.
    😁😁
    (సరదాగా అంటున్నాను, ఏమనుకోకండి 🙂🙂)

    ReplyDelete
    Replies
    1. రండి రండి మీ కోసమే ఎదురు చూస్తున్నాం. అక్కడ మా బ్లాగు లో మీ జవాబు కై ఎదురు చూపులు చూస్తోందో కా మింటు :)



      నారదా
      జిలేబి

      Delete
  6. కాంత్9 June 2023 at 19:22

    జిలేబి గారడిగిన శ్లోకం (కృపణేన సమోదాతా) గూగులమ్మ నడిగితే చూపించింది:
    https://telugusodara.blogspot.com/2009/07/blog-post.html

    ReplyDelete
    Replies
    1. కాంత్9 June 2023 at 19:22
      కాంత్ జీ
      మీరిటువంటివి చెప్పి ఉపయోగం లేదా కలహకారిణికి. కలహానికి ఏమైనా సాయం చేయండి, ఎగేసుకు వచ్చేస్తుంది.
      అందుకే ఎవరో కలహాల్రాణి పేరెట్టేసేరుగా, జగడాలమ్మి పేరుందండి. నిత్యంగా ఉండేది చిన్నగా ఉండే పేరెడుదురూ మీకు పుణ్యముంటుందీ! :)
      ధన్యవాదాలు.


      Delete
  7. శర్మ గారు,
    ఎవరో గతంలో “తంపి” అని ఓ పేరెట్టారని గుర్తు. పొట్టిగా బాగానే ఉందిగా పేరు?

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు10 June 2023 at 11:58
      నిజమేనండి కాని జనం వాడటం లేదు, మరచినట్టున్నారు, ఈ పేరు. సహస్రనామాల్లా అన్నిపేర్లుంటే ఏ పేరని గుర్తుపెట్టుకూంటారు? అందుకే కోపమొచ్చినప్పుడల్లా రోజుకో కొత్త పేరెడుతున్నట్టుందండీ! :)

      Delete
  8. తింబు - ఎలా ఉంది?
    దీని అర్థం చెప్పిన వాళ్ళకి వెయ్యి వీరతాళ్ళు.

    ReplyDelete
    Replies
    1. bonagiri10 June 2023 at 12:30
      తింగరి బుచ్చి పాతకాలం పేరేనండీ! ఏమైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ యు నో. బుజ్జమకి వెయ్యండి వీరతాళ్ళు

      Delete