Saturday, 22 November 2025

చలిగా ఉంది. చలి చలి చలిగా ఉంది.

 చలిగా ఉంది. చలి చలి చలిగా ఉంది.


అసలు చలెందుకేస్తుంది? అదీ కొచ్చను. 

"నిండాములిగితే చలి ఉండదంటే", "నిండాములిగాకా చలి, నిండా ముంచాకా చెలీ నిలవ"వన్నారు మిత్రులు లక్కాకులవారు. ఇది జీవిత సత్యం అనుకుంటా. 

మరో మిత్రుడు చలిగా ఉందని ముణగదీసుకు పడుకోకు. చలిగా ఉన్నపుడు బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ముడుచుకు పడుకుంటే మరికొంచం చలేస్తుంది,కాని వదలదు. లేచి నాలుగడుగులేయడమో,మరో పని చెయ్యడమో చెయ్యొ. అన్నారు.

 కాని చలెందుకేస్తుందో చెప్పలేదు.

ఆడవారికి మగవారికి వేసే చలిలో తేడా ఉంటుందా?

ఆడవారికి ఎక్కువచలేస్తుందా? మగాళ్ళకా?

లావుగా ఉన్నవాళ్ళకా? సన్నగా ఉన్నవాళ్ళకా?

పడుకుంటే చలేస్తుందా? కూచుంటేనా?   

 చలి తగ్గే విధానాలేంటి?

తెలిసీ చెప్పకపోతే...... సహస్ర శిరఛ్ఛేద అపూర్వ చింతామణి కతల బుక్కులో భేతాళుడు విక్రమార్కుడికి ఇచ్చిన శాపం అవుతుంది. ఆ పై మీ చిత్తం.


No comments:

Post a Comment