Sunday, 9 August 2020

ఓ!వియ్యపూరాలా



ఓ!వియ్యపూరాలా
ఓ!వయ్యారీలోలా
నీ వయ్యారామూలే........Iఓ!I

కయ్యాలామారీవీ
గయ్యాళీ గంపావూ
కయ్యంబూ నీకేలా.........Iఓ!I

 వధువుతల్లి  వరుడితల్లినుద్దేసించి పాడేపాట.ఇంకా ఉందేమో తెలియదు. వియ్యపురాళ్ళని వీరకత్తిలని అనడం కూడా ఉత్తరాంధ్రలో అలవాటు.పాట వినడానికి సొంపుగా ఉండి. ఏదో ఛందస్సుకు చెందేదిలాగానూ కనపడుతోంది.జానపదులలో ఎంత గొప్ప కళ దాగిఉన్నదో కదా!

31 comments:



  1. బండి వారు వచ్చి మిగతావి కట్టేస్తారు :)

    ReplyDelete
  2. బండి వారు అంత సమర్థులే గానీండి వారు ఉత్తరాంధ్రులు కాకపోవడం ప్రధాన సమస్య, “జిలేబి” గారూ? ఆ, ఇంకా “కొత్తావకాయ” గారు అనండి, మరింత సబబుగా ఉంటుంది. ఎందుకంటే వారు ఫక్తు ఉత్తరాంధ్రులు కదా.

    ReplyDelete
  3. శర్మ గారు,
    పాట పూర్తి పాఠం లభ్యమైతే మరింత సొగసుగా ఉండేది. కానివ్వండి.

    అవును సర్. ఉత్తరాంధ్రాలో వియ్యపురాలిని “వీరకత్తి” (ఏమిటో, “విరక్తి” లాగా ధ్వనిస్తోంది 🙂) అనడం గంజాము సైడు మాండలికం అని “ఆంధ్రభారతి” సూచిస్తోంది. మీకెలా తెలుసు?

    ReplyDelete
    Replies


    1. తాతగారికి తెలియనిదంటూ ఏదీ లేదు :)

      Delete
    2. విన్నకోటవారు, Zilebi.

      ఈ పాట ఉత్తరాంధరవారిదే కాదండి.సమయం వచ్చింది కనక వియ్యపురాలికున్న మరొక మాట ఉత్తరాంధ్ర మాండలికంలోది చెప్పేను. మన బ్లాగులలో ఉత్తరాంధ్ర మాంండలికం రాసేవారు చాలామందే ఉన్నారండి. అవసరానికి రాస్తారు :)నాలా చెప్పరు.నాకు ఉత్తరాంధ్ర మాండలికం అందునా విజయననగరం మొదలు గంజాం వరకు పల్లెలలో మాటాడే మాండలికమంటే మక్కువ. ”మక్కువ” ఒక ఊరుందండి :)

      పాట చిన్నప్పుడు విన్నది గుర్తొచ్చి కంప్యూటర్ మీద పెడితే ఇలా వచ్చింది.

      వియ్యపురాల
      ఓ! వయ్యారిలోల
      నీ వయ్యారము లేలనే
      కయ్యాల మారివి
      గయ్యాళి గంపవు
      కయ్యంబు నీకేలనే.

      చూస్తే ఎగుడు దిగుడుగా కనిపించింది.మార్పులు కూర్పులు కొద్ది కొద్దిగా చేసి ఒక రూపానికి తెచ్చాను. UIUUUU. ఇది పద్యమా? పాటా? తెలియలేదండి. సంస్కరించిన దానిని అలా పాటగా ఉంచేశాను. మూడు పాదాల పద్యం ఉంటుందా? సంశయం. ఆరుపాదాల పద్యమా? కావచ్చు. తొమ్మిదక్షరాల నాలుగు పాదాల పద్యం చేస్తే అనిపించింది. అలా చేస్తే నడక కుదరలేదు. ప్రాస కుదరలేదు. ఏమో నాకిది నచ్చింది.పాట ఇంకా ఉందా? తెలియదు, గుర్తు రాలేదు. తెలిసినవారు చెబితే శానా సంతోషం

      Delete


    3. స్వల్ప అడ్జస్ట్ మాడి :) షట్పదము

      పదాలు వేరే యేదైనా వుండొచ్చు ( జనపదం కాబట్టి)


      వియ్యపురాల ఓ
      వయ్యారిలోల నీ
      వయ్యారములవేల వారజాక్షి
      కయ్యాల మారివి
      గయ్యాళి గంపవు
      కయ్యంబు నీకేల క్రాలుగంటి


      షట్పదము
      జిలేబి

      Delete
    4. ఈ విషయమై కొంచెం ఆలోచించి వ్రాస్తానండీ.

      Delete
    5. ఇది సీసపద్యఛందానికి దగ్గరగా ఉంది .

      వియ్యపురాల ఓవయ్యారిలోల నీ
      వయ్యారములవేల వారజాక్షి
      కయ్యాల మారివి గయ్యాళి గంపవు
      కయ్యంబు నీకేల క్రాలుగంటి

      Delete


    6. వాహ్! షట్పదమే సీసమాయె!

      సీ, సమ్ :)


      జిలేబి

      Delete
    7. జిలేబి
      భేష భేష్!
      షట్పదిగా చేసినందుకు మెచ్చేను.
      బల్బ్ లేట్ గా వెలిగిందేం :)

      Delete


    8. బల్బు ఎప్పుడంటే అప్పుడు వెలిగించి ఎనర్జీ వేష్టు చేసుకోమండోయ్ :)



      జిలేబి

      Delete
    9. అంచేతనే ఎల్ ఈ డీ: లాజిక్ ఎన్హాస్డ్ డిస్కషన్ లైట్.. డిమ్ కావు.. ఎనర్జీ సేవు.. బ్రైట్ లుక్.. ఈకో ఫ్రెండ్లి.. అదసలు లైట్ ఎమిటింగ్ డయోడ్ లెండి.. మీ జిలేబుల పాక పద్యమున జోడింతిని మన్నికుణుమ్ మట్రుమ్ వణక్కం.. ఇదెల్లామే "బాన్ గియొర్నో"..!

      Delete
    10. గంజాము: గంజి ఆము..!
      ఋషికుళ్య నది ఒడ్డున ప్రవహించే ఊరు.. గంజాము ఒడిషా.. ଗଂଜାଂ, ଓଡିଷା

      Delete
  4. భావం, భాష, ఆచారం, సందర్భం అన్నిటినీ కలబోసిన బహుచక్కని పదాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. బాణీ కూడా దొరికితే ఇంకెంత బాగుణ్ణు!

    యతి, ప్రాస, ఛందస్సు ఇవేవీ జానపదాలను బందించలేవు. భారత దేశ మట్టివాసన ఒలికే గీతాల రూటే సెపరేటు.

    ReplyDelete
    Replies
    1. యతిప్రాసలూ ఛందస్సులూ‌ బంధనాలు అనుకొనే వారికి తప్పక అవి బంధనాలే. కాని జానపదాల్లో అవి బాగానే‌ కనిపిస్తాయి. ఆ యతిప్రాసలు తెలుగు నుడికారంలో ఒక భాగం కాని వేరు కాదు. ఎన్నో‌ జానపదగీతాల్లో ఛందస్సుల పరుగులు చక్కగా చూడవచ్చును. ఎటొచ్చీ తెలుగుదనం నుండి మనం దూరంగా పోతూ అవన్నీ బంధనాలూ‌ అనుకొనే పరిస్థితికి వచ్చాం. ఈమాటలు నేను వాదన కోసం చెప్పటం లేదు. మీకు నాపలుకులపై నమ్మకం లేకపోతే వాదించే ఉద్దేశం కూడా లేదు.

      Delete
    2. జనసాహిత్యంలో అప్పటికే ఉన్న శైలి & పోకడలను అధ్యయించి ఛందస్సు నియమాలను రాసుకోవడం (తయారు చేయడం కాదు) జరిగిందనే నేనూ అంటున్నాను.

      జానపదాలు సహజంగా సమాజం నుంచి పుట్టుకొచ్చినవి, ఒకరు పని కట్టుకొని రాసేవి కావు.

      ఇటీవలి నియమాలు కొత్తగా రాస్తున్న వారికి తప్పక ఆవశ్యమే కానీ సదరు నియమాలకే కారణభూతమయిన జానపదాలను అవి శాసించజాలవు.

      Delete


    3. స్వామీ గొట్టిముక్కలానంద జనపద్ మహారాజ్ కీ జై :)



      జిలేబి

      Delete
    4. జై గారూ, నేను అనలేదు కదండీ జానపదాలను శాసిస్తున్నారనో శాశించాలనో!

      Delete
    5. సంగీతానికి మాతృక జానపదాలు. పాటనడక లోనే రాగం తాళం ఉంటుంది. తాళం నుంచే ఛందస్సు , పాట నుంచే రాగం కూడా ఏర్పడింది. జానపదం తల్లి అయితే రాగం తాళం పిల్లలు. అవి అంది పుచ్చుకుని పండితులు, విద్వాంసులు రాగానికి తాళం లేదా ఛందస్సుకు వ్యాకరణ శాస్త్రం నిర్మించారు. తల్లి వేరు నుంచి పుట్టుకొచ్చిన పిల్ల వేర్లు మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించాయి అనుకుంటున్నాను. గంగోత్రి లో ఉద్భవించి గంగా మహా నదిగా విస్తరించిన తీరుగా.

      Delete
    6. ఈ పాటలూ పద్యాలూ సాహిత్యమూ భాషాపోడుములూ అన్నీ జానపదుల సంపదలు . పండితులు వాటి దురాక్రమణదారులు . వారి భాషావ్యవహార మనోఙ్ఞతలను చెడగొట్టి , ఆ నెన్నుడుల నుడికార సొంపును గ్రామ్యాలనీ , అసాధువులనీ ఈసడించుకుంటున్నారీ దురహంకారులు .

      Delete
    7. మిత్రులు రాజారావు గారు‌, మరీ అంత పండితద్వేషం అవసరం కాదేమోనండీ. సజ్జనులూ దురహంకారులూ అన్నిచోట్లా ఉంటారు కదా. కేవలం మీకు పండితులపై పగ ఎందుకు చెప్పండి. కాదు పండితులంతా దుష్టులే అని మీరంటే, అది మీ అభిప్రాయం మాత్రమే. పోనివ్వండి, మీ ఆలోచనలూ అనుభవాల కోణంలో నుండి చూస్తే అలా మీకు అభిప్రాయం స్థిరపడి ఉండవచ్చును. వాదన కోసం కాక నాకు తోచిన మాట చెప్పా లనిపించి ఇలా వ్రాసా నంతే.

      Delete
    8. "జానపదం తల్లి అయితే రాగం తాళం పిల్లలు"

      ఈ అవగాహన సబబుగా ఉంది.

      "అంది పుచ్చుకుని పండితులు, విద్వాంసులు రాగానికి తాళం లేదా ఛందస్సుకు వ్యాకరణ శాస్త్రం నిర్మించారు"

      నిజమే కాకపొతే "అంది పుచ్చుకున్న" వివరణకర్తలు తామే సృష్టికర్తలమని చలామణీ చేసుకోవడంతోనే ఇబ్బందంతా. ఏది పూర్వ సహజసిద్ధ కళ, ఏది తదనంతర సాంకేతిక వర్ణనా విశ్లేషణ అనే తేడా గుర్తిస్తే ఎటువంటి సమస్య రాదు.

      Delete
    9. మీరు శాస్త్రగ్రంథాలు చూసి ఉంటే, వివరణకర్తలు వినయవర్తనులే నని సులువుగానే తెలుసుకొనే వారు. కనీసం పెద్దలు వ్రాసిన వ్యాసాలవంటి వాటిని చదివినా అలాగే అనుకొనే వారు. శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఒక వ్యాసంలో సంగీతంలో కొన్ని రాగాల పుట్టువుల గురించి చెబుతూ భైరవి రాగం కుక్క అరుపు మూలంగా వచ్చినది అన్నారు - ఇంకా జానపదుల నుండి గ్రహించిన వాటినీ చెప్పారు. మనం అవేమీ పట్టించుకునే ప్రయత్నం చేయకుండానే పెద్దలూ పండితులూ అంతా దురహంకారులూ దొంగలూ వగైరా అనుకుంటూ ఉండటం చాలా శోచనీయం.

      Delete
    10. గురువు గారూ, నేనెవరినీ తక్కువ చేయలేదు. వ్యక్తిగత వినయం ఉందా లేదా ముఖ్యం కాదు "సైద్ధాంతిక క్రమం" గురించే నా తపన.

      "ఎన్నో‌ జానపదగీతాల్లో ఛందస్సుల పరుగులు చక్కగా చూడవచ్చును" అని మీరన్నారు. నేను ఇందుకు భిన్నంగా "ఎన్నో‌ జానపదగీతాల్లోని ఛందస్సు పరుగులలో *పలు* అంశాలను ఆ తరువాత *అధ్యయనం చేసిన వ్యక్తులు* చక్కగా అర్ధం చేసుకోగలిగారు" అంటున్నాను. ఇదొక్కటే తేడా.

      బాట్స్మన్ మెళుకులు కామెంటేటర్ అర్ధం చేసుకున్నాడా లేదా వ్యాఖ్యాత చెప్పిన పద్దతిలో ఆటగాడు ఆడాడా? ఇవే ప్రశ్నలు అనేక రంగాలలో ఉంటాయి. ఏది కార్యం ఏది పర్యవసానం తెలుసుకుంటే సమస్యే లేదు.

      Delete
    11. పెద్దలు శ్యామలరావుగారికి నమస్సులు .
      పండితుల , కవులయెడల నాకు ద్వేషం లేదండి .
      వారి అహంకారం మీదనే చిక్కంతా . సాధుత్వాసాధుత్వాలమీదనే ఇబ్బంది . నిజాలను దాటవేసే ధోరణి మీదనే అసహనం . ఇతరులను నిరసించడం మీదనే వళ్ళుమంట . మీరూ అలాంటి పండితుల పండితుల పక్షం వహించ వద్దని మనవి .
      ధన్యవాదాలు .

      Delete
    12. జై గారు,
      జానపదాన్నేదీ శాసించలేదు. చిత్రంగా ఛందస్సే జానపదాన్ని అనుసరిస్తుంది. జానపదంలో ప్రతి ప్రక్రియని ఛందస్సు అంది పుచ్చుకుంది. చిన్న అక్షర మార్పును కూడా ఛందస్సు అందిపుచ్చుకున్నట్టే ఉంది, మనం వెతుక్కోగలగాలండి.

      Delete
  5. శర్మ గారు. ఈ పాట పల్లవి కి ఒసేయ్ చేర్చి

    ఒసేయ్ వియ్యపురాలా
    వయ్యారిలోల
    నీ వయ్యారము లేలనే
    కయ్యాల మారివి
    గయ్యాళి గంపవు
    కయ్యంబు నీకేలనే.

    ఇప్పుడు ఒసే వయ్యారి రంగి వగలమారి బుంగి పాట పల్లెటూరి బావ సినిమాలోని ది. ఈ బాణీలో సరిగా కుదురుతుంది.😁

    ReplyDelete
    Replies
    1. బుచికి గారు,
      కయ్యాల మారివి
      గయ్యాళి గంపవు
      కయ్యంబు నీకేలనే.
      బలే అంది కదండీ! జిలేబి గిర్తొస్తోంది కదా :)

      Delete


  6. ఇక్కడ ఏదో అగ్గి రాజిల్లుకుంటోంది :)


    నారదా కాస్తా ఘృతమును తెమ్మా :)



    జిలేబి

    ReplyDelete
  7. కానీండి, ఘృతాచీలను
    రానీండి మహానుభావ!రాకాచంద్రా!
    ఙ్ఞానులు తమరున్నారుగ ,
    ఐనా, ఘృతమేల?శానిటైజరులుండన్.

    ReplyDelete
  8. రాజా వారు,శ్యామలీయంవారు.
    ధన్యవాదమ్స్ :)

    ReplyDelete