సిరిఅబ్బదు చీడబ్బినట్టు, ఇదో నానుడి.
మంచి అలవాట్లు కావడం కష్టం, కాని చెడు అలవాట్లు తొందరగా అవుతాయంటారు, ఇదీ పెద్దలమాట.
సిరి అంటే లక్ష్మి, మనవారు లక్ష్ములని ఎనిమిదిగా చెప్పారు. ఆధునికులు మరో అడుగు ముందుకేసి, పెళ్ళాం పిల్లలు చెప్పిన మాట వినేవారైతే సిరి,ఇంట్లో ఉన్నవాళ్ళంతా కలసి భోజనం చెయ్యడం సిరి, తల్లితండ్రులతో కలసి ఉండడం సిరి అని ఇంకా ఏవో చెప్పేరు, ఇదంతా మా వాట్సాప్ యూనివర్సిటీ విజ్ఞానం :)
ఇలా మంచి అలవాట్లు కావడం కష్టం చెడు అలవాట్లు కావడం చాలా సులభం, అన్నది, పెద్దల మాట.
కుండలో,రాగిపాత్రలో,ఇత్తడిపాత్రలో వండుకోండి. గంజివార్చండి, వార్చిన గంజి పారబోయక అన్నంలో కలుపుకు తినండి.అతివేడిగా, అతి చల్లగా ఆహారం తీసుకోకండి, వండుకున్న అన్నం ఉమ్మగిలనివ్వండి,ఉమ్మగిలడం అంటే సాధారణ ఉష్ణోగ్రతకు చేరడం, ఇలా కావాలంటే అన్నం వండుకున్నతరవాత దానిని కలియబెట్టి ఆరనివ్వడమే. ఇలా ఆరనిస్తే కార్బోహైడ్రేట్లలో మార్పు జరిగి, వరిఅన్నపు గ్లైసిమిక్స్ ఇండెక్స్ తగ్గుతుందిట. దంపుడు బియ్యపు అన్నం మంచిది,కాని డబుల్ పాలిష్ బియ్యమే తింటున్నాం. సనాతనమైనది కాదనుకుని, తాతతండ్రులు తిన్నదాన్ని నిరసిస్తూ పురోభివృద్ధి సాధించామా లేదా?కుండ,రాగిపాత్ర,ఇత్తడి పాత్రలలో వండుకోడం అనాగరికమని అల్యూమినియం బొచ్చల్లో వండుకుంటున్నామా లేదా? నాగరికతంటే ఇదేకదా అని అడుగుతున్నాం కూడా!
ఈ మధ్య ఒక అంతర్జాతీయ సదస్సులో ఒక శాస్త్రవేత్త ఆఫ్రికా ఖండం వాడు, నీరుల్లిపాయ సుగర్ ని అదుపులో ఉంచుతుందన్నారు,మెట్ఫార్మిన్ తో కలిపితీసుకుంటే . మిగిలిన ఆధునికులు ఈ మాటమీద ఇంకా దీనిపై పరిశోధన జరగాలని విషయాన్ని బుట్టదాఖలా చేసేసారు.
నాకైతే ఒకమాటనిపించింది. భారతదేశంలో ఉల్లివాడకం ఎక్కువకదా! మరిక్కడ ఇన్ని సుగర్ కేస్ లూ ఎందుకున్నట్టు? ఇదిగదా కొచ్చను :)
మనం తీసుకునే ఆహారంలో రకరకాల ఆహార పదర్ధాలుంటాయి. అన్నిటికి ఒకటే జి.ఐ (G.I )ఉండదు, ఎక్కువ తక్కువలుంటాయి. వీటిని కలిపితీసుకున్నపుడు జి.ఐ తగ్గుతుంది, అది 50 కి లోపు ఉంటే మంచిదే, దానికంటే ఎక్కువ ఉంటే రక్తంలో చక్కెర శాతం తొందరగా పెరుగుతుంది. ఇక పచ్చిఉల్లి జి.ఐ 10, అదే ఉడికిస్తే అది కాస్తా 40 అయి ఊరుకుంటుంది. మనకు పచ్చి ఉల్లిని తినడమూ అలవాటే కాని ఈ మధ్యనే ఈ అలవాటు తప్పించుకుంటున్నాము. పచ్చి ఉల్లిని ఆహారంలో తీసుకుంటే మొత్త జి.ఐ తగ్గుతుంది, మందులు, సమర్ధవంతంగా పనీ చేస్తాయనుకుంటున్నా! పచ్చి ఉల్లి తినిచూస్తే పోయిందేంలేదు.పంజాబీలు రోటీతో ఒక పెద్ద ఉల్లిపాయ,ఒకపచ్చిమిరపకాయ కూడా తింటారనుకుంటా.
ఇక ఈ మధ్యనే ఒకదేశి డాక్టరమ్మ,అలోపతి డాక్టరమ్మే చద్దన్నం తినండి అన్నారు, శాబాసో! అనుకున్నా, ఆ తరవాతే చెప్పిందా తల్లి, నిన్నరాత్రి మిగిలిన అన్నం ఫ్రిజ్ లో పెట్టుకుని మర్నాడు ఉదయం తినమన్నారు. అన్నం ఉడికిన తరవాత దానిని ఫ్రిజ్ లో పెట్టి ఉంచి చల్లబడ్డ తరవాత మళ్ళీ వేడి చేసుకు తినండీ, అని. అసలే కుక్కర్లో వండిన వాటిలో పోషక విలువలు చస్తున్నాయంటున్నారు, ఇక ఫ్రిజ్ లో పెట్టి తీసి మళ్ళీ వేడి చేసి తింటే అసలు పోషక విలువలుంటాయా? నా ఉద్దేశం ఈ అలవాటు మాత్రం చాలా తొందరగానే అందరిని చేరచ్చు అనుకుంటున్నా!
బావుంది
ReplyDeleteధన్యవాదాలు.
Deleteచెడుకి పబ్లిసిటీ ఎక్కువ గదా - ముఖ్యంగా టీవీ మాధ్యమం వచ్చిన తరువాత.
ReplyDeleteఉల్లి వాడకం అధికంగా ఉన్నప్పటికీ మన దేశంలో షుగర్ కేసులు ఎందుకు ఎక్కువ ఉన్నట్లు అంటారా? దక్షిణాదిలో షుగర్ బాధితులను వరి అన్నం మానేసి గోధుమ రొట్టెలు తినమంటారు గదా డాక్టర్లు. మరి గోధుమే ప్రధాన ఆహారం అయిన ఉత్తరాదిలో కూడా షుగర్ కేసులు బాగానే ఉన్నట్లున్నాయే? ఏమిటో చెబుతూ ఉంటారు డాక్టర్లు, వాట్సప్ ప్రొఫెసర్లూ.
పై Anonymous comment (4 October 2022 at 19:38) వ్రాసింది నేనే సుమండి.
Delete- విన్నకోట నరసింహారావు
విన్నకోటవారు,
Deleteనమస్కారం.
ఈ రోజుల్లో దయాబెటీస్ లేనివారెవరు చెప్మా :)రేపటిరోజునుంచి బద్ధకం ఇల్లాళ్ళు వారానికొకసారి వండేసి ఫ్రిజ్ లో పెట్టేసి అన్నం పెడితే అనే ఆలోచనొచ్చి ....
శర్మ గారు, ఈ రోజుల్లో డయాబెటీస్ లేనివారు, ఒకరైనా అమెరికా వెళ్ళని కుటుంబాలు లేవంటే అతిశయోక్తి కాదు.
Deleteఇక మీరన్న ఫ్రిజ్ తిండి రావడం ఎప్పటి వరకో అక్కరలేదండి. అమెరికాలో సర్వసాధారణం. వాళ్ళని చూసి / విని అలాటి ఫ్రిజ్-గత ఇల్లాళ్ళు మన దేశంలో కూడా ఆల్రెడీ తయారయ్యారు. ఆధునిక జీవనం, ఉరుకులు పరుగులు ముఖ్య కారణమంటారు జనం. హడావుడి లేని పల్లెటూళ్ళకు, చిన్న పట్టణాలకు కూడా వ్యాపించిందా అని నా అనుమానం.
విన్నకోటవారు,
Deleteదయాబెటీస్ లేనివారు అరుదు కదండీ. నిజమే అమెర్కాలో కుటుంబానికొకళ్ళేనా ఉన్నారు. మరి మేమూ తక్కువ తినలేదు కదా! :) ఇక్కడినుంచీ అమెరికాలో అలాగే కుటుంబానికొకరులా ఉన్నారు. మరో మాట, ఇక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు దీపం పెట్టే దిక్కు కూడా కనపట్టం లేదు, కొన్ని చోట్ల. చీడ తొందరగా అబ్బుతుందంటారు, మేమూ అంతేగా!
సార్ ,
ReplyDeleteవిజయదశమి శుభాకాంక్షలు ,
నమస్సులూను .
రాజాసాబ్!
Deleteనమస్సులు.
బహుకాల దర్శనం.కుశలమేకదా!
విజయదశమి శుభకామనలు.
తమద్వారా పెద్దలు శ్రీ నరసింహరావుగారికున్నూ
ReplyDeleteవిజయదశమి శుభాకాంక్షలు , నమస్సులు
ఎంత మాట, రాజారావు మాస్టారు.
Deleteమీకు, మీ పరివారానికీ విజయదశమి శుభాకాంక్షలు.