Wednesday, 3 August 2022

టెస్ట్ ట్యూబు-ఇంక్ పిల్లరు

 టెస్ట్ ట్యూబు-ఇంక్ పిల్లరు


అరవై ఏళ్ళ కితం అమ్మకి సుగర్,మూత్రం   టెస్ట్ కి, ఉదయమే  రోజు పక్క పట్నం సైకిల్ మీద  వెళ్ళి టెస్ట్ చేయించుకొచ్చి ఇంజక్షన్ చేసేవాడిని. నా తిరగుడు చూసిన డాక్టర్ గారు, టెస్టు చేయడం నేర్పించారు. టెస్ట్ చేయడం నేర్చుకున్నా, సరే, మరి పరీక్షనాళిక ఏదీ? డాక్టర్ గారే ఒకటిచ్చి కొద్దిగా సొల్యూషనూ ఇచ్చి ఇంటి దగ్గరే చేసుకో అన్నారు. ఇక ఇక్కడినుంచి నా తిప్పలు మొదలయ్యాయి. స్పిరిట్ లేంప్ లేదు, కుంపటి మీద నిప్పు సెగ వాడేను, టెస్ట్ ట్యూబ్ వేడెక్కుతుంది కదా చెయ్యి కాలకుండా పట్టుకోడానికి, తంటసం లేదు,గుడ్డ తో పట్టుకునేవాడిని. పొరబాటున కిందబడి పగిలిపోతే? ఈ ఆలోచనే భయపెట్టింది. 


కంపౌండర్ని అడిగా ఇవెక్కడ దొరుకుతాయీ,అని.   మెడికల్ షాప్ లో అడుగూ అన్నాడు.  ఆ ఊరికి పెద్ద షాపు కరెడ్లా మెడికల్స్,తొమ్మిదవలేదు, అప్పుడే షాపు తలుపులు తీస్తున్నాడు. టెస్ట్ ట్యూబు, సొల్యూషనూ, స్పిరిట్ లేంప్ ఉన్నాయా? అని అడిగా . కొట్టు తీస్తూనే సరుకు లేదనలేక, మళ్ళీ రండి, చెబుతానన్నాడు. చేసేది లేక కాళ్ళీడ్చుకుంటూ సైకిలెక్కి, మెడికల్ షాపుల వెంట పడ్డా. ఎవరినడిగినా కరెడ్లలో అడగమన్నవారే. ఆశ! దొరుకుతుందా? రెండు గంటల తరవాత మళ్ళీ కరెడ్లకి వెళ్ళేను. అతను నన్ను చూస్తూనే, దొరకవండి అనేశాడు, నిరాశ!. తెప్పించగలరా? చెప్పలేనండీ!. మరో నిరాశ!. మీదగ్గర దొరకచ్చని డాక్టర్ గారు చెప్పేరన్నా. పోనే ఎక్కడ దొరుకుతాయో చెప్పండి, దయచేసి, అని ప్రాధేయపడ్డా. దానికి అతను కొంచం మొహమాట పడుతూ, ఇప్పుడు బేరాల టైము, భోజనానికి కొట్టు కట్టేసే ముందు రండి. ఆశ చిగురించింది. బయటికిపోయా, ఎమీ చెయ్యాలి? ఉదయం చద్దెన్నం తిని బయలుదేరా సైకిల్ మీద,పదకొండు దాటుతోంది, కడుపులో కరకరలాడుతోంది, జేబులో డబ్బులు  నిండుకున్నాయి. అవసరం మనది కదా, అశక్త దుర్జనత్వంతో,  ఊరు పిచ్చి తిరిగుడు తిరిగి మళ్ళీ కరెడ్ల చేరాను. 


అతను నన్ను చూసి నక్షత్రకునిలా తగులు కున్నాడనుకున్నాడో ఏమో,నేను మాత్రం పట్టు వదలని విక్రమార్కునిలా నా అవసరం, వైనవైనాలుగా అతనికి జాలి పుట్టించేలా చెప్పేను. తను కుర్చీలో కూచుంటూ, కూచోండి అన్నాడు, ఆశ మొలిచింది,కూచున్నా, ఇవి అస్తమానం అవసరముండవండీ, డాక్టర్ గారు చెబుతారు, మేము రిప్ లకి చెబితే వాళ్ళు వీటిని పంపేస్తారు, అక్కడితో అది పూర్తవుతుంది, స్టాక్ పెట్టం అంటూ పాత ఫైల్ దులిపి కాగితాలు తిరగేస్తూ ఆ అడ్రస్ దొరికింది అన్నాడు. ఆశ బతికింది.  ఇవి  ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ మచిలీ పట్నం లో దొరుకుతాయి, అన్నాడు. నిరాశ!. . మరోమాట ఈ కంపెనీకి కాకినాడలో బ్రాంచ్ కాబోలు ఉంది అన్నాడు,అడ్రస్ లేదు, ఆశ చావలేదు. ఆశ నిరాశల మధ్య ఊగులాడుతూ పల్లె చేరేను రెండు దాటింది.మర్నాడు రెప్లై కార్డ్ కొన్నా, ''ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ, కాకినాడ'' కి ఓ ఉత్తరం రాసి పడేసి, టేస్ట్ ట్యుబు వి.పి.పి లో పంపమన్నా. జవాబు కోసం ఎదురు చూపు. జవాబు లేదు, అసలు  ఉత్తరం  అందిందా? అడ్రస్ రాయక కంపెనీ పేరు రాసి పడేస్తే, అనుమానం, ఏం చేయాలో తోచలేదు.  కాకినాడ నుంచి జవాబు రాకపోతే మచిలీపట్నం వివరాల కోసం ఉత్తరం రాయాలనుకుంటుండగా ఆశ నిరాశలో కొట్టుకుంటుండగా వారం దాటేకా పోస్ట్ మేన్ సూరయ్య రిప్లై కార్ద్ ఇచ్చాడు. మళ్ళీ ఆశ బతికింది. మీరడిగిన వస్తువులు మా దగ్గర దొరుకుతాయి కాని వి.పి.పి పంపం. ఒక వార్త ఆశ మరొకటి నిరాశ.ఏం చేయాలి?ధరల వివారాలిచ్చారు, అదే పదివేలనిపించింది.  


10 comments:

 1. దీనినే నేను సీబాసీ పీబాపీ అంటానాచార్య క్లుప్తంగా. 1991 లో స్టీమ్ ఇంజన్ లో చివరాఖరి ప్రయాణం.. ఆ తరువాతి తరం డీజిల్, ఇలెక్ట్రిక్ తరం మారినా ఉత్తరం మారింది కాదు. యల్లో పోస్ట్ కార్డ్ యాభై పైసలు, బ్లూ ఇన్లాండ్ రూపాయి కాలానికి డిజిటల్ డేట‌ తరానికి వారధి మా 1980 ~89 దశాబ్దిలో పుట్టినవారు.కళ్ళకట్టినట్లు చెబుతారు చక్కగా శర్మాచార్య.

  ReplyDelete
  Replies
  1. శ్రీధరా!
   ఎనభైలలో పుట్టినవాళ్ళ గురించి చెబితే ఎనభై ఏళ్ళ వాళ్ళని కర్చు రాసినట్టేనా :)

   అరవై ఏళ్ళకితం సుగర్ టెస్టు మూత్రంతో నే చేసేవారు. దానికి టెస్ట్ ట్యూబ్ అవసరం. పల్లెటూరిలో టెస్ట్ ట్యూబ్ దొరికేనా! దానికోసం నేను పడిన పాట్లు. ఈ మధ్య ఇంక్ ఫిల్లర్ కావలిసొచ్చి తిరిగితే దొరకలా! అదో కత! :)

   Delete
  2. క్షంతవ్యుణ్ణి శర్మాచార్య మీ తరం వారినో, మీ వయసు వారినో హెచ్చు-తగ్గుగా మాటలాడాలని కాదు. హ్మ్.. నిజమే.. సీబాసీ అంటే సీత బాధ సీతాది అనే నానుడి.. ఎవరి తరం లో వారికి తగిన బాధలవని చెప్పబోయి.. అలా.. ఈ మధ్య అనానిమస్ గా ప్రచూరితమౌతున్నాయి చెప్మా

   Delete
  3. శ్రీధరా!
   అనామకులదే రోజులా ఉందండీ, నా బ్లాగులో నేనే అనామకుణ్ణి ఒక సారి. తర్డ్ పార్టీ కుకీస్ అలౌ చేయకపోతే అనామకుణ్ణి చేస్తోంది గూగులమ్మ :) :)

   Delete
 2. ఏవైనా అర్జెంట్ గా కావలసినపూడే దొరకవు. వాటి అవసరం మీరాకా దొరుకుతాయి. ఇదీ నా స్వీయానుభవం.

  ReplyDelete
 3. అవును శర్మ గారు. మీరన్నట్లు ఒకప్పుడు యూరిన్ టెస్టే ఉండేది. ఆ నీలం రంగు బెనెడిక్ట్ సొల్యూషన్, టెస్ట్ ట్యూబ్, దాన్ని పట్టుకోవడానికి పట్టకారు - ఈ జ్ఞాపకాలన్నీ నాలో ఇంకా పదిలంగా ఉన్నాయి. మా తండ్రిగారు ఈ టెస్ట్ చేసుకునేవారు. స్పిరిట్ ల్యాంప్ మా ఇంట్లోనూ లేదు. మా తండ్రిగారు సింపుల్ గా మా ఇంటి సైడు ఓపెన్ వరండాలో పాత పత్రికల కాయితాలు కొన్నిటిని అంటించి ఆ మంట మీద టెస్ట్ ట్యూబ్ ని వేడి చేసేవారు. ఇదంతా 1950 దశకం ముచ్చట. ఆ నాటి పరిస్థితులు వేరు.

  ReplyDelete
  Replies
  1. విన్నకోటవారు,
   ఉండేది పల్లెలో డాక్టర్ పట్నంలో రోజూ టెస్టు, ఇది అవస్థ అయింది, మొదటిలో, ఏరొకచోట చాకిరేవు ఒక చోట ఐపోయింది. అందుకు టెస్ట్ ట్యూబ్ కొనాల్సివచ్చింది. సొల్యూషన్ కొన్నాను, తంటసం కొనలేకపోయా, ఖరీదు ఎక్కువతో, గుడ్డతో పట్టుకుని కుంట నిప్పుల సెగలో కాచి టెస్ట్ చేసేవాణ్ణి. టెస్ట్ ట్యూబ్ ఎక్కడ దొరుకుతుంది? అన్నదానికోసం ఒకరోజు తిరిగాను చూడండి అదీ నాటి పరిస్థితి

   ఇది రెండేళ్ళకితం రాసిన టపా, అసంపూర్తి, చెత్తలో ఉంటే పట్టుకున్నా. :) :)

   Delete
  2. చెత్త టపాల్ని జనాల పై కి తోలేస్తున్నారన్న మాట

   Delete
 4. పై వ్యాఖ్యాతను నేనే - విన్నకోట నరసింహారావు ను.

  ReplyDelete