Saturday 6 August 2022

పిండీ బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచింది.



"పిండీ, బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచిందనేది" ఒక నానుడి. పిండి, బియ్యం అనేవి ఆహారపదార్ధాలు, పిడకలంటే ఇంధనం,పొయ్యిలో మంటకి ఉపయోగించేవి. పెద్ద లెక్కలోకి తీసుకునేవి కావు, మరి అటువంటి పిడకలకోసం ఎందుకేడిచిందీ? విలువైనవాటికోసం కాక విలువ తక్కువైన వాటి కోసం ఎందుకు ఏడ్చిందీ? అదిగదా అసలు ప్రశ్న.  కతలో కెళ్ళే ముందు కొంత చెప్పాలి. పిండి, బియ్యం అంటే తెలిసినవే! ఇక పిడకలగూడేంటనేదే తెలియవలసినది. సరే! పిడక కూడా తెలీదా?  పాతకాలంలో, అదేం లెండి నేటికిన్నీ పశువులు విసర్జించినదాన్ని పేడ అంటారు. పేడని అలాగేగాని,దీనితోపాటు, రంపంపొట్టు, బొగ్గుపొడి, ఊక ఇలా మండే స్వభావం ఉన్నవాటిని కలిపి ముద్దగా చేసి గుండ్రంగా చపాతీలా చేసి వాటిని ఎండబెడతారు. ఆ తరవాత వాటిని ఆహారం పచనం చేసుకోడానికి ఇంధనంగా వాడుతారు,కట్టెలతో పాటు, లేదా పిడకలే, నేటికీ పల్లెలలో, కొంతమంది.  ఇలా ఎండిన పిడకల్ని ఆరుబయట ఎత్తైనచోట గుండ్రంగా పేరుస్తారు. ఆతరవాత వాటిపైన వరసగా పేర్చుకుంటూ వస్తే అదొక శంకువు ఆకారంకి తేలుతుంది. దీనిపైన కొన్ని తాటాకులు కప్పుతారు, తడవకుండా, పైన ఒక రాయి ఎత్తు పెడతారు, ఆకులు ఎగిరిపోకుండా. 

కావాలనుకుంటే ఫ్లిప్ కార్ట్ లో వెతకండి, ఒక్కో పిడక ఖరీదు ఎనభైతొమ్మిది రూపాయలే.



మరో మాట,ఆవు పేడని ఎగుమతి చేస్తున్నారట, భారతదేశం నుంచి. దిగుమతి చేసుకుంటున్న దేశాలు U.A.E,U.S.A., Malaysia. నేడు,  15000 టన్నుల ఆవుపేడ U.A.Eకి ఎగుమతి అవుతోందిట, రాజస్థాన్ నుంచి, ఎందుకూ వారికిదీ? అదిగదా కొచ్చను. ఆవుపేడ ఎరువుగా వేసి పెంచిన ఖర్జూరాలు పెద్దవిగానూ, నాణ్యంగానూ ఉన్నాయని వారి సైంటిస్టులు చెబుతున్నారష. పిడకల వ్యాపారం బాగున్నట్టుందే! కంగారు పడిపోకండి, ఇప్పటికే చాలామంది ఆ వ్యాపారంలో ఉన్నారు. ఇప్పుడు కతలో కొద్దాం.


అనగనగా అదొక పల్లెటూరు, నాటి కాలం పల్లెటూరు.  ఆ పల్లెలో నాడు ఉన్నవన్నీ పూరిళ్ళే! అంటే తాటాకు ఇళ్ళుగాని, ఆవిరిగడ్డి నేసిన పూరిళ్ళుగాని. అటువంటి పల్లె ఒక వర్షాకాలంలో గాలితుఫానులో చిక్కుకుంది. చినుకు చినుకుగా మొదలైన వాన కుండపోతయింది. ఇక గాలి వెర్రెత్తినట్టు వీచింది. అసలే పూరిళ్ళు, గాలికి కొన్ని పడిపోయాయి. మరికొన్ని మట్టి ఇళ్ళు కూలిపోయాయి. మరికొన్ని ఇళ్ళకి తాటాకులెగిరిపోయాయి, మరొకొన్నిటికి నడికొప్పులెగిరిపోయాయి. ఇలాటి సమయంలో ఒక ఇల్లాలు తన తాటాకిల్లు కూలిపోతుండగా తప్పించుకుని బయట పడింది. కొంచం తడవని చోటకి చేరుకుంది. కొంత సేపటికి గాలి తగ్గింది. చిన్న చినుకు పడుతూంది, సాయంత్రమవుతూన్న సమయం. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా! కూలిపోయిన ఇంటి లో ఏమున్నాయో ఏమిపోయాయో వెతుకులాట ప్రారంభించింది, పడిపోయిన వాటిని తప్పిస్తూ,రాత్రి భోజనం తయారు చేసుకోడానికి..  

చూస్తే సర్వం నాశనం. కుండలో పోసిన బియ్యం పూర్తి నేలపాలయ్యాయి,మట్టి గొట్టుకుపోయాయి, మట్టిలో కలిసిపోయాయి. కుండ మీద ఏదో పడటం మూలంగా, కుండ బద్దలైంది. ఆ పక్కనే పెట్టిన కుండ కూడా బద్దలైంది, పోసివుంచిన పిండీ  మట్టి చేరడం తో పనిరాకుండా పోయింది. బట్టలు సర్వం తడిసిపోయాయి, కొన్ని ఎగిరిపోయాయి,పొడి బట్టలేదు. నిలవడానికి పొడి జాగా లేదు.  ఇదంతా చూసిన ఆ ఇల్లాలికి బాధ కలిగింది. . . ఆ తరవాతామె పెరటిలోకి పోయి చూస్తే చెట్టూ, చేమా అన్నీ పడిపోయాయి. అక్కడే ఎత్తుమీదున్న పిడకలగూడు చెదిరిపోయింది, పిడకలన్నీ నీటిపాలయి ముద్దయిపోయాయి. ఇప్పుడు ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది. అయ్యో! పిడకలగూడు పోయిందే అని బావురు మని ఏడ్చింది.


ఇన్ని పోయినా బావురుమని ఏడవని ఆమె పిడకలగూటికోసం ఎందుకు బావురుమని ఏడ్చింది చెప్మా!!!



27 comments:

  1. పొలిటికల్ సెటైరా?

    ReplyDelete
    Replies
    1. అనామకా!
      అలా అనుకున్నారా? ఆ పొలిటికల్ సెటైర్ చెప్పరాదూ? ఆనందిస్తాం కదా!

      Delete
    2. అదికారం నేలపాలు-ఆస్తి ED పాలా?....

      Delete
    3. అనామకా!

      ఇది జిలేబిని అనుకరించడం!

      అధికారం పోయినా సంపాదించుకోవచ్చు, ఆస్థులుపోతే ఎంతకాలానికి సంపాదించేం :)

      Delete
  2. పై ప్రశ్న కు సరైన జవాబు మీకే తెలియాలి ఆచార్య. ఐనా గాని ఓ రాయి వేసి చూస్తాను ✓ బహుశా ఆ పిడికిలి గూడుని మరల పోగు చేసుకుని ఆరబెట్టాలి అనే ఆలోచన ఆమె మది ను తొలిచేస్తుండవచ్చు. ఇహ మీరు తెలిపిన గాలి వాన హోరు నన్ను అమాంతం ౨౦౧౪ అక్టోబర్ ౧౨ తేదిని గుర్తుకు తెచ్చింది. హుద్ హుద్ ను కళ్ళారా చూసి తిట్టుకున్నా వారిలో నేనూ ఒకడిని. ఆ రోజు అందరికీ పిడకలే. :(

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా! అనామకులు చెబుతారేమోనని చూస్తున్నా! ఆకోణం లో ఆలోచించలేదు.
      పిడకలెలాగా పని చెయ్యవు పదిరోజులదాకా, అరబెట్టుకుంటే కాని.అది పెద్ద పనే, ఇప్పుడు వెంటనే పనికిరావు.ఎనిమిది పదుల వయసులో ఎన్నిగాలివానలు చూశాను :)

      Delete
  3. ఏడవడం‌ అన్నది ఆడవాళ్లకి సహజం - వెన్నతో బెట్టిన విద్య. వెన్నే పోయె, వెన్న కరగడానికి పిడకలు కూడా లేవే అని కన్నీళ్లు రాలి పోయి ఉంటాయనుకుంటా

    ReplyDelete
    Replies
    1. అనామకా!
      ఈ మధ్య చాలామంది అనామకులు జిలేబీ ని అనుసరించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు జిలేబి కాదు. :)
      అయ్యో! రాత్రి మెతుకులుకి గింజలు లేవు, పొయ్యి పాయె, పొయ్యికిందకి ఎండుకట్టెలు లేవు, పిడకలూ పనికిరావు అదిగదా బాధ! వెన్నకోసం, కరగడం కోసం ఏడవడం ఎక్కడ బాబూ! :)

      Delete
  4. // “ ఇది జిలేబిని అనుకరించడం! ” //

    శర్మ గారు,
    మధ్యలో నా ఈ వ్యాఖ్య “పిడకల వేట” అనుకోండి. కానీ ఆ “అనామక” యే “జిలేబి” ఎందుకు కాకూడదు ? ప్రచ్ఛన్నంగా ఉండి బ్లాగులోకాన్ని అలరిద్దామనుకుంటున్నారేమో “జిలేబి” గారు? అలా అయ్యుండే అవకాశం లేదంటారా?

    ReplyDelete
    Replies
    1. శర్మ గార్కి అందరు అనామకాలు జిలేబి‌ గారి లాగే వున్నారేమోనండీ

      Delete
    2. విన్నకోటవారు,
      అలా అనుకున్నానండి,కాని మీ కామెంట్ చూశాక,

      లైఫ్ బాయ్ ఎక్కడవుందో ఆరోగ్యం అక్కడ ఉందన్నట్టు,
      ”జిలేబి ఎక్కడవుందో గందరగోళం అక్కడ ఉందీ” :)

      Delete
    3. //శర్మ గార్కి అందరు అనామకాలు జిలేబి‌ గారి లాగే వున్నారేమోనండీ//

      అనామకంగారు,

      ఈ మధ్య కాలంలో జిలేబిని అనుకరించేవారు, అనుసరించేవారు పెరిగారండి.ఎంత ప్రయత్నం చేసినా తమదైన శైలిని దాచలేరు, అందుకే దొరికిపోతారు, మీలాగానూ, ఇది జిలేబి శైలి కాదు, కానే కాదు. :)
      కేసరి జీర్ణతృణంబు మేయునే!

      Delete
    4. అయితే జిలేబి” గారు “కేసరి” అంటారు? అంతే లెండి ….. మీరన్నట్లు “గందరగోళ” కేసరి 🙂🙂.

      Delete
    5. విన్నకోటవారు,
      గందరగోళ కేసారి బిరుదు బావుందండీ :)

      Delete
  5. జిలేబీ శైలి కే ఏ పాల్ శైలి లాగా విలక్షణం

    ReplyDelete
    Replies
    1. అనామకా!
      //జిలేబీ శైలి కే ఏ పాల్ శైలి లాగా విలక్షణం//

      //కే ఏ పాల్// వీరెవరు చెప్మా!

      Delete
  6. శర్మ గారి బ్లాగులో జిలేబి గారి ప్రస్తావన రాకుండా మానదు. శర్మ గారే జిలేబి గారా ద్విపాత్రాభినయమా అని ఒక్కో సారి సందేహం వచ్చేస్తుంది. ఇరువురిదీ శైలి విలక్షణమే.

    ReplyDelete
    Replies
    1. అనామకం గారు!

      "ఎక్కడో చూసినట్టుందే తమర్ని" ఏదీ కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి గుర్తొస్తుందేమో చూద్దాం! :)

      ఇదికదా అసలు సిసలు జిలేబి బాణీ!! గందరగోళంలో గందరగోళం.
      Lika kuppusaamayyar made difficult :)

      Delete
  7. మొదలు మొదటి అనామొకానికి "పిసికావులే పేడ" అనుంటే సందర్భోచితంగా ఉండేదేమోగా సారూ!?

    ReplyDelete
    Replies
    1. అనామకం గారు!
      అలా ని ఉండాల్సిందంటారా? :) మీరిప్పుడనేశారుగా సారూ :)

      Delete
  8. "అందరు అనామకాలు జిలేబి‌ గారి లాగే వున్నారేమోనండీ"-
    మొకాలు లేని అనామొకాలతో ఏర్పడిన చిక్కు ఇది. ఇకపోతే జిలేబీయే జిలేబీలా సంచరించడం - ఈ ఊహను కూడా కొట్టి పారేయ లేం.

    ReplyDelete
    Replies
    1. అనామకం గారు!
      లెస్సబలికితిరిగా :)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  9. "ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి" -

    దయచేసి మీరు జిలేబీ కాదని నిరూపించండి.
    నేను రోబోట్ ని కాను. (టిక్ పెట్టండి)
    reCAPTCHA
    గోప్యత.నిబంధనలు

    మీ కామెంట్ ను పబ్లిష్ చేయండి.

    ReplyDelete
  10. సారీ. పైన "నేను జిలేబీని కాను (టిక్ పెట్టండి)" అని ఉండాలి. తికమకకు క్షమించాలి.

    ReplyDelete
    Replies

    1. //దయచేసి మీరు జిలేబీ కాదని నిరూపించండి./సారీ. పైన "నేను జిలేబీని కాను//
      అనామకం గారు!
      ఓ! బ్రహ్మయ్య! ప్రతి ముఖానికి , తరతరాలుగా రకరకాలుగా , తికమక మకతిక తికమక...జిలేబిగాలి మహిమ:)

      Delete