కొడుకుని నమ్ముకునేకంటే...
కొడుకుని నమ్ముకునేకంటే కొబ్బరిచెట్టును నమ్ముకుంటే మేలు అని, కొడుకుని పెంచుకునే కంటే కొబ్బరి చెట్టును పెంచుకోవడం మేలు అనీ మా కోనసీమ వాసులు అనుకునేమాట. అలా అనుకోలేదుగాని ఇల్లాలు ఈ కొబ్బరిమొక్కని పది పన్నెండేళ్ళకితం నాటింది. ఎవరింటికో ముత్తయిదు వాయనానికి పిలిస్తే వెళ్ళగా వారు ఇచ్చిన బొండం ఇంటిలో ఉంచగా,దానికి మొలక కనపడింది. దానిని సద్వినియోగం చేస్తానని పక్క పెరటిలో పాతింది. దానిని సంరక్షణ చేయకపోయినా పెరిగి పెద్దదయింది. నాటిన అమె కాలం చేసి 7 ఏళ్ళు దాటింది. మొదటి సారిగా కాయలు దింపితే దగ్గరగా నలబై కాయలు లెక్కకొచ్చాయి. మంచి పని చేసిపోతే ఫలితం తరవాత వారైనా అనుభవిస్తారుగా!


No comments:
Post a Comment