Thursday 2 March 2023

గతం గతః

 గతం గతః

పరమాత్మా! 

ఇన్నేళ్ళ జీవితంలో కష్టాలూ పడ్డాను, సుఖాలూ అనుభవించాను. తట్టుకోలేనంత కష్టం వచ్చినపుడు కుంగిపోయాను, పడిపోయాను, జీవితం ఐపోయిందనుకున్నా! కాని నీ లీల తెలియనిదే సుమా! కాలం దాటరానిదిన్నీ! "బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకునాకు బ్రహ్మాదులకున్...." నీవే నా బలం సుమా!


కష్టాలొచ్చినప్పుడు ఏడ్చాను, ఇప్పుడూ వాటిని తలుచుకుని ఏడ్చి ఉపయోగం లేదు. ఏడిస్తే పోయినవాళ్ళు లేచొస్తారా? చంటిపాప నవ్వులో, మొక్కను పూసిన పువ్వులో, మంచిమనిషి హృదయంలో నువ్వున్నావని నమ్ముతున్నా. 


ఇరవై ఏళ్ళపుడున్న ఆరోగ్యం ఇప్పుడుంటుందా? ఉండదని తెలుసు. చివరిదాకా కాలూ,చెయ్యీ ఆడే, కదుపుకునే ఆరోగ్యం ప్రసాదించు, చాలు.  ఇప్పటిదాకా నాకు కావల్సినదానికంటే ఎక్కువే ఇచ్చావని నమ్ముతున్నా!


 నీ మీద భక్తి ఉన్నదని చెప్పుకోను, ఈ వయసులో పూజలు,వ్రతాలూ చెయ్యలేను,  నువ్వున్నావని

 నమ్ముతాను. 


నీ పాదకమల సేవయు, నీ పదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూతదయయును, తాపసమందార! నాకు దయ సేయగదే!


నిన్నెప్పుడూ మరువని స్థితి ప్రసాదించు చాలు. చింతాకంతయు భక్తి నిల్వదుగదా శ్రీకాళహస్తీశ్వరా!


3 comments:

  1. పూర్తిగా సందర్భం కాదు గానీ
    “ఏడేడు శిఖరాల నే నడువలేను”
    అన్న ఓ సినిమా పాట చరణం గుర్తొచ్చింది.

    అద్భుతమైన భాగవత పద్యం ఉదహరించారు ఇక్కడ 🙏.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు2 March 2023 at 11:53
      ఏ పాటి కానుకలందించలేను
      వెంకన్న పాదాలు దర్శించలేను.

      ఆ సమయానికి భాగవత పద్యం గుర్తొచ్చిందండి

      Delete