Monday 4 September 2023

చంద్రయాన్-3 విజయానికంతా చుట్టాలే!!!!

 చంద్రయాన్-3 విజయానికంతా చుట్టాలే!!!!

Scroll down for latest update


23.08.23

చంద్రయాన్-3 లేండర్, చంద్రుని ఉపరితలంపై నెమ్మదిగా దిగింది, అందులోనూ ఎక్కడా? చంద్రుని దక్షణ ధృవం దగ్గర, ఏం దీని ప్రత్యేకత? అక్కడ ప్రదేశం సాపుగా ఉండదు, అంతేకాదు అక్కడ ఘనీభవించి నీరుందని అంచనా! ఏ దేశమూ ఆ ప్రాంతంలో తమలేండర్లను దింపడానికి ప్రయత్నం చేయలేదు.ఆ ప్రాంతానికి లేండర్ను దింపడానికి రష్యా ప్రయత్నం 23.8.23తారీకు కు ముందే విఫలమయింది.


ఈ విజయాన్ని సాధించిన అందరికి జేజేలు చెబుతున్నారు, మా వాళ్ళు ఇస్రో లో ఉన్నారంటే మావాళ్ళున్నారని చెబుతున్నారంతా. ఐతే సోమనాథ్ గారు ఉటంకించిన ముగ్గురిలో ఒకరు మా జిల్లావారు, అంతేగాక మండపేట దగ్గర వల్లూరు గ్రామవాసి, ఒకరు ముఖ్యులుగా ఉన్నారని తెలిసింది, అంతేకాదు, గోదావరిజిల్లాలనుంచి చాలామంది ఉన్నట్టూ తెలిసింది. విజయానికి కారణమైన అందరికి జేజేలు.


చంద్రయాన్ గురించి చాలా వార్తలు ఉన్నాయి, అందులో నిజమేదో తేల్చుకోడమే కష్టంగా ఉంది. నాకు తెలిసినవరకు...

లేండర్ విక్రం, క్రాలర్ ప్రజ్ఞాన్ రెండున్నూ పదనాల్గు భూమి రోజులు మాత్రమే పని చేస్తాయి. ఎందుకు అలా? అంటే చంద్రుని పై సూర్యకాంతి భూమి పదనాలురోజులుంటుంది, అది చంద్రునికో పగలు. ఆతరవాత ఈ పరికరాలు నిద్రలోకి జారిపోతాయి, సోలార్ పేనల్స్ సూర్యకాంతి లేక పని చెయ్యవు గనక. ఆ చంద్ర రాత్రిలో (పద్నాలు భూమి రోజుల్లో) అక్కడ విపరీతమైన చలి. ఆ తరవాతొచ్చే ఉదయంలో ఇవి పని చేస్తాయా? ప్రశ్నార్ధకమే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, పనిచేస్తే అదో గొప్ప విజయం. ఇక క్రాలర్ చంద్రుని మీద దిగింది. ఇది చంద్రుని ఉపరితలం మీదనే స్థిరంగా ఉండి పరిశోధనలు చేసి వాటి ఫలితాలు లేండర్కి అందిస్తుంది. అవి భూమికి పంపబడతాయి. వాటిని విశ్లేషించడం ఒక రోజులో ఆయ్యే పనిగాదు. వేచి ఉండాల్సిందే! మరో ప్రమాదమూ పొంచి ఉన్నదని ఏ క్షణంలోనైనా ఏమైనా జరగచ్చంటున్నారు, సోమనాథ్. ఏం? చంద్రునిపై వాతావరణం లేదు గనక ఉల్కాపాతం తిన్నగా చంద్రుని ఉపరితలాని తాకుతుంది. అలా రాలే ఉల్కలు ఈ రెంటినీ పాడు చేయచ్చు. భూమికి కూడా ఉలకలు రాలుతుంటాయి కాని ఇవి మన దాకా చేరవు, వాతావరణంలోకి చేరినవెంటనే వేగానికి మండిపోతాయి. ఇన్ని అవాంతరాల మధ్య చంద్రయానం సంపూర్తిగా విజయవంతంకావాలని ...

వివిధ దేశాలవారు, మన దేశంలో కొందరు చంద్రయాన్-3 విజయం మీద  స్పందించినది తరవాత చూదాం...

3.9.23

చంద్రయాన్ లో రోవర్ తనకు అప్పగించిన పని దిగ్విజయంగా ముగించింది. చంద్ర రాత్రి ప్రారంభం కాకముందే దానిలో బేటరీలను పూర్తిగా చార్జి చేసి నిద్రలోకి జారుకుంది. అతి శీతలానికి ఇతర ఆపత్తులకు తట్టుకుని  చంద్రునిపై సూర్యోదయంతో మేలుకుంటే అదో గొప్ప విజయం. ఇక లేండర్ దిగినచోటునుంచి కొద్ది ఎత్తుఎగిరి పక్కగా కొద్ది దూరంలో మరలా క్షేమంగా దిగడమూ విజయమే!! లేండర్ కూడా నిద్రలోకి జారుకుంది. ఇది కూడా చంద్రునిపై సూర్యోదయంతో మేల్కుంటే ఘనవిజయం. దీనిని ఇస్రో సాధిస్తుందని ఆశిద్దాం.

75 comments:

  1. ఓవరాక్షన్ స్టార్ కి‌ ఓవర్ ఆక్షన్ మరీ ఎక్కువైంది :)

    ReplyDelete
    Replies
    1. Zilebi26 August 2023 at 09:45
      అవునట భానోదయంలో అలాగే అనుకుంటున్నారట, ఆ ఎత్తుకోడాలేంటి? ఆకౌగలింతలేంటి? ఓవరేక్షన్ స్టారుకి ఓవరేక్షన్ మరీ ఎక్కువైందని :)

      Delete
  2. అసలేం జరుగుతోందిక్కడ ఆయ్? వాళ్ళ యాక్షన్ కి ఇక్కడ మీరి యాక్షన్ కి సంబంధమేంటా అని! యాన్ ఆం సరుక్కొట్టక ముందే నాకు తెలియాలి :)

    ReplyDelete
    Replies
    1. Anonymous26 August 2023 at 12:30
      అమ్మో! అక్కడైతే ఏంజరుగుతోందో నాకైతే తెలీదండి. జిలేబి ఓవరేక్షన్ అంతకన్నా తెలీదండి.
      నవమినాటి వెన్నెల నేను
      దశమినాటి జాబిలి నీవు
      కలుసుకున్న ప్రతిరోజూ
      కార్తీక పున్నమి రేయి
      అన్నదండి ఒక నాయిక నాయకునితో
      మరిదంటే? కదా కొచ్చను.

      భూమిపై, శుక్ల సప్తమి మొదలు పౌర్ణమి ఆతరవాత పౌర్ణమి మొదలు కృష్ణపక్ష సప్తమివరకు జాబిల్లికొక రోజు పగలు, శుక్ల పక్ష సప్తమిరోజునే రోవర్ దిగింది చంద్రునిమీద. అంతేకాదు కృష్ణపక్ష సప్తమి మొదలు అమావస్య ఆపై అమావస్య మొదలు శుక్లపక్ష సప్తమివరకు జాబిల్లి రాత్రి. మొదటిది భూమిపై పదునాల్గు రోజులు జాబిల్లిపై ఒక పగలు, అలాగే ఆతరవాత పద్నాల్గు రోజులు జాబిల్లి పై రాత్రి.

      చంద్రునిపై దిగిన మన లేండర్, రోవర్ మళ్ళీ తిరిగి భూమికి రావు.

      Delete
  3. లోకరీతి అంతే గదా, శర్మ గారు - విజయానికి అందరూ చుట్టాలే!!!! అపజయం మాత్రం అనాథ.

    మా వూరివాళ్ళు ఇస్రోలో ఉన్నారని చెప్పుకుంటే పెద్ద ఆశ్చర్యం లేదు. ఇంకో అడుగు ముందుకు వేసి మా కులం వాళ్ళు ముగ్గురున్నారని ఒకరంటే మా కులం వాళ్ళు అయిదుగురున్నారని చెప్పుకోవడం కూడా మొదలయింది.

    చంద్రయాన్ విజయం గురించి మీరు వ్రాసిన చక్కటి ఈ పోస్ట్ లో ఆ “ఓవరాక్షన్” సినిమా మనిషి ప్రస్తావన తీసుకొచ్చి విషయాన్ని పక్కదారి పట్టించారు గదా “జిలేబి” గారు తనదైన శైలిలో 😏. ఏమి చెప్పుదున్ గురునాథా ! 😒

    ReplyDelete
  4. // “ చంద్రునిపై దిగిన మన లేండర్, రోవర్ మళ్ళీ తిరిగి భూమికి రావు.” //

    ఆ రోదసీ యొక్క “అనంత నీరవ నిశీధిలో” అలా శాశ్వతంగా ఉండిపోతాయంటే అయ్యో పాపం అనిపిస్తుంది కదా 😘. భూమి నుంచి బయలుదేరే ముందు ఇంట్లో చెప్పొచ్చాయో లేదో 😒 (🙂🙂)?

    ReplyDelete
    Replies
    1. -

      That's really amazing (). I love your comment. Thanks for sharing

      Delete
    2. విన్నకోట నరసింహా రావు26 August 2023 at 21:30
      విన్నకోట నరసింహా రావు26 August 2023 at 21:40
      ఓవరేక్షన్ చెయ్యడం జిలేబి జన్మలచ్చనం కదు సార్!
      రకరకాల మనుషులు కదుసార్!! ఇంతే
      ”ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా! పంతమ మువ్వ గోపాలా నా సామీ”!! అనుకోవలసిందేనండి. జిలేబి మనకి కొత్తా :)
      ''అనంతనీరవ నిశీధిలో నీ కొరకే రాజా వెన్నెల రాజా! కలనైనా నీతలపే కలవరమందైన నీ తలపే''!!!
      జాతస్య మరణం ధృవం కదండీ, ఒక గొప్ప కారణానికి మరణించడమూ గొప్పే కదా!!!

      Delete
    3. మరచాను, చెప్పడం
      ఇప్పటికి ప్రజ్ఞాన్ ఎనిమిది మీటర్ల ప్రయాణం చేసిందట. ఇస్రో వారి వార్త. జాబిల్లి రాత్రి మొదలైతే రోవర్, లేండర్లు నిద్రలోకి జారిపోతాయనుకున్నాం కదూ! మళ్ళీ సూర్యోదయం తరవాత నిద్ర లేచే సావకాశాలు బహు తక్కువ, వీటి యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ అన్నీ చలిలో తమ లక్షణాలు కోల్పోతాయి. ఈ రెండు తిరిగి పనిచేస్తే గొప్ప విజయం కూడా, విజయం గురించి ఏడ్చేవాళ్ళకి బోనస్సూ.

      Delete
  5. “కలనైనా నీ వలపే” పాటని ఠక్కున గుర్తు పట్టేసారే 👌👏 సినిమాల గురించి తెలియదంటూనే 🙂.

    అవునండి నాకు అర్థం కాక అడుగుతున్నాను - అంతరిక్షంలో విపరీతమైన చల్లదనం ఉంటుంది అని ఎప్పుడో చదివినట్లు గుర్తు. మరి భూమి నుంచి వేరే గ్రహానికి ప్రయాణించే రాకెట్ ఆ వాతావరణంలోనే తట్టుకుని వెళుతుంది కదా. అది దిగిన వేరే గ్రహం మీద కూడా ఇంచుమించు అదే వాతావరణం ఉంటుందేమో కదా (నా ఊహ)? మరి తరువాత ఆ యంత్రాలు ఎందుకు పని చెయ్యవు? ఏమిటో పామరులం మనకా తెలివేది 😒?

    ReplyDelete
  6. విన్నకోట నరసింహా రావు27 August 2023 at 13:43
    1960-70 దశాబ్దం పిచ్చిగా సినిమాలు చూసానండి. ఆ తరవాతొక్కసారిగా సినిమాల మీద విరక్తి కలిగి మరి సినిమా చూడలేదు, కాని సినిమాలో పాటల్లోని సాహిత్యం మీద అభిమానం పోలేదు. మంచిపాటలన్నిటి సాహిత్యం నేటికీ గుర్తే!

    నేను జిలేబిలా ప్రొఫెసర్ కాదండి. కాలేజి మెట్లు ఎక్కివుంటేనా :)

    చంద్రయాన్-౩ మీద దేశ,విదేశాల్లోని వారి స్పందనలు టపా రాద్దామనుకున్నాగాని హేటువాదుల్ని చూసిన తరవాత ఎంతని రాయను. భారతదేశం మీద ఇంత విషం చిమ్మే మనుషులున్నారనుకోలేదు సుమండీ!

    ReplyDelete
    Replies
    1. నేనండి జిలేబీ వలె
      కానండి ప్రొఫెసరునండి కానండీ చూ
      సానండి పిచ్చి పిచ్చిగ
      నేనెన్నెన్నొ సినిమాల నిట్టూర్పులతో :)


      నారదా
      జిలేబి

      Delete
    2. తోచిన అభిప్రాయాలను ఎన్నింటినో వ్రాయటం జరిగంది. ఇంత గొప్ప అవకాశాన్ని ప్రసాదించిన దైవానికి అనేక కృతజ్ఞతలు.
      అంతాదైవం దయ.

      Delete
    3. (విషం) చిమ్మి పోదురు గాక నాకేటి చిగ్గు. ఆ టపాలు రాయడం ఇంకా అవసరమా?

      Delete
    4. ఒకసారి దైవం మాయ వెల్కం చెప్పిందంటే అది యావజ్జీవకార్యక్రమమే నండీ.

      Delete
    5. Zilebi27 August 2023 at 17:33
      ఉన్నమాటంటే ఉలుకెక్కవని సామెత బుజ్జమ్మా

      Delete
    6. Anonymous27 August 2023 at 19:30
      సాగినంతకాలం నా అంతవాడు లేడందురు
      సాగకపోతే చతికిలబడిపోదురు
      అన్నారు ఒక సినీ కవి :)

      Delete

    7. కాంత్27 August 2023 at 21:08
      కాంత్ జీ
      అవునండి చిమ్మిన విషాన్ని మళ్ళీ కెలుక్కోడమెందుకని టపా మానేసేనండి.
      ఏడ్చేవాళ్ళని ఏడవనీ
      నవ్వేవాళ్ళ దృష్టమేమని
      ఏడ్చేవాళ్ళని ఏడవనీ

      Delete
    8. Anonymous27 August 2023 at 21:13
      మాయలో పుట్టేం :)
      మాయలో పెరుగుతున్నాం
      చివరికి మాయలో మాయమైపోతాం
      జీవితమే మాయ
      అంతా విష్ణుమాయ

      Delete
  7. సార్, ఈ లింక్ వద్ద గల "Sharma" గారి ఫోటో మీదేనా అండి?
    http://vedivedisamosaalu.blogspot.com/2013/03/blog-post_5837.html?showComment=1693152484555&m=1#c3796965884895885129

    ReplyDelete
    Replies
    1. Anonymous28 August 2023 at 06:30

      సార్!
      బలే కనబెట్టేసేరే!
      చివరికందరదీ అదేఫోటోటండి.
      మంచి బ్లాగు లింక్ ఇచ్చినందుకు
      ధన్యవాదాలు.

      Delete
    2. Anonymous28 August 2023 at 06:30
      అజ్ఞాతగారు క్షమించండి. ఆ ఫోటోలో శర్మగారు నా మిత్రులే. చాలా కాలం నా బ్లాగును ఫాలో అయినవారు.ఇప్పుడెక్కడున్నారో వివరాలు తెలియవు. నేను మీ కామెంటు సరిగా చూసుకోలేదు. లింక్ లో చూడగానే ఒక బొమ్మ కనపడింది, పొరపాటుపడిపోయాను. మరో సారి క్షమాపణ వేడు తున్నా!

      Delete
    3. "శర్మగారు నా మిత్రులే. చాలా కాలం నా బ్లాగును ఫాలో అయినవారు.ఇప్పుడెక్కడున్నారో వివరాలు తెలియవు"


      మిత్రులు! అంటారు మళ్లీ వివరాలు తెలీవంటారు ! ఇదేమి చోద్యమండి తాతగారూ మిత్రులంటే మీ ఉద్దేశ్యంలో ఏమని అర్థము ?



      జిలేబి

      Delete
    4. Zilebi29 August 2023 at 10:39
      శర్మగారు మిత్రులే! పూర్తి వివరాలు తెలియవు. ఆస్థి వ్యవహారాలు చూసుకొస్తానని వెళ్ళి మరి రాలేదు, వివరాలూ తెలియవు :) నీవు లేక నేను లేను అని అన్నవారు, బంధువులమన్నవారు ఏరీ? ఎక్కడా? లేరే! అన్నీ అంతే!! ఇదో మాయ!!!
      అంతెందుకు? జిలేబి నా స్నేహితుడు/స్నేహితురాలు అని చెప్పుకోవచ్చా? పదమూడేళ్ళ పరిచయం, జిలేబి ఎవరు? విష్ణుమాయ. అంతే

      Delete
    5. -

      తెలిసినట్టె వుంది కాని తెలీలె :)

      పదమూడేళ్ల పరిచయ
      మ్ము ! దమ్మిడికి పనికి రాదు! ముక్కంటే ము
      క్క దరసలు జిలేబి యెవరొ
      యిదమిద్దముగ తెలివిడి కలిగెన హతవిధీ!



      నారదా
      జిలేబి

      Delete

    6. జిలేబి నా స్నేహితుడు/స్నేహితురాలు అని చెప్పుకోవచ్చా? పదమూడేళ్ళ పరిచయం -
      పదమూడేళ్లుగా ఆడో మగో తేల్చుకోలేని మీ అ..న్ని చూస్తే - ఎందుకులెండి?

      Delete
  8. అవునో కాదో తెలియదండీ

    ReplyDelete
    Replies
    1. Of course కాదు.
      ఆ ఫొటోలో ఉన్న “Sharma” గారు వేరు,
      ఈ “కష్టేఫలి” బ్లాగర్ శర్మ గారు వేరు.

      Delete
    2. విన్నకోట నరసింహా రావు28 August 2023 at 08:25

      సర్వం జగన్నాధం సార్! :)

      Delete
  9. Anonymous28 August 2023 at 07:28
    కాదనుకోడమేల సారూ :)

    ReplyDelete
  10. మీరు పాదరసంలాగా బలే జారిపోతారు, శర్మ గారు 🙂.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు28 August 2023 at 09:37
      విన్నకోట సారూ!
      కళ్యాణమొచ్చినా, కక్కొచ్చినా, ఆగవని సామెత తెలిసినదే కదండి.
      కళ్యాణం చేసుకునేవాళ్ళని ఆపడం పాపం. విషం కక్కుకునేవాళ్ళని ఆపడం కుదురునా :) కక్కుకోనివ్వక తప్పదనుకుంటానండి. :)
      దీనికి తోడు
      పుష్కరకాలం పైగా జిలేబి సావాసం, ఇప్పటికైనా నేర్చుకోపోతే ఎలాగ సార్! :)
      పొరపాటుంటే మన్నించెయ్యండి! ఆ పెద్ద మనసు మీకుందని నా నమ్మకం :) _/\_

      Delete
    2. నేనన్నది ఆ ఫొటోలోని Sharma గారు, మీరు ఒకరేనా అని ఓ అనానిమస్సుడు అడిగిన ప్రశ్నకు, దాని మీద జరిగిన చిన్న చర్చకు మీరిచ్చిన లౌక్యపు సమాధానాల గురించి 🙂.

      అయినా మిమ్ములను మన్నించ మేమెంతవారము, శర్మ గారు 🙏.

      Delete
    3. విన్నకోట నరసింహా రావు28 August 2023 at 10:53
      అయ్యయ్యో! ఎంతమాట. నిజంగానే నేను తప్పుచేసానండి. కామెంట్ సరిగా చూసుకోకపోవడం నాదే తప్పు. క్షమించండి.

      Delete
  11. పోనీ ఇందులో ఉన్న శర్మగారి ఫోటో మీదేనా అండీ? కాదనకండి :-)
    https://youtu.be/AdH9fLUwUFg&t=50

    ReplyDelete
    Replies
    1. కాంత్28 August 2023 at 18:43
      కాంత్ జీ
      బలేటోరండీ మీరు :)
      అందులో ఒకరు వంగర,రెండో వారు అల్లు. వారు నేనలా అవుతానండి :)
      నా ఫోటో, నా ఇల్లు చూస్తారా!
      ఈ కింద లింక్ లో చూసెయ్యండి.
      https://kasthephali.blogspot.com/2022/08/blog-post_14.html
      ధన్యవాదాలు.

      Delete
  12. తాతగారూ..


    "ఉన్నమాటంటే ఉలుకెక్కవని సామెత బుజ్జమ్మా"

    దీంట్లో ఉలుక అంటే ఏమిటండి ? ఈ సామెత కథాకమామీషు గురించి వ్రాద్దురూ ప్లీజ్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీరు తాత గారిని అదిలిస్తే మిమ్మల్ని ఇంకెవరో
      యాసతో కొట్టి విదిలించారు చూడండి :)

      Delete
    2. Zilebi29 August 2023 at 03:52
      ఉలుకు అంటే భయం. ప్రతి సామెతకి కతుండదు బుజ్జమ్మా! నువ్వో కత చెప్పు దానికి.
      మాలిక ఉలుకు దగ్గరే ఆగిపోయినట్టుంది, కదులుతుందా?

      Delete
    3. Anonymous29 August 2023 at 07:00

      సార్!
      ”ఊళ్ళోవాళ్ళ కొడుకుల్ని రాజు కొడితే రాజుకొడుకుని దేవుడు కొట్టేడు"అని సామెతండి

      Delete
    4. Zilebi photo dorikindi annamata.

      Delete
    5. appadiya, photo enge?

      Delete
    6. తాతగారు

      మీ ఉలుకు తో మాలిక హుళుక్కి నిదుర లేచి గాడిలో పడినట్టుంది. :) ఓ సారి చూద్దురూ సరిగ్గా గిరగిర తిరుగుతోందాలేదా అని ?

      శ్యామలీయం వారి కొత్త రామకీర్తనం కనిపిస్తోంది ఓ కందం వేద్దామంటారా ? :)



      లక్కుపేట నిదురలేచెను మాలిక ముందుసాగె :)



      జిలేబి

      Delete
    7. Zilebi30 August 2023 at 21:50
      ఒకసారి ఆగుమా ఓ చందమామ!
      ఆ చందమామ ఆగదు, ఈ మాలిక కదలదు. తోస్తే కదిలి ఆగిపోతుంది.
      మారేన నీమనసు ఓ చందమామ!

      Delete
    8. అవునండోయ్ తాతగారు !
      రౌడీ గారు వేస్తున్న బగ్ ఫిక్స్లను ఆ యాసలో కాకుంటే పొలొటికల్ న్యూస్ అప్డేటో గుటకాయ స్వాహా చేసేస్తున్నట్లుంది.

      మొత్తం మీద మాలిక కి రోజులు దగ్గిరపడినట్లే వుంది :)


      శోధిని కి జంప్ జమాల్ అయిపోదాం పదండి శ్రీనివాస్ గార్కి జిందాబాద్ జిందాబాద్ :)



      జిలేబి

      Delete
    9. ముళ్ళపూడి వారన్నట్లు “రౌడీని గుండేసి కొఠేస్తారా” 🙂? జాగ్రత్త సుమండీ.

      “శోధిని” “శ్రీనివాస్ గార్కి జిందాబాద్” తప్పకుండా. మరి మీ స్వంత సంకలిని “జిలేబివదన” పేరెత్తరేం?

      https://zilebivadana.blogspot.com/?m=1

      Delete
    10. Zilebi1 September 2023 at 07:48
      విన్నకోట నరసింహా రావు1 September 2023 at 08:35
      ”శోధిని” వైభవాన్ని సంతరించుకుని దూసుకుపోతోంది. శ్రీనివాస్ గారికి అభినందనలు.
      ఇక, మాలికలో ఇంత అశ్రద్ధ ఇదివరలో చూడలేదు. నా మనసు చెబుతున్నమాట,మాలికలో పెద్ద మార్పులు చేస్తున్నట్టనిపిస్తుంది, ఆ సందర్భంలోనే కొంచం అశ్రద్ధలా అనిపిస్తుంది. ఏదో ఒక రోజు, నా ఉద్దేశ్య ప్రకారం విజయదశమికి మాలిక కొత్త రూపులో కనపడచ్చు.

      Delete
    11. “మాలిక” ఎడమవైపు మళ్ళీ బిగుసుకున్నట్లుందిగా?

      Delete
    12. రామాయణమంతా విని‌ రామునికి సీతేమవుతుందని అడిగారట మీలాంటి మహానుభావులెవరో :)


      జిలేబి

      Delete
    13. -
      రామాయణమంతయు విని
      స్వామీ మీలాంటి వారెవరొ యడిగేరం
      టా మాకు తెలుపుడీ శ్రీ
      రామునికి ధరణిజ యెటులరా చుట్టంబౌ ?:)


      జిలేబి

      Delete
    14. విన్నకోట నరసింహా రావు1 September 2023 at 13:22
      Zilebi1 September 2023 at 14:53
      మాలిక ఎడమవైఅపు టపాలు బిగుసుకున్నాయని చెప్పిన చాలా రోజులకి కదిలిందండి. కదిలిందని సంతోషించేటప్పటికే మళ్ళీ బిగుసుకుంది. ఏమయిందో తెలీదు.
      కొంచం పరాకు పడినంతలోనేనా :)

      Delete
    15. "శోధిని" పై మీరు చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలండీ.. బ్లాగులు వెలగాలి... బ్లాగర్లు పెరగాలి.

      శ్రీనివాస్

      Delete
    16. శ్రీనివాస్2 September 2023 at 00:19
      శ్రీనివాస్ గారు!
      ఉన్నమాట చెప్పేను. శోధిని వేగంలో, బ్లాగులు జాబితాలో ఉత్తమంగా ఉంది. వేగానికైతే ఆశ్చర్యమే కలుగుతోంది. వేగంలో మిమ్మల్ని మించగలవారు వస్తారనుకోను :)

      ఇక తెనుగు బ్లాగుల గురించి మీకు తెలియందేముంది? :) రాసేవాళ్ళు రోజురోజుకి తగ్గిపోతున్నారు. కొంతకాలంలో రాసేవాళ్ళుంటారనుకోను. పూర్వ వైభవం తిరిగిరావడం అకాశకుసుమమే, అందని మానిపండే :) కాలంకదండీ! విధిని మార్చలేం :) మీరొక మంచి సంకలిని తయారు చేసి ఉంచారు, దానిని ఉపయోగించుకోవలసినవారు వినియోగించుకోవడం, మీ పనికాదు. మీ విధిని మీరు నిర్వర్తించారు. తెనుగు భాషపట్ల మీ అభిమానానికి ధన్యవాదాలు. శోధిని ఇలా రూపుకట్టించినందుకు అభినందనలు.

      Delete
    17. బాగా చెప్పారు, శర్మ గారు 👏.

      Delete
    18. విన్నకోట వారు

      ఈ సంకలిని (https://zilebivadana.blogspot.com/?m=1) ఎవరిదండీ చూడముచ్చటగా వుంది ?




      Delete
    19. విన్నకోట నరసింహా రావు2 September 2023 at 09:17
      ధన్యవాదాలండి

      Delete
    20. Anonymous2 September 2023 at 10:09
      సంకలిని బాగానే ఉందిగాని ”తనను తాను పొగుడుకుంటే తన్నుకున్నట్టుంటుందని” సామెతలే బుజ్జమ్మా

      Delete
    21. “జిలేబి” గారి సంకలిని (దాంట్లోనే పైన ఎడమ ప్రక్కన “జిలేబి” గారి బొమ్మ కనబడుతోంది కూడా). అసలు ఈ ప్రశ్న వేసిన వారుకూడా “జిలేబి” గారేనని నా అనుమానం.

      Delete
    22. విన్నకోట నరసింహా రావు2 September 2023 at 15:10
      బలేవారండీ!
      ఎంటీవోడు, తలమీద రూమీ టోపీ , కళ్ళజోడు,పిల్లిగడ్డం పెట్టుకొచ్చేస్తే రాజనాల గుర్తుపట్టలేడుగాని జనాలు గుర్తుపట్టరుటండీ అలాగే జిలేబి ముసుగుమీద ఎన్ని ముసుగులేసుకున్నా చెహరా మారదు కదండీ :)

      Delete
    23. ముసుగు మహాశయులందరికి లీడరు జిలేబి గారు :)

      Delete

    24. Anonymous2 September 2023 at 17:16
      ఇది జగమెరిగిన సత్యం. మీరుకొత్తగా చెప్పేరంతే!

      Delete
  13. Anonymous29 August 2023 at 23:58
    Anonymous29 August 2023 at 23:20
    Anonymous30 August 2023 at 00:00
    లోకో భిన్న రుచిః
    పరమాత్మా!
    నిన్నే రూపంలో వేడుకోను?
    జ్ఞానదా (లలితా సహస్రంలో అమ్మ పేరు. అనగా జ్ఞానమునిచ్చుతల్లి)
    అయ్యా!
    అజ్ఞానినా మయా దోషాన్
    అశేషాన్ విహితాన్ హరీ
    క్షమస్వ త్వం క్షమస్వ త్వం
    శేషశైల శిఖామణీ

    ReplyDelete
    Replies
    1. అయ్యో, I meant అ..న్ని as అయోమయాన్ని. Feel sorry if you felt otherwise 🙏

      Delete
    2. Anonymous30 August 2023 at 10:37
      అయోమయాన్ని సృష్టించడం కొనసాగించడం జిలేబి అలవాటు, అవసరం కూడా! అంతే కాదండి! నేను జిలేబి ఒకటికాదనీ, నా గురించిన పూర్తి వివరాలు నా బ్లాగుల్లోనే ఉన్నాయనీ, నన్ను ప్రత్యక్షంగా కలసి మాటాడిన వారు చాలామంది ఉన్నారనీ అన్నమాట యదార్థం. ఈ విషయాల్ని చెప్పి చెప్పి అలసిపోయాను. ఈ అజ్ఞానం నుంచి నన్ను బయట పడేయమని వేడుకున్నానండి.

      కిమస్థిమాలాం? కిం కౌస్తుభంవా? కిం కాలకూటః? కిమువా యశోదా స్తన్యం? భవతు స్వాదు ప్రభోమే? అని తిక్కనగారూహించిన హరిహర రూపంలోని పరమాత్మను భక్తి,జ్ఞానం, వైరాగ్యం ప్రసాదించమని వేడుకోవాలనేదే కోరికండి. భక్తి జ్ఞానము దయచేయమని అమ్మను లలిత రూపంలోనూ అయ్యను వేంకన్న బాబు రూపం లోనూ వేడుకున్నా గాని మరొకటి కానే కాదండి.

      మరోలా అనుకోలేదు :) సారీలు శారీలు కట్టుకున్నామన్న అయోమయం సృష్టి కర్తలకే చెల్లిందండి :)

      Delete
    3. అంతే కాదండీ ! కూ
      సింతయు సంబంధమసలు చిలిపి జిలేబీ
      కాంతకు నాకున్ లేదం
      చెంతయొ మొత్తుకొనుచుంటి చిరకాలముగా !

      Delete
    4. Anonymous30 August 2023 at 21:42
      నాప్రయత్నమంతా, చెవిటివాని ముందు శంఖం ఊదిన చందం

      Delete
  14. చంద్రయాన్ లో రోవర్ తనకు అప్పగించిన పని దిగ్విజయంగా ముగించింది. చంద్ర రాత్రి ప్రారంభం కాకముందే దానిలో బేటరీలను పూర్తిగా చార్జి చేసి నిద్రలోకి జారుకుంది. అతి శీతలానికి ఇతర ఆపత్తులకు తట్టుకుని చంద్రునిపై సూర్యోదయంతో మేలుకుంటే అదో గొప్ప విజయం. ఇక లేండర్ దిగినచోటునుంచి కొద్ది ఎత్తుఎగిరి పక్కగా కొద్ది దూరంలో మరలా క్షేమంగా దిగడమూ విజయమే!! లేండర్ కూడా నిద్రలోకి జారుకుంది. ఇది కూడా చంద్రునిపై సూర్యోదయంతో మేల్కుంటే ఘనవిజయం. దీనిని ఇస్రో సాధిస్తుందని ఆశిద్దాం.

    ReplyDelete
  15. గ్రహాంతర యానాల వల్ల ఏ మేరకు ఉపయోగం ఉంటుంది అన్న విషయం ప్రశ్నార్థకం. Exploration of distant inhospitable planets with hostile environments in physical realm may prove to be a costly and futile exercise.

    ReplyDelete
  16. గుర్తుందనుకుంటా! మనదేశంలో ప్రభుత్వం కంప్యూటర్ని మొదటగా ప్రవేశపెట్టినపుడు ఒక పార్టీ భారత్ బంద్ కి పిలుపిచ్చింది. ఎందుకూ? కంప్యూటర్ తో నిరుద్యోగం ప్రబలుతుందీ, ఇది కార్మిక వ్యతిరేక బూర్జువా ప్రభుత్వపోకడ అని నిరసించింది. తర్వాతది ఎరిగిన కత. ఇప్పుడు కల్పిత మేధస్సుకి ఏమందో తెలీదు.

    చంద్రునిపై మానవ ఆవాసం సాధమేనని వార్తలున్నాయి.అక్కడ ఎకరం పదిహేను లక్షలకి అమ్ముడుపోతోంది. ఒక రెండెకరాలు కొనేస్తున్నా! ఎమో ఏం చెప్పగలను? ఏమంటారు? చేత్తో సూర్యుణ్ణి మూసెయ్యగలమా? ప్రగతిని ఆపెయ్యగలమా?

    ReplyDelete
  17. శర్మ గారు,
    చంద్రయాన్-3 / లేండర్ / రోవర్ ల కథ ముగిసినట్లే అనుకోవాలా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు29 November 2023 at 15:18
      చంద్రయాన్-౩, చంద్రుని ఒక పగటి కాలానికోసం మాత్రమే ఉద్దేసింపబడింది.అది శుక్ల సప్తమినాటికి దిగింది, కృష్ణ సప్తమిలోపు దానికై ఉద్దేసింపబడిన పని పూర్తి చేసింది. ( పదునాల్గు భూమి దినాలు చంద్రుని ఒక పగలు, పదునాల్గు భూమి దినాలు చంద్రుని ఒక రాత్రి) ఆపై నిద్రలోకి జారుకుంది. ఉదయం లెస్తే అదో వింతవుతుందని,అద్భుతమవుతుందని ముందనుకున్నదే! అనుకున్నట్టే లేవలేదు. కథ ముగిసినట్టే!!

      Delete