Friday, 7 October 2022

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.

 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.


పులి బంగారం రంగులో ఉండి,ఆపై నల్ల మచ్చలుంటాయా? నల్ల ఒంటి మీద బంగారపు మచ్చలుంటాయా? తేలలేదు. కాని అందరూ నల్లమచ్చలే ఉంటాయంటారు. పులిని చూస్తే భయం, రాజసం అందుకు అడవిలో జంతువులంతా అణిగిమణిగి ఉంటాయి. ఇది చూసిన నక్కకి కన్నుకుట్టింది. ఎలాగైనా తానూ పులిలా కావాలనుకుంది.   మార్గం ఏంటీ? అలోచించింది. ఒంటి మీద మచ్చలు వేసుకుంటే తానూ పులిలాగే ఉంటాననుకుంది.ఒంటి మీద మచ్చలు శాశ్వతం కావాలంటే, ఆలోచించింది,అట్లకాడ కాల్పించి   మచ్చలేయించికుంది,వాతలు పెట్టించుకుని , బాధ సహిస్తూ. ఒంటి మీద మచ్చలొచ్చాయి గాని తోటి నక్కలు చూసి అసహ్యించుకున్నాయి, ఇప్పుడు తాను అటు పులీ కాదు, ఇటు నక్కాకాదు . రెండికీ చెడ్డ రేడు అయింది.                            

మరో చిన్నకత, విష్ణుశర్మ పంచతంత్రంలోది.

ఒక పోతరించిన నక్క, అడవిపక్క గ్రామంలో కొచ్చింది.ఒక కోడిని తరిమింది  . ఆ కోడి ఒక సాలీల ఇంట్లో దూరింది. తరుముకు వెళుతున్న నక్క చూసుకోక, సాలివాడు బట్టలకి వేద్దామని కలిపి ఉంచిన నీలి రంగులో పడింది.ఒళ్ళంతా నీలి రంగు పట్టేసింది. కోడి దొరకలేదు, ఈ సందడిలో అది పారిపోయింది. అలాగే అడవికొచ్చిన నక్కని చూసి జంతువులు భయపడ్డాయి. వెళ్ళి పులికి చెప్పేయి, ఏదో భయంకరమైన జంతువు అడవిలో తిరుగుతోందని, అది చాలా కౄరమైనదని, రకరకాల కతలు , పులిని భయపెట్టేయి. పులి కూడా చూసీ చూడనట్టు ఉండిపోయింది. నీలినక్క ఎవరితో పలకలేదు, మాటలేదు. దీనితో ఆ జంతువు నక్కేనని గుర్తించలేకపోయాయి, జంతువులన్నీ. కాలం గడిచింది, ఓ రోజు వర్షం వస్తే ఆ వర్షంలో తడిసిన నీలి నక్క ఒంటిమీద రంగు కరిగింది కొంత, వికారంగా తయారయింది. ఇది చూసిన తోటినక్కలు గుసగుసలు పోయాయి. ఇంతలో పున్నమి వచ్చింది, తోటి నక్కలన్నీ సభచేసి గొంతెత్తి ఊళలు పెట్టాయి. నీలినక్క కూడా ఆనందం పట్టలేక గొంతెత్తి ఊళపెట్టింది. దానితో ఇది నక్కేనని తెలిసిపోయి, తోటి నక్కలు తిట్టేయి, ఇది తెలిసి పులొచ్చి ఒక్క పెట్టు పెట్టింది, పోతరించిన నక్క కత సమాప్తం.


పెద్దతెల్లగడ్డం పెంచుకున్నవాళ్ళంతా రవీoద్రనాథ ఠాకూర్ అంతవారవుతారా?


పెద్దతెల్లగడ్డం పెంచుకున్నవాళ్ళంతా ప్రధాని అవుతారా?


పెద్దతెల్లగడ్డం కాకపోతే నల్లగడ్డం పెంచుకుంటే ప్రధాని అవుతారా?


పోనీ మల్టీ కలర్ గడ్డం పెంచుకుంటే ప్రధాని అవుతారా?


పాదయాత్ర చేసినవాళ్ళంతా 

ముఖ్యమంత్రులయ్యారు. నడవనివాళ్ళూ ముఖ్యమంత్రులయ్యారు.


పాదయాత్రవాళ్ళంతా ముఖ్యమంత్రులవుతారా?


రథయాత్రలు చేసినవాళ్ళు ప్రధాని అయ్యారా?

రథయాత్రచేస్తే ప్రధాని అవుతారా? 


గొప్పవారి పేరుకు దగ్గరగా మనం పేరు పెట్టుకున్నంతలో వారి గొప్ప మనకొస్తుందా?


పెద్దవాళ్ళని తిట్టినవాళ్ళంతా మేధావులైపోతారా?


మేధావులంతా పెద్దవాళ్ళని తిడతారా?


పులినిజూసి నక్క వాతలు పెట్టుకోడం అంటే ఇదేనా?


ఏంటో సమాధానం లేని ప్రశ్నలు 

12 comments:

  1. పాదయాత్రవాళ్ళంతా ముఖ్యమంత్రులవుతారా

    ఇది మాత్రం ఖచ్చితమే నండి

    జనాల పల్స్ పట్టేయడానికి వంద శాతం సక్సెస్ రేటున్న మార్గం

    నాటి ఎన్ టీ ఆర్ , వై యస్ ఆర్ , ఇప్పటి యువతరం జనప్రియ నేత జగన్ దీనికి సాక్షులు.

    ReplyDelete
    Replies
    1. Anonymous7 October 2022 at 10:48
      అనామకా!
      అబ్బోడా! చరిత్ర చాలాగుర్తుందే :)

      Delete
  2. మరొకటి ……. పెళ్ళి చేసుకోని వాళ్ళంతా ప్రెసిడెంట్లు, ప్రధానులవుతారా 🙂?

    అన్నట్లు ఎన్.టి.ఆర్ గారు “చైతన్య రథయాత్ర” (తన van లో) చేశారు గానీ పాదయాత్ర చేశారంటారా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      మరీ సంక్లిష్టమైన కొచ్చన్లేసేరు! :)

      పాపం! ఎన్టీవోడికి టైమ్ లేకపోయిందండి, లేపోతేనా పాదయాత్ర చేస్తే ప్రదానైపోయేవోడండి :)

      Delete
  3. పెళ్ళయిన వాళ్ళు రథయాత్ర పెళ్లి చేసుకోని నాయకులు పాదయాత్ర చేయడం మంచిది. మళ్లీ పెళ్లి చేసుకున్న నాయకులు ఏ యాత్ర చేసే అవకాశం రాదు.

    ReplyDelete
    Replies
    1. Anonymous7 October 2022 at 20:32
      బుల్లితమ్మీ! ఏటి కమింటు సానుభవం వాసనేస్తన్నాదే! :)
      నిజమేస్మీ! పెళ్ళికానోడు పాదయాత్రజేస్తే ఏ బుల్లెమ్మైనా దొరక్కపోద్దా :)

      Delete
    2. వెటకారం ఎక్కువైతే వెగటు పుడుతుంది శర్మాజీ. మీ కామెంట్స్ వికారం గా ఉంటున్నాయి.

      Delete
    3. వెట కారం లేని గోజి వాళ్లు వుంటారాండి

      Delete
    4. Anonymous8 October 2022 at 19:22
      నాపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు
      ధన్యవాదాలు.
      =======================================
      (లోకో భిన్నరుచిః
      చాలాచెప్పాలి
      సమయం కాదుమరి.)

      Delete
    5. Anonymous8 October 2022 at 21:41
      నమస్కారం

      Delete
  4. కష్టేఫలి ఏమోగాని కష్టేపులి (కష్టపడి వాతలు పెట్టుకుంటే పులి అవుతారు) అంటారు?

    ReplyDelete
    Replies
    1. కాంత్ జీ!
      అదేటి బావ్! ఎంత కష్టపడి పులోతలెట్టిచ్చుకున్నా, పులిపులే, నక్క నక్కేనంట సావీ! పులోతలు మిగిలిపోయినై గందా!

      Delete