పంచదార చిలకలు ఈ ఆకారంలో కూడా ఉంటాయా ! అఫ్‌కోర్స్ ఏ రకపు అచ్చులైనా తయారుచెయ్యచ్చులెండి, కాని ఇటువంటి అచ్చు నేను ఇదివరలో చూసిన గుర్తులేదు. సైజ్ కూడా భారీగా ఉంది 😋 .
మా చిన్నప్పుడు పంచదార చిలక అంటే చిలక రూపమే ఉండేది, ఆ తరవాత కాలంలో హంస, నెమలి..ఇలా వివిధ పక్షుల రూపాలూ సంతరించుకుంది. ఆ తరవాత కాలంలో కట్టడాలు, మరి ఇతర ఆకృతులూ కూడా వచ్చి చేరేయి.
ఇక ఇవి తూకాన్ని బట్టిపోస్తారు, వంద గ్రాములు, రెండు వందలు, రెండు వందల ఏభై, ఐదు వందలు, కేజి, రెండు కేజిలకి ఒకటి, ఐదు కేజిల పెద్ద బొమ్మలూ పోస్తారు. ఆడపిల్ల అత్తవారి ఇంటికి వెళ్ళేటప్పుడు పెడతారు, సూడిదలకి తెస్తారు, ఇలా వివిధ కార్యక్రమాలకి ఉపయోగిస్తారు.
కలిగినవారు భారీగా పోయించి, పంచి పెడతారు, వారికి ఇచ్చేవారితో ఉన్న ప్రాముఖ్యాన్ని బట్టి బొమ్మ సైజు ఉంటుంది. కోడలు తెచ్చిన చిలకలలో ఒక పెద్ద అందమైన బొమ్మను ఒక పళ్ళెంలో నీళ్ళు పోసి పెట్టి, ముందుగదిలో, పళ్ళెంలో నీళ్ళలో ఒక పీట వేసి దాని మీద ఈ బొమ్మ పెట్టి ఉంచుతారు, అదో సరదా!
మాకీ మధ్య ఎవరో కలిగినవారు ఒక కేజి బొమ్మ ఇలా ఇచ్చారు, దాని ఫోటో ఇది.
ReplyDeleteపంచదార చిలక జూచె పో! జిలేబి !
నెంత చక్కగ నుండెను నెమ్మదిగన !
మాడి పడికట్టు నింటిని మాదిరి గొనె !
వింత యననిది మాచన వింజ మనగ !
జిలేబిగారు,
Deleteబాబోయ్! ఇది విట్టో,టిట్టో తెలియలేదండీ లోల,లోల :)
ధన్యవాదాలు.
చిన్నప్పటి జ్ఞాపకాలలో ఇదీ ఓ తియ్యని జ్ఞాపకం. :)
ReplyDeleteచిరంజీవి. శ్రీ
Deleteమాకు ఇంకా పల్లెటురి లక్షణాలు కొన్ని మిగిలున్నాయమ్మా! అందులో ఇదొకటి :)
ధన్యవాదాలు.
పంచదార చిలకలు ఈ ఆకారంలో కూడా ఉంటాయా ! అఫ్‌కోర్స్ ఏ రకపు అచ్చులైనా తయారుచెయ్యచ్చులెండి, కాని ఇటువంటి అచ్చు నేను ఇదివరలో చూసిన గుర్తులేదు. సైజ్ కూడా భారీగా ఉంది 😋 .
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteమా చిన్నప్పుడు పంచదార చిలక అంటే చిలక రూపమే ఉండేది, ఆ తరవాత కాలంలో హంస, నెమలి..ఇలా వివిధ పక్షుల రూపాలూ సంతరించుకుంది. ఆ తరవాత కాలంలో కట్టడాలు, మరి ఇతర ఆకృతులూ కూడా వచ్చి చేరేయి.
ఇక ఇవి తూకాన్ని బట్టిపోస్తారు, వంద గ్రాములు, రెండు వందలు, రెండు వందల ఏభై, ఐదు వందలు, కేజి, రెండు కేజిలకి ఒకటి, ఐదు కేజిల పెద్ద బొమ్మలూ పోస్తారు. ఆడపిల్ల అత్తవారి ఇంటికి వెళ్ళేటప్పుడు పెడతారు, సూడిదలకి తెస్తారు, ఇలా వివిధ కార్యక్రమాలకి ఉపయోగిస్తారు.
కలిగినవారు భారీగా పోయించి, పంచి పెడతారు, వారికి ఇచ్చేవారితో ఉన్న ప్రాముఖ్యాన్ని బట్టి బొమ్మ సైజు ఉంటుంది. కోడలు తెచ్చిన చిలకలలో ఒక పెద్ద అందమైన బొమ్మను ఒక పళ్ళెంలో నీళ్ళు పోసి పెట్టి, ముందుగదిలో, పళ్ళెంలో నీళ్ళలో ఒక పీట వేసి దాని మీద ఈ బొమ్మ పెట్టి ఉంచుతారు, అదో సరదా!
మాకీ మధ్య ఎవరో కలిగినవారు ఒక కేజి బొమ్మ ఇలా ఇచ్చారు, దాని ఫోటో ఇది.
చాలా ఎక్కువ చెప్పేసేనా :)
ధన్యవాదాలు.