Monday, 22 December 2025

కొడుకుని నమ్ముకునేకంటే...

 కొడుకుని నమ్ముకునేకంటే...



కొడుకుని నమ్ముకునేకంటే కొబ్బరిచెట్టును నమ్ముకుంటే మేలు అని, కొడుకుని పెంచుకునే కంటే కొబ్బరి చెట్టును పెంచుకోవడం మేలు అనీ మా కోనసీమ వాసులు అనుకునేమాట. అలా అనుకోలేదుగాని ఇల్లాలు ఈ కొబ్బరిమొక్కని పది పన్నెండేళ్ళకితం నాటింది. ఎవరింటికో ముత్తయిదు వాయనానికి పిలిస్తే వెళ్ళగా వారు ఇచ్చిన బొండం ఇంటిలో ఉంచగా,దానికి మొలక కనపడింది. దానిని సద్వినియోగం చేస్తానని పక్క పెరటిలో పాతింది. దానిని సంరక్షణ చేయకపోయినా పెరిగి పెద్దదయింది. నాటిన అమె కాలం చేసి 7 ఏళ్ళు దాటింది. మొదటి సారిగా కాయలు దింపితే దగ్గరగా నలబై కాయలు లెక్కకొచ్చాయి. మంచి పని చేసిపోతే ఫలితం తరవాత వారైనా అనుభవిస్తారుగా!          

10 comments:

  1. पुष्पिताः फलवन्तश्च तर्पयन्तीह मानवान्।
    वृक्षदं पुत्रवत् वृक्षास्तारयन्ति परत्र च॥

    ReplyDelete
  2. श्लोक का अर्थ है कि जिस प्रकार फल और फूल वाले वृक्ष निकट रहने पर मनुष्य को संतुष्टि प्रदान करते हैं, उसी प्रकार वृक्ष दूर रहने पर भी उसे लगाने वाले को सभी प्रकार के लाभ प्रदान करते हैं। “पुष्पिताः फलवन्तश्च तर्पयन्तिह मानवान। वृक्षदं पुत्रवत् वृक्षास्तारायन्ति पात्र च॥”4 days ago
    courtesy:google

    ReplyDelete
  3. జిలేబీకి జిలేబీ ధోరణిలోనే సమాధానాలు చెప్పటానికి బదులు ఆ జిలేబీని దేవిడీమనా చేసేయటం ప్రయోజనకారి కదా. ఆలోచించండి.

    ReplyDelete
    Replies
    1. ఏల ఈ பொராமை :)

      Delete
    2. శ్యామలీయం గారు,
      మీకు తెలిసినదే మరో సారి చెప్పే సాహసం చేస్తూ పెద్దరికం వహించేస్తున్నాను.

      లోకం పలు విధాలు,రకరకాల మనుషులు జీవితంలో తారసపడుతుంటారు. ఎవరినీ మన్నా చేయలేం. వారి భాషలోనే వారికి సమాధానం చెప్పాలి,తప్పదు. మనం బతికి ఉండాలంటే ఇటువంటి విద్యలు నేర్చుకోకతప్పదు.😂 ఒక చిన్న ఉదాహరణ.

      బంగ్లాదేశ్ మండిపోతూంది. భారత్ మీద,హిందువులమీద కావలసినంత ద్వేషం ,విషం చిమ్ముతున్నారు.హిందువులను బతకనివ్వం చంపేస్తామని,వీరాలాపాలూ చెబుతున్నారు. ఒక జిలేబిలాటి ప్రొఫెసర్ అండలో పెరుగుతున్న ఒక యువనాయకుడు, చెప్పినమాట. బంగ్లాదేశ్ నుంచి డబ్బు పంపకపోతే భారత్ లో జనం మలమల మాడి ఛస్తారు,తిండి లేక అని శలవిచ్చాడు. ఒక రోజు గడిచింది, ఇప్పుడు బంగ్లాదేశ్ మాకు 50వేల టన్నుల బియ్యం కావాలి అంటున్నది.మన వర్తకులనడిగితే మేము మీకు బియ్యం అమ్మముగాక అమ్మం అని చెప్పేసేరు.
      ఇలాగే జిలేబి నన్ను బ్లాగుల్లోంచి తొలగించడానికి చేయని ప్రయత్నం లేదు. ఇది మీకు తెలియనిదీ కాదు. జిలేబిని తట్టుకుని బ్లాగుల్లో కొనసాగాను. ఇప్పుడు నా బ్లాగును కబ్జాచేసి,నా టపాలు,కామెంట్లు ఆగ్రిగేటర్లలో కనపడకుండా చేస్తోంది,నాకేం తెలియదని సొల్లు చెబుతోంది.

      విసిగిపోయాను. ఈ నెలాకరుకి సంవత్సరమూ పూర్తవుతుంది. బ్లాగులకి శలవూ చెప్పేస్తున్నాను.ఒక్క చిన్న కొరవ ఉండిపోయింది. రామునిరాజ్యం-భరతుని పట్టంలో కొద్ది భాగం మిగిలింది. అది మాత్రం పూర్తి చేస్తాను. బ్లాగులకిక శలవు.

      Delete
    3. జిలెబి
      ఆ రోదనేదో తెనుగులో చేస్తే తెలుస్తుంది.

      Delete
    4. జిలేబి నన్ను బ్లాగుల్లోంచి తొలగించడానికి చేయని ప్రయత్నం లేదు. .

      చవితి కూడా కాదే
      ఏల ఈ నిందాపరోపణలు ?



      Delete
  4. భూమాత కున్న ఘనతలు
    ఆ మాతకు గలవు , గాన , ఆ యమ్మ కరం
    బేమని విత్తెనొ బోండము ,
    భూమియు పులకించె నేమొ ! ప్రోది యొసంగెన్

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      ఆమె ఏమనుకుందో చెప్పలేనుగాని,గుర్తుండే ఒక పని చేసి దాటిపోయింది.అదృష్టవంతురాలు.

      Delete
  5. వినుడు విబుధ ! 'విన్నపములు'
    మనమంతా కనపడేది మన్నన గల యీ
    ఘన బ్లాగుల ద్వారానే ,
    కనుమరుగయి పోవుటేల ? కలగా మిగులున్ .

    ReplyDelete