Saturday, 21 February 2015

స్వామి సేవకై


అదేంటో తెలుసా! భగవంతుని సేవలకై మంగళ వాద్యాలబదులు ఉపయోగించే యంత్రం. ఒకప్పుడు గుడిలో మంగళవాద్యాలు మనుషులే వాయించేవారు, అందుకుగాను వారికి కొంత భూమి సర్వీస్ ఈనాంగానూ దేవుడు ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ సర్వీస్ ఈనాం లు అమ్మేసుకున్నారు, సర్వీసూ లేదు. మరో చిత్రం... ఈ యంత్రం పని చెయ్యాలంటే కరంట్ కావాలి అదెక్కడా పల్లెలలో..... దేవుడా...

6 comments:

  1. శర్మ గారూ ,

    నమస్తే . శుభోదయం .

    కొన్ని వసతులు సవతులై కూర్చొంటాయి కదా మఱి .

    ReplyDelete
    Replies
    1. శర్మాజీ,
      ఏదీ సరిగా చేసుకోలేకపోవడమే మన ప్రత్యేకతేమో
      ధన్యవాదాలు.

      Delete
  2. కరెంటులేని పల్లెలకి విద్యుత్తుతో నడిచే ఘంటలు.ఇది ప్రస్తుత మానవ చిత్రం.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మి గారు,
      దేవుడికి ఇవన్నీ కావాలా? మానవుని తృప్తి, అది కూడా సరిగా చేసుకోలేకపోతున్నారు.
      ధన్యవాదాలు.

      Delete

  3. 'మాన్' 'ఘళ్ ఘళ్ వాద్యాలు వినలేక కరెంటు నిచ్చి ఈ కొత్త 'ఎలెక్ట్రిక్' గంటల నిచ్చి , ఆ పై తాపీ గా కరెంట్ పీకేసుకున్నాడు స్వామి !

    స్వామీ వారికి తెలియని 'ఘంటా రావమా !!

    తాత కు దగ్గులు నేర్ప వీలగునా ! అంతా హుష్ మాయ !

    జేకే
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      నేటి కాలానికి అంతా విష్ణుమాయ అనిపిస్తోంది.
      ధన్యవాదాలు.

      Delete