పుట్టినరోజా? రిటయిర్మెంటా?
భారత ప్రధాని మోడీజీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
దంతంబుల్పడనప్పుడే తనువునన్ దార్ఢ్యంబు నున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింతల్మేనఁ జరించనప్పుడె కురుల్వెల్వెల్ల గానప్పుడే
చింతింపన్‌వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!
75 సంవత్సరాలు నిండితే రిటయర్మెంటు అంటున్నారు. ధూర్జటిగారు ఇలా ఉన్నప్పుడే రిటయిర్ ఐపోవాలయ్యా అంటున్నారు. మీకా పళ్ళు ఊడినట్టు లేదు,కట్టు కదలలేదు. ఒంట్లో ఓపికున్నప్పుడే, విమానం నుంచి చకచకా దిగుతూ,ఎక్కుతున్నారు, ఓపికున్నట్టే.🤣 . కాంతా సంఘము రోయనప్పుడే, చిత్రం చక్రాల్లాటి కళ్ళు తిప్పుకుంటూ అందగత్తెలు మీ చుట్టూ తిరుగుతున్నారు కదయ్యా! నేను నీలా ఉండాలని ఉందంటూ. ఒంటి మీదకి వింతలు రానప్పుడే అంటే ముసలి రూపురానప్పుడే,మీకు ముసలి రూపా! కానేకాదు. కురుల్ వెల్లల్ గానప్పుడే, ఇదొక్కట్టే తేడాగా ఉంది గడ్డంతో సహా అంతా తెలుపే. నా మిత్రుడు శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తిగారు అనేవాడు, ఒరే శర్మా! చెట్టుకి నలుపు చేవ,మనిషికి తెలుపు చేవ. దీనికోదానికీ ఒప్పుకున్నాం. ఇప్పుడుటయ్యా రిటయిర్ అయి కృష్ణా రామా అనుకోవాలని. అంటే ఇప్పుడే కృష్ణా రామా అనుకోవాలట 🤣.అందుకే మీ రిటయ్ర్మెంటు ఎప్పుడూ అని అడుగుతున్నారు. మీరు కుర్చీ కాళీ చేస్తే ఎక్కి కూచోడానికి చాలామందే ఎదురు చూస్తున్నారు. మీ చేత కుర్చీ కాళీ చేయించడానికి చాలా మంది చాలా అవస్థలు,కుట్రలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచం అలా ఎదురు చూడటం లేదు, మేము అనగా దేశవాసులూ ఎదురు చూడటం లేదు. పాపం, కొంత మంది ఆశపడుతున్నారు. ట్రంప్ తో సహా దేశ దేశాల అధిపతులూ చెబుతున్న శుభాకాంక్షలతో,నూతనుత్తేజం పొంది దేశాన్ని రక్షించే పనిలో ఉండండి.
దీర్ఘాయుష్మాన్ భవ.
దేవతలు దీవించుగాక .
ReplyDelete