Wednesday, 26 August 2020

కర్ణుడు - భారతయుద్ధ మొదటి పదిరోజుల సేనా నాయకత్వం.

కర్ణుడు - భారతయుద్ధ మొదటి పదిరోజుల సేనా నాయకత్వం.

కురు సభ జరుగుతున్న సమయంలో దుర్యోధనుడు భీష్ముని చేరి తాతా! యుద్ధం రాబోతోంది. అటువైపు ఎవరెంతవారో చెప్పు, మా నాన్నకి పాండవులంటే భయం, అన్నాడు. విన్న భీష్ముడు పాండవ పక్షం వారి గురించి చెప్పాడు. మరి మా వైపు వారి గురించీ చెప్పూ అనగా, భీష్ముడు, నువ్వు అడుగుతావు నేను ఉన్నది ఉన్నట్లు చెబుతాను, అది నీకు, నీ స్నేహితులకి నచ్చదు, నాకెందుకొచ్చిన తలనొప్పి చెప్పు, మధ్యన, అన్నాడు. విన్న దుర్యోధనుడు చెప్పు తాతా అని బ్రతిమలాడేడు. భీష్ముడు, కౌరవుల గురించి ఎవరెంతవారో చెబుతూ, కర్ణుడు అర్ధ రధుడు అని చెప్పేరు. విన్న కర్ణుడు, ముసలితనంతో నీ మతిపోయి మాటాడుతున్నావని భీష్ముని పలురకాలుగా నిందించి, నువ్వు యుద్ధ రంగంలో నిలబడినంతకాలం నేను ఆయుధం పట్టి యుద్ధం చేయనని ప్రతిన చేసి సభ విడిచిపోయాడు. షరా మామూలుగానే దుర్యోధనుడు కర్ణుని అలక తీర్చడానికి వెనకపోయాడు.

ఈ సంఘటన జరిగేనాటికి భీష్ముడు సర్వసైన్యాధిపతీ కాదు, కర్ణుడు అక్షౌహిణి సైన్యాధిపతీ కాదు. ఆ తరవాత కాలంలోనే ముందు భీష్ముని సర్వసైన్యాధిపతిని చేసి ఆతరవాతే మిగిలిన సేనాపతులను దుర్యోధనుడు నియమించాడు, అందులో కర్ణుడొకడు. ఆ నియామకాలకి ఆక్షేపణ ఎవరినుంచీ లేదు. అంటే యుద్ధం చేయడం వేరు సైన్యాధిపత్యం వహించడం వేరు అని తెలుస్తోంది కదా! యుద్ధం చేయటం లేదు నేను సైన్యాధిపత్యం వహించడం ఏంటని కర్ణుడు అడగలేదు, యుద్ధం చెయ్యనివాడు సేనాధిపతా అని భీష్ముడు ఆక్షేపించలేదు. అన్నీ తెలిసిన దుర్యోధనుడు కర్ణునికి సేనాధిపత్యం ఇచ్చాడంటే, యుద్ధం చేయడం వేరు, సైన్యాధిపత్యం వహించడం వేరని తెలుస్తోంది కదా!

అంటే  భారత యుద్ధం మొదటి పదిరోజులు కర్ణుని అక్షౌహిణి సేనను కర్ణుడే నడిపాడు, యుద్ధం చేయలేదంతే!  


విన్నకోటవారి ,
భారతం మీద మరో ప్రశ్నకు చాలా కాలంగా జవాబీయలేదు. అది "అంపశయ్య మీద చేరేనాటికి భీష్ముని వయసెంత?"  ప్రశ్న మొత్తం భారతం తిరగెయ్యాలి, పెద్ద జవాబు అందుకే చెయ్యి చేసుకో లేదు.

133 comments:

  1. థాంక్స్, శర్మ గారు.
    మీరన్నది నిజమే లెండి. తాము యుద్ధం చేయకుండా తమ సేనను నడిపించడం ఆధునిక కాలంలో మన మిలటరీ జనరల్స్ చేసే పనే కదా. అలాగే జరిగుండ వచ్చేమో కురుక్షేత్రంలో? నిన్న బోనగిరి గారు అన్న ఉపసేనానికి కర్ణుడు సూచనలు ఇస్తూ తన అక్షౌహిణిని నడిపించుంటాడు .... పదకొండో రోజున తను స్వయంగా పోరాటంలోకి దిగేటంత వరకు. అంత భారీ యుద్ధం ఆ మాత్రం ప్రణాళిక లేకుండా ఎలా నడుస్తుంది లెండి.

    ReplyDelete
  2. యుధ్ధము సేయని కర్ణుడు
    యుధ్ధృతిగా సేననడిపె, యుధ్ధధరణిలో
    యుధ్ధతులై తెగటార్చరు
    బుధ్ధిగలిగి పాండుసుతులు పోరుదలిర్పన్ .

    ReplyDelete
    Replies

    1. రాజావారు,
      అంతేనంటారా?

      Delete
    2. ఐదూళ్ళు ఇచ్చి యుంటే ఏమి
      క్షత్రీయులున్ వారి నెటుల గాఁచేది లోకము
      హస్తిన కొర్చి గాంధారము, సింధుదేశము, అంగ వంగ దేశము..!

      Delete
    3. శర్మ గారు..
      ఒక భారతం విషయంలో అవగతమయ్యేదేమంటే.. కొంత మందికి కేవలం రాజ్యాకాంక్ష ఉంటుంది. వారు వారి బలగాన్ని సమాయత్తం చేసుకుని రాజ్యాలను వారికి ఆధినంలో తీసుకుని సామంతం పాటించేవారు. ఒకలాగ చూసుకోవాలంటే.. భీష్మ పితామహుడు కౌరవులు పాండవులు ఇరువురు కూడా హస్తినపురాన్ని అలాగే వారి వారి కుటుంబాలను కూడా ఆస్తిగా భావించి సరిసమానంగా రాజ్య పాలన గావిస్తే లోక కల్యాణం జరిగేదని.. కాని.. దుర్యోధనుడు అందుకు వ్యతిరేకంగా తనకే హస్తిన చేజిక్కాలని పంథం మీద తన రాజ్యం తో పాటు ప్రాణస్నేహితుడైన కర్ణుణ్ణి, సమస్త బంధుజనాలను కురుక్షేత్రం యుద్ధం మూలాన పోగొట్టుకుని చివరికి ఒంటరిగానే తనువు చాలించాల్సి వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ సైతం ఇరు వర్గాల నడుమ సమన్వయ దృక్పథం కుదుర్చాలని చేసిన ప్రయత్నం సైతం విఫలమయ్యింది. అటు విదురుల వారు కూడా తమవారి ఉన్నతినే కోరుకున్నారు.

      దూతగా వారడిగిన ఐదూళ్ళు ఇచ్చేసి ఉంటే బహుశ భారతం వేరేలా ఉండేదేమో..

      ఒకటి మాత్రం నిజం ఆచార్య..
      కొంత మందికి ఐశ్వర్యమంటే కేవలం ఆస్తి మాత్రమే అనుకుంటారు, కాని వారు దేనిని మరచిపోతారంటే ఆ ధనాగారం తో పాటు తనకు తోడుగా ఉండే రక్తసంబంధికులు కూడా ఆ ఆస్తిలోనే భాగమని. కాని దుర్యోధనుల వంటి వారికి కేవలం రాజ్యప్రీతి తప్ప బంధుప్రీతి లేదని. మరొక విషయం.. ఈ రణాన్ని గెలవటానికి శకుని కపటానికి పావులై గాంధార రాజ్యం (ఆఫ్ఘనిస్తాన్), సింధుదేశం (పాకిస్తాన్), అంగ వంగ దేశము (ఈస్ట్ [బాంగ్లాదేశ్] వెస్ట్ బెంగాల్ బీహార్) సైతం వారికి తోడు రావటం ఒకింత ఆశ్చరయానాకి కలుగజేస్తుంది. ఆ లెక్కన చూస్కుంటే బహుశ కురుక్షేత్రం మొత్తం బలగాలతో కిక్కిరిసి పోయేదేమో ఇరువైపుల సైనికులతో.

      Delete
    4. జూదంలో గెలుచుకున్నాక పాండవుల రాజ్యమంతా ధుర్యోధనుడి సొంతమే కదా! ఐదు ఊల్లు ఇవ్వాలా వొద్దా అనేది అతని ఇష్టం. అంతేగానీ .. ఇవ్వకపోవడం ధుర్యోధనుడి తప్పెలా ఔతుంది? సరే! తమ్ముల్లు కదా.. పంచితీరాలి అనుకుందామంటే, పాండవులేం.. కౌరవులకి సొంత తమ్ముల్లుకాదు కదా! ఇక దీన్లో కౌరవులతప్పేమిటి? వారికి సాయమొచ్చినవారి తప్పేమిటి? ఇతరుల సొమ్ము ఆశించి భంగపడడమే కాక, ఆ ఇగోతో యుధ్ధానికి, తద్వారా లక్షలాదిమంది ప్రాణాలు పోవడానికి కారకులైన పాండవులదేకాదా తప్పంతా!

      వందమందివున్నాగానీ, తమ వంశంపేరు కురు గానే వుంచుకున్న కౌరవుల బంధుప్రీతి గొప్పదా? ఐదుగురాగా ఉన్న తమ వంశాన్ని పాండవులుగా మార్చుకున్న పాండవుల బంధుప్రీతి గొప్పదా?

      Delete
  3. నా మరొక ప్రశ్న అంపశయ్య నాటికి భీష్ముడి వయస్సు గురించినది ఒకటి (మీకు బాగా గుర్తుందే, శర్మ గారు?).

    మరొక సందేహం కూడా ఉందండోయ్. అదేమిటంటే అర్జునుడు అన్ని బాణాలతో ఎందుకు కొట్టాడు భీష్ముడిని అని? ఆలోచిస్తే నాకు అనిపిస్తున్నది ఏమిటంటే ... ఇచ్ఛామరణం వరం ఉన్న భీష్ముడి శరీరంలో ఎన్ని బాణాలు గుచ్చినా కూడా భీష్ముడు మరణించడు ఆయనే కోరుకుంటే తప్ప. ఆ బాణాలు తీసేసి గాయాలకు మందు పూయించుకుని మళ్ళీ పోరుకు తయారై పోయుండే వాడు ఎన్నిసార్లైనా కూడా. అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో తిరిగి లేవకుండా పడిపోయేటట్లు శరీరమంతా బాణాలు గుచ్చుంటాడు అర్జునుడు. తాము ఎలాగూ చంపలేరు కాబట్టి కనీసం యుద్ధంలో మరి కొనసాగకుండా ఆ విధంగా భీష్ముడిని నిరోధించినట్లైంది.
    కరక్టేనంటారా 🤔 ?

    (ఏమైనప్పటికీ భీష్ముడిది దారుణమైన అంత్యదశ అండీ)

    ReplyDelete
    Replies
    1. ఒక్కోసారి అనిపిస్తుంటుంది నాకు.. అలా సాధారణ మనిషికి కూడ ఏ అనీస్తిషియలు లేకుండ ఉత్త మూలికా ఔషధాలతోనే నయమయ్యి తిరిగి యుద్ధానికేగిన వారు ఆ కాలం లో చాలానే ఉన్నారు. మూర్ఛ పోయిన సౌమిత్రిని అంజిబాబు సంజీవని దెచ్చి కాపాడినట్లు.. అపుడెంత పెద్ద గాయమైనా ఓర్పు, నయమైపోయే గుణం ఉండేది కదా.. కాంటెంపోరరి ఇష్యు నే కొంచం వెనక్కి నెట్టి చూసుకుంఠే ఒహవేళ మహాభారత కాలం లోనే ఏ కరోనా నో, స్వైన్ ఫ్లూ నో, నిఫా నో, సార్స్ లాటి మహామారిలు వచ్చి ఉంటే అపుడు ఎలా డీల్ చేసి ఉండేవారో ఏమో.. ఇపుడైతే ఏ హైడ్రాక్సి క్లోరోక్విన్, ఫావిపిరావిర్, కొవాక్సిన్, కోవిషీల్డ్, అస్త్రా జెనేకా, సైనోవాక్, రెమెడెసెవిర్ లాటి క్యాండిడేట్ ట్రయల్స్ జరుగుతున్నాయి కాని.. వయసు రిత్య మాటలాడుకున్నా భీష్ముని వయసు భారత యుద్ధం నాటికి ప్రపౌత్రులు కలిగి ఉన్నారని అంటారు కనుక ఓ నూట ఇరవై రేంజ్ అనుకోవచ్చు.. అంత వయసు పైబడ్డా కళ్ళద్దాలు లేకున్నా తీక్షణ చూపు, వణుకుడు లేని కండ బలం, గాయమైనా పసరు ఎసరుతో నయమయ్యే ఇమ్యూనిటి, ఒక చిన్న గాయమైతేనే ఆ వయసు వారికి డయాబెటిస్, హైపర్‌టెన్షన్, మయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్ వంటి కాంప్లికేషన్ మూలానా గాయం మానదు.. మరీ వయసు నిరాకరించే దశలో ఐతే బైపాస్ కూ సైతం సహకరించని దేహం ఉంటాయి.. కాని అన్ని బాణాలు (అవి కర్రవో, లేక అల్లాయి వో లేక గోల్డ్ వో తెలియదు..) గుచ్చినా భీష్మునికి అందివచ్ఛిన వరం మూలానే సజీవంగా ఉన్నారేమో.. ఇంకొక విషయం.. అర్జునుని బాణాల తాకిడికి ఏ ఒక్క విస్రా కూడా వాటి వాటి పనితీరును కోల్పోయి ఉంటాయి.. ఒక బ్రెయిన్ మినహాయించి.. అటువంటప్పుడు మల్టి ఆర్గాన్ ఫెల్యుర్ ఎందుకు కాలేదు.. అన్నేసి బాణాలు దేహాన్ని ఛిద్రం చేస్తే లోపల ప్రవహించే నెత్తురు సైతం బాణాల తాకిడికి చిల్లు ముంతలా కారి పోవటానికి సగటునా ఇట్ఠే సమయం పట్టదు.. బోన్ లో కూడ దిగినవి గనుక బోన్ మ్యారో పని చేయదు, కొత్త ఎరిథ్రోసైట్స్ జెనరేట్ కావు.. స్ప్లీన్ పంక్చర్ కనుక ఎరిథ్రోసైట్స్ డిసాల్వ్ కావు.. బేసల్ బయోకెమికల్ రియాక్షన్ జరగనపుడు బాడి మొత్తం వెజిటేటివ్ మోడ్ లో.. బాడి సరిగా పని చేయకుంటే తద్వార బాణాలు రిబ్ కేజ్ ను డ్యామేజ్ చేసే ఉంటాయి.. కనుక స్పైనల్ కార్డ్ దెబ్బ తిని సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ మూలాన బ్రెయిన్ కి కూడా సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అయ్యే ఉంటుంది ఆచార్య.. కాని మీరన్నట్లు గానే భీష్ముడిది దారుణమైన అంత్యదశ. ఆ పైవన్ని సాధారణ మనషులకు.. ఎవరో అనట్లు.. అన్న దమ్ములు చిన్నప్పుడే సఖ్యతగా ఉంటారు.. పెద్ద వారైతే ఇరువురి మధ్య ఏదో ఒక తగాద మూలానా దూరమై పోతారు.. అదే అక్కాచెలెళ్ళైతే చిన్నపుడు విమూఖత చూపిస్తు.. పెద్ద పెరిగినాక దూరమైన కొలది వారి మధ్య సఖ్యత పెరుగుతుందని అంటారు.. మా అమ్మమ్మ చెప్పేవారు.. "బేటి హుఅ కోని జేరాంగ ఖా పీ లేణు.. బ్యోడి ఆవ కోని జేరాంగ ఓడ్ ప్యార్ లేణు.." అంటే కూతురు పుట్టక మునుపే మనకు నచ్చినట్లు తినటం, ఉండటం చేసుకోవాలి.. అనంటే.. కూతురు పుట్టాక తన బాగోగుల కోసం కూడబెట్టటం మొదలౌతుంది. అప్పుడు కూడా అంతే విచ్చల విడిగా ఖర్చు చేస్తే మంచిది కాదని హితవు.. అదే విధంగా కోడలు మెట్టినింటిలో అడుగిడక ముందే నచ్చిన బట్టలు, నగలు వేసుకోవాలి.. వచ్చినాక మంచి బట్టలు కట్టినా విలువైనవి తొడిగినా.. ఈ వయసులో ఎందుకు ఈ ఆర్భాటమని హేళన చేస్తారని హితువు.. అనగా ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే తిర్చుకోవటం సబబని ఆ ఉక్తి సారాంశం శర్మ గారు. ఎక్కువగా రెస్ట్ తీసుకుంఠు ఫ్లూయిడ్ కాచి వడబోసి ప్రతి మూడు గంటలకోమారు తాగుతు ఉండండి.. మీ ఆరోగ్యం జాగ్రత

      Delete
    2. శ్రీధర్ గారు,
      చాలా వివరంగా వ్రాశారు, బాగుంది.
      భీష్ముడి అంపశయ్య ఉదంతం విన్నప్పుడల్లా నాకూ ఇదే సందేహం వస్తుంటుందండీ so called Multi-organ Failure ఎందుకు అవలేదని.

      ఈనాటి మన డాక్టర్లకు అదొక favourite పదం ఏమో అనిపిస్తుంది
      - రోగి చనిపోయాడని ప్రకటించేటప్పుడు తరచూ వాడే పదం (నిజంగానో లేదా ఆ కారణం impressive గా ఉంటుందనో?) (అయినా మరణం అంటే మల్టి-ఆర్గాన్ ఫెయిల్యూరే కదా? ఏమో మరి మాబోటి అజ్ఙానులకు ఏం తెలుస్తుంది లెండి?).


      భీష్ముడి విషయం మాత్రం -- అంత భయంకర అంపశయ్య మీద ఉండి కూడా పూర్తి స్పృహలో ఉండడం, సూక్ష్మబుద్ధి అలాగే పదునుగా ఉండడం, రోజూ ఎవరైనా చెబితే యుద్ధ విశేషాలు వినడం - స్పందించడం, చివర్లో విష్ణు సహస్రనామం బోధించడం -- ఏమిటో విష్ణుమాయ. మహానుభావుడు 🙏.

      Delete
  4. // “మీరెండో ప్రశ్నకి బామ్మ సమాధానం చెబుతుంది ...” //

    భీష్ముడి వయసు గురించా?
    సర్లెండి, వారు తన వివరాలే చెప్పరు, మీరు బలే వారండీ శర్మ గారూ.

    “ఎవరో. ఏ ఊరో” అన్న పాత పాట గుర్తొస్తుంటుంది వారి ప్రస్తావన వచ్తినప్పుడల్లా 🙂.

    ReplyDelete
    Replies
    1. వారి వివరాలు తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదండి. ఈ దోబూచులాట బాగానే ఉంది కదా, అలాగే కొనసాగనివ్వండి.

      Delete
    2. హ.. మీరు నిజమే చెప్పారు ఆచార్య.. గురువు గారికి ఈ విషయం తెలిసి కూడా సరదాగా చెప్పి ఉంటారు లెండి. నాకు స్వతహ గా జిలేబి ఇష్టం ఉండదు.. ఎపుడైన తినాలనిపిస్తే మోతిచూర్ లడ్డు తింటా.. అంచేతనే జిలెబి వారిని సైతం వారి గద్యపద్య కంద బచ్చంప్స్ ఇట్టే సునాయాసంగా అశనిపాతమలే విరిచేసి ఉత్పల మాలలా కట్టి పెడతారని బిజ్లి నే బిజిలే అమ్మణ్ గా రూపు మార్చి అంటుంటాను.. క్షమాపణలతో

      Delete
    3. బోనగిరిగారు,
      బలే కని బట్టేసేరు. డొల్ల జిలేబీ కి ఇంతకు మించిన సీనొద్దు.దిష్టి తగులుద్ది :)

      Delete
    4. శ్రీధర్ గారు,
      వెల్లుల్లి కంపు జిలేబీ ఎవరికి ఇష్టమండి :)

      Delete
  5. ' విల్లొదిలె ' శిఖండి గనగ ,
    మల్లీ పోరుకు తలపడు మాట తలెత్తన్ ,
    అల్లాటప్పా కాదుగ ,
    విల్లందిన యతని గెలుచు వీరుండేడీ !

    విశిఖవృష్టిదవిలి వెలవెలబో డస్త్ర
    సన్యసమున పోరు సమసెగాక ,
    భీష్ముడయ్యె నతడు భీషణ ప్రతినలన్ ,
    చావు వెఱచు నతని చాయ జనగ .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      నిజమే చెప్పేరు. కర్ణుడో పెద్దపోటుగాడనేసుకుంటోంది జిలేబీ :)

      Delete


  6. భీష్ముని వయస్సు ౧౨౮ సంవత్సరాలు.

    ReplyDelete
    Replies
    1. సమాచారం ఇచ్చారే ! సంతోషం, థాంక్స్ "జిలేబి" గారు.
      Calculation or Source, please??

      Delete


    2. అబ్బే ఇవ్వమండీ. కాదంటే ప్రూవ్ చేయండి కాదని. అంతే.


      జిలేబి

      Delete
    3. జిలేబీ‌ గారూ,

      భీష్ముని వయసు భారతయుధ్ధం‌ నాటికి 128 సం॥ కాదండీ. కానే‌ కాదు.

      భారతయుధ్ధం నాటికి శ్రీకృష్ణుని వయస్సు 90 సం॥ ఆ తరువాత 36 సం॥ కు 126సం॥ వయస్సులొ శ్రీకృష్ణుడు అవతరసమాప్తి కావించాడు. శ్రీకృష్ణుని కన్నా ధర్మరాజు గారు కేవలం ఒక సంవత్సరం పెద్ద.

      ధర్మరాజు గారు భీష్మునికి మనవడు కదా. ధర్మరాజు జననం‌ నాటికి ఆయన తండ్రి హస్తినాపురపాలనం‌ కొన్నేళ్ళు చేయటమూ, ఆతరువాత మరికొన్నేళ్ళుగా వనవాసంలో ఉండటమూ జరిగింది. ఆ పాండురాజు జననమే దౌష్యంతి వంశ విచ్చేదంబు గావచ్చిన సత్యవతీ దేవి పట్టుదలతో దేవరన్యాయానికి భీష్ముడు ఇయ్యకొని వ్యాసుణ్ణి ప్రార్ధించిన పిదప జరిగింది. అప్పటికే సత్యవతీపుత్త్రులు యౌవనవంతులై దురదృష్ణవశాత్తు మరణించిన పిదప ఆ దేవరన్యాయప్రయోగం జరిగింది. ఆ సత్యవతీ దేవిని శంతనుడు వివాహం ఆడే‌ నాటికే యౌవనశాలి నాటి దేవవ్రతుడూ అప్పటినుండీ భీష్ముడూ‌ ఐన మహాత్ముడు. శంతనునికి యువప్రాయంలో గంగయందు జనించిన వాడు దేవవ్రతుడు.శంతనునికి మలివయస్సులో సత్యవతిని తెచ్చి వివాహం చేసినవాడు దేవవ్రతుడు.

      దీనిని బట్టి విచారించగా, భీష్ముడి వయస్సు రెండువందలో ఎక్కువో‌ ఐనా ఆశ్చర్యపోనవసరం‌ లేదు. వందచిల్లర మాత్రమే‌ భారతయుధ్ధం నాటికి అన్నది పొసగని మాట. మనవడైన ధర్మరాజే వందకు దగ్గర అవుతుంటే తాతగారి వయస్సు కేవలం‌ మరొక ఇరవై ముఫ్ఫై పెచ్చు అంటే ఎలాగండీ?

      నేను ఎక్కడో‌ చదివాను. భీష్మాచార్యులు 410 సం॥ జీవించారని.

      అదలా ఉంచండి. దేవాపి, శంతన బాహ్లికులు సోదరులు. వారిలో దేవాపి చిరంజీవి. బాహ్లికుడు భారతయుధ్ధంలో మరణించాడు. ఇప్పుడు వీరి వయస్సు గురించి ఆలోచించండ్ మరి.

      Delete
    4. జిలేబీ,
      అప్డీ చొల్ల మాడాదు. ఈ ట్రిక్కులకి కాలం చెల్లింది :) ప్రూవ్ ఇట్

      Delete
    5. // “.... ప్రూవ్ చెయ్యండి కాదని” //

      ఎదుటివాడి మీద నిరాధారంగా కేసు వేసి .... నువ్వు నిర్దోషివని ప్రూవ్ చేసుకోవలసిన బాధ్యత నీదే, నువ్వు దోషివని ప్రూవ్ చెయ్యాల్సిన బాధ్యత మాకేమీ లేదు .... అన్నట్లుంది.

      Delete
    6. ఈ జిలేబీ ట్రిక్కులకి కాలం చెల్లిపోయింది సార్!

      Delete
    7. ఏమిటో, శర్మ గారికి జిలేబి గారి మీద కోపం వచ్చినట్టుంది.

      Delete
    8. బోనగిరిగారు.
      జిలేబి మీద కోపమా? నెవర్! జిలేబిని మరీ పొగిడేస్తే దిష్టి తగిలి పడిపోద్దండి బాబూ! పదేళ్ళనించి ఇదలవాటే !! దిష్టి తగిలి పొద్దుటినుంచి మళ్ళీ కనపళ్ళా. తలనొప్పొచ్చిందో ఏమో!! అయ్యరుగారే అవస్థ పడతన్నాడో! :)

      Delete
  7. విన్నకోట ఆచార్య వర్య..
    కృష్ణుని అవతార కాలం: ౯౧ సం.
    యుధిస్టిరుని వయసు: ౫౭ సం.
    భీముని వయసు: ౫౬ సం.
    అర్జునుని వయసు: ౫౫ సం.
    నకుల సహదేవులు కవలలు వయసు: ౫౩ సం.
    భీష్ముని వయసు: ౧౧౯ సం. ౬ నె. (దక్షిణాయనం కలుపుకుని)

    ప్రూఫ్: గంగ శాంతను కు దేవవ్రతుని అప్పగించే నాటికి అతని వయసు ౧౬ సం. పరశురాముని ట్రెయినింగ్ పీరియడ్ ముగిసే నాటికి ౨౦ సం. అప్పటి నుండి మరో ౧౮ ఏళ్ళ తరువాయి చిత్రాంగద విచిత్రవీర్యల జననం.. అనక మరో ౨ సం. తరువాయి పాండు ధృతరాష్ట్రుడు, వెదురుడు జన్మిస్తారు.. అపటికి భీష్ముని వయసు ౪౦ సం. ప్రతిన పూనిన తరువాయి మరో ౧౮ ఏళ్ళకు పాండు కోరోనేషన్ సెరిమనె. అపటినుటడి మరో ౪ ఏళ్ళ కు యుధిష్టిరుని జననం.. అనగా మరో ౨౨ ఏళ్ళు కలగలిపెథే అపటికి ౬౨ సం. హస్తినకు మొదటి సారి యుధిష్టిరుడు ౧౩ ఏళ్ళకు వస్తారు అల ద్రోణుల వారి నుండీ వీలూవిద్య నేర్చుకుని రావటానికి పాండవులకు ౧౨ ఏళ్ళు. మొత్తం అపటికి భీష్మూల వారికి ౮౭ సం. వారణావత లాక్షా గృహములో తయారు చేయటానికి ౧ సం. వారు అందులో ఉన్నది ౧ సం., మంటగలిశాక అడవిలో ౧ సం., ద్రుపదుని ప్రాసాదంలో ౧ సం., అంటే ద్రౌపది పెళ్ళినాటికి దేవవ్రతుని ఏజ్ ౯౧ సం. ఇంద్రప్రస్థంలో నివాసం ౧౩ ఏళ్ళు. ఆ నాటికే ౧౦౫ సం. ద్యూతక్రీడ సమయంలో పాండవులు ఓటమి పొంది ౧౨ సం. + ౧ సం. అజ్ఞాతం పూర్తయే నాటికి భీష్ముల వారి వయసు ౧౧౮ సం. కురుక్షేత్ర యుద్ధం నెగోషియేషన్ ఫేయిల్ అయ్యి ఇహ యుద్ధం అనివార్యమని నిర్ధారించే సమయం ౧ సం. పట్టింది. అపటికి భీష్ముని వయసు ౧౧౯ సం. దక్షిణాయనం కోసం వెయిట్ చేసి హితబోధ చేసి కాలం చేసేనాటికి మరో ౬ నె.

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!

      ఎక్కడో డీటెయిల్స్ మిస్సవుతున్నాయి.

      Delete
    2. అంకెల్ని తెలుగులో రాస్తే మీలాంటి పండితులకేగానీ, మాబోటి పామరులకెలా అర్ధమౌతుందో చెప్పండి?

      Delete
    3. చిరు కలల వారికి మరియు రావు వారికి కూడా.. నా మొబైల్ లో నేను తెలుగు భాష సెట్ చేస్తే వెనువెంటనే న్యూమరికల్ కీ ప్యాడ్ తెలుగు సంఖ్యలతో ప్రత్యక్షమౌతోంది.
      ౦, ౧, ౨, ౩, ౪, ౫, ౬, ౭, ౮, ౯. ఏ భాష కైనా ఆయా భాషలో సంఖ్యలు లేవనుకోండి.. వాటికి సాధారణ సంఖ్యలే ఉంటున్నాయి.

      శర్మ గారికి.. ఈ విషయాలన్ని నా చిన్నపటి నుండి మా అమ్మమ్మ వారి తమ్ములం గారు అనగా మా అమ్మ వారి మేనమామ గారు వారి దగ్గరున్న సంక్షిప్త భారత పుస్తకం లోనివి. నా చిన్నపుడే ఆ పుస్తకం ఆరు చెదలు మూడు చీమలతో వెలవెల బోయేది. మరి మూడున్నర దశాబ్దాల తరువాయి కాలం.. అందులోని వే నేను ఇక్కడ ప్రస్తావించటం జరిగింది. నా పదవ ఏటనే ఆ పుస్తకం కాల గర్భం లోకి చెదల ఉదరంలో కలసి పోయింది.. అందుకే నాకు మా అమ్మమ్మ గారు తెలిపిన విషయాలనే పొందు పరిచాను. పైగా ఇదే అనే [బారాకాఫి (గ్యారంటీ)] నేను ఇవ్వలేను. నాణ్ చొల్ల మాటే ఆశార్య..!

      Delete
    4. శ్రీకృష్ణుడు ధర్మరాజు కన్నా ఏడాది చిన్న అండీ. భారతంలో ఆయన ఎప్పుడూ ధర్మరాజుకు పాదాభివందనం చేయటం గమనార్హం.

      Delete
    5. శ్రీధరా!
      అమ్మమ్మ చెప్పిన మాట నిజానికి దగ్గరగా ఉన్నట్టు ఉంది. కొద్దిగా సరిజేయాలె. పాత పుస్యకాలని శ్రద్ధ చేయకపోతే విలువైన విషయాలు కోల్పోతాం.

      Delete
    6. ఔనాచార్య మీరు చెప్పినది నిజమే.. భారత యుద్ధం నాటి వారి వారి వయసులను పొందు పరిచాను. మాధవుని అవతార కాలం ౯౧ అయ్యుంటుందని.. లేకుంటే పలు విధాలుగా కలియుగాంతం వరకు అవతార త్యాగం చేసే నాటికి ఏ నూట పాతిక పై చిలుకు సైతం ఉండ వచ్చు. ఆ కాలములో మునిజనుల తపస్య కాలమే వందల యేళ్ళుగా చెప్పుకునే వారు. కాస్త సంధిగ్దత.. మానవులం మైక్రోకాస్మ్ ఐతే దైవం మ్యాక్రోకాస్మ్ అంటారు కదా.

      Delete
  8. >> ...... కర్ణుని అక్షౌహిణి సేనను కర్ణుడే నడిపాడు, యుద్ధం చేయలేదంతే ....
    అదెలా సంభవమండీ?
    యుధ్ధరంగంలో మధ్యలో నిల్చుని సైన్యానికి ఆదేశాలు జారీ చేస్తూ పచార్లు చేయటం‌ కుదరదని నా అభిప్రాయం. యుద్దరంగంలో non-playing captains ఉండే అవకాశం లేదండీ. యుద్దరంగ ప్రవేశం చేసాక యుధ్ధం చేయవలసిందే కద. కేవలం నిరాయుధుడైన వాడికి ఇతరులను చేరుకుందుకు అవకాశం ఉంటుంది - ఎందుకంటే తాత్కాలికంగా యుధ్ధం మానినాడు కాబట్టి. కాని ఆయుధధారి కాకుండా యుధ్ధరంగం‌ కలయదిరగటానికి ఎవరూ‌ ఒప్పుకోరు కదా. యుధ్ధం చివరి ఘట్టంలో సంజయుడిని గమనించిన పాండవవీరులు అతడిపైకి వస్తే వ్యాసుడు విడిపించాడు కదా. దీనిని బట్టి యుధ్ధరంగంలో ఫ్రీడ్వెల్లింగ్ సాధ్యం కాదనుకుంటానండీ. యోధులకి support staff వారి వెంట వస్తుంది కాని వారిని కాపాడుకొనే‌ పూచీ ఆ యోధుడిదే.

    ReplyDelete
    Replies
    1. శ్యామలరావు గారు.
      యుద్ధం మొదలైన పదిరోజులలో యుద్ధ నియమాలు బాగానే పాటించారు. ఆ తరవాతే అవి దిగజారిపోయాయి. చివరిది సంజయుణ్ణి చంపబోవడం. ఆయుధం లేనివాడితో యుద్ధం ఎవరూ చేయలేదు. కర్ణుడు నిరభ్యంతరంగా యుద్దరంగం లో తిరగచ్చు. దెబ్బతగులుతుంది, చస్తానేమో అన్నవాడు యుద్ధానికే రాకూడదు.

      చిన్నచిన్న విషయాలు కూడా పూసగుచ్చినట్టు చెప్పిన వ్యాసుడు ఇంత పెద్ద విషయాన్ని చెప్పలేదంటే.....సేనాని యుద్ధ రంగంలో ఉండే ఆదేశాలివ్వక్కర లేదు. యుద్ధం చేయడం సేనకు అదనపు ప్రోత్సాహం. మీరు కర్ణుడు మొదటి పదిరోజులూ గోళ్ళు గిల్లుకుంటూ కూచున్నాడంటే ఇప్పటిదాకా కాస్తో కూస్తో కర్ణుడి పట్ల ఉన్న అభిమానం కాస్తా కాకెత్తుకుపోయినట్టే..:)

      Delete
    2. సైనిక వృత్తిలో స్ట్రాటజీ పాలే హెచ్చు. ఏ లక్ష్యాలను ఎంచుకోవాలి, ఏ ఫార్మేషన్లు వాడాలి, దేన్ని ఎట్లా ఎదురుకోవాలి, విరోధపక్షం ఫలానా పన్నాగాలు పన్నితే కౌంటర్ ఏమిటీ వగైరాలు అన్నీ వ్యూహపరిధిలో వస్తాయి. యుద్ధక్రీడలు (war games) శాంతాకాలంలో సైతం నిరంతరం ఆడుతూనే ఉంటారు.

      Military craft >>> on-field fighting

      Delete

    3. జై గారు

      సేనాపతి చేసే పనులవేగా అప్పటికి ఇప్పటికిన్నీ

      Delete
  9. ఇంతకీ కర్ణుడు యుద్ధం చేయనని అన్నాడా లేక యుద్ధరంగంలో అడుగు పెట్టనని అన్నాడా?

    ReplyDelete
    Replies
    1. బోనగిరిగారు.
      ఇదిగో ఇదీ కవిత్రయం మాట.
      నీకు నాలావుతోడ్పాటు లేక యుండ,వలయు నీ తెగునంతకు గలన నిలువ
      నాయుధంబులు విడచితి నంతమీద,మెఱసిబలవిక్రమంబులు నెఱపువాడ ఉద్యోగ.ప.ఆశ్వా.2. 289

      నీకు నా బలం తోడ్పాటు లేకుండా ఉండడానికి, నీవు పడిపోయేవరకు( నీవు చచ్చేవరకు అని చెప్పుకోవచ్చు)యుద్ధంలో నిలబడను ఆయుధం ధరించి. ఆ తరవాత నా బలం విక్రమం చూపిస్తా.

      Delete
    2. కర్ణునికి రెండే రెండు కోరికలు.. ౧. దుర్యోధనుని పట్ల విధేయత విశ్వసనీయతతో మెలగాలని. ౨. కుంతి కి మాటిచ్చినట్లు పాండవులంటే ఐదుగురే మిగిలుంటారని.. తాను గెలిస్తే అర్జునుడు ఉండరాదని వైస్ వర్సా.. స్వతహ గానే పాండవులు లాగ కర్ణుడు సైతం మొదట విముఖత చూపించినాడట.. కాని అతని స్నేహితుడి ఋణం తీర్చుకునేందుకు యుద్ధాన్ని అవకాశం లా మలుచుకో వచ్చని తరువాయి సుముఖత చూపినా గాని భీష్ముల వారి మూలాన కొద్ది రోజులు రణక్షేత్రం లో అడుగు పెట్టలేదు. కాని అతను రణ శిభిరాన హాజరై ఉండేవారుట స్టాండ్-బై లా..

      Delete
    3. @sarma:

      "నీవు పడిపోయేవరకు( నీవు చచ్చేవరకు అని చెప్పుకోవచ్చు)"

      గురువు గారూ, 11వ రోజున (కర్ణుడు పోయేటప్పుడు కూడా) భీష్ముడు బతికే ఉన్నాడు కాబట్టి కర్ణ శపథం "పడిపోయే వరకు" అయినా ఉండాలి లేదా అతను మాట మార్చయినా ఉండాలి.

      Delete
    4. జై గారు,
      భీష్ముడు కర్ణుని అర్ధరథుడు అంటే, కర్ణుడు నీకు సాయం కాకుండేందుకు నువ్వు బతికుండగా ఆయుధం వదిలేసాను, యుద్ధరంగం లోకి దిగను అని ప్రతిన చేశాడు. దానికి భీష్ముడు ఫొ ఫోవోస్ నువ్వే కాదు, నీ కొడుకులు,మిత్రులు,మంత్రులూ ఎవరూ యుద్ధం చేయద్దన్నాడు ( ఎంత పెద్ద వాడైనా అయనకీ కోపం ఉంటుందిగా)

      నీవు బతికున్నంతవరకు అంటే పదకొండవరోజు కర్ణుడు యుద్ధం చేశాడుగా.అప్పటికి భీష్ముడు బతికున్నాడే! ( ఆ తరవాత ఏబది ఎనిమిది రోజులు బతికున్నాడు. కర్ణుని చావు కూడా విన్నాడు, దుర్యోధనుని చావు విన్నాడు. కర్ణుడుని అర్ధ రథుడు అన్న మాట మాట నిజమని విన్నాడు. ఆతరవాతే కాలం చేశాడు) అంటే నువ్వు యుద్ధం చేసినంతకాలం నేను యుద్ధం చెయ్యనని అర్ధం కదా. అలాగే యుద్ధరంగంలో అడుగు పెట్టను ఆయుధం వదిలేస్తున్నా అంటే యుద్ధం చెయ్యనని కదా అర్ధం. వడ్ల గింజలో బియ్యపు గింజ.

      నిజంగానే ఆ పదిరోజులు సేనా నాయకత్వం కూడా కర్ణుడు చేయకుంటే అంతకు మించిన మిత్ర ద్రోహం ఉండదు. ఒక వేళ మొత్తం కర్ణుని సేన యుద్ధంలో పాల్గోక ఉండిపోయి ఉంటే ఆ మాట వ్యాసుడు చెప్పక ఉంటాడా?

      ఏమో! నా మాట చెప్పి విరమిస్తున్నా.కర్ణుడు యుద్ధం చేయలేదు, మొదటి పదిరోజులు, సేనా నాయకత్వం చేశాడు. ఇది నామాట

      Delete
    5. అరటి పండు ఒలిచినట్టు లాజికల్ వివరణ ఇచ్చారు, థాంక్సండీ

      Delete


  10. అందరికీ నమస్కారములు ఈ భీష్మ వయోనిర్ధారణా కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ జిలేబి :)

    ReplyDelete
  11. కవిత్రయంలో ఇలా ఉంది (ఉద్యోగ పర్వం, ద్వితీయాశ్వాసం, పద్యం నెం.289 లోనే)
    —————————
    తాత్పర్యం: ‘నీకు నా బలం తోడు లేకుండా ఉండాలి. నీవు చచ్చేవరకూ నేను యుద్ధభూమిలో అడుగుపెట్టను. అస్త్రాలు విడిచాను. ఆ తరువాత - నీవు చనిపోయిన తరువాత - విజృంభించి నా బలపరాక్రమాలు చూపిస్తాను.’ “
    —————————

    కాబట్టి అడుగుపెట్టను అనే కర్ణుడి ప్రతిన అని అనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. అడుగులకు మడుగులొత్తుతు పూర్వికులు వదిలెళ్ళిన అడుగు జాడల ఆనవాళ్ళు ఇవి. ఇతిహాసము నుండి నేటి కాలమున మరియు కాలాలకతీతమై మిగిలేవి విహిత కర్మములే.. పాప పుణ్యాల బేరీజు వేసేది పరలోకంలో కాని వాటిని కర్మ ద్వార మనిషి ఈ జన్మలోనే రుగ్మతులుగా, అపవాదులుగా భరిస్తాడు. ఎవరి క్యపాసిటికి అణుగుణంగానే మన లైఫ్ సైతం అక్కడే టెయిలరింగ్ చేసి వస్తాయట.. ప్రాణం పోసుకున్న ప్రతి జీవి.. ఆ భగవంతుడు కుట్టి ఇచ్చిన ఈ "కుట్టి స్టోరి" మాదిరి 'విజయ'వంతం చేయాలి.

      Delete
    2. భీష్ముడు ఇంకా కర్ణుడితో ఇలా కూడా అన్నాడు (కవిత్రయం వారి ఉద్యోగపర్వము, చతుర్ధాశ్వాసము, పద్యం నెం. 249)
      ------------
      "తాత్పర్యం: 'యుద్ధానికి జంకి నాపై నెపం మోపి నీ విపుడు తప్పించుకొన్నప్పటికీ మున్ముందు తప్పించుక తిరుగలేవు. క్రోధరీత చిత్తుడైన అర్జునుడు కూలుస్తూ ఉండగా వరుసగా మహావీరులంతా వెళ్ళిపోయిన తరువాత నీకు కదనరంగ ప్రవేశం తప్పదు. అపుడు చావక మిగిలి దీనదశలో నున్న పరివారమూ, సుయోధనుడూ నీ చందమెటువంటిదో తెలిసికొనగలరు. ' "
      -------------
      అంటే అప్పటివరకు కర్ణుడు యుద్ధభూమికి ఆవలనే ఉంటాడనేగా?

      Delete
    3. యుద్ధప్రారంభానికి ముందు కౌరవసేనలోని నాయకులకు ఉత్సాహ పరిచే వచనాలు చెబుతూ చివర్లో భీష్ముడు దుర్యోధనుడితో ఇలా అంటాడు (కవిత్రయం వారి భీష్మపర్వము, ప్రధమాశ్వాసం, 101) :
      ----------------
      "తాత్పర్యం: ఆ సమయంలో భీష్ముడు దుర్యోధనుతో ఈ విధంగా అన్నాడు. 'ఓ దుర్యోధనా! నీ మిత్రుడైన కర్ణుడు నేను యుద్ధం చేసేటప్పుడు తాను యుద్ధంలో పాల్గొనరాదు. అట్లే అతడి కొడుకులు స్నేహితులు మంత్రులు, చుట్టాలు సయితం యుద్ధంలో పాల్గొనరాదు.'"
      -----
      తనను అర్ధరధుడు అన్నప్పుడు :
      (కవిత్రయంలోని మాటలు 101 -->) "కర్ణుడు కోపించి భీష్ముని నాయకత్వంలో తాను యుద్ధం చేయనని ప్రతిజ్ఙ చేశాడు. అందుచేత భీష్ముడు ఈ మాట చెప్పవలసి వచ్చింది దుర్యోధనునితో."
      ----------------

      అయితే మొదటి నుండే కర్ణుడు కురుక్షేత్రంలోనే శిబిరం వేసుకుని వేచి యుంటాడని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ భీష్ముడు పడిపోతే తాను రంగంలోకి దిగాలి కదా. తను హస్తినాపురంలో కూర్చుంటే భీష్ముడి వార్త సంజయుడి దివ్యదృష్టి ద్వారా తెలిసినప్పటికీ అప్పుడు బయలుదేరి యుద్ధరంగానికి చేరుకోవడానికి రోజుల సమయం పట్టేస్తుంది కదా. అందువల్ల రణరంగానికి సమీపంలోనే వేచి ఉండుండాలి .... పైన శ్రీధర్ చెప్పినట్లు "స్టాండ్ బై"లా. మరి ఆ పది రోజులూ తన ఉపసేనానికి ఏమన్నా సూచనలిస్తుండే వాడేమో తెలియదు.

      Delete
    4. విన్నకోటవారు,

      భీష్మునికి సాయం లేకుండేందుకే యుద్ధం చేయనని కర్ణుడు చేసిన ప్రతిన అతని ఉడుకుబోతుతనాన్ని చూపుతోంది. యుద్ధం ఎవరికోసం చేస్తున్నాడు? సుయోధనుడి కోసమా? భీష్ముని కోసమా? ఈ ప్రతిన చేసి కర్ణుడు ఎవరికి లాభం చేకూర్చాడు ? ఇది మిత్ర ద్రోహం కాదా?

      Delete
    5. ముమ్మాటికీ మిత్రద్రోహమే. అసలు ముఖ్యంగా అర్జునుడిని ఎదుర్కోవడానికి అతన్ని నమ్ముకునేగా యుద్ధం లోకి దిగుదామనుకున్న దుర్యోధనుడికి నిరాశే మిగిలింది. కర్ణుడికి కోపం, ఆవేశం, ఉద్రేకం ఎక్కువయ్యుండాలి.

      Delete
  12. కర్ణుడేగాదు , సేనలు , సేవకజన , మంతి
    పురములును , రాణులు , సమస్తము కరిపురము
    విడిసె , డేరాల , రణభూమి విడిది కవల ,
    ఘన కురుక్షేత్ర యుద్ధ భూమిని చెలంగ .

    ReplyDelete
    Replies
    1. రాజా వారు,
      ముసలి ముతక తప్పించి అందరూ యుద్ధరంగం దగ్గరే ఉన్నారండి

      Delete
  13. అటూ ఇటూ పాల్గొన్న 18 అక్షౌహిణీలలోని రధ జగ తురగ పదాతి దళాలకు విడిదికి ఎంత స్థలం పడుతుంది?అసలు యుద్ధరంగం యొక్క వైశాల్యం ఎంత?యుద్ధరంగానికి చుట్టూ కట్టిన గ్యాలరీ కొలతలు ఎంత?గ్యాలరీలు కూడా ఉన్నాయా అనకండి,ఆ గ్యాలరీలో కూర్చున్న కర్ణుణ్ణి "మహావీరుడివి చేతులు ముడుచుకుని కూర్చోవడం దేనికి?భీష్ములవారు కూలేవరకు మా తరపున యుద్ధం చెయ్యవచ్చు కదా!" అని కుళ్ళు జోకు వేసి కర్ణుడు సిగ్గుపడేలా చేశాడు శ్రీకృష్ణుడు.అప్పుడు కర్ణుడు చెప్పిన జవాబు తెలిస్తే ఇప్పుడు ఇక్కడ మీరు కర్ణుడు ఏమి చేశాడోనని వెలిబుచ్చుతున్న సందేహాలకి జవాబు దొరుకుతుంది కదా!

    గరికపాటి వారు ఒక్కో రధంలోనూ ఆయుధాలు దాచుకోవడానికే గాక వెంటవెంటనే అందివ్వడానికి సహాయకులకు కూడా చోటు వుండేదని చెప్పిన లెక్కల ప్రకారం యుద్ధానికి వాడే రధాల పరిమాణం ఎంత?

    అటువైపునా ఇటువైపునా మొహరించిన సైన్యాలకు పోషణ ఖర్చుల్ని భరించింది ఎవరో తెలుసా?ఆ చివార్న ఉన్న పాండ్యరాజులు!

    తెలుసుకుని పిన్నలకు చెప్పాల్సిన పెద్దలు కూడా కొంత తెలిసి కొంత తెలియక అయోమయంలో ఉన్నారు.మీకే అంత బద్ధకం అయితే మాకు తెలిసేదెట్లా?

    అసలు కురుక్షేత్రమే రణక్షేత్రం ఎందుకు అయ్యిందనేది తెలిస్తే చాలా చిక్కుముడులు విడే అవకాశం ఉంది, ప్రయత్నించండి!

    ReplyDelete
    Replies
    1. హరిబాబూ గారు,
      ఇన్ని అక్షౌహుణీల జనం ఎక్కడపట్టేరు అసలు యుద్ధం జరిగిందా అన్నదానికి సమాధానం గా నేనొక టపా రాయడం దాన్ని తమరు చదవడం కూడా చాలా కాలం కిందటే జరిగిపోయింది. కృష్ణుని ప్రశ్నకు కర్ణుని సమాధానమేంటో తమరు చెబితే విని తెలుసుకునేవారం కదా! అది చెప్పలేదు.
      ఇక్కడ అంతులేని చర్చలు, వ్యక్తిగత దూషణలు ఉండవు, తెలిసినది చెప్పడం, యుక్తి యుక్తంగా మాటాడటం, తెలియనిది తెలుసుకోవడం జరుగుతుంది, తమరు గుర్తించగలరు.

      Delete
    2. He(The karna) simply sat in the gallery along with other spectators!All those saints, warriors who are interested to see the mighty war sat in the gallery which is constructed for the purpose.

      Why do all of you overlook such details such as selecting a place and constructing shelters for warriors and artillery including infantry and trained animals while a small cricket match also requires so many arrangements!

      Delete
    3. Sir,
      My question is not in harsh tone, just a lovingly fun. Please excuse me if it hurted anybody.
      Sorry!

      Delete
    4. హరిబాబు గారు,
      ఇక్కడ మేము రెండు ప్రశ్నలగురించి చర్చిస్తున్నాం .ఆ రెండు ప్రశ్నలగురించి మీకు తెలిసిన విషయం చెప్పమని విన్నకోట వారు మిమ్మల్ని అడిగారు.విషయం తెలిస్తే వివరించండి.
      కృష్ణుని ప్రశ్నకు కర్ణుని సమాధానం మీరింతవరకు చెప్పలేదు. విషయాన్ని పక్క దోవ పట్టించకండి.


      అక్కడే యుద్ధం ఎందుకు జరిగింది వగైరా విషయాల గురించిన విషయాలూ చెప్పచ్చు, నాకు తెలిసినది తోచినది ఇదివరకే చెప్పాను. విషయన్ని అనవసరంగా సాగదీయకండి.
      Please don't make fun of us.

      Delete
    5. హరిబాబు గారు,
      అందరికి అన్నీ తెలిసుండాలనీ లేదు, తెలియకాపోవచ్చు. తెలిసినా కొంతమంది సమయానికి చెప్పలేకాపోవచ్చు, అన్వయం చేయలేకపోవచ్చు,గుర్తు రాకపోవచ్చు. అంతలో వారంతా పనికిరానివారనుకోగలమా?

      Delete
    6. Sarma sir!
      Why you are pestering me about a non issue even after I expressed sorry about it. It is common in a conversation between friends to pass on some humorous talk. I have not committed any black comedy, just a casual remark I made. Yes, I am trying to tell what I knew. It will take time to check the original story and type it in telugu.

      But,in the mean time I wonder why you are so harsh about me. How could I continue where there is a hate and negative ambience against me?

      Just Tell me what crime I did here!

      Delete

    7. Pestering :) మళ్ళీ మళ్ళీ అడగడం తెలుసుకోవాలనే!
      మిమ్మల్నేం అనలేదే, మీరలా అనుకుంటే సారీ
      విషయం చెప్పండి. మళ్ళీ, అనకండి, తెలుసుకోవాలని ఆతృత అంతే :)

      Delete
    8. ఇక్కడ నేను నా స్వకపోలకల్పనలను చెప్పడం లేదు.మిత్రా పబ్లికేషన్స్ వారు ప్రచురించిన ఉషశ్రీ మహాభారతం నుంచి ఎత్తి రాస్తున్నాను.ఉషశ్రీ గారు చెప్పిన ఒక విశేషం మనవి చెస్తాను.కవిత్రయ భారతం మనకు 18 పర్వాలనే చూపిస్తున్నది గానీ వ్యాసభారతంలో శతాధిక పర్వాలు గోచరిస్తున్నాయట!ఆ విభజన ప్రకారం శ్రీకృష్ణుడు రాయబారం కోసం వెళ్ళడం,అక్కడ సంభాషించడం, తిరిగి రావడం అనేదాని పేరు భగవద్ యాన పర్వం.ప్రస్తుతం ఉన్న లక్షశ్లోక పరిమాణంలో వ్యాసకృతం 6000,శిష్యకృతం 4000 కలిపి మూలం 10,000 శ్లోకాలు మాత్రమే అని అంటున్నారు.ఈ మధ్యనే మన తెలుగాయన ఒకరు "జయం" అన్న పేరుతో నవలీకరించినది వ్యాసకృతం అని గ్రంధ పరిచయంలో చదివాను.గ్రంధం చదవలేదు.రచయిత పేరు గుర్తు లేదు.
      ఇక విషయానికి వస్తే కర్ణుడికి సొంత సైన్యం అంటూ ఏమీ లేదు."శిబిర నిర్మాణం" అనే తలకట్టు పెట్టి ఉషశ్రీ గారు చెప్పినది ఇది:వాసుదేవుడు హస్తినాపురం వదలి వెళ్ళగానే దుర్యోధనుడు తన మిత్రులందరినీ రావించి కురుక్షేత్రంలో మన వీరులందరికీ తగిన శిబిరాలు నిర్మించండి,రాజధాని నుండి రనక్షేత్య్రానికి మార్గాలను ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించాడు.
      ధీమంతుడైన దుర్యోధనుడు తన సేనలను ఎంతో శ్రద్ధ తీసుకుని విభజించాడు.కురుక్షేత్రంలో సంఘర్షించిన పద్ధెనిమిది అక్షౌహిణీలలో పదకొండు దుర్యోధనుడి వెంట ఉన్నాయి.55గురు పదాతులు ఒక పత్తి,అటువంటివి మూడు కలిస్తే ఒక గుల్మం లేదా సేనాముఖం అవుతుంది.మూడు గుల్మాలు ఒక గణం,ఇటువంటి గణాలు 10,000 దుర్యోధనుడి వెంట ఉన్నాయి.కృప,ద్రోణ,అశ్వద్ధామ, శల్య,జయధ్రధ,సుదక్షిణ,కృతవర్మ,కర్ణ, భూరిశ్రవన,శకుని,బాహ్లిక అనే పదకొండు మంది వీరవరుల్ని ఒక్కొక్క అక్షౌహిణికి అధిపతులను చేశాడు.

      పైన చెప్పింది ఉషశ్రీ గారి వచనం.ఇది స్వయాన దుర్యోధనుడు చేసిన విభజన.దీనికీ భీషుల వారు చేసిన అర్ధరధ, మహారధిక విభజనకీ ఎటువంటి సంబంధమూ లేదు.యుద్ధరంగంలోని వ్యవహారాలలో సైన్యాధ్యక్షుడు ప్రతి సైనికుడికీ రధికుడికీ ఆజ్ఞలు పంపించడు.అక్షౌహిణికి అధిపతులైన వారికి తమ అధీనంలో ఉన్న సైన్యాన్ని వ్యూహంలో ఎక్కడ వుంచాలి,ఎప్పుడు ఎవరు ముందుకు కదలాలి లాంటి సూచనలు పంపిస్తాడు.అతను వాటిని ఇతర్లకి తెలియజేస్తాడు.అంతే కాక, శ్రీకృష్ణుడు తన రధానికి పూన్చిన గుర్రాలను ప్రేమించి లాలించి పోషించినట్టు తన అధీనంలో ఉన్న సైన్యాన్ని రక్షించడం,పోషించడం కూడా అధిపతుల బాధ్యతలు అని మనం అనుకోవాలి.
      అన్ని అక్షౌహిణీల్ని మొదటి రోజునుంచీ యుద్ధంలో దించడం కుదిరేది కాదు కాబట్టి కర్ణుడి ప్రతిజ్ఞ కర్ణుడి అధీనంలో ఉన్న అక్షౌహిణీ సైన్యానికి కూడా వర్తిస్తుంది.
      దీని వెంటనే "భీష్మ సేనాపత్యం" ఆనె తలకట్టు పెట్టి ఉషశ్రీ గారు చెప్పినది ఇది:ఈ విధమైన విభజన పూర్తి చేసి దుర్యోధనుడు గాంగేయుని సమీపించి,"ఈ విశాల సేన రణరంగంలో సేనాపతి రహితంగా ప్రవేశిస్తే చీమలబారులా చిన్నాభిన్నమై పోతుంది.....నీకంటే మా శ్రేయస్సు కోరేవారెవరు?నీ సేనాపతిత్వంలో మేమంతా నడుస్తాం" అని అన్నాడు.అప్పుడు భీషుడు,"దుర్యోధనా!నాకు మీ ఉభయుల యందూ సమానమైన అనురాగం ఉన్నది.అందుచేత పాండవులు వచ్చి శ్రేయోమార్గం కోరితే వారికి హితవు చెబుతాను.నీ పక్షాన యుద్ధం చేస్తాను.ఈనాడు భూమండలంలో అర్జునునితో సమానంగా నిలబడగల శాస్త్రాస్త్రవేత్త లేడు. అనేక దివ్యాస్త్రాలను వాడెరుగును.అయినప్పటికీ నేను వానికెదురు నిలిచి పోరాడగలను.నా చేత్తో నేను పాండవులను సంహరించను.రోజుకు పదివేలమందిని కూల్చగలను.(మరొకచోట ఇదే లెక్కను మళ్ళీ చెప్పి పాండవ సైన్యాన్ని సమస్తం నాశనం చెయ్యడానికి నెలరోజులు చాలునని చెప్తాడు.)మరొక్క మాట!యుద్ధభూమిలో కర్ణుడు ఉంటే నేను అడుగు పెట్టను." అన్నాడు.ఆఖరు మాట వినగానే కర్ణుడు,"మహారాజా!భీష్ముడు నేలకూలేవరకు నేను ధనుస్సు చేతబట్టనని ఏనాడో శపధం చేశాను.ఆయన కన్ను మూశాకనే నా చేతులలో అర్జునుని ప్రతాపం తేలుతుంది" అని దుర్యోధనునితో అన్నాడు.
      ఇదే మాటని కొంచెం మార్చి సరదాగానే అయినా కొంచెం సిగ్గుపడుతూ,"శ్రీకృష్ణా!భీష్ముడు నేలకూలేవరకు నేను ధనుస్సు చేతబట్టనని కదా శపధం చేశాను?అన్నీ తెలిసి ఇలా గికురించడం న్యాయమా!" అని ప్రేక్షక సమూహం నుంచి శ్రీకృష్ణుడికి జవాబు చెప్పాడు.

      ఇప్పటికి అర్ధరధ నిర్ణయం జరగలేదు.అయినా శపధం పట్టి చాలా కాలం అయ్యిందంటున్నాడు.అది ఎప్పుడు జరిగింది?నా దగ్గిర ఉన్న భాగంలో కనిపించడం లేదు.మిగిలిన భాగాలు ఇక్కడ లేవు.మీరే కనుక్కోవాలి.

      ఇక కురుక్షేత్రమే ఎందుకు రణక్షేత్రం అయ్యింది అనే సందేహానికి నా సమాధానం చెప్పడానికి కొంత విరామం తీసుకుంటాను.

      Delete
    9. Just a small correction!

      "కర్ణుడు - భారతయుద్ధ మొదటి పదిరోజుల సేనా నాయకత్వం." అనడంలో ఒక పొరపాటు దొర్లింది.18 రోజులలో మొదటి పది రోజులు భీష్ముల వారు సేనాధిపతి.ఆ కధ మొత్తాన్ని కవిత్రయం భీష్మ పర్వం అన్నారు.భీష్ముడు పడిపోగానే కర్ణుడు యుద్ధంలోకి వచ్చాడే తప్ప తను సేనాధిపతి కాలేదు.భీష్ముడు కూలిన మరుసటి రోజు నుంచి ద్రోణుల వారు అయిదు రోజులు సేనాధిపత్యం వహించారు.ఆ కధ మొత్తాన్ని కవిత్రయం ద్రోణ పర్వం అన్నారు.16, 17 రోజులు మాత్రమే కర్ణుడు సేనాధిపత్యం వహించాడు.దానిని కర్ణ పర్వం అన్నారు.18వ రోజు శల్యుడు సేనాధిపతి అయ్యాడు.అది శల్య పర్వం,అంతటితో మహాయుద్ధం ముగిసిపోయి దుర్యోధనుడు మడుగులో దాగడం అనే ఉపసంగ్రామ కధ మొదలౌతుంది.

      Delete
    10. హరిబాబు గారు,

      అక్షౌహిణి సేనకు అధిపతి సేనాపతి, ఇటువంటి సేనాపతుల అధ్యక్షుడు సర్వ సేనాపతి. కర్ణుడు యుద్ధం మొదలయ్యే రోజుకు సేనాపతి,భీష్ముడు సర్వ సేనాపతి.

      కృష్ణుడు, కర్ణుని పాండవులవైపు,భీష్ముడు యుద్ధంలో ఉన్నంతకాలము, యుద్ధం చేయమని అడిగితే చెప్పే సమాధానం కోసం ఎదురు చూశా,ఆతృతగా. కర్ణుడు మాత్రం ”ఈ సమయంలో నన్ను కికురించడం న్యాయమా?" అన్నాడన్నారు.
      అంటే
      ”అప్పుడు సభలో ఉడుకు జుర్రుకుని ప్రతిన చేసి తప్పు చేశాను,యుద్ధం చేయనని. దానిని ఇప్పుడు ఈ పెద్దల మధ్య గుర్తు చేసి నన్ను గేలిచేయడం, ఎత్తిపొడవడం న్యాయమా” అన్నాడంటే,అప్పుడు తప్పు చేశాను, ఇప్పుడిలా హింసించడం న్యాయమా అని వేడు కున్నాడు కదా! శత్రువు పై మానసికంగా విజయం పొందడం కూడా యుద్ధం లో భాగమే కదూ!

      ఆ పది రోజు యుద్ధం చేయక ఏమి చేశాడు అన్నది తేలలేదు.

      మొత్తం సేన ఒక రోజునే యుద్ధం లో పాల్గోదు కనక, కర్ణుని సేన ఆ పదిరోజులూ యుద్ధంలో పాల్గోలేదనీ, కర్ణునితో సహా రిజర్వు లో ఉండిపోయిందంటే బాగుంది కర్ణుని పట్ల కొంత అభిమానం మిగిలింది.







      Delete
    11. You:అంటే
      ”అప్పుడు సభలో ఉడుకు జుర్రుకుని ప్రతిన చేసి తప్పు చేశాను,యుద్ధం చేయనని. దానిని ఇప్పుడు ఈ పెద్దల మధ్య గుర్తు చేసి నన్ను గేలిచేయడం, ఎత్తిపొడవడం న్యాయమా” అన్నాడంటే,అప్పుడు తప్పు చేశాను, ఇప్పుడిలా హింసించడం న్యాయమా అని వేడు కున్నాడు కదా! శత్రువు పై మానసికంగా విజయం పొందడం కూడా యుద్ధం లో భాగమే కదూ!

      Me:you pasted the actual text exactly.And I put it in my own words as I didn't have the relevant part at my disposal.

      By the way, I said karna was a spectator until bheeshma falls.There are so many references of the presence of a gallery and spectators in kavitrayaybharatam also.

      Please find such details yourself as I am working on second part of my topic.

      Delete
    12. అప్పుడు సభలో ఉడుకు జుర్రుకుని ప్రతిన చేసి తప్పు చేశాను,యుద్ధం చేయనని. దానిని ఇప్పుడు ఈ పెద్దల మధ్య గుర్తు చేసి నన్ను గేలిచేయడం, ఎత్తిపొడవడం న్యాయమా” They are my words only through Karna. If they synchronize it is just coincidence. I am not having that book with me, refered by you.
      Please continue the second part of the topic and publish

      Delete
  14. హస్తినాపురానికి కురుక్షేత్రం 173 కి.మీ. దూరం.

    ReplyDelete
  15. తెలుసుకుందామనే సదుద్దేశంతో మా సందేహనివృత్తి చెయ్యమని ఇందు మూలంగా మిమ్మల్ని కోరుతున్నాను, హరిబాబు గారు👇.
    (1). ఆ పదిరోజులూ కర్ణుడు ఎక్కడ, ఏ విధంగా కాలక్షేపం చేశాడు?
    (2). మహాభారత యుద్ధం నాటికి భీష్ముడి వయసు ఎంత?
    థాంక్ యూ.

    ReplyDelete
  16. Total 18 Aukshohini Warriors (38,57,142s Warriors) died in only 18 days.

    Pandava side survivors:-

    Vasudev Sri Krishna (age 89 years)
    Dharmaraja Yuddhisthira (age 91 years)
    Gadadhara Bheema (age 90 years)
    Dhanurdhara Arjuna (age 89 years)
    Intelligent Shahadeva (age 88 years)
    Handsome Nakula (age 88 years)
    Yuyutsu (age 90 years)

    Kaurava side survivors:-

    Pitamaha Bhishma (age 191 years)
    Kulguru Kripacharya (age 150 years)
    Vrishaketu (age 56 years, youngest son of Karna)

    ReplyDelete
    Replies
    1. Thanks sir for information but it requires some base

      Delete
    2. బోనగిరి గారు హస్తినాపురానికి కురుక్షేత్రం 173 కిలో మీటర్ల దూరం అన్నారు. ఆ కాలపు ప్రయాణసాధనాలతో, మార్గమధ్యంలో అక్కడక్కడ విశ్రాంతితో (తనకూ, సారధికీ, గుర్రాలకూ) ఆ దూరం వెళ్ళడావికి ఓ రెండు రోజుల సమయం పట్టదూ?

      Delete
    3. అంచె గుర్రాలతో పన్నెండు గంటలలో చేరచ్చండి. కర్ణుడు దుర్యోధనునితోనే ఉన్నాడు ఎప్పుడూ

      Delete
    4. కరక్టేనండీ, అంచె గుర్రాల ఏర్పాటు ఉండేది కదా ఆ రోజుల్లో. మరచితిని.

      అవునండీ, కర్ణుడు దుర్యోధనుడితోనే ఉన్నాడనే నా నమ్మకం కూడా. ఒకవేళ హస్తిన నుండి వెళ్ళాల్సి వస్తే (ఎవరైనా) ఎంత దూరం, ఎంత సమయం అని అంచనా వేద్దామనే నేనా అంశం ప్రస్తావించాను

      Delete
  17. కనుగ్రుడ్లు పొడిచి గ్రద్దలు
    హనువులు చీల్చుక తిను తరహా రాబందుల్
    గని ధర్మజుండు బొగిలెను
    మనమున , రణభూమి లోని మారణ చర్యన్ .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      యుద్ధం తరవాత దృశ్యం హృదయ విదారకం.

      Delete
    2. రాజా రావు గారు, శర్మ గారు..
      మహాభారత యుద్ధం ఎన్నో వీర యోద్ధులను పరిచయం చేసిందనుకోవచ్చు ఒక పక్క.. కాని ఆయ వీరత్వ శూరత్వాలు పాండవుల పరాక్రమం ముందు ఏ రోజు కా రోజు వీగిపోయేవి.. నెత్తుటి యేరులై శవాల గుట్టలై తేలుతుండేవి.. ఆ సన్నివేశాలన్ని హృదయ విదారకాలే.. మహా ఐతే వారి వారి శూరత్వాల పటిమ శత్రువు శేషాన్ని అంతమొందించే వరకే. కాని ఆశ్చర్య పరిచే మాటేమిటంటే పగలు యుద్ధ శంకనాదానికి భీకర పోరు తలబెట్టే వారు సైతం రాత్రులు శోకాలకు హాజరయ్యేవారుట.. ఈ ఉదంతమంత చూస్తే అనిపిస్తుంది.. అసలు భారత యుద్ధం వలన లాభం పొందింది ఎవరు లేదు.. నష్టమే.. జీవించి ఉన్నవారి శాపాలు, రోదనలతో, శత్రుశేషం పరిసమాప్తమయ్యే లోపు పాండవులకు కర్ణుడు తమ అగ్రజుడని తెలియటం మూలానా కృంగిపోయారు. ఒక్కో ఘటన ఒక్కోలా.. అంత మందిని మట్టుబెట్టినా మట్టుబెట్టకపోయినా ఏదో ఒక రోజు కాలమే సమాధాన పరిచేదిగా అనే ప్రశ్న దిగులును రేకెత్తుతుంటుంది.
      భారతాన్ని కేవలం భగవద్గీత కొసమే లోక కల్యాణం కోసమే అని అనుకుంటే మరీ ఇంతటి హింసతో కూడుకున్న ఈ ప్రాచీన యుద్ధం కడు శోచనీయం. యుద్ధం వలన ఏ వైపు వారికి తగిన ఫలం దక్కలేదు. ధర్మ మార్గమున కృష్ణుడు నడిపించారు కనుఖనే పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ హితులయ్యారు. స్వస్తి.

      Delete
    3. అవునండీ, ఏదైనా పెద్ద దొమ్మీ తరువాత గానీ, రోడ్డు / రైలు ప్రమాదం తరువాత గానీ కనబడే దృశ్యమే కడు హృదయవిదారకంగా ఉంటుంది. ఇక కురుక్షేత్రం వంటి అతిభారీ యుద్ధం సంగతి చెప్పేదేముంది.

      నాకు కలుగుతుండే మరో సందేహం .... ప్రతిరోజూ కూలి పడుతున్న వేలాది శవాలను, జంతువులను ఏరోజుకారోజే disposal చెయ్యాలి కదా - తెల్లవారితే మళ్ళీ పోరుకు అదే క్షేత్రాన్ని తయారుగా ఉంచాలి కాబట్టి. అంటే రాత్రంతా ఆ పనే అయ్యుండాలి., అన్నన్ని ఏర్పాట్లు ముందుగానే ప్రణాళికతో చేసుకుని ఉంచుకోవాలి కదా (logistics అని కాబోలు ఆధునిక పదం). అప్పటి వారు కూడా ప్రణాళికాబద్ధులే.

      Delete
    4. మహాభారత యుద్ధాన్ని ప్రస్తావిస్తు కాలం సూర్యునితో ఇలా చెప్పేదని ప్రతితి.. ఓ సూర్య దేవ.. నువు ఉదయించే కాలానికి వేలాది మంది యోద్ధులు రణభూమిన పాండవుల పక్షాన అలాగే కౌరవుల పక్షాన పోరాడదలచి కదలి వస్తారు. అందులో నీవు అస్తమించే నాటికి గుట్టల కొలది శవాలే.. ఇపుడు ఆ శవాలు కౌరవ సేనకి చెందినవి కావు పాండవుల సేనకి చెందవు.. వారంత ఒకటే.. వారి వారి పక్షాన పోరాడుతు నేలకొరిగిన వారే.. వారికి తెలిసిందల్ల ఒకటే వారే పక్షాన పోరాడుతున్నారో ఆ పక్షానికి చివరి దాక పోరాడి వీరగతి పొందాలని. అసలీకి మహాభారత యుద్ధ విజయం పాండవులది కాదు, ధర్మ పక్షాన పోరాడుతు ప్రాణత్యాగం గావించిన సైనికుల త్యాగానికి దక్కిన ధర్మ ఫలం.. ధర్మో రక్షతి రక్షితః

      Delete
    5. స్త్రీ పర్వం చదవండి. పద్దెనిమిదిరోజులూ శవాలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఆ తరవాత పీనుగులు గుట్టలుగా తగలబెట్టేరు. హృదయ విదారకంగా ఉంటుంది.

      Delete
    6. అవునండీ. చాలా హృదయవిదారకం స్త్రీ పర్వం. అనేక రోజులపాటు పడియున్న శవాలను గుర్తించడమే కష్టం కావచ్చునేమో!

      Delete
    7. అవును , సత్యము , హృదయవిదారక దృశ్యము .

      గుట్టలుగ పేర్చి శవముల
      నెట్టెటులో నూనెలొలికి నిల్చి దహించెన్
      కట్టా ! ధర్మజు డొక్కడె
      గట్టిగ నంతిమ క్రియలను గావించె కడున్ .


      Delete


  18. ఇప్పటిదాకా జరిగిన చర్చలను చూడగా ఖచ్చితముగా భారతమును చూపించి ఇదిగో భీష్ముని వయసింత అని చెప్పలేరని పిస్తున్నది.

    కావున ఏదైనా యూనివర్సిటీ ఈ ప్రశ్న పై పీ హెచ్ డీ చేయడానికి ముందుకు రావచ్చు :)



    జిలేబి


    ReplyDelete
    Replies
    1. మేమా పిపీలికాలము ,
      హేమాహేమీలుమీరు , ఇదమిధ్ధముగా ,
      సాముగరిడీలుద్రిప్పి మ
      హామహితులు భీష్మువయసు నరయుడు గరిమిన్ .

      Delete
    2. PhD చెయ్యడానికై అర్హమైన అంశమే, “జిలేబి” గారూ. అసలు ఇప్పటికే ఎవరైనా చేశారేమో? చేసుండకపోతే ఆశ్చర్యమే.

      Delete
    3. ఏంటీ? జిలేబి P.hd చేశారా దీనిమీదా. అబ్బో అద్భుతం. ఎక్కడా? ఏ యూనివర్సిటీలోనూ. చెప్పలేదేం :)

      Delete
    4. మహాభారతకాలనిర్ణయం గురించి, ఆయితిహాసం లోని పాత్రల గురించీ చాలానే పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉండవచ్చును. ఇక్కడ మనం చర్చించింది ఆట్టే లేదు. బాగా శోధించాలి ఇప్పటివరకు ఈవిషయంగా వెలువడిన పత్రాలనీ సాహిత్యాన్నీ.

      Delete
    5. శ్యామలరావు గారు,
      మీ దృష్టికి వచ్చిన పత్రాలలోనో సాహిత్యంలోనో ఎక్కడైనా భీష్ముడి వయసు ప్రస్తావన కనిపించిందా? ఉంటే చెప్పగలరు, థాంక్స్.

      Delete
    6. చాలా శోధించాలండీ. కాని నాకు సమయం లేదు. ఒక పెద్ద పనిలో ఉన్నాను. తీరిక లేదు. కొన్ని నెట్ లింకులు ఇస్తున్నాను.

      1. https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/63498/10/10_chapter%204.pdf
      2. https://logicaltelugu.com/important-life-events-of-sri-krishna/
      3. http://peoplespost.news/te/అసలు-మనం-ఏ-సంవత్సరంలో-ఉన్/
      ఇంకా చాలా సమాచారమే దొరుకుతుంది కాని వెదికేందుకూ చదివే‌ందుకూ‌ కూడా తీరిక లేదు ప్రస్తుతం.

      Delete
    7. శ్యామలీయం వారు,
      గాంధారి మాంస నేత్రాలతో చూడ కూడదనుకుని గంతలు కట్టుకుంది. దానిని ఉల్లంఘించలేదు. నిజానికి దుర్యోధనునే గుర్తుపట్టలేదు,మరెవరిని గుర్తు పట్టగలదు? మాంస నేత్రాలతో అందుకే దివ్య నేత్రాలు ప్రసాదించారు.
      మీరు సాగిస్తున్న కార్యం పూర్తి చేయండి, నేనీ మధ్య అటు చూడలేకపోయినందుకు చింతిస్తున్నా. ఇప్పుడు ఖాళీ చేసుకు చూస్తా.
      Good links sir.


      Delete


  19. ఇంతకీ వినరా వారూ మీకీ ప్రశ్న ఎలా ఎందుకు తట్టిందండీ ? ఏమన్నా రీసెర్సి చేస్తున్నారా ?


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కరోనా లాక్ డౌన్ రోజులు కదండీ 🙂.

      Delete
    2. లాక్ డవున్ ఐపోతోందిగా కొత్తవేం తట్టవు కదా :)

      Delete
  20. విన్నకోటవారు
    నాకూ అనుమానాలే ( చచ్చుదో పుచ్చుదో అనుమానం అనుమానమే)
    ప్రశ్న:- 1.గాంధారి కళ్ళకి గంతలు కట్టుకుంది కదా! యుద్ధరంగంలో చనిపోయినవారిని చూసినట్టు, వర్ణిస్తూ ఏడుస్తుంది. గంతలు విప్పి చూసిందా?
    2.భీష్ముడు అంపశయ్యమీద బోర్లా పడుకున్నాడా? వెల్లకిలా పడుకున్నాడా?

    ReplyDelete
    Replies
    1. శర్మ గారు.. మొదటి ప్రశ్న .. గాంధారి కి బహుశ కుంతి వర్ణించి ఉంటుందని అనుకుంటున్నా ఎలా ఐతే ధృతరాష్ట్రునికి సంజయుడు వర్ణించినట్టు. ఆమే తన పాతివ్రత్యాన్ని నిలుపుకునేందుకు బహుశ కడదాక కూడా ఆ గంతలు విప్పలేదేమో.
      రెండవ ప్రశ్న కు సులువు గానే చెప్పవచ్చునేమో.. అర్జునునికి తానెదురేదురుగానే ఉండగా శరాఘాతం మొదలు పెడతాడు కాబట్టి ఛాతి ను చీల్చుకుంటు వెళ్ళుంటుంది. పైగా అపటివరకు యుద్ధ నియమాలకు విఘాతం కలగనీయకుండ నెరక్కు నేర్ యుద్ధమే కొనసాగింది గనుక.. ఎన్ని శరాలను సంధించినా ఎదురు నిలిచి వాటిని స్వీకరిస్తారు పితామహ.. అలా స్వీకరిస్తూనే ఉండగ బాణపు మొనలు ధరిత్రి తాకగా తల ఆకాశం వైపు అంటే వెల్లకిలా పడుకుని ఉండవచ్చు.. ఒకవేళ అతను బొర్ల పడి ఉంటే బాణాలు పృష్ఠ భాగానికి తాకి ఛాతిని చీల్చుకుని వుండేవి. అలా అయితే అపటి యుద్ధ నియమాలకు భంగం కదా.. పై పెచ్చు నా తల ఒరిగి ఉంది విల్లు ఎక్కుపెట్టమని అర్థించటం వెనుక ఆంతర్యం తెలియజేస్తుంది. పైగ దాహార్తి తీర్చుకునేందుకు పాతాళ గంగ ధార నేరుగా నోటిలోకే పడట్టు చెబుతారు కదా..

      Delete
  21. బోళ్ళాపడుకునియుంటే
    నీళ్ళేలాత్రాగె? క్రీడి నిజవిశిఖముతో
    ద్రెళ్ళించినగాంగఝరిని ,
    వెళ్ళికలా నిజముగాగ వినతిదెలిపితిన్ .

    ReplyDelete
    Replies
    1. భీష్ముడు అంపశయ్య కోరడం వెనుక కారణమేమైవుంటుంది?

      Delete
    2. చిరు కలలు గారు.. నాకు తెలిసినంతలో వివరణ ఇవ్వగలను. పార్థునికి తన మరణ రహస్యం ఏమనేది పాండవుల సమక్షంలో చెబుతాడు. అదే శిఖండిని ప్రవేశ పెడితే తాను విల్లు ముట్టనని అంటాడు. అలానే ఇంకొక రహస్యాన్ని సైతం అంటారట.. అదేమంటే స్వతహ గా మానవ జన్మ పొందిన వారు జనన మరణాలకు అతీతం కాదని ప్రతితీ, కాని శాంతను దేవవ్రతుని ప్రతిజ్ఞ కు మెచ్చి ఇచ్ఛా మృత్యువు అనే వరం ఇస్తాడు. ఆ మూలాన కురు పాండవుల మధ్య సహేతుకానికి సంధికి పూనుకుని నాలుగు ఐదు తరాల వరకు జీవించి ఉండటం చేత పృథము సిద్ధి కలగదని చెబుతారు. పృథము అంటే భూమి. అలానే అంబను సైతం వద్దనుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించటం మూలాన పితృ ఋణం తీర్చని వారిగా ఆకాశం తనని తిరస్కృతము చేయగలదని చెబుతారు. అపుడు అర్జునుడు వీటిని దృష్టిలో ఉంచుకుని ఇటు నేల తాకక అటు నింగి లో తేలక ఉండేలా నడిమధ్యన తన శరాలతో శయ్య ఏర్పర్చుతారని అమ్మమ్మ ఉవాచ

      Delete
    3. ఉత్తరాయణంలో మరణించాలని ఆశించాడు కాబట్టి. తను యుద్ధంలో పడిపోయినప్పుటికింకా దక్షిణాయనమే కాబట్టి.

      Delete


  22. పనిలేని సింహములిచట
    పనిగట్టుకుని కెలికెనరె భారతమునహో
    తనివారెను చర్చలు భళి
    మన విదురుల బ్లాగులోన మహిని జిలేబీ :)


    నారదా !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి,
      మీ నారదుడు జపానగ్గిపుల్ల కాదు. :)



      Delete
  23. శర్మ గారు,
    పైన మీరు లేవనెత్తిన రెండు సందేహాల్లో రెండవ దానికి (అంపశయ్య మీద భీష్ముడు బోర్లా పడుకున్నాడా, వెల్లకిలా పడుకున్నాడా ?) వెల్లకిలానే పడుకున్నాడని రాజారావు గారు, శ్రీధర్ సరిగానే చెప్పారు కదా .... భూమిలో నిండి ఉబికి వచ్చిన నీరు తాగడం, గుచ్చుకున్న బాణాల వాడిమొనలు వీపు వైపు ఉండి అవి నేలలోకి దిగబడి శయ్య లాగా ఏర్పడడం, అర్జునుడు బాణాలతో తలగడ అమర్చడం. మరొకటి కూడా ఉంది .... వచ్చిన వారితో మాట్లాడడానికి వీలయ్యే పొజిషన్. కర్ణుడు ఒంటరిగా వచ్చి భీష్ముడిని పలకరిస్తాడు (దీని వల్ల మరొక సందేహం కూడా తీరిపోతుంది. అదే ... కర్ణుడు కురుక్షేత్రం దగ్గరే ఉన్నాడని).

    ఇక మీ మొదటి సందేహం ... గాంధారి శవాల్ని ఎలా చూడగలిగింది? కవిత్రయ స్త్రీ పర్వం ప్రధమాశ్వాసం రెండవ పద్యంలో వివరణ దొరుకుతుంది. “...... గాంధారీదేవికి వ్యాసమునీంద్రుడి వరంవలన అప్పటికప్పుడు దివ్యదృష్టి కలిగింది” అని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెబుతాడు.

    మీ అనుమానాలు సమంజసమే.

    ReplyDelete
    Replies
    1. >> గాంధారి శవాల్ని ఎలా చూడగలిగింది? వ్యాసమునీంద్రుడి వరంవలన అప్పటికప్పుడు దివ్యదృష్టి కలిగింది కాబట్టి.

      ఎందుకని చూడలేదండీ, ఆవిడ అంధురాలు కాదే! కాని ఆవిడ కనులతో ఆశవాలను చూడనిచ్చగించి అలా చేసిందా అన్నది స్త్రీపర్వం తిరుగవేసి చూడవలసి ఉంది. నియమభంగం చేసినది అనుకోను. దివ్యదృష్టి ఈసందర్భంలో ఆవిడకు అవసరం కాలేదే. నియమభంగదోషం లేకుండా వ్యాసభగవానులు అనుగ్రహించి కళ్ళతో చూడమన్నారా? ఈ విషయం విచార్యం. అదటుంచి, గాంధారి ఒంటరిగా రాలేదు కదా యుధ్ధభూమికి? కోడళ్ళతోనూ‌ పరివారంతోనూ‌ కలసి వచ్చింది. ఫలాని దేహం ఫలాని వ్యక్తిదని ఆమెకు ఎఱుక లేకపోవచ్చును - అది సులభగ్రాహ్యమే. కాని ఆదేహం ఫలాని వ్యక్తిది అని వివరంగా కోడళ్ళో పరిచారికలో ఆవిడకు సూచించరా? అందుచేత, ఈవిషయంలో సందేహం అవసరం లేదు.

      Delete
    2. పైన నా వ్యాఖ్యలో పొరపాటున స్త్రీ పర్వం ప్రధమాశ్వాసం అని వ్రాశాను. దాన్ని ద్వితీయాశ్వాసం అని చదువుకోవలెను.

      ఆ రెండో పద్యం తాత్పర్యంలో గాంధారి దివ్యదృష్టి గురించి చెప్పిన దానిలో తరువాతి వాక్యం (సందేహనివృత్తి కోసం):-
      ———————
      “దీని వలన ఆమె కళ్ళకు కట్టిన గంత తీయకుండానే యుద్ధభూమిలో సుదూరంగా ఉన్నప్పటికీ వస్తు సముదాయమంతా ప్రత్యక్షంగా కనిపించటం మొదలుపెట్టింది.”
      ———————
      కాబట్టి గాంధారికి కళ్ళగంతల నియమభంగం కలగలేదని తెలుస్తోంది.
      ఇక ప్రక్కనున్న వారు వర్ణించి చెప్పడం వేరు, తను స్వయంగా చూడడం వేరు కదా.

      Delete


  24. హమ్మయ్య ! చాలా కాలం తరువాయి కా, మింట్లు వందకు ఎగ బ్రాకు తున్నాయి :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి,
      కడుపు నిండిందా?



      Delete
    2. ఇంతకు భీష్మునిగడ్డపు
      బొంతవయసుతెలియదాయె,పోపోండింకన్,
      ఇంతకుమించినపనులిక
      సొంతవిలేవేమిమాకుసూ!టైమేదీ?


      Delete
  25. ఈ చర్చలో పాల్గొన్న అందరికి వందనాలు.
    ముఖ్యంగా శ్రీధర్ అమ్మమ్మ గారికి సాష్టంగ దండ ప్రణామాలు. ఆ తల్లి పెద్ద వయసులో మనుమని ద్వారా చర్చలో పాల్గొన్నందుకు చాలా సంతోషీంచాను.Thanks to Sridhar.
    మిత్రులు రాజావారు యుక్తి యుక్తంగా చెప్పినదానికి ఆనందం.
    బోనగిరిగారిచ్చినది ఉపయుక్తమైన విషయం దానికి వివరణ తోడితే బాగుంటుంది.
    చిరుకలల వారి ప్రశ్నకి జన సామాన్యంలో మరో సమాధానమూ ఉంది, శ్రీధర్ చెప్పినది కాక. దుర్యోధనుని పాపపు కూడు కుడిచిన పాపానికి ఇది ... అని.
    జైగారు, విషయాన్ని తార్కికంగా యుక్తి యుక్తంగా చెప్పేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు.
    శ్యామలీయం వారు విషయాన్ని వివరించినందుకు సంతసం. పనిలో ఉండి కూడా చర్చలో పాల్గొన్నందుకు ఆనందం.
    అసలు ఈ చర్చను ప్రారంభించిన విన్నకోటవారికి బహుధా కృతజ్ఞుడను.
    పక్కవాళ్ళని నీళ్ళలో తోసేసి గట్టున నిలబడి చప్పట్లు చరిచే జిలేబీ కి వందనం. ఇంకెప్పుడూ నీ పక్క నిలబడను బామ్మా :)



    ReplyDelete
    Replies
    1. ఈ చర్చ గోష్ఠిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ వంటి పెద్దవాళ్ళ మూలానే పురాణైతిహాసాలు ఇలా తలారు దాటి ప్రవహిస్తు ఉంది, ప్రవహిస్తూనే ఉండాలి. తెలుగు భాష దినోత్సవ శుభాభినందనలు మరీ ముఖ్యంగా బిజిలే అమ్మణ్ వారికి.

      Delete
    2. చిన్న వయసులో వీటి పట్ల మక్కువ చూపే నీకు అభినందనలు, నిన్నిలా తీర్చిదిద్దిన అమ్మమ్మగారికి వందనాలు.
      అబాయ్! నాకో అనుమానం అరవపాటీ గొప్పేంటి చెప్పూ :)

      Delete
    3. గరికపాటి లెక్కలో:

      "మహా భారతంలో పూర్తి మంచివాల్లూ, పూర్తి చెడ్డవాల్లు అంటూ ఎవరూ లేరు. ప్రతి పాత్రా.. తమ తమ పరిస్థితులనిబట్టి మంచిగానో, చెడ్డగానో వుంటుంది. అంతా మామూలు మనుషులే"

      ధుర్మార్గుడైన ధుర్యోధనుని పక్షం వహించినందుకు భీష్ముడికి ఆగతి పట్టింది అన్న వ్యాఖ్యలపై నా వివరణ.

      Delete
    4. నేను చెప్పినది లోకం లో ఉన్న మాట. లోకో భిన్నరుచిః గిరి గీచినట్ట్లు మనుషులు ఉండరు. మంచి చెడుల మిశ్రమమే మనిషి

      Delete
    5. శర్మ గారు.. మీ అనుమానానికి నాకు తెలిసిన దానికి బహుశ నక్కకు నాకలోకానికి గల వ్యత్యాసం ఉండవచ్చు.. ఏదైనా పొరపాటు ఉంటే తెలుపగలరు.
      ౧. అరవపాటి అంటే గరికపాటి లా భావిస్తే అతను గరికపాడు అనే ఊరుతో సంబంధముండే విధంగా ఆయా నామధేయం కలవారని అర్థం.. అలా చూసుకున్నా ఉలవపాడు.. ఆ ఉలవపాటి రసాలు, సపోటాల గురించి విన్నా గాని అరవపాడు అనేది ఏమో తెలియదు.
      బహుశ ఈ రోజు గిరాము గారి జయంతి కనుక తెనుగు భాష ఉత్సవం కనుక ఈ అరవపాటి అని శెలవిచ్చింది బహుశ ఈ తమిళియుల భాషపై వారికుండే మక్కువనే అంటారేమో.. వారికి హింది తెలిసినా ఇంగ్లిష్ తెలిసినా సినిమా పోస్టర్ల పై తమిళమే ఉంటుంది దాదాపుగా.. అలానే వారి హింది హింమిళ్, ఇంగ్లిష్ తమ్ళిషు.. అంటే అట్లా ఉంటుందని కాబోలు. ఈ రెండు కాని పక్షంలో ఆ పదం తాలూకు వివరణ మీకు వీలునుబట్టి ఇస్తే తెలుసుకుంటా..

      Delete
  26. హరిబాబుని వదిలేశావని అగ్గిపుల్ల గీసేస్తోందప్పుడే :)
    హరిబాబు గారికి.
    శ్రమ చేసి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. No problem sir!
      Hari is every where - omnipotent!
      JK.

      Delete


  27. With astrological software అతి‌త్వరలో ఓ పెద్ద టపా రాబోతోంది astrological signs mapping to Bhishma's DOB with kurukshetra war times and figuring out Bhishma's age :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నిజంగా జిలేబి నుంచే ఈ టపా :)

      Delete

  28. ఎల్లరకు తెనుగు దినోత్సవ శుభకామనలు.

    ReplyDelete
    Replies
    1. తెలుగు దినోత్సవం అనేది ఒకటి వుందని నాకు మీవల్లే తెలిసింది. అందరికీ కృతజ్ఞతలు. శుభాకాంక్షలు.

      Delete

    2. తెనుగు వాడుక భాషా ఉద్యమకారుడు గిడుగు (గిడుదు వేంకట రామమూర్తి గారి) వారి పుట్టిన రోజు సందర్భంగా తెనుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం

      Delete
  29. Karna kept out during the first ten days of the battle, though all his men participated in it.
    From Rajaji Mahabharata.

    ReplyDelete
    Replies
    1. Sir,
      I suppose it was in English. It is not known which text he followed. Thanks for the info

      Delete
  30. తిక్కనకున్ వేమనకున్
    మ్రొక్కెద గురజాడ గిడుగు మొనగాళ్ళకు, నా
    చక్కని తెనుగుకు మీగడ
    చిక్కని రుచులద్ది సేవ జేసినవార్కిన్ .

    ReplyDelete


  31. ఈ పద్యం ఇక్కడ మీ బ్లాగులో వేయబోయి మా ‌బ్లాగులో వేసినట్టు ఉన్నారు రాజా వారు. స్వీకరించండీ :)

    అంద రరగొర చదువరుల్
    కొందరు గొప్పకు చనెదరు కోవిదులగుటన్
    ఇందున తెలిసినదేమన
    గందరగోళమ్మె గాని కనము జవాబుల్ .



    లరారా‌.

    ReplyDelete
    Replies
    1. బామ్మా!
      ఈ సలహా లరారా వారు మీకు మీ బ్లాగులో ఇచ్చిన సలహాయే చూశారో లేదోనని :)


      తాత కనుదెరిస్తే మన
      పాతకథలు దెలియగలవు పండితవర్యా!
      ఏతావత్ మనమంతా
      ఓతరహాస్నేహితులమె ఓరిమిపడతాం .
      లరారా

      Delete

  32. అందరికి వందనం,
    పాండవులది న్యాయమా? కౌరవులది న్యాయమా? అన్న విషయం మీద అనేక భారతం మీది విషయాల మీద, మన మునుపటి తరాలవారు పెద్ద పెద్ద చర్చలే చేశారు, కోర్టుల్లో కేస్ లు కూడా నడిపారు.

    ఇప్పుడు నేను కొత్తగా చర్చ పొడిగించదలచుకోలేదు. ఇక ముందు ఈ టపా మీద కామెంట్లు ప్రచురించబడవు. గమనించగలరు.

    ReplyDelete
    Replies
    1. >>కోర్టుల్లో కేస్ లు కూడా నడిపారు.


      Is it true??😳😳😳😳

      Delete
  33. // “ఇప్పుడు నేను కొత్తగా చర్చ పొడిగించదలచుకోలేదు. “ //

    మంచి నిర్ణయం. అసలు మీరు నిన్ననే వందన సమర్పణ కూడా చేసేశారుగా. దాని తరువాత సభకు స్వస్తే కదా 👍🙂.

    ReplyDelete
  34. Namasthe. Vedas World Inc is conducting **Vishanumuktha Maha Yajna, in a Large Scale at Multiple Locations, starting Aug 19th. **Virus and Pollution is reducing in the cities where Yajna is happening, related research and results avialble at https://vedas.world/

    Please watch the *Special event in few hours, Pravargya Shroutha Yajna in Rajahmundry tonight 11:30PM to 2:30AM EST (Mon Aug 31, 9AM to 12PM IST)*

    *Facebook Live* (search for Vedas Word) https://www.facebook.com/groups/158605854842852

    Free Event, Donations Welcome http://www.vedas.us/Donate.html

    ReplyDelete
  35. రాజమండ్రిలో స్వంత నిధుల్ని వెచ్చించి యజ్ఞవేదికలను నిర్మించి హోమద్రవ్యాలను సేకరించుకుని వేదపండితులను ఎంచుకుని గత పది రోజుల నుంచి ప్రజాసేవ చేస్తున్న గోదావరి దివ్యజ్ఞాన సమాజం వారికి మన వంతు సాయం చేసే అవకాశం వచ్చింది.

    వారికి ధనసహాయం చెయ్యాలనుకున్న వైదిక ధర్మ అభిమానులు ఈ క్రింది వివరాలను ఉపయోగించుకుని తమ శక్తి మేరకు ధర్మ కార్య నిర్వహన చెయ్యగలిగితే వైదిక ధర్మం విశ్వవ్యాప్తం కావడం అనే మన లక్ష్యం నెరవేరడానికి ఎంతో కాలం పట్టదు.రాజమండ్రిలో జరుగుతున్న యజ్ఞం యొక్క ప్రయోజనాలను ప్రముఖ data analyst చాలా సాశ్త్రీయమైన పద్ధతిలో అంచనా కడుగున్నారు.ఆ సాక్ష్యం సర్వులకీ విదితం అయ్యాక అతి త్వరలోనే ప్రపంచం మొత్తం రాజమండ్రిని అనుసరిస్తుంది!

    GODAVARI THEOSOPHICAL SOCIETY
    Andhra Bank, Dowlaiswaram
    SB a/c : 010410100195068
    IFSC Code : ANDB0000104
    MICR Code : 533011113
    Swift code : ANDBINBB

    PhonePe/Gpay : 9491380487

    జై శ్రీ రామ్!

    ReplyDelete
    Replies
    1. Thank you for the info. This is what I require

      Delete
    2. Today, that means now pravargya is running. It is live now at this link `https://www.facebook.com/GodavariTS1933/videos/774961226604858/`

      Please have a look at how a yajnam will be performed.

      Delete