Tuesday, 15 November 2022

జంతికొచ్చి చక్కిలాన్ని ఎక్కిరించినట్టు

 అత్తచుట్టం గూదపగ


అత్తచుట్టం గూదపగ, అనేదోనానుడి. పాతకాలందే. ఏంటిదీ ఒక చిన్నకత చెప్పేసుకుందాం.సరేనా!


అనగనగా ఒక పల్లెటూరు అందులో ఒక చిన్న కుటుంబం. ఒకడే కొడుకు. వయసొచ్చింది, పెళ్ళి చేసేరు. కోడలమ్మ ఒచ్చింది. కాలంగడిచి, ఇంటి యజమాని కాలం చేసేడు. కొడుకు ఇంటి యజమానయ్యాడు. అత్త స్థానం మారింది, యజమానురాలు నుంచి. కోడలికి అత్త చుట్టమే కాని రెండు పూటలా తింటోంది, చాకిరీ చేస్తున్నా, ఇది కోడలికి కంటకంగా ఉంది. ఏమీ చేయలేదు. కొంతకాలం గడిచింది, అత్త లొంగుబాటులో కొచ్చేసింది, ఆరోగ్య రీత్యా, కాని రెండుపూటలా తింటూనే ఉంది. కోడలు విసవిసలాడుతూ ముద్ద పడేస్తోంది. అలాగ అత్త చుట్టం గూద పగ అయ్యాయా కోడలికి. 


జంతికొచ్చి చక్కిలాన్ని ఎక్కిరించినట్టు


ఇదీ ఒకనానుడే! పాతకాలందే!! జంతికొచ్చి చక్కిలాన్ని నీ ఒళ్ళంతా చిల్లులే అని ఎక్కిరించింది. నేటికాలానికి ఇదేంటో తెలీదుకదా! మరిప్పుడంతా పిజ్జాలు బర్గర్లేగా తింటున్నది. జంతికల్నిచక్కిలాలని చూసినవారే అరుదైనట్టుంది. చక్కిలానికి లెక్కగా చిల్లులుంటాయి, జంతికకి లెక్కలేనన్ని చిల్లులుంటాయి. లెక్కగా చిల్లులున్న చక్కిలాన్ని లెక్కలేనన్ని చిల్లులున్న జంతిక నీ ఒళ్ళంతా చిల్లులే అని ఎక్కిరించిందనమాట. ఎలా చెప్పినా నేటి కాలానికి అర్ధం చెయ్యడం కష్టమే కనక నేటి కాలం ఉదాహరణ బాగుంటుంది కదూ!


ఒక జంతిక, చక్కిలం బ్లాగుల్లో కొంతకాలం కలిసున్నాయి. ఈ జంతిక బ్లాగుల్లోంచి పారిపోయింది, బుఱ్ఱలో గుంజెండిపోయి, రిపీట్ చెయ్యడానికి కూడా పాత గుంజులేక. . చక్కిలం ఇంకా కుంటుకుంటూ బ్లాగుల్లోనే ఉంది, పాతవి రిపీట్ చేస్తూనో, కొత్తవి రాస్తూనో. కొంతకాలంపోయాకా, ఒక పాత టపా రిపీట్ చేస్తే ఆ జంతిక, చక్కిలాన్ని బుర్రలో గుంజెండిపోయి, పాత టపాలు రిపీట్ చేస్తున్నాట్టా అని అడిగినట్టు.

13 comments:

  1. టపా శీర్షికలోని రెండవ భాగంలోని మొదటి పదం (తిండియావ అనే అర్థంలో) కళింగాంధ్ర మాండలికం అని “ఆంధ్ర భారతి” చెబుతోంది. మరి మన దగ్గర కూడా వాడతారా? నేనెప్పుడూ వినలేదు లెండి, అందువల్ల అడుగుతున్నాను 🙏.

    ఇక జంతికలు, చక్కిలాల భాగంలో చివరి పేరాలో మీరు వాడిన అన్యాపదేశం ఎవరినో తెలుస్తోంది గానీ ఇంకా ఇక్కడే ప్రచ్ఛన్నంగా తచ్చట్లాడుతున్నారంటారా ఆ వ్యక్తి?

    టపాలను రిపీట్ చెయ్యడంలో మీకన్నా అందె వేసిన చెయ్యి సీనియర్ బ్లాగర్ ఒకరున్నారు కదా బ్లాగుల్లో. అందువల్ల మరేం ఫరవాలేదు 🙂.

    ReplyDelete
    Replies
    1. నా అనవసరప్రసంగం. నా శ్యామలీయం బ్లాగులో 2700 టపాలు ఉన్నాయి. టపాలను రిపీట్ చేయలేదు. (జిలేబీగారిపై వ్రాసిన ఒక్క టపాను మాత్రం మరొక్కసారి వేసాను.)

      Delete
    2. విన్నకోటవారు,

      గూద అనేపదం ఉచ్చరించడానికి కూడా సంకోచించారే! ఈ నానుడి గోజిలలో పల్లెలలో వాడేదే! ఉత్తరాంధ్ర వారి ప్రభావం మా పల్లెల మీదనే ఎక్కువ. వారిని తూర్పువారనడం మామూలు. వారు కూడా మేము తూర్పుకాపులం అనే చెప్పుకునేవారు.ఇప్పటికి తూర్పుపేటలు పల్లెలలో ఉన్నాయండి. ఆ పదానికి పొట్ట అనే అర్ధం ఉందండి.పదాలకి ఉన్న అసలు అర్ధాలు మార్చి కొత్తర్ధాలు చెప్పడం మనవాళ్ళకి అలవాటేనండి.

      అన్యాపదేశమేం కాదండి :) టపాలు రాయడం చేతకాక, బుర్రలో గుంజెండిపోయి పారిపోయినవాళ్ళు, మరొకరిని గుంజెండి పోయి పాత టపాలు మళ్ళీ వేస్తున్నరనడం, ఆ సామెతకి సరిపోలేదాండీ! :)

      పెద్ద చెరువులో నీళ్ళు కుక్క ముట్టుకుంటే తప్పులేదని మా శంకరమ్మత్త చెప్పిందండి :)

      Delete
    3. శ్యామలీయంగారు,
      మీలాటివారు ఎన్నిటపాలైనా రాయగలరు, మాలాటి వారు ఎప్పుడేనా ఒక టపా రిపీట్ చేస్తే ఇలా రచ్చచేస్తారండి. అంతే లెండి. :)

      Delete
    4. మిత్రులు శర్మ గారు, నేను వ్రాసేది రాముడి గురించి కదటండీ. అందుకని ఆట్టేమందే రారు. అందుకే ఎక్కువగా రచ్చ కనబడదు కాబోలునండి. అసలు వచ్చే పదీపరకా మౌనస్వాములు ఏమీ పలికేవాళ్ళు కాదు.

      Delete
  2. నరసింహారావు గారి అభిప్రాయమే నాదిన్నూ

    ReplyDelete
    Replies

    1. Anonymous15 November 2022 at 17:51
      చిత్తం, నాదీ అదే సమాధానమండి :)

      Delete
  3. ఆ అన్యాపదేశం ఎవరండీ?

    ReplyDelete
    Replies

    1. Anonymous15 November 2022 at 21:04
      ఆయ్! తవరే శలవివ్వాలండీ :)

      Delete
  4. ఇంగ్లీషు వాడికో సామెత ఉంది. Pot calling kettle black. అని. (తెలుగులో చెప్పాలంటే కుండవెళ్ళి టీ కాచే గిన్నె అడుగు నల్లగా ఉందని ఇకిలించిందట.అని) మీ జంతిక చక్కిలం సామెతకన్నా ఇది బాగా.బోధపడుతుంది.

    ReplyDelete
    Replies
    1. ఎర్ర కుండలుండవాండీ

      Delete
    2. శ్యామలీయం గారు,
      పల్లెటూరోణ్ణి కదండీ అందుకు ఆ పోలిక చెప్పేనండి.

      Delete
  5. ఏమిటో గూఢంగా వీల్లు వీల్లు మాటలు. ఒక్క ముక్కా అర్థమవదు

    ReplyDelete