ఖరము పాలు
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ.
ఆవుపాలు గరిటెడైనా చాలు. గాడిదపాలు కడివెడైనా ఉపయోగం లేదు. భక్తిగా పట్టెడు మెతుకులు పెట్టినా చాలు అంటున్నారు, తాతగారు.
చాలా పాతకాలంవాడు కదా అందుకలా అనేసారు. తాత ఆవుని గొప్పచేసి గాడిదను చులకన చేసేరు. నేటికాలంలో గరిటెడు ఆవుపాలు ఎందుకూ పనికిరావు! కడివెడు గాడిద పాలు అమ్ముకుంటే లక్ష రూపాయల పైమాటే. భక్తెవడికి కావాలి కడుపు నిండాలిగాని. తాతగారికి క్షమాపణలతో పేరడీ పద్యం.
గంగిగోవుపాలు గరిటెడైన నేలపాలు
కడివెడైన ఖరముపాలు లక్షవిలువ
కడుపునిండు కూడు ఎంగిలైననేమి
విశ్వదాభిరామ వినుర వేమ
గాడిద పాలతో సబ్బు తయారు చేసిందో టెకీ. నెమ్మదిగా మార్కెట్ చేసింది. ఇప్పుడా సబ్బు హాట్ కేక్ లా అమ్ముడుపోతోంది. ఇంటర్ నేషనల్ మార్కెట్ ఎక్కేసింది.సామాన్యులకి దొరకడమే లేదు.
గాడిద వెన్న అతిమెత్తగా,సుతిమెత్తగా ఉంటుంది. గాడిదవెన్న కెజి. రెండు లక్షలు ఐదేళ్ళకితం మాట. ఇప్పుడెంతో తెలీదు.లీటర్ గాడిదపాలు ఎనిమిది వేలు. లేడీ ఫైర్ నెస్స్ క్రీమ్ లన్నీ గాడిదవెన్నతోనే తయారు చేయబడతాయి.
గాడిదల్ని పెంచండి కోటీశ్వరులు కండి అని చెపితే నన్ను ఎగతాళీ చేసేరు. ఇప్పుడు ఆడగాడిదలే దొరకటం లేదు, కంచరగాడిదలు కూడా, వాటికంత డిమాండ్ ఏర్పడింది. కాలమండీ బాబూ కాలం.
ఆడగాడిదలకీ జై
గాడిదైనా కొనకపోతిని
ReplyDeleteడబ్బు మూటలు దక్కగా
…….. ……..
గాడిదపాలు అంత శ్రేష్ఠమైనవని సైంటిఫిక్ ఋజువేమన్నా ఉందా, శర్మ గారు లేక మార్కెటింగ్ పుకార్లేనా?
అవునూ సబ్బు కాక, అసలు గాడిదపాల వ్యాపారమే ఇంకా కార్పొ’రెట్ట’ల హస్తగతమవలేదా 🤔?
విన్నకోట నరసింహా రావు5 October 2024 at 11:30
Deleteనిజం సార్! మీరు రిటయిర్ అయ్యేనాటికి కూడా గాడిదలు కాయడం లాభ్సాటి అనిపించలేదండీ! లేకపోతే ఆ పని చేద్దుమేమో!
**************
గాడిద పాలు అంత శ్రేష్థం అవునో కాదో తెలియదండి. కాని మన దేశంలో వేలఏళ్ళుగా వాడుతున్నారు,పిల్లలికిపోయడానికి.నేటి కాలంలో యూరప్ లో గాడిదపాలు తాగడం విరివిగా ఉందిట, కాని లభ్యత తక్కువ,ఖరీదు కూడా కారణం అంటున్నారు. కింద లింక్ లో చూడండి.. కొందరైతే గాడిదపాలపొడి తయారు చేస్తున్నారట.
https://www.healthline.com/nutrition/donkey-milk
గాడిదపాలు,సబ్బుల వ్యాపారం కార్పొరేట్ లు ఎందుకందుకోలేదో చెప్పలేనండి.
గాడిదల్ని పెంచండి కోటీశ్వరులు కండి అని చెపితే నన్ను ఎగతాళీ చేసేరు
ReplyDeleteఇంతగా గాడిద మీద టపాల్ రాసిన వారు ( ఇది మూడొదో నాల్గోదో )/
మీరెందుకు గాడిదల్ని మేపలేదు ?
Zilebi5 October 2024 at 12:39
Deleteఆవుల్ని మేపుతారు,గాడిదల్ని కాస్తారు. తెనుగు పదాలు తెలిసినంతలో సరిపోలేదు. ప్రయోగం కూడా తెలియాలి.
****************************
నేను రిటయిర్అయి దగ్గరగా పాతికేళ్ళు. అప్పటికి గాడిదల్ని కాయడం నీచమే!
గాడిదల్ని కాయడం లాభసాటి అని తెలియొచ్చేసరికి నా వయసు వజ్రోత్సవం దాటింది. నీలా తెలిసినది చెప్పకపోవడం నా అలవాటుకాదు, అందుకే చెప్పేను. ఇంకా కోడ్ కూలీలాగానే ఉంటా, పరాయి పంచల నాకుతూ, అనుకుంటే నీ చిత్తం.
మార్చుకోవాలండీ మేపితే గాని పాలు దండిగా ఆపై దస్కం దండిగా రావు :)
Deleteకాస్తే ( ఎలాగూ చాన్నేళ్లు కాచేరు బసనలలో :) హేవీ రావని మీరెరుగని విషయం కాదనుకోండీ :) అయినా చెప్పాల్సిన కర్త్వ్యం వుందికాబట్టి చెబ్తున్నా :(
Zilebi5 October 2024 at 19:34
Deleteడబ్బు దస్కం అక్కరలేదనే అనుకున్నాను.కావాలనుకునే వాళ్ళకి మంచి వ్యాపారమని చెప్పేను.
జీవితంలో రకరకాల పీడముఖాల్ని చూసాను. తప్పదుకదా! కొన్ని అడ్డగాడిదల్నీ కాసేను.
ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
ReplyDeleteకడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు
ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .
వెంకట రాజారావు . లక్కాకుల6 October 2024 at 11:24
Deleteశ్రీ మాత్రేనమః
భూమి తత్త్వాత్మిక శ్యామలా మాతగా
ReplyDeleteపసుపు కుంకుమ గంధ ప్రతతు లిచ్చి
ఆకాశ తత్త్వాన నలరు యంబికగాగ
నలరుల దండల నలర నిచ్చి
వాయు తత్త్వాత్మికై వరమహేశ్వరిగాగ
నగరు ధూపముతోడ హారతిచ్చి
వహ్ని తత్త్వముతోడ వసియించు లలితగా
దేదీప్య సందీప్త దీప మెట్టి
అమృత తత్త్వాన వెల్గు దుర్గమ్మ గాగ
ప్రీతి పొంగళ్లు బెట్టి నైవేద్య మెట్టి
తాకి మూలపు టమ్మను , తల్లి దరికి
చేరి , సాష్టాంగపడి నమస్కార మిడుదు 🙏 .
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ReplyDeleteద్దమ్మ సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ తన్నులోనమ్మెడి వేల్పు
టమ్మల మనంబునుండెడియమ్మదుర్గ మా
యమ్మ కృతాబ్ధి ఇచ్చుట ప్రభుత్వ,కవిత్వ సంపదల్!
మాస్టారూ జ్ఞాపకం నుంచి రాసాను, పదవిభాగం తప్పు చేసేనేమో! కొన్ని పదాలూ మరచానేమోనని అనుమానం తప్పు సవరించగోర్తాను.
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ReplyDeleteద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.... . . . భా-1-10-ఉ.
వెంకట రాజారావు . లక్కాకుల7 October 2024 at 17:05
Deleteకాపీచేసి పట్టుకురావచ్చు కాని ఈ పద్యం ఎంత గుర్తుందీ అని చేసిన చిన్నప్రయత్నమండి. మందుల ప్రభావంతో ఇది కూడా మరపునపడిపోతోందే అనేదే ఖేదం, కాలం కదండీ.
మీకు శ్రమ ఇచ్చాను.
ధన్యవాదాలు.
జ్ఞాపక శక్తి బావుందండీ
Deleteజిలేబిని అప్పుడప్పుడూ పాత some గతుల గుర్తుచేసుకు వాయించేస్తూ వుంటే మరింక ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు మెండు :)
మరో మెథడు - సొంత పజ్యాలు వ్రాస్తూ యతి ప్రాసల కొరకు కొరుకుడితే ఇంకా జిలేబి లా ఫ్రెష్ మెమొరీ ఆల్వేస్ :)
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.
ReplyDeleteవెంకట రాజారావు . లక్కాకుల7 October 2024 at 17:16
Deleteఆది పరాశక్తి
' అమ్మా ' యని , ఆర్తిగదుర
Deleteఅమ్మ పదాల గెడ నొదిగి , యడుగన్ , ఆ దు
ర్గమ్మతొ పోతన కెంతటి
కమ్మని తల్లీ కొడుకుల ఘనతలు గలవో !
వెంకట రాజారావు . లక్కాకుల7 October 2024 at 19:08
Deleteఅమ్మ పదంతో ఆర్తి చూపిన పోతన ఈ పద్యంలో చూడండి.
సందర్భం:- అమ్మ పుట్టిందనుకున్నాడు, చెఱసాలలో చిన్నిపాప కూత విని, చిడిముడిపాటుతో కత్తి చేతబట్టి వచ్చిన అన్న కంసునితో దేవకీదేవి మాట.
అన్న! శమింపుమన్న తగదల్లుడు కాదిది మేనకోడలౌ
మన్నన సేయుమన్న విను మానిని జంపుట రాచపాడిగా
దన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములుబోవు తోవ బో
వన్న భవత్సహోదరిగదన్న నినున్ శరణంబు వేడెదన్
ఇదీ గుర్తునుంచి రాసిందే పొరబాట్లు మన్నించండి.చెప్పుకుంటూపోతే అబ్బో ఎన్నెన్ని రత్నాలో!
కృష్ణ మూర్తిని , తెలుగు వాకిటికి దెచ్చి
Deleteనిలిపి , పరమాత్మను తెనుంగు నేల మీద ,
కలయ దిరుగాడ జేసె నేకంగ , నెంత
ఘనుడొ పోతన్న , అతనికి కరము మోడ్తు .
దుర్గ మాయమ్మ అని పోతన యెంత ఆర్ద్రంగా ,
ReplyDeleteచదివేవాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా చెప్పుకున్నాడో
చూడండి అన్నగారూ !
వెంకట రాజారావు . లక్కాకుల7 October 2024 at 17:20
Deleteఒకప్పుడు వ్యాసుల సంస్కృత భాగవతం, పోతన తెనుగు భాగవతం తైపారు చూసుకుంటూ చదివానండి. అప్పుడు నాకు వ్యాస భాగవతం కంటే పోతన తేటతెనుగు చిన్న, చిన్నపదాల అల్లికతో రాసిన తెనుగుభాగవతం బాగా నచ్చింది. అప్పటినుంచి మరి పోతనని (ఇది అభిమానం కొద్దీ చనవుమాట సుమా)మరచిపోలేకపోయానండి. ఆ ఆర్ద్రత మరెందులోనూ లేదు,రాదు కూడా.
మూలా నక్షత్రములో ,
ReplyDeleteమేలుగ , మే మాయుధాల మేలు భజిస్తూ ,
వాలాయము పూజింతుము ,
కాలము మారినను , ఖడ్గ కరవాలములన్
ఏ నాటి పటాకత్తులొ !
ఈ నాడును పూజలందు , నిజమిది , మా గ్రా
మాన , ఉభయదాతలు మే
మేను , తరతరాలుగ , ఘనమిది , రేపేగా .
నాటి రాయల కాలాన , రాజసముగ
ఖడ్గ విద్యల , యుధ్ధాల కళల దేలి
బలిజ వీరుల మైనట్టి పాదు , ఙ్ఞాపి
కగ నొకింత , ఆయుధ పూజ కనగ నగును .
వెంకట రాజారావు . లక్కాకుల8 October 2024 at 09:46
Deleteనాటి యుద్ధ విద్యల్ని ప్రభుత నిషేధించిందేమో కూడా!కఱ్ఱ సాము,కత్తి సాము ఇలా ఎన్నేని చెప్పుకోవచ్చు.స్త్రీలు కూడా (in self defence) వీటిలో ప్రావీణ్యులై ఉండేవారు, నేడు ఏమీలేదు, స్వయం రక్షణకోసం ప్రయత్నమే లేదు,ఆ విద్యలూ లేవు. మరైరావు. కఱ్ఱ పట్టుకోవడమే తెలియని కాలం.
మహా సరసవత్యేనమః
ReplyDeleteక్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి జంచరీకచయసుందరవేణికి రక్షి తానత
శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షధామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్
పుట్టం బుట్ట శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
నెట్టన్ గల్గను గాళి గొల్వను బురాణింపన్ దొరకొంటి మీ
దెట్టే వెంట జరింతు దత్సరణి నాకీవమ్మ యో యమ్మ మేల్
పట్టు న్మానకుమమ్మ నమ్మితిజుమీ బ్రాహ్మీ దయాంబోనిథీ
మహాకవి పోతనామత్యుడు
నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
ReplyDeleteవాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
పరదేవతా ! నీకు వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,
జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .
పాల నీళ్ళ వేరు పరుపంగ నేర్చిన
హంస నెక్కి తిరుగు నజుని రాణి !
మంచి చెడుల నెంచు మహనీయ బుధ్ధిచ్చి
మమ్ము గావు మమ్మ ! మంజు వాణి .
వెంకట రాజారావు . లక్కాకుల10 October 2024 at 09:03
Deleteవాణి పలికించెనద్భుతముగ
' వాణి పలికించె నద్భుత వాగ్ఝరు ' - లను
ReplyDeleteఘన ప్రశంశకు తగు వాడ గాను కాని ,
నిలిచి , విబుధుల మనసులు గెలుచుకున్న
మిన్న గంటిని కడు , భాస్కరన్నగారు !
శ్రీ మహాలక్ష్మైనమః
ReplyDeleteహరికిన్ పట్టపుదేవి పున్నెములప్రో వర్ధంపు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీగిరిసుతల్ తోనాడు పూబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా
సురతన్ లేములు వాపు తల్లి సిరిఇచ్చున్ నిత్యకల్యాణముల్.
బంగారు ధగధగల్ రంగారు తనులత
ReplyDeleteరత్న కిరీట విరాజిత శిఖ
కలిమికి నెలవైన కళలతో నెమ్మోము
సంపదల్ గురియంగ జాలు కనులు
వరద హస్తమొకట వరశంఖ మొకచేత
కలపద్మ మొకచేత కలశి యొకట
ఇరు గెడ గజరాజు లిరవొంద కరములు
పైకెత్తి నవనిధుల్ పైన జల్ల
పద్మజాత , కమల , పద్మాసనాసీన
పద్మనయన , లక్ష్మి , పద్మ వదన
పద్మసదనవసన , పద్మాక్షు నిల్లాలు
కొలువు దీరె మనకు కొదువ గలదె ?
వెంకట రాజారావు . లక్కాకుల11 October 2024 at 09:58
Deleteవెరసి, తలవ కొలిచే పద్మాక్షి
అతడి నుదుటి చిచ్చు , అనితర సాధ్యమ్ము
ReplyDeleteతగుల బెట్టును , విశ్వజగతి నెల్ల
అతడి గళమున గల , అరి కాలనాగులు
కాల గమనమును కాటువేయు ,
అతడి తోడ నడచు , నతుల త్రిశూలమ్ము
పుడమి నడయాడెడు , చెడును బొలియు
అతడి చే దిరుగాడు , నరిది డమరుకము
నరుల నడతల , హెచ్చరిక సేయు
హరు డతండు , విశ్వగురు డతండు , కడు సం
హరు డతండు , కలడు , నరుడ ! ' నేనె
శక్తిమంతుడ ' నన జనకు , ఈ విశ్వమ్ము
ఈ శ్వరుని తలపున , నేల బడెడు .
వెంకట రాజారావు . లక్కాకుల11 October 2024 at 20:04
Deleteఈశానః సర్వ విద్యానాం ఈశానః సర్వభూతానామ్ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా అస్తుమే సదా శివోమ్.
ధన్యవాదాలండీ
విజయ దశమి శుభకామన
ReplyDeleteలు , జయంబగుగాక ! అమ్మ రోచిష్షులతో
రుజ లడగి , రోజు వారీ
నిజ కార్యము లందు సారు ! నేమము కలుగన్ .
Deleteవెంకట రాజారావు . లక్కాకుల11 October 2024 at 20:23
మీ కామన ఆనందాన్నే కలగజేసింది. ’రుజలడగి’ ధనోస్మి! అస్తు!!
మీకు దసరా శుభకామనలతో శుభాశీస్సులు. దీర్ఘాయుష్మస్తు.ఆరోగ్యమస్తు!! ఐశ్వర్యమస్తు!!! సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సనమంగళాని భవంతు.
ధన్యవాదాలండీ
రామచంద్రుని బాణము , రాజసమున
ReplyDeleteరేగి , చెడుపయి విజయభేరి యలరించె
గాన , విజయదశమి నేడు , కాంక్షదీర
ఘన శుభాకాంక్ష లందింతు , కరము 🙏 మోడ్చి .
శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు
ReplyDeleteచెవుల కుండల దీప్తి చెలువు వాడు
నుదుటిపై కస్తూరి మృదు తిలకము వాడు
ఉరమున కౌస్తుభం బొలయు వాడు
నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు
కరమున వేణువు మెరయు వాడు
చర్చిత మైపూత సరి చందనము వాడు
గళమున ముత్యాల కాంతి వాడు
తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు
నంద గోపాల బాలు డానంద హేల
లీల బృందావనము రాస కేళి దేల
వచ్చె పరమాత్మ కన్నుల భాగ్య మనగ .
నల్లనయ్యను తలుచుకుంటే కవితలకు లోటా?
Deleteదేవకీ వసుదేవు దేహచాయలు తెల్పు
ReplyDeleteనంద యశోద వర్ణాలు తెలుపు
రాధికా రమణీయ రాగబంధము తెల్పు
రుక్మిణీ భక్తిస్థ రుచియు తెలుపు
తగ రతీ మన్మథ తాదాత్మ్యములు తెల్పు
మునుల తపో ఙ్ఞాన ములును తెలుపు
భారతాంతర్గత భావ జాలము తెల్పు
గీతామృతంపు సత్కీర్తి తెలుపు
బ్రహ్మ తెలుపు సరస్వతీ ప్రమద తెలుపు
లక్ష్మి తెలుపు శేషాహి తల్పమ్ము తెలుపు
పాల సంద్రమ్ము తెలుపు మా భక్తి తెలుపు
నీకెలా గంటుకొనె నల్పు నీరజాక్ష !