Saturday, 22 November 2025

చలిగా ఉంది. చలి చలి చలిగా ఉంది.

 చలిగా ఉంది. చలి చలి చలిగా ఉంది.


అసలు చలెందుకేస్తుంది? అదీ కొచ్చను. 

"నిండాములిగితే చలి ఉండదంటే", "నిండాములిగాకా చలి, నిండా ముంచాకా చెలీ నిలవ"వన్నారు మిత్రులు లక్కాకులవారు. ఇది జీవిత సత్యం అనుకుంటా. 

మరో మిత్రుడు చలిగా ఉందని ముణగదీసుకు పడుకోకు. చలిగా ఉన్నపుడు బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ముడుచుకు పడుకుంటే మరికొంచం చలేస్తుంది,కాని వదలదు. లేచి నాలుగడుగులేయడమో,మరో పని చెయ్యడమో చెయ్యొ. అన్నారు.

 కాని చలెందుకేస్తుందో చెప్పలేదు.

ఆడవారికి మగవారికి వేసే చలిలో తేడా ఉంటుందా?

ఆడవారికి ఎక్కువచలేస్తుందా? మగాళ్ళకా?

లావుగా ఉన్నవాళ్ళకా? సన్నగా ఉన్నవాళ్ళకా?

పడుకుంటే చలేస్తుందా? కూచుంటేనా?   

 చలి తగ్గే విధానాలేంటి?

తెలిసీ చెప్పకపోతే...... సహస్ర శిరఛ్ఛేద అపూర్వ చింతామణి కతల బుక్కులో భేతాళుడు విక్రమార్కుడికి ఇచ్చిన శాపం అవుతుంది. ఆ పై మీ చిత్తం.


13 comments:

  1. పనిలేక బ్లాగులాడుకునే వారికి చలేయును ):

    ReplyDelete
    Replies
    1. Zilebi23 November 2025 at 12:50
      పనిలేనిమాట నిజం. ఈ సందర్భంగా తిరుపతివేంకట కవుల మాట గుర్తొచ్చింది.

      సంగర శక్తిలేదు వ్యవసాయము చేయుట సున్న
      సంతలో నంగడి వైచియమ్ముటది ముందె హుళక్కి ముష్టికిన్
      బొంగు భుజాన వైచికొని పోయెదమెక్కడికేని ముముష్టిచెం
      బుం గొనిపెట్టుమొక్కటి యమోఘమిదేగద దంతిరాణృపా

      నీకు బుర్రలో గుంజూ లేదు,బుద్ధీ లేదు,బ్లాగులాడ్డమూ లేదు. ఏమీ లేదు,అంతా బుళుక్కు, హుళక్కి.

      టపా కాని కామెంట్ కాని వేసిన గంటల తరవాత కాని జిలేబివదినలో కనపట్టం లేదు. ఇదేకద భాగ్యము

      Delete
  2. మీరు "రాసే" టపాలేమన్నా వైరల్ మేటరా‌ ఏమిటి‌ వెంఠనే ఠా అని‌ చూపించడానికి ?

    కొట్టుకొచ్చిన మేటర్లా కావా అన్న ఫిల్టర్ తరువాయే వస్తాయి :)

    ReplyDelete
  3. Zilebi23 November 2025 at 17:41
    నాదంతాడూప్లికేటనుకో నీది కేటు కదా.ఏమయిమందిటా నువ్వెప్పుడో వేసినకామెంట్(తిమె17.41) ఇప్పటిదాకా అనగా 19.36 దాకా జిలేబివదినలో కనపడలేదే! కామెంటిన బ్లాగిణి గబుక్కునబట్టన్, డొల్లు కబుర్లేనా!

    ReplyDelete
  4. ఇల్లాంటి సూక్ష్మాల్స్ విడదీయగలిగిన వారు ఇరువురే నండి~‌ శ్రీనివాస్ గారు~ కల్నల్ ఏకలింగిమ్ :) వారేమన్నా చెబ్తారేమో చూద్దారి :)


    ReplyDelete
    Replies
    1. @జిలేబి
      నా గురించేనా మీరు అడుగుతున్నది...
      శర్మ గారి టపాలు ఎందుకో శోధినిలో కూడా లేట్ అవుతున్నాయ్..
      ఏమైనా సెట్టింగ్స్ మార్చారేమో!!!

      Delete
  5. శ్రీనివాస్ జీ,
    టపాలు,కామెంట్లు ఒక్క శోధినిలోనే కాదు,వదనలోనూ ఆలస్యమవుతున్నాయి. మీరు 11.46 కి వేసిన కామెంటు కొద్ది ఆలస్యం తరవాత ప్రచురింపబడింది,శోధినిలోనూ,వదనలో కూడా! నా బ్లాగు సెట్టింగ్స్ ముట్టుకోలేదు,మార్చలేదు చాలా కాలంగా! మరి ఇప్పుడు మీ కామెంట్ వెంటనే ఎలా ప్రచురింపబడిందో ఎరుకలేదు.అదీ గాక బ్లాగరు కామెంట్లను ఆగ్రిగేటర్ లో ప్రచురించడాన్ని నియంత్రిమచలేడు, ఒక సారి ప్రచురిస్తే! ఈ కామెంట్ ప్రచురింపబడుతుందా? చూడాలి.

    ReplyDelete
  6. జిలేబి,
    ఎక్కడో ఏదో జరుగుతోంది! నా బ్లాగుకే ఇది జరుగుతోందా,అందరికినీ నా తెలియదు. నా అనుమానం పెరిగింది.

    ReplyDelete
  7. శ్రీనివాస్ జీ,జిలేబి!
    నేను ఒక కామెంట్ 15.04 నిమిషాలకి,మరొకటి 15.07 కి ప్రచురించాను. శోధిని,జిలేబి వదనలను పక్క పక్కన ఉంచుకుని పరిశీలించాను. 15.34 తర్వాత కూడా నా మొదటి కామెంట్ రెండు ఆగ్రిగేటర్ లలోనూ ప్రచురింపబడలేదు. చెప్పవలసింది చెప్పేసేను,చూసుకోండి. ఆ పై మీ చిత్తం. ఉంటా!
    శలవు.

    ReplyDelete
    Replies
    1. துப்பரியம் ஸாம்பு :)

      Delete
    2. తెనుగులోనే తెలిసేడవటం లేదు అరవగోలకూడా ఎందుకు?
      నీ అరవ కామెంటు 8.25 కి వేసేవు నా బ్లాగులో అది వదనలోనూ శోధినిలోనూ 12.30 లోపు కనపడితే గొప్పే! కామెంటిని బ్లాగర్ చేతిలో నియంట్రణ ఏమి ఉంటుంది? ఈ కామెంటు నీ బ్లాగులో వెఠనే కనపడుతుంది,నీకు మైల్ కూడా వస్తుంది,కాని వదనలోనూ,శోధినిలోనూ 12.30 లోపు కనపడితే ఒట్టు!!!! క్లౌడ్ ఎత్తుకుపోతోందేమో చూసుకో!!!!!

      Delete
  8. ಕಷ್ಟೀ ನೊ ಫ಼ಲ :)

    ReplyDelete
  9. Zilebi25 November 2025 at 11:09
    ಕಷ್ಟೀ ನೊ ಫ಼ಲ :)
    సిద్ధుడా? శివుడా? ఎవరు రేపటి రాజు? తేలక ఛస్తుంటే ఈ కన్నడగోలేల?

    ఈ కామెంట్ నీ బ్లాగులోనూ వేస్తున్నా! దానికి అక్కడే సమాధానం చెప్పు.నీ బ్లాగుని నువ్వు వదిలేసి బహుకాలమయిందిగా! నా బ్లాగు సెట్టింగులపై అనుమాన పడదాం. నీ బ్లాగులో నీ కామెంట్ నీ జిలేబివదనకి,శోధినికి ఎప్పటికి చేరేనో చూదాం.

    ReplyDelete