మావగారు వినండి.
==================
కన్యాదాతలైన మావగారు వినండి.
చెలిమితోడ మీ అల్లుడి కోర్కెలు చెప్పెద వినండి.
మాటిమాటికి వచ్చేలా మారుతి ఇవ్వండి.
ఫస్ట్ క్లాస్ గోల్డ్ చైన్ మా బ్రదర్ కి ఇవ్వండి.
కాలేజీ దూరం స్కూటర్ ఇవ్వండి.
ఫస్ట్ క్లాస్ బ్రాస్లెట్ మా బ్రదర్ కి ఇవ్వండి.
చాలినంత కట్నం చదువుకి ఇవ్వండి.
ఇంతకు మించి కోర్కెలు మరి ఏమీ లేవండి.
ReplyDeleteఆశ దోసె అప్పడం వడ.
కాలాలు మారిపోయేయి యిప్పుడు.
మా అబ్బాయికి పెళ్లికావటంలేదండీ అమ్మాయిల డిమాండ్ ఎక్కువై పోయిందనేవారే ఎక్కువ ఈ నడుమ
జిలేబి
బామ్మా!
Deleteఏం అనుకోవద్దూ! మనలో మనమాట.కాబోయే అత్తగార్లని చూసి జడుసు కుంటున్నారేమో ఆడపిల్లలు.
ఇప్పుడంతా రివర్స్ ట కదా? అదీగాక అత్తమామలతో కలిసి ఉండటం కూడా గణనీయంగా తగ్గిపోయినట్లు అనిపిస్తోంది కదా? అయినా అసలు సంగతి మీకు తెలియకనా, శర్మ గారు.
Deleteసమానమైన చదువులు ఉద్యోగాలు, విదేశావకాశాలు, తద్వారా లభిస్తున్న ఆర్థిక స్వాతంత్ర్యం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ. టెక్నాలజీ / మీడియా ప్రభావం ... పెళ్ళి విషయంలో పాత్ర వహిస్తున్నాయనిపిస్తోంది. స్వంత నిర్ణయాలు, కొండెకచో తప్పటడుగులు. రేజులు మారాయి అనడానికి తార్కాణాలు.
കായി ലൊല്ലി, മാര് ബാധ തോന അത്രാ മസക്രീ നീ ലാഗ്രോചകു ജിലേബീ
Deleteవిన్నకోట నరసింహా రావుగారు
Deleteఅత్తామామలతో కలిసుండే వారెక్కడో, తక్కువ. పాతకాలంలో లా అథారిటీ చలాయిద్దామనుకున్నవారి కొడుకులకు పెళ్ళిళ్ళే లేవు. ఇప్పటి ఆడపిల్లలకి మీరు చెప్పినవన్నీ అవసరమే, ఒక్క తప్పటడుగులు తప్ప. ముదురు బెండకాయలే ఎక్కువ కనపడుతున్నాయండీ!
మిత్రులందరికి
ReplyDeleteజన్మాష్టమి శుభకామనలు.
This comment has been removed by the author.
Delete
Deleteమీ లాంటి పప్పు సుద్దలు వున్నంత వరకు మాలాంటి జిలేబులకు ఢోకా లేదండి :)
జెకె:)
జిలేబి
జిడ్డు పాకం.. కరకర లాడే తత్వం..
Delete(:
తూచ్..!
సరదా కి రాస్తే..
నారదా.. నారాయణ నారాయణ
కష్టేఫలి శర్మ గారు రాసిన టపాకి అణుగుణంగా.. విన్నకోట వారి వ్యాఖ్యకు ధీటుగా.. జిలేబి వారి గద్యపద్యాల కలయికతో జెకె అంటే జరిగింది కదా.. అనో.. లేక జస్ట్ కిడ్డింగ్ అనో తెలియలేదు వరుధిని గాలు
Delete:'(
Delete
Deleteఇంత భయమా :) కామింటునే డెలీటు కొట్టేసేరు ? :)
భయము కాదు వరూధిని గారు.. తాత్కాలిక తడబాటు
Deleteభయంబు కాజాలదు వరుధిని వారు.. తత్కాలీన తత్తరబాటు
ఎవరు రాయి విసిరితేనేమి.. దెబ్బ గట్టిగానే తగులుతుంటే
Deletesri(dharani)tha,
DeleteSurvival of the fittest.రాళ్ళు విసరడం నేర్చుకోండి. :)
యస్ సర్.. దీజ్ డేస్ ఆర్ సచ్..! ఒక సామేత ఉంది.. "ఖావ బాపురో గావీరారో" అని అంటే పెళ్ళయ్యాక పుట్టినింటి కట్నం తీసుకొచ్చి దాంతోనే దంపతిలువురు తిని.. మా వారే గొప్ప.. మా నాన్న నాకేమిచ్చాడని తిరగమోతేసే కూతుళ్ళుంటారని షార్ట్ గా "తినేది తండ్రిది.. పొగిడేది భర్తని అని".. కాకపోతే నా విషయంలో "ఖావీరారో గావ బాపురో" అయ్యింది.. కాని కట్నం ఆశించకుండా పెళ్ళాడిన నాకు.. నాదే తిని మా పుట్టింటివారే గొప్ప నీకన్న అంటేనే అపుడపుడు చిర్రెత్తుకు వస్తది.. కాని సహధర్మచారిణిని ఏమి అనలేము.. మన ప్రతిబింబాన్ని మనం హేళన చేసి రాయి విసిరితే పగిలే ఆ అద్దం గుండెలోతులో గాయం చేయగలదని తెలిసి ఇంగితం తోనే మసలుకోవాల్సి వస్తోంది. ఐతే తాను మరీ అంత గయ్యాళి ఐతే కాదు.. ఎటొచ్చి అపుడపుడు ఈ కలహాలు, విరహవేదనలు ఈ రెండున్ పావేళ్ళలో అలవాటు చేసుకుంటున్నా సర్..
Deleteధర్మ పత్ని: మనం ఎంతటి ధర్మం చేసినా అందులో పుణ్యం సగభాగం తనకే.. మనం ఏ పాపం చేసినా, తానేం పాపం చేసినా అది మనకే..
నా భార్యను నేను గుండెల్లో పెట్టుకుని చుస్కుంటున్నా.. అంతా ఆ వేంకట నారసింహ లీలా వినోదం.. మా దాంపత్యం మూడు మౌనాలు ఆరు అరుపులుగా విడదీయని బంధమై ఆచంద్రతారార్కం నిలవాలని మనసార మనఃపూర్తిగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటు.. ఎందుకంటే.. చివరాఖరి ఘడియలో మగనికి ఆలి తోడు ఆలి కి మగని నీడయే శ్రీరామ రక్ష.. ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు.. రెండున్ పావేళ్ళే గదా.. హా పచ్చ పచ్చ సే యాన్ వేవాసు
ఇదటుంచి..! నో రిగ్రెట్స్.. భార్య అలకను సత్యభామ తో.. భార్య ఔనత్యం సీతదేవితో.. భర్త సహనశీలత కృష్ణునిలా.. భర్త ఔదార్యం రామునిలా ఉండాలని ప్రతి దంపతులు కోరుకోవాలి.. అదే అన్యోన్యతకు తార్కాణం గురువర్య..!
మీరెలా ఉన్నారు.. మీ ఆరోగ్యం ఎలా ఉంది.. కోవిడ్ కాలములో తగిన జాగ్రతలు పాటిస్తున్నారని ఆశిస్తున్నా..!!
యద్యదాచరతి శ్రేష్ఠః తద్తదేవేతరః జనాః।
సా యత్ ప్రమాణం కురుతే లోకాః తత్ అనువర్తతే॥ (కర్మ యోగః తృతీయో అధ్యాయః ఏకోనవింశతి శ్లోకః)
నాకేదో లీలగా గుర్తుంది .... కొంతకాలం క్రితం వరకు “శ్రీధర్ భుక్యా” అనే పేరుతో ఒకరు బ్లాగులోకంలో చురుకుగా తిరుగుతుండేవారు. అప్పుడప్పుడు వేరే భాషలో కూడా వ్రాస్తుండేవారు.
ReplyDeleteపైన కామెంటిన “sri(dharani)tha” వారేనా .... ఇప్పుడు ధర్మపత్నీ సమేతస్యగానా??
ఔను ఆచార్య వర్య.. ఆ శ్రీధర్ భూక్యా నే నేను.. రెండున్ పావేళ్ళ క్రితం వివాహమయ్యింది.. అంచేతనే ధర్మపత్ని పేరును నా పేరు చివర మిళితం గావించి (పెన్ నేమ్) పెట్టుకున్నా.. మాకు పదిహేను నెలల పాప కూడా.. [దాదాపు మూడేళ్ళ క్రితం మీరు, శర్మ గారు, శ్యామల్ రావు గారు, పద్మ గారు, నాగ మల్లేశ్వర్ రావు గారు నాకు చిన్నపాటి (అప్పటి యాతన పెద్దదే లెండి) ఇన్సిడెంట్ జరిగిందని తెలిసి పరామర్శించారు..!
Deleteశ్రీధర నామధేయస్య ద్వీవత్సర కాలగమనానంతరే సతి సమేతస్య అభవతామ్. వత్సరానంతరే వయమపితు తనయా జాత.. అనట్టు మా చిట్టితల్లి పేరు శరణ్య.. ముద్దు పేరు చూచూలు.
సదా మీ అందరి శుభాశిస్సులు కోరుతు..!
కరోన సమయమందు తామెల్లరు క్షేమమని తలుస్తున్నా
~శ్రీత ధరణి
మీరు ఆ శ్రీధర్ భూక్యానే అన్నారు కాబట్టి మీకు జరిగిన ఆ ప్రమాదం గురించి నాకు గుర్తుందండి. దాని ప్రభావం నుండి పూర్తిగా కోలుకున్నారని ఆశిస్తాను.
Deleteఒక ఇంటివారు అయినందుకు మీకు, మీ శ్రీమతి గారికి అభినందనలు (కాస్త లేటుగా) 🌹🌹. తల్లితండ్రులు అయినందుకు రెట్టింపు అభినందనలు 👍. మీ కూతురు చి.శరణ్యకు ఆశీస్సులు .... శతమానం భవతి ✋.
హా.. ఔనండి.. ఆ నొప్పి నుండి పూర్తిగా కోలుకోవటానికి దాదాపు మూడు నెలలు పట్టాయి.. ఇపుడు క్షేమమే.. నేను మీ అందరికి విన్నవించటమే లేట్ అయ్యింది.. మీ అభినందనలకు సదా పాత్రుణ్ణి.. సతిపతి ఇరువురం క్షేమం.. మా తనయా చూచూలు కూడా.. శరణ్య కంటే ఎక్కువగా చూచూలు అనే పిలుస్తాం అందరం.. ఆ దుర్గక్క (అమ్మవారిని అలా పిలుస్తు ఉంటాను.. ఆమేది నవ్వులొలికే స్వభావం కనుక) ఆశిస్సులతో మాకు కలిగిన సుపుత్రికకు తగిన నామకరణం శరణ్య గా ఆ తల్లి పేరునే పెట్టుకున్నామన్నట్టు.. పుట్టు వెంట్రుకలు బెజవాడ లో సమర్పిస్తామని మొక్కుకున్నామ్.. ఈ కరోనా వలన కుదరటం లేదు.. ఐతే తన మూడో ఏటనే ఇక తలనీలాలు సమర్పించుకోవాలేమో.. మీ అభిమానాశిస్సులు సదా సర్వదా ఉండాలని అభిలాషిస్తు..
Deletehttps://youtu.be/twl56JMNNjA
ReplyDeleteఈ తమిళ్ పాట కు తెలుగు క్యాప్షన్ (సబ్ టైటిల్) పెట్టి చూడండి.
https://youtu.be/IarsrX60bZw
ఈ తమిళ్ పాటుకు ఇంగ్లిష్ సబ్ టైటిల్ పెట్టి చూడండి
శ్రీధర్ గారు,
ReplyDeleteమీ వ్యాఖ్యానాలతో నా బ్లాగును ముంచెత్తారు, మీ అభిమానానికి ధన్యవాదాలు. విడివిడిగా సమాధానాలివ్వలేని అశక్తతతని మన్నించండి. మీ జాయ పతి,పుత్రి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పరమాత్మని వేడుకుంటున్నా!
ఈ అనుకోని పద వరదకు క్షంతవ్యుణ్ణి.. చానాళ్ళకి అందరిని ఇలా బ్లాగ్ ముఖంగా కలిసే సరికి కట్టలు తెంచిన ఆనకట్ట అయ్యింది.. మీ శుభాశిస్సులను శిరసా వహిస్తు.. మీరందరు కూడా బాగుండాలని ఆశిస్తు
Delete~ശ്രീധര് ഭൂക്യാ