Sunday, 21 December 2025

డిసెంబర్ 21 (Longest night) -భాస్కరదర్శనం

 డిసెంబర్ 21 -భాస్కరదర్శనం


 డిసెంబర్ 21 తేదీనాడు సూర్యుడు, భూమి యొక్క దక్షణార్ధగోళం లోని మకరరేఖకి అభిముఖంగా ఉంటాడు. దీనివల్ల ఇప్పటికే వేసవితో అల్లాడుతున్న అస్ట్రేలియా,న్యూజిలాండు,దక్షణ ఆఫ్రికా,దక్షణ అమెరికాదేశాలకి మండుటెండ, ఐతే మనకి చలి చాలా బాధ పెడుతోంది. మనకంటే యూరప్ ఉత్తర అమెరికా,రష్యా దేశాలైతే చలికి వణుకుతున్నాయి. సూర్యుని రెండు ఆయనాలలో ఉత్తరాయణంలో మనకు మండుటెండలు కదా. అందునా కర్కాటకరేఖ మనదేశం మీదుగా ఉంటుంది.నేడు మనకి రాత్రి భాగం ఎక్కువుంటుంది,అనగా సూర్యాసమయ,సూర్యోదయ కాలాలమధ్య సమయం సంవత్సరంలోని ఇతరరోజులకంటే ఎక్కువ ఉంటుంది. (Longest night) నేడు యాదృఛ్ఛికంగా ఒక మిత్రుడు గ్రూప్ లో పెట్టిన వీడియోలో ఉషా,ఛాయా,పద్మినీ,సౌజ్ఞా  సహిత సూర్యనారాయణమూర్తి నిజదర్శన భాగ్యం కలిగింది. ఎన్నిసార్లు గొల్లలమామిడాడలోని స్వామిని దర్శించినా ఈ దర్శన భాగ్యం నోచుకోలేదు. 

23 comments:

  1. ఓయ్! "జిలేబి వదిన" ఏమయ్యింది నీకు?
    ఈ రోజు ఉదయం ప్రచురించిన ఈటపా ప్రచురించలేదు,మళ్ళీ 11 కి ప్రచురించాను,అప్పుడూ ప్రచురించలేదు,మళ్ళీ 1230 తరవాత ప్రచురించా,ఇప్పటిటివరకు వదిన ప్రచురించలేదు,ఏమయిందీ? అమాసకి పున్నానికి తేడా చేస్తూ ఉంటుందా?😂
    ఉదయమే ప్రచురించిన కామెంట్లు మాత్రం మధ్యాహ్నం 2 దాటేకా ప్రచురించింది. ఈ కామెంట్ ఎప్పుడు ప్రచురిస్తుందో! భగవాన్ జానే😜

    ReplyDelete
  2. సూర్య కిరణాల వల్ల ఉషోదయాలు
    ఛాయ లేర్పడు , పద్మాలు పూయు భువిని
    ఛాయ , ఉష , పద్మముల నిట్లు సతుల జేసి
    సూర్యుడికి ప్రక్క నిలిపిరి ఆర్యు లౌర !

    ReplyDelete
  3. రాజావారు
    మనపూర్వులు ప్రకృతిని ఆరాధించారు,పూజించారు,దానినే భక్తిగా మలచుకున్నారు.ప్రకృతితో కలసి బతికేరు. ప్రకృతి తాము వేరుకాదనే తలచారు. ఆ సంస్కృతి మనకిచ్చిపోయారు,అదీవారి గొప్పతనం.

    ReplyDelete
    Replies
    1. అది సరే , మరీ విడ్డూర మిది , గనంగ
      నస్కలిత బ్రహ్మచారుల కంగనల గు
      దిర్చి ప్రక్క నిలిపిరి యిదేమి భక్తి ?
      మారుతికి గూడ పెండ్లాము ! మతి గలంగు .

      Delete
  4. జిలేబి,
    "జిలేబి వదిన"కి ఏదో అస్వస్థత చేకూరినట్టుంది,అది సరే! నీకేమయింది?నిన్నటినుంచి మళ్ళీ సౌండ్ లేదు,బాగున్నావా! చలికాలం. ఇదేంటి ఈ ముసలాయన నా వెనకపడ్డాడు అనుకుంటున్నావా? వదలా,నిన్ను వదలా అంటూ ఉంటుంది ఓ కొత్తమనవరాలు.ఓస్, ఈ కబుర్లు చెప్పకు నీకంటే ముందే చాలామంది వదలా,నిన్ను వదలా అని చెప్పిన మనవరాళ్ళు చాలామంది అడ్రస్ కూడా లేకుండా కనుమరుగైపోయారు,నువ్వెంత,నాలుగురోజులులే!అన్నా!!
    నేను మాత్రం నిన్ను వదలా!

    ReplyDelete
    Replies
    1. దుంపతెగ! ఈ విషయాలు నాకు తెలియవు చెప్పగలిగిన దురంధరులు పత్తాలేని మలక్ పేట రౌడీ గారున్ను ~ పత్తా కనిపిస్తున్న శ్రీనివాసు గారున్ను మాత్రమే

      వాళ్లకు ఈ ప్రశ్న బదలాయింపు చేయడమైనది


      ఇట్లు

      జిలేబిభయానకం

      Delete
    2. జిలేబి,
      నీకు తెలీదని ఒప్పుకున్నావు. నా గమనిక చెబుతున్నా! చంద్రుని వృద్ధిక్షయాలతో నీ ఆగ్రిగేటర్ లో నా టపా ప్రచురించే సమయం మారుతోంది. అమావాస్యకి అది దగ్గరగా అరుగంటలుంటోంది. ఆపై తిధులప్రకారం పూర్ణిమనాటికి బాగా తగ్గుతోంది. నాకొకడికేనా,అందరికీనా తెలుసుకో! సమస్య ఛేదించే గుణం కావాలి,నేర్చుకో!!

      Delete
    3. సమస్యని మరొకరి భుజాలపై మోపేస్తే సరిపోదు,నీ ప్రయత్నం ఏంటీ

      Delete
    4. గూగుల్ వాడు కూడా తిధి నక్షత్రాలపై పడ్డాడంటే ఇది శ్రీమాన్ మోడీ గారు మన దేశానికి తెచ్చిన అమృత్ కాల్ కి సూచిక !

      జై మోడీ ! జై భాజ్పా జై జై వందే భారత్


      Delete
    5. జిలేబి,
      అక్కడ జర్మనీలో కూచుని అబ్బాయిగారు ఓట్ చోరీ పాతపాట పాడుతున్నారు, ఇక్కడ అమ్మాయిగారు మోడీ హైతో ముంకిన్ హై అంటున్నట్టుంది,హై కమాండులో మరో హై కమాండా? అమ్మాయిగారు లాంచ్ అవుతున్నారా? కొత్త డ్రామానా? ఏదైనా సాధ్యమే!!!!!!
      అలాగే ఇదిన్నీ,నాకు తోచినది చెప్పేను,నువ్వు నాకంటే మేలుకదూ,మడేలు పద్దయినా రాయగలవు,నాకదీ చేతకాదుగా! సమస్య మరొకరికి తోసెయ్యడంకాదు, దాన్ని ఛేదించు,అప్పుడూ నువ్వు మగాడివి.
      అన్నట్టు మరచాను ఒకప్పుడు గూగుల్ కు కూడా ఔటేజి వచ్చేదిగుర్తుందా? అది అమాసకనుకుంటా!!

      Delete
    6. పచ్చ కామెర్ల ..... :)

      తాతగారి సైటు గోవిందా సరిదిద్దండి మొదట అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి :)

      Delete
    7. జిలేబి మగాడా?

      Delete
    8. జిలేబి
      ఆడలేక మద్దెల ఓడు అన్నదట నీలాటిదే. వివరిస్తా,నీకు తెలీదుగా!😜
      నీలాటిది సింగారం చేసుకుని డాన్స్ ఆడేస్తా అని స్టేజి ఎక్కిందిట. సరే మొదలుపెట్టమన్నారు. మద్దెలవాడు వాయించడం మొదలుపెట్టేడు,ఏం చేయాలో తెలియనిది కొన్ని పిచ్చిపిచ్చి పోకడలు పోయిందిట. ప్రేక్షకులు గోల చేస్తే స్టేజి దిగిపోయిందిట,నాలాటివాడు పోటుగత్తెని డాన్స్ ఆడేస్తా అన్నావుగా అంటే కిందపడ్డా నాదే పైచెయ్యి అన్నట్టుగా మద్దెల సరిలేదుగాని ఉంటేనా అందిట. సరిలే నేను వాయిస్తా మళ్ళీ స్టేజి ఎక్కమన్నాట్ట. ఈ సారి ప్రేక్షకులు గోలచెయ్యడంకాదు కొడతారని భయమేసి పారిపోయిందిట. 😂😂అలా పెద్దపోటుగత్తెను అని చెప్పుకుని ఆగ్రిగేటర్ నిర్వహించేస్తా అని చెప్పుకుంటూ "గబుక్కునబట్టన్" అని ప్రకటించుకోడమెందుకూ? 😜నా బ్లాగ్ సరిలేదంటే మొత్తంపోవాలి,ఒకసారి ఒకలా aggrigetor zilebivadana.blogspot.com ఎందుకు స్పందిస్తోందో చెప్పూ!

      Delete
    9. బోనగిరి సార్!
      రెడ్డెచ్చె మొదలాడమన్న సామెతగా ఉన్నదిసార్! మీమాట. మొగాడు సోషల్ మీడియా ఆదపేరు పెట్టుకుని అనామకంగా చెలామణీ ఐపోతున్నాడని చాలాసార్లు చెప్పేనుసార్!
      ఊరూ పేరూ చెప్పుకోలేనివారెవరై ఉంటారు చెప్పండి? 1.చేతకానివారు2.నిజాన్ని చెప్పుకోడానికి భయపడేవారు3.సిగ్గు పడేవారు4.మోసం చేసేవారు కదా! ఇందులో ఈ శాల్తీ ఏ రకానికి చెందినదీ మీరే చెప్పండి.

      Delete
    10. ఆఈ ఉవాచ -

      "జిలేబి వదన" అనేది తెలుగులో ఒక అందమైన అలంకారిక పదం, దీని అర్థం జిలేబి వంటి ముఖం లేదా జిలేబి వలె గుండ్రంగా, ఎర్రగా, మెరుస్తూ ఉండే ముఖం, ఇది ఒక రకమైన ఆనందంతో నిండిన, ప్రకాశవంతమైన ముఖాన్ని సూచిస్తుంది, ముఖ్యంగా బ్లాగులు, పద్యాలలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
      వివరణ:
      జిలేబి: మైదా, చక్కెరతో చేసి, నూనెలో వేయించి, చక్కెర పాకంలో ముంచే ఒక తీపి పదార్థం, ఇది గుండ్రంగా, మెరుస్తూ ఉంటుంది.
      వదన: ముఖం.
      ఈ రెండింటిని కలిపి, జిలేబి ఎంత ఆకర్షణీయంగా, రుచికరంగా ఉంటుందో, ఆ ముఖం కూడా అంతే అందంగా, సంతోషంగా ఉందని వర్ణించడానికి ఈ పదాన్ని వాడతారు.
      ఉదాహరణ:
      " - జిలేబీయం" వంటి బ్లాగ్ శీర్షికలలో, ఆనందంతో ప్రకాశిస్తున్న ముఖాన్ని వర్ణించడానికి ఈ పదం వాడబడింది.
      సంక్షిప్తంగా, జిలేబి వదన అంటే జిలేబిలా మెరిసే, అందమైన, సంతోషకరమైన ముఖం అని అర్థం.

      Delete
    11. ఇక్కడ యున్ జిలేబీయము గా వున్నది :)


      https://youtu.be/UmEaJK3sWlg?si=usp3t5vrwJfA-lvt

      Delete
    12. మినప పిండితో జిలేబి చేయచ్చా తమరి ఉవాచలు ఎవరూ అడిగినట్టులేదు. ఎందుకీ సొల్లు?
      జిలేబి తయారి అంతా కల్తీయే.మైదాతో జిలేబీ తయారా! యాక్కులారీ.

      Delete
    13. అక్కడేం అవుపళ్ళా,వినపళ్ళా!

      Delete
    14. ఇంతకీ అది Jalebi నా? Zilebi నా? ఏ వదనం ?

      Delete
    15. శ్రీనివాస్ జీ
      jilebi అన్నది భారతీయం,Zilebi అన్నది విదేశీయం. వీరు Zilebi అనే చెప్పుకుంటున్నారు,తయారీ కూడా విదేశీయమే.

      దేశీయ జిలేబి తయారీకి మినపపండి,బియ్యం కలిపివాడుతారు. బంగారు తీగచెరుకు బెల్లం పాకంపడతారు,అది లేతపాకం కాదు,తీగపాకమూ కాదు,మధ్యమంగా ఉంటుంది. మరో విశేషం దానినిపోసిన పాత్ర అడుగు కనపడేటంతస్వచ్చంగా ఉంటుంది.దేశీ తయారి జిలేబిలో రంగు వెయ్యరు. విదేశీలో రంగు వేస్తే ఎర్రగా ఉంటుంది. దేశీ జిలేబిలో రంగు వెయ్యక ఉంటే బెల్లంపాకంతో అది బంగారు రంగులో ఉంటుంది.
      ఇది కుళ్ళు జిలేబిsir! ఎర్రగా ఉంటుంది మొహమని చెప్పుకుంటోది కదా!
      ఉడుకుబోతుసార్! జిలేబి వదిన అన్నానని. ఉడుక్కోనివ్వండి మరో సారీ అంటాను.

      Delete
  5. రాజావారు,
    రాబోయే కాలంలో ఇటువంటి కొచ్చన్లు పుడతాయని మన పెద్దలు ఎందుకు ఊహించలేకపోయారో ఊహించలేను సార్!

    ReplyDelete
  6. ఇలా స్వాములవారిని యూట్యూబుల్లోకి ఎక్కించేస్తే గుళ్ళకు వెళ్లేదెవరండి ఇక? I object your highness Sarmaji

    ReplyDelete
    Replies
    1. విషయమేంటో చెప్పలేదు వివరంగా. గుడికి వెళ్ళేవారు వెళుతూనే ఉన్నారు.

      Delete