Thursday 7 September 2023

ధనికః శ్రోత్రియో రాజా

 ధనికః శ్రోత్రియో రాజా

(999 post)


 ధనికః శ్రోత్రియో రాజా

నదీ వైద్యస్తు పంచమః

పంచ యత్ర న విద్యన్తే

న తత్ర దివసం వసేత్

(ఆచార్య చాణక్య)

డబ్బున్నవాడు (అప్పిచ్చేవాడు)శ్రోత్రియుడు (వేదం చదువుకున్నవాడు)రాజా (రక్షకుడు)నదీ ( ఎల్లప్పుడు పారేదానినే నది అంటారు)వైద్యుడు, ఈ ఐదుగురు ఉన్నవూరిలో ఉండు. లేని ఊరిలో ఒక్కరోజు కూడా ఉండకు.


అప్పిచ్చువాడు వైద్యుడు

నెప్పుడు నెడతెగక బారు నేరును ద్విజుడున్

జొప్పడిన యూరనుండుము

   చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ.

ఆచార్య చణకుడు ఐదుగురిని చెబితే సుమతీ శతకకర్త నలుగురితోనే సరిపెట్టేరు, ఎందుకో చెప్పలేను, తెలిస్తే చెప్పండి.



లోకయాత్రా భయం లజ్జా

దాక్షిణ్యం త్యాగశీలతా

పంచ యత్ర న విద్యంతె

న కుర్యాత్ తత్ర సంగతిమ్

(ఆచార్య చాణక్య)


లోకయాత్రా (జీవనోపాధి) లేనిచోట,భయం,లజ్జ (సిగ్గు),అభిమానం(దాక్షిణ్యం)త్యాగశీలత ( ఈవి కలిగి ఉండటం, విడిచేగుణం కలిగి ఉండటం) మనుషుల్లో,ఈ ఐదున్నూ లేనిచోట ఉండకు.


ఆతురె వ్యసనె ప్రాప్తె

దుర్భిక్షె శత్రుసంకటె

రాజద్వారె శ్మశానె చ

యస్తిష్టతి స బాంధవః

(ఆచార్య చాణక్య)


ఆతురె(అనారోగ్యం)లో, వ్యసనె(దుఃఖం, దురదృష్టం)లో, దుర్భిక్షం (కరువు కాలం)లో శత్రుసంకటె (శత్రువు దాడి చేసినపుడు), రాజద్వారె(రాజసభ, కోర్టు)లో, శ్మశానె(శ్మశానం)లో వదలక ఉండే బంధు సమానుడు ఎవరు? 


న పశ్యతి చ జన్మాంధః

కామాంధో నైవ పశ్యతి

మదోన్మత్తా న పశ్యతి

అర్ధి దోషం న పశ్యతి.


పుట్టిగుడ్డి ఎప్పుడూ చూడలేరు.కామంతో కళ్ళు మూసుకుపోయినవారూ చూడలేరు. మదోన్మత్తులూ చూడలేరు.

కోరేవారికి దోషం కనపడదు.


పుట్టుగుడ్డివారెప్పుడూ చూడలేరు. కాని కామాంధులు గర్వాంధులు కూడా కాన లేరు. ఇకా యాచన చేసేవారికిన్నీ అడగకూడనిది, అడగతగినది ఉండదు, తమకు కావాలి అంతే! అడిగేస్తారు. ఉదాహరణలు చూదాం.

 కామాంధులకు, మొదటగా చెప్పుకునేవాడు రావణుడు, గర్వాంధుడు కూడా.తరవాత చెప్పుకోదగ్గవాడు కీచకుడు, మాలిని రూపంలో ఉన్న ద్రౌపదిని మోహించాడు, అంతే.. తరవాత కత తెలిసినదే!. ఇలాటి వాడే మరొకడు సైంధవుడు. కౌరవుల, పాండవుల చెల్లెలైన దుస్సల భర్త. ముని ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని మోహించి ఆమెను బలవంతంగా రథం మీద తీసుకుపోతుంటే ధౌమ్యుడు అరచి పండవులతో చెప్పగా, పాండవులు ద్రౌపదిని కాపాడారు.  సైంధవునికి  ద్రౌపది చెల్లితో సమానం. కామంతో కళ్ళు మూసుకుపోయి, వీరంతా చచ్చారు.


చివరగా అర్ధికి ఉచితానుచితాలు తెలియవనడానికి, కళ్ళు కానవనడానికి ఉదాహరణ, దేవతలు ధధీచి వెన్నెముక అడగడం



11 comments:

  1. // “ సుమతీ శతకకర్త నలుగురితోనే సరిపెట్టేరు, ” //

    చాణక్యుడి కాలం నుంచి దాదాపు 1500 వందల యేళ్ళు ముందుకు పురోగమించాం, రక్షణ వ్యవస్థ ప్రతి గ్రామానికి ఉంది అనుకుని (ఉంది అని నేను అనుకుంటున్నాను సుమండీ)
    రక్షకుడు అనే దాన్ని వదిలేసి తతిమ్మా నాలుగు చెప్పారేమో బద్దెన గారు ?

    చాణుక్యుడి గొప్ప గొప్ప సూక్తులు ఇక్కడ చెప్పారు మీరు. చాణక్య సూక్తులు సర్వకాలీనమైనవి కదా, మహానుభావుడు 🙏.

    అవునూ, చాణుక్యుడు తెలుగు మూలాలు గలవాడని ఎక్కడో చదివాను. మీరు ఎప్పుడయినా విన్నారా?

    ReplyDelete
    Replies
    1. 1500 ఏళ్ళా? 2300 ఏళ్ళా?

      Delete
    2. చాణక్య సూక్తులు సర్వకాలీనమైనవి అంటే 100% కరెక్ట్ కాదేమో. కొన్ని సత్యాలు దేశ, కాల మాన పరిస్థుతిల్ని బట్టి మారుతుంటాయి.

      Delete
  2. // “ 1500 ఏళ్ళా? 2300 ఏళ్ళా?” //

    సుమతీ శతక కర్త బద్దెన గారి కాలంనాటికి 1500 యేళ్ళు.
    ————-
    చాణక్యుడి జీవితకాలం 375 - 283 BCE.
    బద్దెన గారి జీవితకాలం 1220 - 1280 CE
    ————-
    లెక్క సరిపోయిందా?

    ReplyDelete
    Replies
    1. మీరు "చాణక్యుడి కాలం నుంచి దాదాపు 1500 యేళ్ళు ముందుకు పురోగమించాం" అని వ్యాఖ్యానించారు. అంటే "చాణక్యుడి కాలం నుంచి ఇప్పటివరకు 1500 ఏళ్ళు అయింది అన్న అర్థం వచ్చేటట్టుగా ఉంది. అందుకని అడిగా - 1500 ఏళ్ళా లేక 2300 ఏళ్ళా అని. [మీరు 1500 వందల యేళ్ళు అని అన్నారు - అది కూడా తప్పే. గమనించగలరు :-)]

      Delete
    2. Anonymous 9 September 2023 at 20:20
      ———————
      “పురోగమించాం” తరువాత కామా పెట్టాను, ఆ వాక్యం అక్కడితో పూర్తి కాలేదు, అదంతా బద్దెన గారి ఆలోచన అయ్యుండచ్చని,
      చాణక్యుడి జీవితకాలం నుంచి బద్దెన గారి జీవితకాలం వరకు గడిచిన కాలం ఇంతా అని … అన్వయించే ప్రయత్నం చేసాను. నా వాక్య నిర్మాణంలో కాస్త స్పష్టత లోపించిందేమో, ఏమనుకోకండి.

      1500 “వందల యేళ్ళు” అనడం mea culpa.

      Delete
  3. విన్నకోట నరసింహా రావు8 September 2023 at 17:53
    Anonymous9 September 2023 at 01:12
    విన్నకోట నరసింహా రావు9 September 2023 at 06:37

    చణకుడు, బద్దెన ఏ కాలం వాళ్ళో తెలీదు. చణకుని తరవాత వాడే బద్దెన అనుకుంటున్నాను.
    నాటి కాలంలో రక్షణ వ్యవస్థ అన్ని గ్రామాలకీ ఉందని అనిపించదు, చణకుని శ్లోకాన్ని బట్టి, ఆ తరవాత కాలంలో బద్దెనగారి కాలానికి పెద్ద మార్పు వచ్చినట్టు లేదు, నేటికిన్నీ పెద్ద మార్పులొచ్చినట్టనిపించదు.
    చణకుని సూక్తులేపాటి :) నేటికాలంలో ప్రతిదాన్నీ తృణీకరించడమే నేటి అలవాటు కదా!
    చణకుడు తెనుగువాడా? తెనుగు మూలాలున్నవాడా? చెప్పలేనండి

    ReplyDelete
    Replies
    1. "నేటికిన్నీ పెద్ద మార్పులొచ్చినట్టనిపించదు" - ఇది మీ అభిప్రాయం అయ్యుండొచ్చు. చాణుక్యుడు తన నీతులన్నిటినీ మీలా బ్లాగులో ప్రచురించలేదు కదా. ఇది మార్పు కాదంటారా?

      Delete
    2. Anonymous9 September 2023 at 20:32

      అది నా అభిప్రాయమే కాదనను. మొదటి వాక్యంలో రక్షణ వ్యవస్థ గురించి చెప్పేను. ఆ తరవాత వాక్యం మొదటిదానికి అన్వయం ఉంటుందనుకున్నాస్మీ :) ఇప్పటికి పల్లెలలో రక్షణ వ్యవస్థ సామాజికమే, మీరు కాదంటే వాదించగల ఓపిక పూజ్యం.
      మార్పులు అనివార్యం. చణకుని కాలానికి, బద్దెన కాలానికి చాలా మార్పులొచ్చాయని చణకుని మాట, బద్దెన మాట పోల్చి చూసుకుంటే తెలుస్తుంది కదా!
      చణకుడు తాటాకులమీద రాసినా నేటికి నిలిచున్నాయి. :)

      Delete
  4. శర్మ గారు,
    పైన అనానిమస్సుల వారు పదిహేను వందలా రెండువేల మూడు వందలా అంటూ ఏదో సందేహపడితేనూ గూగులమ్మని అడిగాను వారిద్దరి సరైన జీవితకాలం గురించి. గూగులమ్మ ఇచ్చిన సమాచారం అది.

    ఇక ఇద్దరిలో ఎవరు ముందు అని చెప్పడానికి గూగులమ్మని అడిగేదేముంది? ఎలాగూ మనం చరిత్రలో చదువుకున్న దాని ప్రకారం చంద్రగుప్త మౌర్య చాణక్యుడి కాలం వాడు కదా. అలెగ్జాండర్ మన దేశానికి వచ్చింది కూడా ఆ ప్రాంతంలోనే. అదంతా క్రీస్తు పూర్వం. కాబట్టి చాణక్యుడే పెద్దవాడు.

    ఇవన్నీ మీకు తెలియదని కాదు. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి నాకు తోచింది చెప్పాను 🙏.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు9 September 2023 at 11:18
      ధన్యవాదాలు.

      Delete