ఇది కర్నాటకలో దేవరాయనగట్టు అనే ఊరిలో ఉన్న యోగనరసింహస్వామి ఆలయం ఫోటో. అక్కడ కొండమీద యోగనరసింహుడు, కొండక్రింద భోగనరసింహుడు ఉన్నారు. ఇది కొండపైన దేవాలయంవద్ద ఫొటో. అక్కడ మధ్యాహ్నం నివేదన అనంతరం ముందు కోతులకు ప్రసాదం పెట్టిన అనంతరం భక్తులకు ప్రసాదం పెడతారు. కోతులు మనుషులలాగా వరుసలో కూర్చొని ప్రసాదం తీసుకుంటాయి. ఈవిషయం కొంతకాలం క్రితం బ్లాగు లో ఈ ఫోటో తో సహా వచ్చింది. బ్లాగు పేరు నాకు గుర్తు లేదు.
అప్పిచర్ల. కోదండ రామాంజి బాబు.గారు, మంచి సంగతి చెప్పేరు, ఇది తెలియదు సుమా! ధన్యవాదాలు. ఇక కేరళాలో ఒక గుడిలో కోతులకు ఆహారం ఇవ్వడం పూర్వకాలంనుంచీ జరుగుతోందిట. ఐతే తెల్లవారి ప్రభుత్వంలో దాన్ని నిషేధించారట. దానితో కోతులు వంటశాలలో ప్రవేసించి అల్లరి ప్రారంభించాయి. అధికారులకు తెలిపారు, దమనచర్యలూ జరిగాయి, కాని కోతులు వెనక్కి తగ్గలేదు, అప్పటివరకు క్రమశిక్షణతో ఉన్నవి. దానితో మన్రో తానే స్వయంగా వచ్చాడట. కోతులెంత క్రమశిక్షణతో ఉంటాయో వివరిస్తే నమ్మనన్నాడట. వీటి రాజెవరో పిలవండంటే సుగ్రీవా అని పిలవడం తో ఒక వానరం వచ్చిందట. మీకు ఆహారం పెట్టాలని ఎక్కడుంది అని మన్రో అడిగితే ఆ సుగ్రీవుడు పక్క చెట్టెక్కి పైన ఉన్న రాగిరేకు మీద ఉన్న రాజశాసనం చూపాడనీ, అప్పటినుంచి మరల కోతులకక్కడ ఇప్పటికిన్నీ ఆహారం ఇస్తారనీ, చాలా క్రమశిక్షణతో కోతులు మెలుగుతాయనీ కథనం, ఎక్కడో చదివా గుర్తులేదు.
శర్మ గారు, కేరళ రాష్ట్రం లోని కొల్లాం జిల్లా (Quilon) లోని శాస్తంకోట అనే ఊళ్ళో ఉన్న శ్రీ ధర్మ శాస్త గుడిలో కోతులకు భోజనం వడ్డించడం జరుగుతుందట (కేరళలో శాస్త అంటే సాధారణంగా అయ్యప్ప). దానిని “వానర సద్య” అంటారట (“సద్య” అంటే విందు). క్రింది లింకులో చూడచ్చు 👇.
కోతులకు కులాలుండవేమో బహుశః? ఇప్పుడంతా కులాలవారీ వనభోజనాలే కదా. ఎంత వీలయితే అంత సమాజాన్ని విడగొట్టి భ్రష్టు పట్టించారు నాయకులు.
ReplyDeleteవిన్నకోటవారు,
Deleteఅలా అంటారా? పాతకథే కదండీ :)
కోతులు ఇంత కుదురుగా ఒక వరసలో కూర్చోవటం అసాధ్యం. ఎవరో ఏదో ఫోటో మీద ఒక కోతిపని ఏదో చేసారని అనుమానం కలుగుతోంది.
ReplyDeleteఅందులో అనుమానమేముంది?
Deleteఇది కర్నాటకలో దేవరాయనగట్టు అనే ఊరిలో ఉన్న యోగనరసింహస్వామి ఆలయం ఫోటో. అక్కడ కొండమీద యోగనరసింహుడు, కొండక్రింద భోగనరసింహుడు ఉన్నారు. ఇది కొండపైన దేవాలయంవద్ద ఫొటో. అక్కడ మధ్యాహ్నం నివేదన అనంతరం ముందు కోతులకు ప్రసాదం పెట్టిన అనంతరం భక్తులకు ప్రసాదం పెడతారు. కోతులు మనుషులలాగా వరుసలో కూర్చొని ప్రసాదం తీసుకుంటాయి. ఈవిషయం కొంతకాలం క్రితం బ్లాగు లో ఈ ఫోటో తో సహా వచ్చింది. బ్లాగు పేరు నాకు గుర్తు లేదు.
Deleteఆ ఊరి పేరు దేవరాయన “గట్టు” కాదు, దేవరాయణ దుర్గ. అయ్యుంటుంది రామాంజి బాబు గారు.
Deleteశ్యామలీయంవారు,
Deleteకాదుటండీ! ఇటువంటి దే మరొకటీ ఉందిట.
Deleteఅప్పిచర్ల. కోదండ రామాంజి బాబు.గారు,
మంచి సంగతి చెప్పేరు, ఇది తెలియదు సుమా!
ధన్యవాదాలు.
ఇక కేరళాలో ఒక గుడిలో కోతులకు ఆహారం ఇవ్వడం పూర్వకాలంనుంచీ జరుగుతోందిట. ఐతే తెల్లవారి ప్రభుత్వంలో దాన్ని నిషేధించారట. దానితో కోతులు వంటశాలలో ప్రవేసించి అల్లరి ప్రారంభించాయి. అధికారులకు తెలిపారు, దమనచర్యలూ జరిగాయి, కాని కోతులు వెనక్కి తగ్గలేదు, అప్పటివరకు క్రమశిక్షణతో ఉన్నవి. దానితో మన్రో తానే స్వయంగా వచ్చాడట. కోతులెంత క్రమశిక్షణతో ఉంటాయో వివరిస్తే నమ్మనన్నాడట. వీటి రాజెవరో పిలవండంటే సుగ్రీవా అని పిలవడం తో ఒక వానరం వచ్చిందట. మీకు ఆహారం పెట్టాలని ఎక్కడుంది అని మన్రో అడిగితే ఆ సుగ్రీవుడు పక్క చెట్టెక్కి పైన ఉన్న రాగిరేకు మీద ఉన్న రాజశాసనం చూపాడనీ, అప్పటినుంచి మరల కోతులకక్కడ ఇప్పటికిన్నీ ఆహారం ఇస్తారనీ, చాలా క్రమశిక్షణతో కోతులు మెలుగుతాయనీ కథనం, ఎక్కడో చదివా గుర్తులేదు.
శర్మ గారు,
Deleteకేరళ రాష్ట్రం లోని కొల్లాం జిల్లా (Quilon) లోని శాస్తంకోట అనే ఊళ్ళో ఉన్న శ్రీ ధర్మ శాస్త గుడిలో కోతులకు భోజనం వడ్డించడం జరుగుతుందట (కేరళలో శాస్త అంటే సాధారణంగా అయ్యప్ప). దానిని “వానర సద్య” అంటారట (“సద్య” అంటే విందు). క్రింది లింకులో చూడచ్చు 👇.
కర్ణాటకలోని దేవరాయణ దుర్గ గుడిలో కోతుల విందు సంగతి వివరం దొరకడం లేదు ఆన్‌లైన్‌లో.
https://www.keralatourism.org/onam/ona-sadya/monkey-sadya
కోతులకు రోజూ వన భోజనమే కదా!
ReplyDeleteబోనగిరిగారు,
Deleteఅవును కదా!