జై శ్రీరాం. జయ జయ శ్రీరాం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ।
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ॥
*****
ఇల్లలకగానే పండగకాదు.
నడిచే ఎద్దునే పొడుస్తారు.
పారా హుషార్!
జై శ్రీరాం. జయ జయ శ్రీరాం
సంస్కృతం దాకా బావుంది
ReplyDeleteఆ తరువాయి తెలుగు అర్థం బేమిటి భాయ్ ?
రామో విగ్రహవాన్ ధర్మః
శుభాకాంక్షలు
Zilebi6 April 2025 at 09:04
Deleteతమకు తెనుగు తెలియదు. వాక్ఫ్ బిల్లు ఏక్టైనంతలోసరిపోలేదు. చుట్టుపక్కల చూడరా! చిన్నవాడా!!!!
శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు6 April 2025 at 09:07
Deleteధన్యవాదాలు. ఎండ దంచుతో ఉంది. నిన్న నలభై ఉంది. ఎనిమిదికే బయట కాలు పెట్టలేక ఏసిలో కూచునిపోయా! కొత్త ఏర్పాటు చేస్తున్నా! ఎంతవరకు సాధించగలనో చెప్పలేను.
కొత్త యేర్పాటు వాటర్ టబ్ లో
Deleteబైఠాయింపాండీ ?
Zilebi7 April 2025 at 10:25
Deleteనా రూం లొనే. మనవరాలి లేప్ టాప్ షేరింగ్, కాలేజి కెళ్ళేటప్పుడు ఇచ్చి వెళుతుంది,సాయంత్రం వచ్చాకా లేప్ టాప్ ఇచ్చేయాలి. అదీ ఏర్పాటు. అప్పటిదాకా.. కొత్తగా ఉంది,ఇంకా అలవాటు కాలేదు.జై శ్రీరాం.
పోలీ!పొలీ!!నీ భోగం ఎంతసేపంటే మా అత్త చాకిరేవు కెళ్ళొచ్చేదాకా అనేది తెనుగు సామెత. తమకెక్కడ తెలుసు గనక.
మనవరాలి కాలేజీ ని చాకిరేవు తో పోల్చేరా !
Deleteప్చ్ మనవరాలికి తెలుసా ఈ సంగతి?
లాప్ టాప్ ఇచ్చింది తప్పయ్యేను
DeleteZilebi7 April 2025 at 12:23
కాలేజిని చాకిరేవుతో ఎందుకు పోల్చానో సమాధానం ఇప్పుడే చెప్పగలనుగాని చెప్పను. జరిగినది మనవరాలితొ చెప్పి,తను ఎం చెబుతుందో అది రేపు చెబుతాను. లేప్ టాప్ ఇచ్చి తప్పే చేసింది. 😊
ఏమి చెప్పును ?
Deleteచాకిరేవు అన్నదానికి నాలుగు మొట్టిక్కాయలు వేయును తాతగారికి :)
తాత గారు లాప్ టాప్ తో టాపు లేపుతారనుకుంటా!
DeleteZilebi7 April 2025 at 15:35
Deleteచూద్దాం😂
Bonagiri7 April 2025 at 16:24
Deleteఅలాటి మాటేగాని సుకమిల్లే సార్!లేప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటే బరువుగా ఉంది. దీన్ని తయారుచేసినవాడికి ఇంగితం ఉన్నట్టు లేదు😂 ఇంత బరువు ఒళ్ళో ఎలాగండీ. దానికి తోడు ఎలకని తిప్పుకోడానికి లేదు.ఇక్కడ వేసుకుందామటే టేబుల్ ఛైర్ లేవు.కొనాలా? దమ్మిడీ ముండకి ఏగాని క్షవరం అంటే ఇదేగదూ😂
చూద్దాం ఏమో! ఏమగునో!!!
ఒళ్ళో పెట్టుకుంటే వేడి కూడానూ.,
Deleteయోగా అలవాటున్నవారేగా మీరు, కాళ్ళు వంగుతాయనుకుంటే (నాకు వంగవు లెండి 😒) శుభ్రంగా లాప్టాప్ ని నేల మీద పెట్టుకుని పని చేసుకోవచ్చు, శర్మ గారు. ఎలకని తిప్పుకోవడానికి కూడా సౌకర్యం. మీ “వాతానుకూల” గదిలోనే కూర్చోవచ్చు. ఆలోచించండి.
ఈ వేంబు ఆసామి లా చెట్టు క్రింద ట్రై చేయరాదూ ?
Deletehttps://www.facebook.com/story.php?story_fbid=1019393743552863&id=100064467408860
Zilebi7 April 2025 at 22:33
Deleteలింక్ చూడలేదుగాని, గుర్తున్నవరకు,వేంబు ఆసామి యువకుడు,పచ్చటి పల్లెను తయారు చేసుకున్నాడు. ఆడుతు పాడుతు డబ్బులు సంపాదించుకుంటున్నాడు,చెట్లకింద,పచ్చటి చేలలో కూచుని,చల్లగా. మనకేదీ ఆ అదృష్టం. ఉన్న ఒక్క మామిడి చెట్టును కొట్టెయ్యమని చుట్టూ ఉన్నవాళ్ళ గోలే నిత్యం.పల్లె పేరుగాని ఉన్నదంతా కాంక్రీటు అరణ్యం.
విన్నకోట నరసింహా రావు7 April 2025 at 19:43
Deleteనిన్న చెక్కప్లాంక్ ఒళ్ళో పెట్టుకుని తిప్పలు పడ్డానండి. మంచి సలహా ఇచ్చారు,కింద కూచున్నా,కింద కూచుంటే లేప్ టాప్ పెట్టుకోడానికో పీట కొనుక్కుంది,మనవరాలు. తాను వాడుకుంటోంది,అది కూడా ఇచ్చింది. దిల్ బహార్,బాగుంది,కింద కూచుంటే.
ధన్యవాదాలు.
sarma7 April 2025 at 14:20
Deleteనిన్న సాయంత్రం సంగతంతా వివరంగా చెప్పేను,మనవరాలికి. విని,ఏమో అనేసి,నవ్వేసింది. తనకు కాలేజిని చాకిరేవుతో ఎందుకు పోల్చానో చెప్పేను. అది ఇప్పుడు చెబుతున్నా. బట్టకి అంటిన మురికిని చాకి రేవులోనే శుభ్రం చేస్తాం. అజ్ఞానమనే మురికిని వదిలించడానికి కాలేజికి వెళతాం. అంచేత కాలేజిని చాకిరేవుతో పోల్చడం....
అరవ వేంబు గారు పొలంగట్టు మీద కూర్చున్నారు. ఆ చెట్టు ఏ తాటిచెట్టో అయ్యుంటుంది - పొలం గట్ల మీద అంతకన్నా ఏం చెట్లుంటాయి. దాని క్రింద కూర్చుంటే “ధర ఖర్వాటుడు ……… “ పద్యంలో లాగా ఉంటుందేమో? .
Deleteవిన్నకోట నరసింహా రావు8 April 2025 at 10:29
Deleteసాధారణంగా తాడి చెట్లే ఉంటాయండి,కాని దిమ్మలాగా మట్టి ఎత్తుపోసి ఒక మకాం కట్టి అక్కడ పళ్ళ చెట్లు నాటడం అలవాటండి. అటువంటి చోటై ఉండచ్చు.
కంప్యూటర్ ఒక్కచోటే ఉంటే ఏ యిబ్బందీ లేని వాళ్ళకు laptop అనవసర మండీ. ఉద్యోగస్తులకు తప్పదు. మీటింగులకూ ప్రయాణాలకూ వెళ్ళేటప్పుడు తమతమ కంప్యూటర్లు వాళ్ళకు కూడా ఉండాలి కాబట్టి. ఉద్యోగస్తులకు తమ డెస్కుల మీద వేరే మానీటర్లూ కీబోర్డులూ మౌసులూ ఉంటాయి. వాటిని laptop ద్వారా అనుసంధానం చేసుకుని పనిచేస్తారు. ఐనా ఆధునికం ఐనా laptop బరువుగా ఉండకూడదే!
Deleteమనవరాలు తాతల కాలంనాటి ల్యాపు టాపు ఇచ్చేసుంటుంది :) తాతగారు కూడా మా నాన్నే మా మనవరాలే అంటూ లాపుటాపు గొప్పల్ వాపోయుంటారు !
Delete:)
శ్యామలీయం8 April 2025 at 12:53
Deleteదగ్గరగా నాలుగు కెజిల బరువనిపించిందండి. దీనిపైdy అని ఉంది,కంపెనీ పేరు..
Zilebi8 April 2025 at 14:29
Deleteచిన్నతల్లికి పని లేని సమయంలోనే ఇచ్చింది. తాతల నాటి దంటే నా కాలందేగా.వాపోవడమెందుకుటా? 😂
Glad you liked it . :)
Deleteశ్రీరామనవమి శుభాకాంక్షలు మిత్రులారా ?
ReplyDeleteనిదుర లేవంగనే నిలువడి పరమాత్మ
యెదుట చేతులు జోడించు హితుడ !
భక్తిపాటల ననురక్తిగా చెవుల క
మంద సుఖానందమందజేయి ,
స్నానాదికాల ప్రస్తానములు ముగించి
దేవదేవుని గొలుము తీరినంత ,
పనికి వెళ్ళి పనిని భగవదత్తముగాగ
కష్టపడి యొనర్చు మిష్ట మొదవ ,
ఆలుబిడ్డలె తొలి ప్రాధాన్యతలుగ
ప్రేమలను పంచు నదియె శ్రీరామ రక్ష !
తల్లి దండ్రుల మరువకు , ధర్మ మరసి
సమ సమాజ హితము గోరి సాగు మిత్ర !
వెంకట రాజారావు . లక్కాకుల6 April 2025 at 10:56
Deleteఆనందో బ్రహ్మ. ధన్యవాదాలు
ఏ మహాత్ముడు జనియించి భరతభూమి
ReplyDeleteపావనమయ్యె సౌభాగ్యయగుచు
ఏ మహాత్మునిపాద మీమహీతలమును
తాకగా పుణ్యాల తతులు విరిసె
ఏ మహాత్ముని నామ మిరవొంద రామా య
నుచు నిట మార్మ్రోగి నుతులు గొనియె
ఏ మహాత్ముని చేత ఏలబడి సుభిక్ష
మై యిచ్చటి జనులు హాయి వడిరి
అట్టి లోకైక ప్రభు డయోధ్యాధిపతిని
రామచంద్రుని స్మరియించి , భూమిజను
శరణు వేడి , లక్ష్మణునికి శిరసు వంచి ,
పవనసుతునికి మ్రొక్క నాపదలు తొలగు .
వెంకట రాజారావు . లక్కాకుల6 April 2025 at 11:04
Deleteచెప్పాలని ఉంది మనసు విప్పాలని ఉంది. ప్రయత్నంలో ఉన్నా. ధన్యవాదాలు.