కత మొదలయింది.
ముంబై పేలుళ్ళ సూత్రధారి,పాక్ లో పుట్టి,అక్కడ సైన్యంలో పనిజేసి కెనడా పౌరుడిగా చెలామణీ అవుతున్న తహవ్వుర్ హుసైన్ రాణా ను అమెరికా ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి ఢిల్లీలో అప్పగించింది,ఒప్పందం ప్రకారం,ఆదేశపు కోర్ట్లు తీర్పులిచ్చిన తరవాత. ఇంకిప్పుడు మొదలయింది భారత్ లో కత......అదెటులంటేని...
అతను మా దేశపు పౌరుడు కాదు, చాలా కాలం కితమే దేశం వదలిపోయాడు అని సన్నాయి నొక్కులు నొక్కింది పాక్ ఎంబసీ.
తహవ్వుర్ని అమెరికా తీసుకొచ్చి అప్పజెప్పింది తప్పించి అతన్ని అమెరికాలో అరస్టు చెయ్యలేకపోయారు,ఇక్కడికొచ్చాకానే అరస్టు చేసి కోర్టుకి తీసుకెళ్ళేరు,ఇందులో మీగొప్పమే అని ఇంకా ఎవ్వరూవాక్రుచ్చలేదు.
అది మీ గొప్పేం కాదు,మేమెప్పుడో ఉత్తరం రాశాం అమెరికాకి,అన్నారు కాంగ్రెస్ వాదులు.
కేస్ ఆరునెలల్లో తేల్చెయ్యచ్చు అన్నారు చిదంబరం మహాశయులు. అదేమో?
ఇతను ఒక చిన్న చేప పెద్దచేపలు ఇంకా దొరకనే లేదూ అని శలవిచ్చారో మాజీ.....
హక్కుల సంఘాలవారింకా రాగం మొదలెట్టలేదేమో.... మందులు,వైద్యం సరిగా అందటం లేదు.బిరియానీ పెట్టటం లేదు వగైరా వగైరా...ఎర్రమిత్రుల మాటే వినబడలా....
కపిలులు,మనువులు,గొపగొప్ప కొమ్ములు తిరిగినవారు ఏం వాదిస్తారో చూడాలి.
అతను హిందువయ్యా! పేరు చివర రాణా లేదూ? అది హిందువుల పేరు. ఆర్.ఎస్.ఎస్ తమవాడినొకడిని పాక్ పంపి ఇదంతా చేయించి ప్లాన్ చేసింది అని ఇంకా ఏ డిగ్గీగారూ అనలేదేమా?
నడుస్తున్న కత చూడాలి..
తాతగారు ఫుల్ స్వింగ్ లో వున్నారు :)
ReplyDeleteఏమి జరగవచ్చునో చెబ్దురూ :)
Zilebi11 April 2025 at 09:33
Deleteభారత దేశం లో ఏం జరుగుతుందో,నేను చెప్పేస్తే మజా లేదు,ఊహించు,ఆ మాత్రం చెయ్యలేవా.
పండితోత్కర్షకు పట్టువడ డితండు
ReplyDeleteసదమల భక్తి పాశమున గాని ,
రాజ రాజోన్నత రాజసములకు గాదు
తులసీ దళానికి తూగు నితడు ,
భోగ లాలస భాగ్య పూజనములకు గాదు
పేదింటి పూవులు ప్రియ మితనికి ,
మహిత మహామంత్ర మాహాత్మ్యముల గాదు
తనను సమర్పించ తనియు నితడు ,
కృష్ణు డితడు , సనాతన విష్ణు డితడు ,
వాసుదేవుడితడు , భక్త వరదు డితడు ,
తనను నమ్మిన వారికి , త్రాత యితడు ,
నెమ్మి , యెదలోన కొలువయ్యె , నమ్మి కొలుతు .
వెంకట రాజారావు . లక్కాకుల11 April 2025 at 12:49
ReplyDeleteనమో నమః
A comment is making rounds in what"s app. slightly modified
ReplyDeleteTerrorist Rana was given the option of whether he wanted to be extradited to Bharat or move back to his home country, Pakistan.
He thought for a moment, "If I were to go to Pakistan then the chances of " unidentified men" killing me are high." Instead,
"If I were to move to Bharat , I would get class A prison, manuvu or Birbal as my counsel, alliance for protection, and TV Channels for propaganda to say my father was a poor millionaire and I was a misguided youth by RSS and an innocent creature. Also, the chances of me getting a Rajya Sabha seat from TN, UP, or W. W.Bengal is very high.
.Above all it would be fun to watch 1.1 billion out of 1.36 billion watching helplessly when India's SC grants me bail and reprimands for failing to act on 26/11"
He said " F...Pakistan! Hail Indi"a!
👏
courtesy:whatsapp
ఇతగాడి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసి, నిరూపించడానికి కావలసిన సాక్ష్యాధారాలను ఇంతకు ముందే రెడీ చేసుకుని ఉంటారంటారా మన అధికారులు, శర్మ గారూ ?
ReplyDeleteఇంటరాగేట్ చేసి కనుక్కుంటారేమోనండీ
Deleteఆ తరువాయి జైలు శిక్ష ఆ జైలు పకడ్బందీ గట్రా వుంటాయనుకుంటా
విన్నకోట నరసింహా రావు11 April 2025 at 20:14
DeleteZilebi12 April 2025 at 06:33
కేసు ఇప్పటికే ఉందండి. దానిలో భాగంగానే కసబ్ కి శిక్ష,మరో ఇద్దరిలో ఒకరిని నిర్దోషిగా వదలడం జరిగింది. ఇతని మీద కూడా ఈ కేస్ ఉన్నదిగనక ఇతని ప్రమేయం పరోక్షంగా విచారింపబడింది. ఇప్పుడు ప్రత్యక్షంగా దొరికాడు గనక,ఇక్కడ సాయపడినవారెవరు? కుట్ర వివరాలు,ఎవరు సారధులు వగైరా విచారించి అప్పుడు కోర్టుకు నివేదిస్తే లాయర్లు వాదనలు వినిపిస్తే ఏమో ఏమగునో! ఇప్పటికి అతనికి గవర్నమెంటు ఒక లాయర్ని ఇచ్చింది. అతను తనకు నచ్చిన లాయర్ని పెట్టుకోవచ్చు,డాలర్ కాసులు చాలా ఉన్నవాడే, అంతేనా మనదేశంలో సాయపడ్డాని ముందుకొచ్చే ధర్మాత్ములు చాలా మంది ఉన్నారుగదండీ.
అర్ధరాత్రి కోర్టులో ప్రవేశపెట్టడమేంటి, ట్రాంపరెన్సీ లేదా వగైరా కొచ్చన్లు పుడతాయండి,ఇక ముందు,వేచి చూడాలి.
ఈలోగా కాంగ్రెస్ వారు తెగ కంగారు పడిపోతున్నారు. కపిల్ సిబాల్ గారు NIA ను ఏర్పాటు చేసినది కాంగ్రెస్ ప్రభుత్వమే అని శలవిస్తున్నారు. వారుగాని వాదించడానికి ముందుకొస్తారా? మను వస్తారా? ఇప్పటికే వాక్ఫ్ కేసు చూడ్డానికి ఇద్దరూ ఉన్నారు అందులో ఉన్నారు. దీనికీ దానికీ ముడి పెట్టినా పెట్టగల మేధావులు. చూదాం ఏమగునో!
మాలిక మళ్ళీ మొదలు కావచ్చని నా ఊహ. దానికోసం చేసే ప్రయత్నంలో ఉన్నది కూడా ఆగిందనుకుంటా.
ReplyDeleteశర్మ గారు,
Deleteకరెంటు సప్లై సమస్య వలన ఇంట్లో మొదట బల్బులు డిమ్ అవుతాయి, ఫాన్ ఈసురోమంటూ తిరుగుతుంది లేదా ఆగి పోతుంది. ఇలా ఒకటి రెండు గంటలు గడిచాక కరెంట్ మొత్తానికే పోతుంది. దాంతో జనాలు హమ్మయ్య మొత్తం పోయింది అంటే కాస్సేపటిలో ఫుల్ గా వస్తుంది ….. అనుకునే వాళ్ళం కదా, మీకు తెలియనిదేముంది. “మాలిక” వ్యవహారం చూస్తుంటే నాకదే గుర్తుకొస్తోంది.
విన్నకోట నరసింహా రావు12 April 2025 at 10:58
Deleteనిన్నను 40 ఆపైనే ఉంది వేడి. మలమలమాడిపోయాం. సాయంత్రం ఆరయింది,కొంచం చల్లగా గాలి వేస్తోందంటే బయట కుర్చీ వేసుకున్నా! అదెంత సేపు,ఈలోగా చినుకులు ప్రారంభమయ్యాయి. బతుకు పెనం మీంచి పొయ్యిలో పడినట్టయ్యింది,వేడి ఉడకబోత. లేచి లోపలికి పోయా! సౌభాగ్యం నాదే అప్పటికే కరంటు చెట్టెక్కేసింది. ఇంకేంటి చెప్పుకునీది సారూ! పడుకున్నా ఎనిమిది దాటాకా! నిద్ర పట్టదు,వేడి,ఉడక. కొద్దిగా గాలేసి కరంటు పోయిందంటే నాలుగు గంటలు లేదా ఆరు గంటల్లో వస్తే పండగే. రాత్రి ఇక లాభం లేదు గచ్చుమీద పడుకుందామని దుప్పటి పరచుకున్నా దిండుకోసం వెళితే కరంటొచ్చింది. ఇప్పుడు కింద పడుకోడమో మంచం మీదో తేల్చుకోడానికి సమయం పట్టింది. ఈలోగా ఎ.సి వేసుకున్నా! కరంటు నిలబడేలాగే ఉందనిపించి మంచం ఎక్కా, పదకొండు దగ్గరై ఉంటుంది. ఎప్పుడో నిద్ర పట్టింది,లేవడం ఆలస్యమయింది. ఇలా మొదలయింది మా కత. 😁 మాలిక కూడా అంతే అనుకుందాం😁 ఆశా జీవులం కదా! మాలిక గోవిందా కొట్టేసిoదని ఎద్దేవా చేసేవాళ్ళలా కాదుగదు సార్!
శర్మ గారు,
Deleteమీ ఇంటికి బయట వైపు రెండు పక్కలా వరండా ఉంది కదా. ఆ వసారాలో మడత మంచమో, నవారు మంచమో వేయించుకుని పడుకోవచ్చుగా మీ మామిడి చెట్టు గాలి ఆస్వాదిస్తూ?
ఉక్కపోత కించిత్ ఉంటుందనుకోండి గానీ ఇంటి లోపల పడుకునే దానికన్నా చాలా నయం కదా ?
-
Deleteఇచ్చోట ఉచిత సలహా లివ్వ బడున్ :)
-
Deleteఇచ్చోట ఉచిత సలహా
లిచ్చెడు వినరాలు గలరు లెండు జిలేబీ
లిచ్చెదము వరుస వ్యాఖ్యల
ముచ్చటలన్ తాతగారు ముందుకు రండీ
నారదా
“ఉచిత సలహా” మధ్యలో మరో పదమేదైనా మర్చిపోయారా 🤔 ?
Deleteఅన్నట్లు “ఇచ్చోట” “ఇచ్చోట” అని అన్నిసార్లు అనకండి - జాషువా గారి పద్యం ఒకటి గుర్తొచ్చేలా 😒😒.
Deleteవిన్నకోట నరసింహా రావు13 April 2025 at 16:05
Deleteఈ శాల్తీకి ఆ పద్యమేంటో తెలిస్తే కదుసార్!
ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి నల్లపూసల సఔరు గంగలో గలసిపోయె,ఇచ్చోటనే కదా .
Deleteవిన్నకోట నరసింహా రావు13 April 2025 at 15:39
అస్సలు పట్టించుకోవద్దు సార్!
విన్నకోట నరసింహా రావు13 April 2025 at 12:08
Deleteమంచం వేసుకున్నా జల్లు కొడుతుందండి. దానికి తోడు ఎదుటి బిల్డిOగ్ నుంచి వేడి ఆవిర్లు,అంతకంటే లోపల నయమని. గచ్చు మీద పడుక్కోడం బెస్ట్ అండి.ఎ.సి వేసుకున్నప్పుడు గచ్చు చల్లబడుతుంది,అది చాలా సేపు ఉంటుందండి,అంచేత కింద బెస్ట్.
శని పన్నెండో ఇంట నడుస్తున్నాడండి. మొన్ననొక రోజు ఏ
.సి పోయింది. పదివేలతో బాగుచేయించుకున్నా,ఈ వేళ మళ్ళీ పోయింది,చెప్పేం,వస్తానన్నాడు టెక్
Zilebi13 April 2025 at 12:26
Deleteతివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు
చేరి మృగతృష్ణలో నీరు ద్రావ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధిమప వచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు
చిన్నప్పుడు చదువుకున్న పద్దెం
చిన్నప్పుడు చదివింది ఇప్పటికి అక్కరకొచ్చింది అంటున్నారాండీ ?
Deleteమొన్నటిలాగే నిన్నను కూడా ఎండ దంచింది,అప్పుడప్పుడు మబ్బేసింది. రాత్రి ఏడు గంటలకి కత మళ్ళీ మొదలయింది,గాలి,ఈ సారి వర్షం, సరే కరంటు షరా మామూలేగా. హడావుడి తగ్గేటప్పటికి తొమ్మిది దాటింది. వస్తుంది,వస్తుంది కరంటని ఎదురు చూచి ఎదురు చూచి బొంత వేసుకుని కింద పడుకున్నా చివరికి పది గంటలలికి. నేల చల్లగా ఉందిగాని ఉక్కిరి బిక్కిరైనట్టుంది. లేచి తలపులు తీసుకుని సీలింగ్ ఫేన్ కట్టేసి, మూలనున్న టేబుల్ ఫేన్ దూరంగా పెట్టుకుని పడుకున్నా. అలవాటు లేని ఔపోసన కదా నిద్ర పట్టలేదు. కాసేపట్కి చలేసింది. లేచి మంచమెక్కేను. అక్కడా నిద్ర లేదు. ఇలా తిప్పలు పడుతుండగా రెండు గంటలికి కరంటొచ్చింది. ఏ.సి చెట్టెక్కిందిగా ఎలాగో తెల్లారి నాలుగయ్యింది. లేచి పెరడు చూస్తే యుద్ధ రంగంలా ఉంది. వీలైనంత చెత్త తీసేసి నడిచి కార్యక్రమాల్లో పడితే తెల్లారింది. మామిడి చెట్టు విరగబూసింది,కాసిందన్నంత ఆనందం మిగల్లేదు. దొడ్డినిండా రాలిన కాయలే. ఏరి పోగుచేస్తే ఏడుపే వచ్చింది. వాటిని అమ్మ ఏంచేస్తుందో! ఈవేళ రైట్ అవ్తుంది ఏ.సి అన్నాడు టెక్. అతని కోసం ఎదురు చూస్తున్నా! శని పన్నిండో ఇంట నడుస్తున్నట్టే ఉంది.
Deleteశర్మ గారు,
Deleteమీ ఏ.సి వ్యవహారం నాకర్థం కావడం లేదు. వేసవి ప్రారంభంలోనే ఆ సోకాల్డ్ “టెక్” ని పిలిచి మీ ఇంట్లోని ఏ.సి. లను సర్వీసింగ్, అవసరమైన రిపేర్లు చేయించానని మీరన్నట్లు జ్ఞాపకం.
మరి అంత డబ్బు పోసి చేయిస్తే ఒక్క వేసవికి కూడా సరిగ్గా పని చెయ్యవా? చేసిన రిపేరు అంత సొంపుగా ఉందా ? ఇప్పుడు మళ్ళీ పదివేల రూపాయల ఖర్చేమిటి? ఆ టెక్ కి మీరు ఓ ATM లాగా కనిపిస్తున్నారేమో ?
అసలే తాతగారు ఏసీ ప్రాబ్లెమ్ లో వుంటే
Deleteమీరిలా ప్రశ్నలపై ప్రశ్నల వరదతో ముంచెత్తేస్తున్నారేమిటండీ వినరావారు
పూర్వ జమానా లో బియెస్యెన్నెల్ ఎలాపనిచేస్తుండేదో దాని నమూనా చూపిస్తున్నాడేమో టెక్కు తాతగారికి :)
Zilebi14 April 2025 at 14:36
Deleteచిన్ననోమునోచి పెద్ద ఫలితం కావాలంటే రాదు. తమరిలాటివారికి ఆ సర్వీసు చాలు. అంతా ముఫత్తు కదా! ఎప్పుడేనా బిల్లు కట్టిన మొహమా ఇది?
విన్నకోట నరసింహా రావు14 April 2025 at 10:00
Deleteఇంట్లో మూడు స్ప్లిట్ ఎ.సి లు. ప్రతి సంవత్సరం వేసవి ముందు ఫిబ్రవరిలోనే ఏన్యుయల్ మైంటెనన్సె చేయించేస్తాను. ఈ సంవత్సరమూ చేయించాను. ఏన్యుయల్ మైంటెనెన్స్ ఛార్జీలు తక్కువే! గేస్ పెడితే అదనం.
నా దగ్గరున్న యూనిట్ తొమ్మిది సీజన్లు పని చేసింది. ఇది పదవ సీజను. అవుట్ డోర్ యూనిట్ లో ఇబ్బంది వచ్చింది. దానిని సరి చేయడం జరిగింది. రెండు మూడు రోజులు పని చేసింది. కూల్ కావడం లేదు. నిన్న చూసేడు,లోపల యూనిట్లో చిన్న పార్ట్ మార్చాలి అని ఉదయం పదికి తీసుకెళ్ళి గంటలో తెచ్చేసేడు, యూనిట్ పెట్టి ఆన్ చేసి వెళ్ళేడు,బాగుంది. టెకీ బాగా తెలిసినవాడు,సీనియర్. డబ్బులు తీసుకెళ్ళ లేదు,యూనిట్ బాగా పని చెయ్యనివ్వండి,డబ్బులు తీసుకుంటా అన్నాడు, అంతే కాదు,మొత్తం బాగు చేసినందుకు,మార్చిన పార్టు లతో కలిపి మొత్తం పది వేలు. కరంట్ సరిగా ఉండని చోట్ల స్ప్లిట్ ఏ.సి త్రీ స్టార్ ఐనా ఫైవ్ స్టార్ ఐనా ఐదారు సీజన్ల పైబడి పని చెయ్యదు.
కరెంటు బిల్లు కడతారాండీ ?
Deleteలేక కొక్కీయా?
Zilebi14 April 2025 at 18:05
Deleteబలే ఆలోచనలొస్తాయి తమరికి. ఐన్ స్టీన్ మెదడులాగా తమ మెదడు కూడా దాచి పెట్టాల్సిందే భావి తరాల వికాసం కోసం.🤔
ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ
ReplyDeleteపాదాంబుజములపై యొరగుట ,
ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ
దరిసి కరముల మ్రొక్కి ప్రదక్షిణ మిడ ,
ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ
నతులతో ముంచి సంస్తుతులు సేయ ,
ఇదికదా , కృష్ణయ్య మదికి నచ్చిన సేవ
అకలంక భక్తి డోలికల నూచ ,
అన్నిటికి మించి , ప్రియమార , గిన్నె లోన
వెన్న నైవేద్య మిడి , తినిపించు సేవ
యన్న , కృష్ణయ్య కిష్టము , కన్ను గవకు
భాష్పములు గ్రమ్ము , కృష్ణయ్య పటము గాంచ .
వెంకట రాజారావు . లక్కాకుల13 April 2025 at 11:52
Deleteఎన్నాళ్ళని నాకన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా ఎంత వేడినా ఈ నాటికి దయరాదేలా,గోపాలా,నంద గోపాలా.
పాలను దొంగిల పరులచేతిలో దెబ్బలు తినకుర కన్నయ్యా
ఈ తల్లి హృదయమూ ఓర్వలేదయా.
ఎంత వేడి!
Deleteనా (పై) ఈనాటికిన్ దయరాదే లా !
గో! పాలానంద! గో! పా! లా!
పరమాత్మ సంస్తుతి వినగ
ReplyDeleteపరమానందము గలిగెడు భాగవత బుధా !
తరమగు పనియే గద ! గురు
వర ! పనిమాలిన పనియని భావింపరుగా !
వెంకట రాజారావు . లక్కాకుల13 April 2025 at 18:17
Deleteకృష్ణా అని తలిస్తే కష్టం తొలగుతుందని పెద్దల మాట. ఆ భాగ్యం మీరు కలగజేస్తున్నందుకు కృతజ్ఞత తెలపాలిసింది నేనే! ఆ అదృష్టం పంచిపెట్టే మీ షృదయానికివే జోహార్లు. నామ స్మరణ ఎప్పటికిన్నీ పనికిరాని పని కాదు కదు సార్!