Wednesday 15 March 2023

కత వెనకకత

 కథ వెనకకత

తిక్కమొగుడుతో తీర్థమెళితే..... కథ రాయాలనుకున్నా! దీనికి పూర్వకథేం లేదు, అనుశ్రుతంగా చెప్పుకునీదిన్నీ. రాయడం మొదలెట్టా. ఎంతసేపు రాసినా తీర్థంలో తిప్పడం సరిపోయింది తప్ప, కత చదివించేలా అనిపించలా! మూడు నాలుగు రోజులు, నాలుగైదుసార్లు రాసి చెరిపేను, నచ్చక. చిరాకొచ్చి వదిలేసేను,మనసు మరల్చేను, బుఱ్ఱలో పురుగు తొలుస్తూనే ఉంది. ఒకరోజు ఉదయం నడుస్తుండగా ఒక మెరుపు ఆలోచనొచ్చింది. తీర్థంలో పిల్లలు తప్పిపోకుండేందుకు వారికి కనపడ్డానికి, పిల్లల్ని మెడలమీద ఎక్కించుకోవడం గుర్తొచ్చింది. ఆ! కొస దొరికిందని సంబరపడి కత మొదలెట్టి రాసా! పెద్దగా రాలేదు, అంత అందగించనూ లేదు. ఏం చెయ్యాలీ? ఆ రోజులనాటికి తిక్కపనులనిపించినవాటిని చొప్పించాలనుకున్నా! తాహతుకి మించి కర్చు, గూటి పడవ, మంది మార్బలం, ఇలా పెంచేను. ఇంతచేసేం కదా! మనకి తెలిసిన తీర్థం, పట్టిసీమను చొప్పిస్తే, శివరాత్రికి

 కత పూర్తిచేస్తే, అక్కడ జరిగే వేద సభను జొనిపిస్తే, అలా జరిగిపోయి, తీర్థంలో పెళ్ళాం అలసిపోతే భుజాలమీద ఎక్కింపజేసి,   గూటిపడవలో పడుకోబెట్టించి,

 కత పూర్తి చేసేను. కాని అసంపూర్తి అనిపించింది. ఈలోగా ఆ అసంపూర్తి కతని ఒక మందస్మితవదనారవిందసుందరి చదివి కత బాగుంది ఐపోయిందా? అడిగింది. నేననుకున్నట్టే అనుకుందే అనుకుని పూర్తి చెయ్యాలన్నా!


తీర్థంలో పెళ్ళాన్ని ఎత్తుకుంటే తీర్థంలో వాళ్ళు చూస్తారు, వీడెవడెవడురా! తిక్కమొగుడు అనుకుంటారు, అంతతో సరికదా! ఊళ్ళో వాళ్ళనుకుంటే కదా ఇదొకనానుడయ్యేది. అందుకు కతలో చిన్న మార్పు, కొండమీద జరిగిన, తీర్థంలో జరిగిన విషయాలు ఊళ్ళోకి, తీర్థానికొచ్చిన ఊరివాళ్ళు ఊరికి చేరేసినట్టు మార్చి, ఊళ్ళో మగా

ళ్ళూ ఆడాళ్ళూ చర్చ పెట్టి ఒక వృద్ధురాలి చేత జాయతో, పతి తీర్థం తిక్కపనిలా ఉన్నా జాయ మనసెరిగి, జాయ కోరిక తీర్చాడు అనిపించి, తిక్కమొగుడు కత పూర్తి చేసాను. ఇందుకు పదిహేనురోజులూ పట్టింది.


కతరాయడం తేలికైన విషయంకాదు. గర్భవతైన స్త్రీ కనడానికి పడినన్ని నొప్పులూ పడితేగాని కత బయటికిరాదు. ఒకటిన్నర నిమిషం చదివించే కతలో ఎన్ని చూసుకోవాలి? కత నడక చూడాలి, అక్షరాల వెంట కళ్ళు పరుగుపెట్టేలా చెప్పాలి,భాష చూడాలి, అప్పుడే ఐపోయిందా? అనిపించాలి.మనుషుల మనస్తత్వం చూడాలి, కత ముగింపు బాగోవాలి, చెప్పగల్గితే ఒక కొత్త విషయం చెప్పాలి. ఇంత బాధాపడాల్సిందే. ఎందుకింత బాధపడి కతరాయాలి? స్త్రీ చావు అంచులదాకా వెళ్ళి కూడా బిడ్డను కనాలని ఎందుకనుకుంటుంది? ఇదీ అంతే!అంతే సుమా!  

ఇక తల్లి తనకిపుట్టిన బిడ్డలందరిని ప్రేమిస్తుంది, అలాగే రాసిన ప్రతి కతా అందంగానే కనపడుతుంది, నాకుమాత్రం.  కత బతికి బట్టకడుతుందా? అది కాలమే చెప్పాలి, కాలానికి వదిలేయక తప్పదు.

తిక్కమొగుడితో తీర్థమెళితే... 

https://kasthephali.blogspot.com/2023/02/blog-post_17.html

23 comments:

  1. Oscar vastumdandi

    ReplyDelete
    Replies
    1. Anonymous16 March 2023 at 03:17
      ఆశ,దోశ,అప్పళం,వడ.

      ఏవేవో చిలిపితలపులురుకుతున్నవి.అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది.

      Delete
    2. కాంత్16 March 2023 at 21:58

      ఆస్కారం లేదండీ, రాజమౌళి ఈ కతని ఒక సినిమాగా తెల్లవాళ్ళతో తీసి ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ప్రపంచమంతా ప్రమోట్ చేస్తే తప్ప.

      Delete
    3. రాజమౌళి సినిమాగా తీసేంతగా దీంట్లో కత వుందనుకొంటున్నారా ? జోక్ ఆఫ్ ది సెంచురీ.

      Delete
    4. కాంత్17 March 2023 at 05:21

      బాహుబలి/ఆర్ఆర్ఆర్ కతలు కూడా ఇలా 5-10 వాక్యాల్లో బ్లాగులో రాయొచ్చు. వాటికికూడా మీరిలా "రాజమౌళి సినిమాగా తీసేంత కతలా" అని కామెంట్ ఆఫ్ ద కలియుగం పెట్టొచ్చు. మీరు రాజమౌళిని తక్కువ అంచనా వేస్తున్నారు. కత కాదు కథనం ముఖ్యం.

      Delete
    5. కత కాదు కథనం.... కత లేనట్టే అప్పుడు.
      అలాంటి దానికి కత వెనుక కత ఎందుకు :)

      Delete
    6. కాంత్16 March 2023 at 21:58
      కాంత్17 March 2023 at 05:21

      కాంత్ జీ
      బ్లాగులో ఒక కత రాసుకున్నాను, అది రాయడంలో పడిన ఇక్కట్లూ రాసుకున్నాను. అది గొప్పకత అని చెప్పుకోలేదు. దానిని బతికించడం కోసం ఇబ్బందులూ పడను.బతికితే బతుకుతుంది లేదా చస్తుంది, రాయడం వరకే. నానుడి వెనుక కతలు ప్రజలనోటి మీద ఉంటాయి. ఎలా ఉన్నాయి? కాలంతోనే!!

      ఇక సినిమాకి నాకూ సగమెరిక. నేను సినిమా వదిలేసి/చూసి ఐదుదశాబ్దాలు. మీరు చెబుతున్న నటీనటులు దర్శకులు సంగీత సామ్రాట్టులు నాకు తెలియరు, పేర్లు కూడా తెలియవు. ఇక అస్కారు వగైరాలంటే చెప్పేదేలేదు, అంతా అయోమయం.

      తెల్లతోలోల్లు మెచ్చితేగాని ఏదీ బాగున్నట్టు కాదనుకునే వారే నేటి జనం. నేనలా అనుకోను. ఈ అవార్డులు దేశీయమైనా,విదేశీయమైనా నాకు నచ్చవు, అందుకే అందులో కలగజేసుకోను.

      Delete
  2. Anonymous17 March 2023 at 05:03
    Anonymous17 March 2023 at 06:42
    మీరు ఇద్దరైనా ఒకరైనా ఇదే సమాధానం.
    మీ అభిప్రాయం మీకు ఉండాడానికి నాకేం అభ్యంతమూ లేదు. అది వెలిబుచ్చడానినీ తప్పు పట్టను. మీ అభిప్రాయం తప్పైకావచ్చుగాని మీ అభిప్రాయం వెలిబుచ్చడం తప్పనే విషయాన్ని, ఖండిస్తాను.మీ అభిప్రాయం ఒకరిని కించపరచేదిగానూ, తిట్టుగానూ ఉండనంతవరకూ ఆమోదయోగయమే నాకు.

    నాకత,దానిగురించిన వెనకకత గొప్పవని చెప్పుకోలేదు,చెప్పుకోనుకూడా! కత మిమ్మల్ని ఎక్కడో ఇబ్బంది పెట్టినట్టుంది.

    ఆస్కారు గురించిగాని శ్రీమాన్ రాజమౌళి గురించిగాని నాకు తెలీదు.
    ఒక భారతీయుడికి అవార్డ్ ఇచ్చారు, సంతసం, అంతవరకే నేను పరిమితం.

    నా అభిప్రాయం మాత్రం, అవార్డులు ఊరికేరావు, తెల్లోళ్ళిచ్చినా నల్లోళ్ళిచ్చినా! తెల్లోళ్ళు మెచ్చినదే గొప్ప అనుకోను.

    ReplyDelete
  3. // “తెల్లోళ్ళు మెచ్చినదే గొప్ప అనుకోను.” //

    లెస్స పలికితిరి, శర్మ గారూ 👌👏👏🙏.


    Reply

    ReplyDelete
    Replies
    1. Vinnakota Narasimha Rao garu Sarma Gari Matalaku eduraDagalara ? Lessa lessa anToo tala upaDam tappimchi.

      Delete
    2. Anonymous17 March 2023 at 19:34
      /Vinnakota Narasimha Rao garu Sarma Gari Matalaku eduraDagalara ? Lessa lessa anToo tala upaDam tappimchi./

      /విన్నకోట నరసింహా రావు గారు శర్మ గారి మాటలకు ఎదురాడగలరా ? లెస్స లెస్స అంటూ తల ఊపడం తప్పించి. /

      ”అని అనిపించుకోవడం అత్తగారా నీకలవాటు” అందో కోడలు, ఇదొక నానుడి.

      మీమాటలో నిజాన్ని చూడలేనితనం. అసూయ స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి. తమ మాటకి పూతికపుల్ల,చిల్లిగవ్వ,గుడ్డిగవ్వ (ఫూటీ కౌడీ)విలువలేదు, ఇది సత్యం.

      తెల్లోడేం చేసిన తమకి నచ్చుతుందికదా! తెల్లోడిమాయ చూడండి, ఇప్పటికైనా మానసిక బానిసత్వం వదలండి.

      చదివి తరించండి.
      https://www.siasat.com/rajamouli-pays-hefty-price-to-attend-oscars-buys-ticket-worth-rs-2548979/

      Delete
    3. ఇరవై ఐదు వేల USD ఆఫ్టరాల్ దీనికోసం ఇంత గింజుకుంటారెందుకో ? వాళ్ల డబ్బు వాళ్ల ఇష్టం. వెరీ వెరీ లో థింకింగ్.

      Delete
    4. Anonymous18 March 2023 at 09:27
      తెల్లోళ్ళిచ్చిన అవార్డులే గొప్పవనుకున్నంత కాలమూ ఇంతే. వాటికోసమే ఎగబడితే అంతే. అవార్డిస్తామంటే ఇంతదూరంనుంచి వెళ్ళినవాళ్ళు హాల్ లో ఆఖరివరసలో కూచుని సభ చూడడానికి మనిషికి పాతికివేల డాలర్ల టిక్కట్టు, తెల్లోడి మర్యాద,తమకి అర్ధంకాదులెండి.అవార్డులు ఊరికేరావు. ఆఫ్ ట్రాల్ పాతికవేల డాలర్లు :) బానిసబుద్ధిపోలేదు, పోదు.

      Delete
    5. ఓ యబ్బో తెల్లోళ్ళు అంటూ తీసిపారేయడమెందుకో ? కాటన్ దొర అంటూ పొగిడినవాళ్లే కదా ?

      Delete
    6. Anonymous20 March 2023 at 07:16
      తమరు రెండేళ్ళ తరవాత అవుపడ్డ ముసుగు మేధావులని తెలుస్తూనే ఉంది.
      ఇది కూడా చిత్తగించండి.
      https://telanganatoday.com/heres-how-much-rajamouli-jr-ntr-ram-charan-paid-to-attend-oscars

      Delete
    7. వాల్ల మనీయేగా? మీకెందుకీ మంట ?

      Delete
    8. Evaree musugu Medhavi?

      Delete
    9. సంఝవలే! శ్రీమాన్ జిలేబీ అని తాతగారి కత వెనక కధ.

      Delete
    10. చావలే?

      Delete
    11. Anonymous20 March 2023 at 10:04
      టిక్కట్టొక్కంటికి పాతికవేల డాలర్లు కర్చుపెట్టినా,ప్రమోషన్ కోసం ఒక్కొకరు పాతికకోట్లుడాలర్లు కర్చుపెట్టుకున్నా అదివాళ్ళ డబ్బు, నాకేల బాధ :) అవార్డులు ఊరికేరావు (ట)

      Delete
    12. Anonymous20 March 2023 at 18:56
      ముసుగు మేదావులకి పేర్లుండవట

      Delete
    13. Anonymous20 March 2023 at 20:13
      సమజ్ గాలా అన్నా! :)

      Delete
    14. Anonymous20 March 2023 at 21:36
      చెప్పలే :)

      Delete