Wednesday 26 February 2020

కుమ్మీసినారు బావూ

నారాయణమూర్తి బావూ!నారాయణమూర్తి బావూ!!

ఛస్!  ఏంటీ కేకలు గొడవా మా ఇంటి దగ్గరా? ఏవడ్రా వీడు ? గంజి కావిడి వేసి మోసుకొచ్చేరూ?

బుగతా! తవరిగారి మనవడేనండి!

అయ్యో! చిట్టితండ్రీ నారదా!నిన్ను కొట్టడానికి వాళ్ళకి చేతులెలా వచ్చాయి. చిన్నపిళ్ళాణ్ణి చేసి కొడతారా?ఆ కట్లేంటీ? వాతలేంటి నాయనా? 

ఏటి బాబూ ఈన సిన్నపిల్లోడా? పెల్లి లేక ఇలా ఐపోనాడుగాని, ఈనకి పెల్లి సేసుంటే ఈన మనవలకి పెళ్ళొయసొచ్చుండేది గందూ!

ఆ గొడవిప్పుడెందుకుగాని, మా బాబుని కొట్టినోళ్ళెవరో చెప్పండి.

ఊరి సెంటర్లో ఎవురో ఇద్దరు అరుసుకుంటన్నారు,సక్కీ పడిపోనారో, తగ్గిపోతాన్నారో, మద్దెలో ఈ బాబు ఏలెట్టేసుకున్నోడు.గొడవ రేపెట్టేసినోడు.మరీ బాబేటో అనీసినాడు. ఒకుడేమో ఏటోస్! అంటన్నావని కడిగీసినాడు. మరేటి సెప్పమన్నవుబావు.సూసిన కళ్ళ సెబుతన్నాగాని నారాయనమూర్తీ తండ్రీ సుట్టుతా ఉన్నోళ్ళు కుమ్మీసినారు బావూ.ఈ బావు ఇదిమరలో సేయించిన దొమ్మీలాగైపోనాది.


 ఓరి పల్లకోండ్రా అంటే ఒక్కుడూ ఇన్లేదుబావు, నారాయనమూర్తి బావు బొట్టిడురా అన్జెప్పినా!

డాక్టేరు కాడికి మోసుకుపోనాం. ఇదుగో డాట్టరు బిల్లు బావు. 

28 comments:

  1. టపా “ కుమ్మీసినారు బావూ” 👌.
    రావిశాస్త్రి గారు గుర్తొచ్చారు 🙂.
    మీరు ఫక్తు గేదావరీతీర ప్రాంతం వారు కదా, ఆ తూర్పు యాస మీకెలా పట్టుబడింది శర్మ గారూ? కొంతకాలం ఆ ప్రాంతాల్లో ఎప్పుడైనా పని చేశారా ఏమిటి?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      గోదారి జిల్లాలు దాటి ఉద్యోగం చెయ్యలేదండి. భీమారావని నా ఆపరేటర్ ట్రైనిన్గ్ రూం మేట్,క్లాస్ మేట్,ఇద్దరమూ కలసి ఒకే ఊళ్ళో మొదటి మూడేళ్ళు ఉద్యోగం చేశాం. అతనిది పొందూరు, నిక్కచ్చి తూర్పు యాస. అతను మామూలుగానే మాటాడేవాడు. నేనతని దగ్గర ఈ యాస పనికట్టుకు నేర్చుకున్నా దగ్గరగా అరవై ఏళ్ళకితం. అప్పుడప్పుడు తన్నుకొస్తుంది. రావిశాస్త్రి గారి ప్రభావం కూడా ఉన్నదే! బుగత,బావు ఈ మాటలన్నీ, బుగత అంటే భుక్త=యజమాని. బావు అంటే బాబు అని అర్ధం. బొట్టి అంటే ఆడపిల్ల, బొట్టిడు అంటే మగపిల్లవాడు :) గోర్జ అంటే ఏంటో చెప్పగలరా? :)

      Delete
    2. పైన మీరు చెప్పిన నాలుగు పదాలకు అర్థం తెలుసు ... “కన్యాశుల్కం” పుస్తకం దయ వలన. “గోర్జ” అంటే ఏమిటో తెలియదండి. గోరోజనం కాదు గదా ??

      నేనూ దాదాపు ఐదేళ్ళు విశాఖపట్నంలో పని చేశాను గానీండి ఆ యాస పట్టుబడలేదు (నేనూ గట్టిగా ప్రయత్నం చెయ్యలేదు లెండి). భావం తెలిసొచ్చిన మాటలు రెండే .... ఒకటి “కమ్మరిల్లు”. మొదట్లో కమ్మరి వారి ఇల్లేమో అనుకున్నాను గానీ తాటాకుల ఇల్లు అని తర్వాత అర్ఖమయింది. రెండవది “పైకి రావడం” ..... తెలిసినతను ఒకతను ఒక రోజు సాయంత్రం మా ఆఫీసుకు వచ్చాడు. బయట తలుపు దగ్గరే నిలబడ్డాడు. ఎంత సేపటికీ లోపలికి రాడు. ఇక నేనే బయటకు వచ్చాను. లేపలికి రాలేదేం అని అడిగాను. ఎలాగూ మీరే “పైకి” వస్తున్నారు కదా అని రాలేదు అన్నాడు. ఆహా పోనీలే, నన్ను పైకి వచ్చే రకం అని నువ్వైనా అనుకున్నావు, థాంక్స్ అనుకున్నాను మనసులో ... అతని మాటకు అసలు భావం అర్ఖం అవ్వక. తరువాత తరువాత తెలిసింది తూర్పు మాండలికంలో “పైకి రావడం” అంటే బయటకు రావడం అని అర్థం అని.

      అప్పట్లో కోరి మరీ నేర్చుకున్న యాస ఇన్నేళ్ళు (60) గడిచినా ఇంకా మీకు పట్టులో ఉండడం చెప్పుకోదగినది.

      Delete
    3. విన్నకోటవారు,
      చాలా మరచానండి. పట్టుందనకుకోను, ఫరవాలేదనిపిస్తుందంతే!
      కమ్మరిల్లు, కమ్మలిల్లు అనడంలో రి లి తెలియనీయక పలికేస్తారండి. రావి వారైతే కమ్మలింటి రాజు అనే అన్నారండి తన రాజు మహిషిలో

      గోర్జ అంటే కట్టవ,పుంత అని అర్ధం పొరబడ్డానేమో కూడా.
      ఒక్క నాలుగు రోజులా ప్రాంతంలో ఉంటే పూర్తి పట్టొచ్చేస్తుందండీ. మరీ చిక్కనైన యాసైతే అర్ధం చేసుకోడమే కష్టం. :)

      Delete
    4. మరో మాట పారిరా, పారిరా అన్నాడు వర్షం వస్తుంటే తను పరుగెడుతూ. నాకేంటో అర్ధం కాలా! ఆ తరవాతడిగితే చెప్పేడు, పరుగెట్టుకురా అని

      Delete
  2. నారాయణ మూర్తి మనుమ
    నారదుడే డౌటులేదు , నాడౌటిందున్
    నారదుల యడ్ర సుందా
    పేరేమైనా దెలియగ వీలుంద హితా !

    ReplyDelete
    Replies
    1. లక్కాకుల వారు,
      బొట్టిడు నారాయన మూర్తి బావు గుంటడేబావు. అడ్రస్ వగైరాల పనిలోనే ఉన్నానండి :)

      Delete

  3. చాల ఎక్కువగా బావు కునేస్తిరి :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi

      కుక్క జట్టీ లేల గుంటడా? తిన్నగుండనేవా? :) కుమ్మీసినారు గందా! సైతిగున్నాదా? :)
      బావు తోళెమెక్కువైపోనాది. :)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. Zilebi
      చాల ఎక్కువగా బావు కునేస్తిరి :)ఇలా అనకూడదు
      లావుగా బావుకునేస్తివి అనాలి :)

      Delete
  4. బొట్టిడని , బొట్టి గాదని గుట్టు దెలిసె ,

    ReplyDelete
    Replies
    1. లక్కాకులవారు,
      తోళెం తాళుమీ అంటే కొంచం వేచి ఉండండి :)

      Delete
  5. ఓర్నాయనోర్నాయనో ఒంటరోన్నిసేసి నుసిసేసినారు నానొగ్గేసినా దేక్షవుడనేటోడు సూసేసింటడు ఆడొగ్గేయడు నాయనా

    ReplyDelete
    Replies
    1. గాదిరాజువారు,
      చప్పట్లు.

      ''ఓర్నాయనోర్నాయనో ఒంటరోన్నిసేసి నుసిసేసినారు నానొగ్గేసినా దేక్షవుడనేటోడు సూసేసింటడు ఆడొగ్గేయడు నాయనా''
      చిక్కనైన యాస, మరికొంచం కలుపుతూ

      ఓర్నాయనో! ఓరినాయనో!! గుంటణ్ణి ఒంటరోన్ని సేసి మట్టీసినారు, నానొగ్గీసినా దేక్షవుడనేటోడు సూసింటడు ఆడొగ్గియ్యడు నాయనా! ఆళ్ళు మట్టీస్తుంతె మీరేటి సేత్తన్నారా బేపి మొకాలు.నాకాడికి పార్రాలేపోనారా?గుంటణ్ణొగ్గీసిన్నార్రో, గుంటణ్ణొగ్గీస్నారు.

      Delete
  6. ఓహో, అయితే గాదిరాజు వారు ఉత్తరాంధ్రులా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      మరంతేగదండీ :)

      Delete
    2. రాజుల లోగిళ్ళలో” మరీ ఇంత చిక్కటి యాస మాట్లాడతారా? మరి గాదిరాజ వారు ఈ యాసను బయటే పట్టుకునుండాలి? అంతేలెండి, రావిశాస్త్రి గారిలాగానూ, మీలాగానూ అన్నమాట 👌 🙂.

      Delete
    3. విన్నకోటవారు,
      రాచలోగిళ్ళ పలుకు,మాట, గౌరవ మర్యాదల గురించి తెలియాలంటే శ్రీపాద,పతంజలి గార్లను చదవాలి. ఈ మర్యాదలు పలుకుబడుల గురించిన అనుభవం చాలా చిన్నపుడే జరిగిపోయింది అంచేత గుర్తు తక్కువ.

      రాచలోగిళ్ళలో ఈ యాస ఉండదుగాని ప్రభువులకు పాలితుల మాటలు వినాల్సిన అవసరం ఉన్నదిగనక, యాస పరిచయం కాక తప్పదు :)

      Delete
  7. అయ్యబాబోయ్, ఎవరైనా ‘ఉత్తరాంధ్రా పదకోశము’ తయారు చేస్తే బాగుండును 😒.

    ReplyDelete
    Replies
    1. ఉత్తరాంధ్ర పదకోశం ఉన్నట్టే ఉందండి

      Delete

  8. Thaatha garu has become too rambunctious :)


    జిలేబి

    ReplyDelete
    Replies


    1. మానలేడు మానలేడు మంకుతనము చూడుడు తాను రచ్చ జేయు కూడదీసుకొని వచ్చును :)



      నారదా!
      జిలేబి

      Delete
  9. సమయ మాసన్న మైనది , శర్మగారు
    కట్టువడరిక , యెవరెన్ని కాఱు లరచి
    రేగి గీపెట్టినా , వినరు , ఆగు నేమి
    పేరు లడ్రసుల్ దెలియుట , ప్రియము మాకు .

    ReplyDelete