మళ్ళున్నా, మాన్యాలున్నా.....
"మళ్ళున్నా,మాన్యాలున్నా మంచెమీద మనిషుండాలి,పాడి ఉన్నా,పంటలు ఉన్నా పంచుకునే మనిషుండాలి". ఇది సినీకవిగారి మాట. నిజం. మడులు మాన్యాలు రక్షింపబడవు, మంచెమీద రక్షించే మనిషిలేనపుడు. ఆ మనిషి తనవారై ఉండాలి. లేకపోతే మిగిలేది శూన్యం. అదే మంచె మీద మనిషి కాపలా. చిన్నప్పటి నుంచి చచ్చేదాకా ఎవరో ఒకరు కాపలా కావాలి, అదే మనసు కాపలా. అదే మరో సినీ కవి "చిన్నతనాన తల్లి కాపలా,వయసున వలచినవారు కాపలా, ఏతోడూ నోచని వేళ కన్నీరేరా నీకు కాపలా" అన్నారు. అంచేత కాపలా తప్పనిసరి. లేకపోతే బతుకు ఒంటరిదే. ఒంటరితనాని కంటే భయంకరమైన శిక్ష మరిలేదు. భారతదేశంలో ఘట్టిగా ఏడవను కూడా చేతకాని వర్గం ఒకటుంది. అదే మధ్య తరగతి. ఈ కుటుంబాల ఆర్ధిక స్థితి గోచీకి పెద్ద గోణానికి చిన్న అన్నట్టు ఉంటాయి, వీరిలో భార్యాభర్తలో ఒకరు చెల్లిపోతే మిగిలినవారికి మిగిలేది భయంకరశిక్ష ఒంటరితనం. అందుకే పాడిపంటలు ఎన్నున్నా పంచుకునే మనిషి కావాలన్నారు. ఈ మనిషి మనసుపంచుకున్నవారై ఉండాలి మొదటగా! ఆ తరవాతనే ఇతరులు,బంధువర్గమైన, మిత్ర వర్గమైనా, వీరంతా ఏదో ఒక సమయంలో మనసు బయట ఉండేవారే!. మంచెమీద మనిషి కానివారెవరూ ఆత్మీయులు కాలేరు.
నెల్సన్ మండేలా గుర్తున్నారా? మనం ప్రచార యుగంలో ఉన్నాముగా! ఎలా గుర్తుంటారు. మహానుభావుడు ఈయనను 35 సంవత్సరాలు ఒంటరి కారాగారవాసం చేయించిన బ్రిటన్ ప్రభుత్వం నేడు సుద్దులు చెబుతోంది,ప్రపంచానికి. మండేలా అంత భయంకరమైన శిక్షను కూడా తట్టుకున్న మహానుభావుడు. మరో ఉదాహరణ జరుగుతున్న చరిత్ర మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీ ఇప్పటికి ఒంటరి కారాగారంలోనే ఉన్నట్టు.
నేటికి మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు చెల్లిపోయాయి. అన్నీ చిన్నకుటుంబాలే. అసలు కుటుంబం అనే అవగాహనే పోతున్నట్టుంది. ఆలుమగలు అన్న భావన లేదు,ఇప్పుడున్నది స్త్రీ,పురుషులు మాత్రమే! వయసులో ఒకరి అవసరం ఒకరికి ఉన్నది కనక లివ్ ఇన్ గా రోజులు గడిపేస్తున్నారు. ఇక ముసలి ముతకని చూసేవారెవరు. నేటికి పాతకాలంలోంచి కొత్తదానికి మారుతున్న జనాభా ఇంకా తల్లితండ్రుల్ని పునరావాస కేంద్రాలలో,వృద్ధాశ్రమాలలో ఉంచుతున్నారు. వీరికి తోడెవరు? కూడా ఉన్నవారే! కుటుంబంలో అన్నాతమ్ములు,అక్కచెల్లెండ్రు, కోడుకులు కోడళ్ళు ఉన్నా అందరూ పైవారే, అందరిది ఆర్ధికపరమైన కాపలాయే. వీరెవరూ మంచెమీద మనుషులు కారు. మంచెమీద మనుషిది మనసు కాపలా!
అరిచి గీపెట్టి మొత్తుకున్నా - వినేటి
ReplyDeleteతీరికేది యువతకు ? ముదిమి లోని
రెండు పక్షులలో ఒకరి మిగులు కథ
ఆలకించడు పరమాత్మయైన విహిత !