Wednesday 27 September 2023

దొంగని దొంగే పట్టాలి.

దొంగని దొంగే పట్టాలి


దొంగని దొంగే పట్టాలి, ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ఇవన్నీ సమానర్ధకమైన తెనుగు నానుడులు. దొంగతనం అరవైనాలుగు కళలో ఒకటిట. దొంగని దొంగ ఎలాపట్టగలడు? అదీ కొచ్చను!


దొంగలకి ఉండే అలవాట్లు, చేసే పొరబాట్లు, నమ్మకాలు, ఇలా చాలా విషయాలు సమానంగా ఉంటాయట, ఇది పెద్దలమాట. సాధారణంగా దొంగలు దొంగతనం చేయబోయే ఇంటిని చాలాకాలం జాగ్రత్తగా గమనిస్తారట. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు? ఎంతబలవంతులు? ఎదురుతిరగ్గలరా?ఎప్పుడు సొమ్ము ఉంటుంది ఇంట్లో?ఎంత ఉండచ్చు? బంగారం ఎంతుండచ్చు?  ఆ ఇంటివారి అలవాట్లు, భద్రత ఎంత?  ఎంతమంది ఆడాళ్ళున్నారు? కుక్కలున్నాయా? ఏజాతివి? బిస్కట్లకి లొంగుతాయా? లొంగదీసుకోడానికి ఇతర మార్గాలేంటి?కాపలా ఉంటుందా? పట్టుబడితే? కన్నగాడు కత్తి మరవడని సామెత.  


ఇలా చాలా విషయాలని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే దొంగతనానికి దిగుతారట. అంతే కాదు, తిథి, వారం,నక్షత్రం ఇలా చూసుకునేవారూ ఉంటారట. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి సాటి దొంగకే తెలుస్తాయి, దీన్నే రెకీ చెయ్యడం అంటారట!!  కనక దొంగని దొంగే పట్టాలంటారు.


18 comments:

  1. దొంగల పద్ధతులు, కిటుకులు మరో ‘వర్గానికి’ కూడా బాగా తెలిసుంటుందని అంటారే సాధారణంగా 🙂🙂.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు27 September 2023 at 14:47
      అవునండి, దొంగకి మరో దొంగ దొంగతనానికి చేయగల ఉపాయాలు,తప్పించుకునే కిటుకులు తెలిసిఉంటాయి. అందుకే దొంగని దొంగే పట్టాలంటారు. దొంగ సాయంతో నే మరో దొంగని తొందరగా పట్టచ్చు. ఒక చిన్న ఉదాహరణ.
      గొడ్డలి ఒక్కటీ అడవిని నరకగలదా? లేదు. మరెలా? అడవి సాయంకావాలి. అదే కామ రూపంలో. కామలేక గొడ్డలి నిరుపయోగం, అడవి నరకబడలేదు. అడవి నరకబడిందంటే గొడ్డలివల్ల, సాయం అడవి, కామ రూపంలో. తప్పు గొడ్డలిదా? అడవిదా? కామదా?

      Delete
  2. |అడవి నరకబడిందంటే గొడ్డలివల్ల, సాయం అడవి, కామ రూపంలో. తప్పు గొడ్డలిదా? అడవిదా? కామదా?

    గొడ్డలిపట్టిన చేతిది తప్పు
    గొడ్డలి దేమి తప్పు
    చితికిన చెట్టు కఱ్ఱది తప్పు
    చెట్టు దెక్కడిది తప్పు
    అడవిని దూరిన మనిషిది తప్పు
    అడవి కెక్కడిది తప్పు

    ReplyDelete
    Replies
    1. అంతా రామ మయం

      Delete
  3. శ్యామలీయం28 September 2023 at 11:40
    కామ సాయం లేక అడవి నరకబడలేదు, చివరికి తప్పు మనిషిమీద నెట్టెయ్యచ్చనుకోండి :)

    ReplyDelete
    Replies
    1. క్రియాసిధ్ధి ర్భవతి మహతాం నోపకరణే! కామ ఐనా గొడ్డలి అన్నా అది ఉపకరణం మాత్రమే. వాటితో పనిచేయించేది మనిషే కదా!

      Delete
    2. Enta baga cheparu meeru

      Delete
    3. శ్యామలీయం28 September 2023 at 23:10
      ఇక్కడ నేను చెప్పిన ఉపమాన ఉపమేయాలకి పూర్తి సారూప్యత లేని మాట నిజం. కానీ ఈ ఉపమేయానికి అతికే ఉపమానం నాకింతకంటే దొరకలేదు, ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నది, వజ్రాన్ని వజ్రమే కోయాలి అన్నదిన్నీ అంతే. ఇక్కడ దొంగకి మరో దొంగ గురించి పూర్తిగా అవగాహన ఉంటున్నది, నా సారాంశం. దొంగే మరొక దొంగని సులువుగా పట్టగలడు, ఇద్దరూ దొంగలే కనక :)

      Delete

    4. Anonymous29 September 2023 at 08:12
      /Enta baga cheparu meeru/
      ఏంత బాగ చెప్పారు మీరు

      ఎత్తిపోతల కార్యక్రమం? :)

      Delete
    5. // Anonymous29 September 2023 at 08:12
      “Enta baga cheparu meeru “ //
      ==========
      ఈ Anonymous గారు “జిలేబి” గారేనని చెప్పెయ్యచ్చు IP లు వగైరా చూడకుండానే 😎.
      ఎందుకంటే అచ్చంగా ఇదే కామెంటు “పద్మార్పిత” బ్లాగులో “స్వయంకృతం” అనే పోస్ట్ క్రింద చంద్రశేఖర్ అనేవారి పేరుతో కన్పిస్తోంది. కామెంట్‌లని ఇటువంటి “ఎత్తిపోతల” కార్యక్రమాలు తరచూ చేసేది “జిలేబి” గారి హాబీ అని చరిత్ర చెబుతోంది మరి 🙂.

      Delete
    6. దొంగే మరొక దొంగని సులువుగా పట్టగలడు, ఇద్దరూ దొంగలే కనక :)

      శర్మ గారు జిలేబి గారిని అట్టే పట్టేసే విధంగా:)

      Delete
    7. మీకు మీరే సాటి.

      Delete
    8. Anonymous29 September 2023 at 13:40
      నిజం చెప్పేవు జిలేబి.

      Delete
    9. విన్నకోట నరసింహా రావు29 September 2023 at 12:46
      Anonymous29 September 2023 at 08:12
      Anonymous29 September 2023 at 16:55
      జిలేబిని పట్టుకోడానికి పెద్ద విద్యలేం అక్కరలేదండి. పైవి రెండూ జిలేబి వ్యాఖ్యలు ఎత్తిపోతలని వేరుగా చెప్పాలంటారా? ఇటువంటి వ్యాఖ్యలని ఆపేసేను, ముందూ ఆపేస్తాను జిలేబి. సరదా అల్లరికి కూడా మితి ఉంటుంది. అతిచేస్తే గతి చెడుతుందని నానుడి.

      Delete

  4. Anonymous28 September 2023 at 14:28
    అంతా రామ మయం ఈ జగమంతా రామ మయం

    ReplyDelete
  5. కం.హరిమయము విశ్వమంతయు
    హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
    హరిమయము గాని ద్రవ్యము
    పరమాణువు లేదు వంశపావన వింటే
    (భాగవతం)
    అందుచేత అంతా రామమయమే నండీ!!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం28 September 2023 at 23:08
      హరియను రెండక్షరములు
      హరియించును పాతకముల నంబుజనాభా
      హరినీ నామ మహాత్మ్యము
      హరియని పొగడంగ తరమె/వశమె హరి శ్రీకృష్ణా

      Delete
    2. కం.హరిమయము విశ్వమంతయు
      హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
      హరిమయము గాని ద్రవ్యము
      పరమాణువు లేదు వంశపావన వింటే
      (భాగవతం)
      ఘట్టం మరిచితిని గుర్తు చేయమనవి.

      Delete