దయ్యం.
దయ్యమా,దెయ్యమా ఏది సాధువు? తెలీదు.
దెయ్యం ఏంటో తెలుసుకొవాలనుకున్నా. కమేని అడిగా,అందమైన దయ్యం అని,అదే మొదటి ప్రశ్న.మొగాడి ఫోటో చూపించింది. కమే మగాళ్ళే దయ్యాలనుకుంది,అదే అడిగా ఆకుకి అందని పోకకి పొందని సమాధానం చెప్పింది.
మన తెనుగు సాహిత్యం లో చూదామని బయలుదేరా! దయ్యం/దెయ్యం ప్రయోగం నాకు వెంటనే ఇక్కడ స్ఫురించింది,
బ్రతుకవచ్చు నొడల ప్రాణంబు లుండిన
బ్రతుకు గలిగెనేని భార్య గలదు
బ్రతికితీవు భార్యపట్టు దైవ/దయ్య మెరుంగు
వలదు వలదు చైద్య! వలదు వలదు.
ఇక్కడా నా అనుమానం తీరలేదు. ఆంధ్రభారతి రెండు వాడుకలో ఉన్నాయంది. హా హతవిధీ! దెయ్యానికెన్ని తిప్పలొచ్చాయనుకున్నా. దెయ్యం ఇంటర్నేషనల్, అన్ని దేశాల్లోనూ దెయ్యాలున్నాయష. దెయ్యమూ లేదు,భూతమూ లేదు, అదంతా మానసిక వికారం,కొంతమంది బతికేందుకు చేసిన సృష్టి అన్నారు, మేధావులు. ఏమోగాని దెయ్యం కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార పెట్టుబడి అన్నారు,మరో మేధావి. ఏంటో మరింత చిక్కుబడిపోయింది.
పోనీ సినిమా లో చూదామనుకున్నా! మొదటగా దయ్యాన్ని పరిచయం చేసినది హిందీ సినిమా అనుకుంటా, ఒక సినిమాలో పేరు గుర్తులేదు, దెయ్యం ఆడది, మధుబాలంత అందంగా ఉంటుందని చెప్పేరు. అదేమో తెలీదుగాని దెయ్యానికి కూడా దేశ భేదం,భాషా భేదం,లింగ భేదం ఉంటుందన్నారు,మరికొందరు. తెనుగు సినిమా దెయ్యం మరీ వికృతంగా ఉంటుంది,దెయ్యాల్లోనూ మంచి దెయ్యాలు,చెడ్డ దెయ్యలూ ఉన్నాయట. బోల్డన్ని కతలున్నాయంట.
దయ్యాలో రకాలున్నయట. అన్ని దయాలూ కనపడవట గాని ఒక్క దయ్యం మాత్రం కనపడుద్దట, అదే కొరివి దయ్యం. మిగతా దయ్యలు ఎక్కదబడితే అక్కడే ఉంటాయటగాని కొరివిదయ్యం మాత్రం శ్మశానంలోనే ఉంటదట.
ఎంతజెప్పినా దయ్యం దయ్యమేగాని దెయ్యం కాదన్నాడు మా సుబ్బరాజు. అరధంగాలేదు.
దయ్యాలో రకాలున్నయట. అన్ని దయాలూ కనపడవట :)
ReplyDeleteజిలేబి దయ్యము కనబడిందాండీ
?
Zilebi16 September 2025 at 12:33
Deleteఅయ్యయ్యో! జిలేబి దయ్యాల్లో ఎప్పుడు కలిసిందీ!
దెయ్యం 👻 అంటే గ్రహాంతర వాసి కూడా అయి ఉండవచ్చు కదండి. ఆ వాసులు ఏ పదార్థంతో నిర్మితమయ్యారో మనకు తెలియదు. వాళ్ళు పారదర్శకంగా ఉండే అవకాశం ఉంది.
ReplyDeletebonagiri16 September 2025 at 20:47
Deleteసారూ!
అంటే జిలేబి దయ్యాల్లో కలిసిపోయిమదంటారా? శాంతం పాపం, చస్తే కదండీ దయ్యమయ్యేది, అంటే జిలేబి బతికున్న దయ్యమా? చచ్చి దయ్యమయి దయ్యాలో కలిసిపోయిందా? అనుమానం సుండీ.
జిలేబీ అంతర్జాతీయం కాదు,అంతర్విశ్వం దయ్యమా? పదార్ధం లేనిది అనగా అణువుల సమూహం లేనిది ఏదీ లేదనుకుంటా విశ్వంలో కూడా! దీన్ని సయిన్సూ ఒప్పదనుకుంటున్నాను🤣. అంటే జిలేబి అణువుల సమూహం లేని ఆకృతి లేని విశ్వాంతరాళ దయ్యమని మీ అభిప్రాయమా?
జిలేబీ ని కర్చు రాసేశారా!
నా కామెంట్ లో జిలేబి ఎక్కడ ఉందండి?
Deletebonagiri17 September 2025 at 14:44
Deleteనిజమే సార్! మీ కామెంట్ లో జిలేబి మాట లేదు. సారీ సార్! పొరపాటు పడిపోయాను. జిలేబి దయ్యాన్ని చూసారాండీ అని జిలేబియే అనడంతో చలించానుసుమండీ! ఎంటి! జిలేబి పెద్దల్లో కలిసిపోయి దయ్యాల్లో కలసిపోయిందా అని బాధ కలిగిందండీ!