Wednesday, 18 May 2016

చలి వేంద్రం


12 comments:



  1. చలివేంద్రమనుచు తాటా
    కుల కప్పును చూపిరి గద ! కుండయు లేదే !
    తెలిసెను యెండలు మండెను
    నిలువను చల్లన జిలేబి నీడయు యిదియే !

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,
      ఎండ మండిపోతోంది కదా! కుండలోపలెట్టేడు, మంచి నీళ్ళకి వచ్చిన మనిషి నీడలో ఉండడానికి ఏర్పాటుగా ఖాళీ ఉంచాడు.
      ధన్యవాదాలు.

      Delete
  2. చలివేంద్రం మన పూర్వీకులు ప్రవేశపెట్టిన సేదదీర్చే గొప్ప ఏర్పాటు. దాన్ని కూడా ఈనాడు కొందరు నీచపు వ్యక్తులు (అటువంటి వారిని మనుష్యులు అనడం నాకిష్టం లేదు) మృత్యుకేంద్రాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు (రాజకీయ కారణాలయ్యుంటుందేమో). నిన్నటి పత్రికలో వార్త - కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కడప జిల్లాలోని ఓ ఊరిలో సర్పంచ్ గారి చలివేంద్రంలోని నీటికుండల్లో విషపుగుళికలు కలిపారట 😳. నీరు వాసన వస్తుంటే స్ధానికులు అనుమానపడి పోలీసులకి సమాచారం అందిస్తే వారొచ్చి ఆ నీటిని "తొలగించారట".
    సమాజంలో కౄర మనస్తత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది కూడా మన "జన్యువు"ల్లోనే ఉందనుకోవాలా? 🤔

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      వీటిని చూస్తుంటే ఏమనాలో,ఏమనుకోవాలో తెలీటం లేదు.

      ధన్యవాదాలు.

      Delete
    2. అంతేకాదండి. విలువలు పతనమయిపోయిన సమాజంలోని భ్రస్టుకి మరొక ఉదాహరణ మొన్నటి వార్తాపత్రికలో వచ్చిన వార్త అవధరించండి - హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ("ఆసుపత్రి" అనకూడదని బ్లాగుల్లో ఒకరు వ్యాఖ్యానిస్తుంటారు; కానివ్వండి ఆయన సూచించినట్లుగా "వైద్యశాల" అనే అందాం) బ్లడ్‌బ్యాంక్ ఉద్యోగొకరు రక్తంబాగ్‌లో నుండి సగం రక్తం సిరంజ్‌తో తీసేసి ఆ ఖాళీని సెలైన్‌తో నింపుతున్నాడుట 🙃. అంటే ఒక రక్తంబాగ్‌ని రెండు బాగ్‌లు చేసి అమ్ముకోవడం. ఫలితం - ఆ రక్తం ఎక్కించిన రోగికి పలచనయిపోయిన రక్తమే అందుతోందన్నమాట. ఆఁ, రోగి ఏమయిపోతే నాకేం, నేను డబ్బు సంపాదించుకుంటే చాలు అనుకుంటున్నట్లున్నాడు. ఇంకా నయం సెలైనే కలిపాడు, నీళ్ళో కిరసనాయిలో కలపలేదు. 😧

      Delete
    3. విన్నకోట నరసింహా రావుగారు,

      >>>>>ఇంకా నయం సెలైనే కలిపాడు, నీళ్ళో కిరసనాయిలో కలపలేదు. >>>

      ప్రస్థుతానికి కిరసనాయిలు కలపడు లెండి, ఎందుకంటే దాని ఖరీదెక్కువ సెలైన్ కంటే :) రేపు మంచి నీళ్ళు కలిపినా కలిపెయ్యచ్చు, సొమ్మండి బాబూ :)
      ధన్యవాదాలు.
      😧

      Delete


    4. కలిపెను సెలైను ఆ బా
      టిలులో తెలియక జిలేబి టిక్ టిక్ జేర్చెన్ !
      వెలిసెను రక్తపు వాటర్ !
      నలతన సొలసెను టపీయనగ శాల్తీ క్లోజ్ !

      Delete
  3. రోజు రోజుకూ హింసలో భయంకర రూపాలు కనిపిస్తున్నాయి. చావు మూడి పోవడం వేరు ఇలా అర్ధాంతర చావులు వేరు. ఆ భగవంతుడే రక్షించాలి.

    ReplyDelete
    Replies
    1. Ramana vamaraju గారు,
      కలికాలం సార్
      ధన్యవాదాలు.

      Delete
  4. అది చలివేంద్రంలాగా లేదు. కల్లు పాక లాగ ఉంది. జిలేబి పద్యాలు ఇక్కణ్ణుంచే పుడతాయి.

    ReplyDelete
    Replies
    1. హా ! కల్లుపాక జూచె సు
      మీ! కడు మోదము జిలేబి మిన్నగ గాంచెన్
      ఆ కలము నందు పద్యము
      సోకుగ అన్నా నిమసును సోంబేరి యనెన్

      Delete
    2. Anonymous గారు,
      అది కల్లు పాకలా కనపడిందా తమకి?
      ధన్యవాదాలు.

      Delete