Saturday 2 September 2023

మోసం

మోసం


 అనగనగా ఒక రాజ్యం. అందులో ఒక పట్టణంలో ఇద్దరు వ్యాపారస్తులు, స్నేహితులు, రత్నం సెట్టి,ముత్యం సెట్టి.


ఒక రోజు ముత్యం రత్నం దగ్గర కొచ్చి మిత్రమా! నేను 200 బారువుల ఇనుము కొన్నాను, సంవత్సరంలో దాని వెల రెట్టుంపు అవుతుందని అంచనా. నేను రేపే భార్య, పిల్లలతో బయలు దేరి, విదేశం వర్తకానికి వెళుతున్నాను. ఇనుమును నీ గొదాములో నిలువచేసి కాపాడు, పాడవకుండా. సంవత్సరంలో నేను తిరిగిరావచ్చు, వచ్చిన తరవాత అమ్ముకుంటాను, అన్నాడు. రత్నం దానికి అంగీకరిస్తే ఇనుమును రత్నం గొదాములో నిలువచేసి వెళిపొయాడు, ముత్యం. 


సంత్సరమైంది, ముత్యం రాలేదు, కబురూ తెలియలేదు. ఇనుము ధర రెట్టింపు అయింది.రత్నానికి ఏమి చేయాలో తోచలేదు. చూస్తుండగా మరో ఏడాదీ గడచింది, ఇనుము ధర మరింత పెరిగింది,అమ్మేసి సొమ్ము చేద్దామనే ఆలోచన కలిగిందిగాని, మిత్రుడు వచ్చేకా చూసుకుంటాడు అనుకుని ఊరుకున్నాడు. మూడో ఏడూ గడచిపోయింది. ఇనుము ధర నాలుగు రెట్లు పెరిగింది. ఇక ఆగలేక రత్నం ఇనుము అమ్మేశాడు.వచ్చిన సొమ్ము వేరుగా ఉంచాడు కొన్నాళ్ళు, మిత్రుడు వచ్చేకా ఇద్దామని, మిత్రుని జాడలేదు, సొమ్ము వ్యర్ధంగా ఉంచడమెందుకని తన వ్యాపారంలో కలిపేశాడు. మిత్రుడు వచ్చాకా ఇవ్వచ్చులే అనుకుని. కొంతకాలానికి మరచిపోయాడు. 


ఐదో ఏట మిత్రుడు విదేశం నుంచి తిరిగొచ్చాడు, ఇనుము ధర మరింత పెరిగింది. ముత్యం మిత్రుని దగ్గరకొచ్చి విదేశం నుంచి నిన్ననే భార్య,పిల్లలతో తిరిగొచ్చాను, నువ్వు, నీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు? ఇనుముధర బాగా పెరిగింది, నీ గొదాములో దాచిన ఇనుము అమ్మేద్దామనుకుంటున్నా నంటే,  రత్నం, నీకో చెడు వార్త  చెప్పాల్సి వస్తోందని విచారంగా ఉంది. గొదాములో వేసిన ఇనుమును చూస్తూ వచ్చాను అప్పుడప్పుడూ, కొంచంకొంచం తగ్గుతున్నట్టనిపించింది, ఎలకలు ఎక్కువగా సంచరిస్తున్నాయక్కడ. వాటిని అరికట్టే ప్రయత్నాలూ చేసాను ఫలితం లేకపోయింది, ఎలుకలు ఇనుమును పూర్తిగా తినేసాయన్నాడు, విచార వదనంతో. విషయం విన్న ముత్యం, మిత్రుడు రత్నం తనను మోసం చేస్తున్నాడని గ్రహించి, మరుమాటాడక ఇంటికెళిపోయాడు.


రత్నం చేసిన మోసాన్ని మిత్రుడు ముత్యం ఎలా బయటపెట్టేడు?

(సశేషం)

ఇది నేను కొత్తగా చెప్పిన కతకాదు, చిన్నప్పుడు చదువుకున్నదే!!!

9 comments:

  1. అవేవో iron deficiency ఉన్న ఎలకలై ఉంటాయి :-)

    ReplyDelete
    Replies
    1. కాంత్2 September 2023 at 20:30
      స్వార్ధమనే ఎలుక మోసపు దంతాలతో కొరికి తినేసిందండీ!

      Delete
  2. ఈ “పంచతంత్రం” కథ మిగతా భాగం కూడా పూర్తి చెయ్యండి, శర్మ గారు. ఆలస్యమైతే మేమే చెప్పేస్తాం.
    🙂🙂

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు3 September 2023 at 09:03
      అదే పనిలో ఉన్నానండి. పాతకాలంలో ఎప్పుడో సగంరాసినదాన్ని ప్రచురించా! పూర్తి చేసేస్తా. కొరవలు పెట్టను. కాలం దగ్గరపడుతోంది, వేగిరపడుతున్నా.
      మీరు పూర్తి చేస్తానంటే ఆనందమే!

      Delete
    2. శర్మ గారు,
      మీవంటి వారిని “ఉత్తములు” అన్నాడు ఏనుగు లక్ష్మణ కవి గారు. ఈ కథని మీరే పూర్తి చేస్తారు 👍.

      నేనేదో సరదాగా అన్నాను. వైరాగ్యంలోకి దిగకండి మీరు 🙏.

      Delete


    3. ఇది కూడా కాపీయా !

      ఏమందును ఏమందును !


      జిలేబి

      Delete
    4. మరి ఇది? కాపీయా? టీయా? జిలేబీగారే చెప్పాలి:
      https://varudhini.blogspot.com/2023/08/blog-post.html

      Delete

    5. Zilebi3 September 2023 at 15:26
      మందును మందును !

      Delete

    6. Anonymous3 September 2023 at 18:10
      శకరమ్మత్త చెప్పిందండి, పెద్ద చెరువునీళ్ళు కుక్కముట్టుకున్నా పనికొస్తాయని.

      Delete