Saturday, 14 May 2016

పనసతొనలు







28 comments:



  1. పనస తొనలు జూడ పసిడిక లలవోలె
    తళుకు లీను హొయల తార వోలె
    మనసు పడిన మగువ మదిని మెరుపువోలె
    చల్లనయ్య చేత చట్టు నొచ్చె !

    సావేజిత
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi గారు,
      క్షేమేంద్రుని మాట నిజమే అనుకుంటా. :) ఈ పద్యమేదో కొంచం అర్ధమవుతోంది.
      ధన్యవాదాలు.

      Delete

    2. ఏమండోయ్ కష్టే ఫలి వారు !

      ఈ క్షేమేంద్రుడు ఎవరు ? ఏమిటా కథా కమామీషు ? వారి మాట ఏమిటి ? తప్పక మీరు టపా పెడతారని ఆశిస్తో !

      చీర్స్
      జిలేబి
      (టపా అడిగి కట్టించు కోవటం లో అదో ఆనందం !)

      Delete
    3. Zilebiగారు
      సగంరాసి ఉంచిన టపా "కందంకట్టినవాదే కవి, పందిని పొడిచినవాడే బంటూనూ" పూర్తి చేసి వేస్తా! ఇదో సామెత కూడా!
      ఈ టపా వెతకడం గడ్డి మేటిలో సూది వెదకిన చందమైపోయింది.
      ధన్యవాదాలు.

      Delete


    4. కందము కట్టిన వాడే
      డెందము నెరయన్ జిలేబి డెంకణ జేయున్ !
      విందుకు జిలేబి సిద్ధము
      యెందుల కాలస్యమోయి యేమి కథ యదీ !

      Delete


    5. గడ్డి మేటిలో వెదికితి అద్దరి మరి
      సూది కానరాలె రమణీ ! చూచి వేతు
      టపను, సమయము నిమ్మా జిలేబి యమ్మ!
      పండి తుల జోడిక సొగసు పద్య మిమ్మ !

      Delete
  2. మధ్యలో ఒక పనసకాయ కుళ్ళిపోయింది. అదే జిలేబీ పద్యం.

    ReplyDelete
    Replies

    1. అబ్బా!

      ఈ అన్నా ని మససు నా మీద మరీ పడి పోయినట్టు న్నది !వదలను వదలనుచు వెనుక పడు చున్నది !

      హత విధీ ! నేనేమి జేతు నయ్యరో !


      జిలేబి

      Delete
    2. కం. పది పాతిక పనసలలో
      నదిగదిగో నొకటికుళ్ళె నరయ జిలేబీ
      పది పాతిక పద్యంబుల
      పదిలంబుగ నొకటి కూడ పండకపోయెన్!

      Delete
    3. పద్యము కుళ్ళిన నేమిట !
      హృద్యముగ గురువు జిలేబి హృత్తుని తాకెన్ !
      సేద్యము జేసిన నెల్లెట
      వేద్యము మనదే యగున? నివేదన నిదియే !

      Delete
    4. Zilebi గారు,
      పద్యం చెప్పడం బాగానే అలవాటు న్చేసుకున్నారు. గురువుగారి దగ్గర కిటుకులు నేర్చేసుకుంటే తిరుగుండదు :)
      ధన్యవాదాలు.

      Delete
    5. Anonymous గారు,
      ఎవరిగోల వారు పడితే చాలుకదండీ... :)
      ధన్యవాదాలు.

      Delete
    6. శ్యామలీయం గారు,
      పద్యం చెప్పాలనేవారే,సాధన చేసేవారే తగ్గిపోయున్న కాలం. దాన్ని పట్టుదలగా సాధన చేస్తున్న జిలేబిగారిని దారిలో పెట్టేయ్యండి. మంచి పద్య రచయిత అవుతారు కదా! నేనేమో ఎంత ప్రయత్నం చేసినా పద్యం రాయలేకపోయా
      ధన్యవాదాలు.

      Delete
    7. ఈ మధ్య కొన్ని రోజుల క్రిందటనే వ్రాసాను శంకరాభరణంలో. పద్యం చెప్పాలన్న కోరిక దొడ్దది (నా బోటి వారి దృష్టిలో). ఐతే, గ్రంథభాషమీద మంచి పట్టు ఉండటం అవసరం. గ్రంథపఠనం ద్వారా ఆ పిమ్మట సాదనద్వారా అది సాధించవచ్చును. కాని గణాల్లో అక్షరాలు పొదిగితే దుర్భరంగా ఉంటుంది. జిలేబీగారు ముందు ఆ విషయంలో దృష్టి పెట్టాలి కాని కృతకపద్యవిన్యాసంతో జనానికి పద్యాలమీదే విరక్తి కలిగించటం మూలఛ్ఛేదపరాక్రమం అవుతుంది. అది జిలేబీ గారు గ్రహించటం లేదు. అందుకు విచారంగా ఉంది.

      Delete


    8. పద్యము చెప్పా లన్నది
      విద్యగ నేర్చుము జిలేబి విరివిగ తెలియున్
      నిత్యానుష్టానము జే
      యద్యోతంబగున కొండ యంచులు రమణీ !

      Delete


    9. బాధ పడనేల కవివర !
      సాధన జేయగ జిలేబి సమ కూరునటన్ !
      యోధులు వీరులు శూరులు
      శోధనకు వెరవగనేల ! చోద్యము గాదే !

      Delete
    10. జిలేబీగారి పద్యాల్లాగే ఆవిడ భావాలూ అయోమయంగా ఉన్నాయి! ఎవరు బాధపడుతున్నారు - నేనా? నాకోసమా? నేను శోధనకు వెరుస్తున్నానా? ఏం చిత్రాలు వ్రాస్తున్నారు! జిలేబి విరివిగ తెలియున్ అంటారు - అలాగైతే ఆవిడ పద్యాలు అకటావికటంగా ఎందుకుంటున్నాయీ? పైగా నాకు 'విద్యగ నేర్చుము' అంటున్నారు. చిత్తం అలాగే. నేను ఇంకా విద్యార్థిదశలో ఉన్నానని నాకూ తెలుసు........ ఏం చేస్తున్నాను? జిలేబీ గారితో వివాదపడుతున్నానా? .. ఐతే వద్దు లెండి. బుధ్ధి బుధ్ధి!

      Delete

    11. భావాలయోమయము! మా
      నావతి పద్యము జిలేబి నాణ్యత లేకన్
      సావీ ! చెప్పెను జూడుము
      ఈవిడ కవిత తలనొప్పి ఇక్కడ తెచ్చెన్ !

      Delete
    12. మౌనేన కలహం నాస్తి, మౌన ముత్తమ భాషణమ్.

      Delete
    13. <"మౌనేన .....".
      ఇటువంటిదే కొంచెం ముతకగా "ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు" అంటుంటారు 🙂

      Delete


    14. "ఊరుకుని" ఉన్న ఉత్తమమే :)



      జిలేబి

      Delete
  3. మీ ఫోటోలు చూసిన తరువాత పనసతోనలను ఏవిధంగా తింటే సంపూర్ణ ఆరోగ్యమో చెప్పాలని ఇది రాస్తున్నాను మాస్టారూ..
    అరకిలో కాచిన నెయ్యి వొక జాడీలో పోసి,అందులో అరకిలో పుట్ట తేనె ప్లస్ రెండేరెండు ఏలకులు కలపాలి.ఈ మిశ్రమంలో పనసతోనలను సన్నటి నిలువు ముక్కలుగా కోసి నానబెట్టాలి.ఈ నానబెట్టడం అనేది మన జాడీలో వేసే పనసతోన ముక్కలమీద ఆధారపడి ఉంటుంది.ఎక్కువ వస్తే ఎక్కువ రోజులు ,తక్కువ వేస్తే తక్కువ రోజులపాటు అన్నమాట..ఉదయాన్నే పరగడుపున వో రెండు లేదా మూడు పీసులను సేవిస్తే ఉంటుంది నాసామిరంగా..ఆ రుచి వర్నిమ్పవీలు కాదు ...అంతేకాదు జీర్ణ వ్యవస్థలోని-లైంగిక అవయవాలలోని ప్రతి కండరాలనూ ఈ తరహ వైద్యం అద్భుతంగా బలపరుస్తుంది..జీవితంలో ప్రోస్ట్రేట్-ఘర్భాషయ,జీర్ణ వ్యవస్థ సంబంధిత రోగాలు వస్తే వొట్టు..సంతనసాఫల్యతకి ఇది దివ్యమైన ఒవ్వుషధం....

    ReplyDelete
    Replies
    1. > ఘర్భాషయ
      ఏమి తెలుగు వర్ణక్రమం ఇది? నాలుగక్షరాలమాటలో మూడు అక్షరదోషాలా?
      యవర్ణకానికి వత్తు ఉన్న రూపం లేక అది మాత్రం చావుదప్పి కన్ను లొట్టపోయినంతపనై బ్రతికిపోయినట్లుంది.

      Delete
    2. astrojoyd గారు,
      మంచి విషయం చెప్పేరు. ఇటువంటివి తయారు చేసుకోమంటే వినేవారేరీ? నిజానికి పుషధాలన్నీ మనం తినే తిండిలోనే ఉన్నాయి.
      ధన్యవాదాలు.

      Delete
    3. శ్యామలీయం గారు,
      అవి టైపో అండి. ఈ పదాలని టైప్ చేయడం ఇంగ్లీష్ కీ బోర్డ్ మీద కష్టమే.
      ధన్యవాదాలు.

      Delete
  4. Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      "కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ యేల ఏడ్చెదో హాటకగర్భురాణి. :)
      ధన్యవాదాలు.

      Delete


    2. కాటుక యద్దిన కన్నీ
      రాటులు దేరెను జిలేబి రాగము దీసెన్ !
      నేటికి తెలిసెను వాటము
      మేటిగ పద కట్టులోయి మేలిమి గూర్చున్ !

      Delete